kethireddy peddareddy
-
జేసీ ప్రభాకర్‌రెడ్డిపై కేతిరెడ్డి ఫైర్
సాక్షి,అనంతపురం:మాజీ ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డిపై జేసీ ప్రభాకర్‌రెడ్డి వ్యాఖ్యలు అభ్యంతరకరమని తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి అన్నారు. ఈ మేరకు పెద్దారెడ్డి మంగళవారం(డిసెంబర్3)మీడియాతో మాట్లాడారు.‘జేసీ వర్గీయులు తాడిపత్రిలో విచ్చలవిడిగా మట్కా,పేకాట ఆడిస్తున్నారు.వైఎస్సార్సీపీ నేతలపై దాడులు తీవ్రమయ్యాయి. బాధితులపైనే అక్రమ కేసులు నమోదు చేయడం దుర్మార్గం. నన్ను తాడిపత్రికి వెళ్లకుండా అడ్డుకుంటున్నారు. నన్ను వెళ్లనీయకపోయినా పర్వాలేదు కానీ వైఎస్సార్సీపీ నేతలపై దాడులు ఆపాలి. అధికారంలో ఉన్నారని టీడీపీ ఏమి చేసినా చెల్లుతుందంటే చూస్తూ ఊరుకోం’అని పెద్దారెడ్డి హెచ్చరించారు.ఇదీ చదవండి: సోషల్‌మీడియా కార్యకర్తలకు ప్రాణహాని -
అధికార జులుం.. తాడిపత్రిలో కొనసాగుతున్న ఉద్రిక్తత
అనంతపురం, సాక్షి: అధికారం చేతిలో ఉంది కదా అని ఇష్టానుసారం ప్రవర్తిస్తున్నారు టీడీపీ సీనియర్ నేత జేసీ ప్రభాకర్‌రెడ్డి. ఈ క్రమంలో వైఎస్సార్సీపీ నేతల్ని లక్ష్యంగా చేసుకుని దాడులకు తెగబడుతుండడంతో.. నియోజకవర్గంలో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. తాజాగా.. కేతిరెడ్డి పెద్దారెడ్డి పర్యటన అనంతరం చెలరేగిన హింస నేపథ్యంలో భారీగా పోలీసులు మోహరించారక్కడ. ఎన్నికల ఫలితాల తర్వాత దాదాపు మూడు నెలలకు నిన్న(మంగళవారం) మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రి వెళ్లారు. వ్యక్తిగత పని ముగించుకుని అరగంటలో తాడిపత్రి నుంచి బయటకు వెళ్లిపోయారాయన. ఆయన అలా వెళ్లిన వెంటనే.. జేసీ తన వర్గీయుల్ని రెచ్చగొట్టారు. దీంతో.. టీడీపీ గుండాలు వైఎస్సార్ సీపీ నేత కందిగోపుల మురళి ఇంటిపై దాడి చేశారు. మురళి ఇంట ఫర్నీచర్‌ను ధ్వంసం చేయడంతో పాటు ఇంటికి నిప్పు పెట్టారు. అదృష్టవశాత్తూ.. జేసీ వర్గీయుల దాడి నుంచి తృటిలో మురళి తప్పించుకున్నారు. ఈ ఉద్రిక్తతల నేపథ్యంలో తాడిపత్రి అంతటా పోలీసులు భారీగా మోహరించారు. మరోవైపు.. జేసీ ప్రభాకర్ రెడ్డిపై మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి జాతీయ మానవహక్కుల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. సుప్రీంకోర్టు, హైకోర్టు జడ్జిలతో పాటు రాష్ట్ర డీజీపీ, కేంద్ర హోం శాఖలకు సైతం ఫిర్యాదులు పంపారు. ఈ సందర్భంగా జేసీపై కే. పెద్దారెడ్డి సంచలన ఆరోపణలు గుప్పించారు. ‘‘నా హత్యకు జేసీ ప్రభాకర్ రెడ్డి కుట్ర పన్నారు, నన్ను చంపి తాడిపత్రి లో రాజకీయ ప్రత్యర్థి లేకుండా చేయాలని జేసీ భావిస్తున్నారు. 2006లో మా అన్న కేతిరెడ్డి సూర్యప్రతాప్ రెడ్డిని జేసీ ప్రభాకర్ రెడ్డి హత్య చేయించారు. జేసీ ప్రభాకర్ రెడ్డి అరాచకాలపై ప్రజాస్వామ్య బద్ధంగా పోరాడుతా. త్వరలో తాడిపత్రి కి వెళ్లి వైఎస్సార్ సీపీ శ్రేణులకు అండగా ఉంటా అని అన్నారాయన. వంద మంది టీడీపీ గుండాలొచ్చారుదాడి ఘటనపై తాడిపత్రి వైఎస్సార్ సీపీ నేత కందిగోపుల మురళి సాక్షితో మాట్లాడారు. ‘‘జేసీ ప్రభాకర్ రెడ్డి నన్ను చంపేందుకు స్కెచ్ వేశారు. నా ఇంటిపై వంద మంది టీడీపీ గూండాలు దాడి చేశారు. ఫర్నీచర్ ధ్వంసం చేసి, నా ఇంటికి నిప్పు పెట్టారు. తలుపులు పగులగొట్టి నన్ను చంపేందుకు శతవిధాలా ప్రయత్నించారు. నాకు లైసెన్స్ తుపాకీ ఉంది.. అయినప్పటికీ కాల్పులు జరపలేదు. ప్రాణ రక్షణ కోసమే తుపాకీ చేతిలో పట్టుకున్నాను. టీడీపీ అధికారంలోకి వచ్చాక నాకు గన్ మెన్ తొలగించారు అని అన్నారాయన. మురళి భార్య రమా మాట్లాడుతూ.. ఇలా దాడి జరగడం రెండోసారి అని చెప్పారామె.‘‘టీడీపీ గూండాలు మా ఇంటిపై దాడి చేసి బీభత్సం సృష్టించారు. గంటసేపు బెడ్ రూం లో దాక్కుని ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని దాక్కున్నాం. మా ఇంటిపై దాడి టీడీపీ నేతలు దాడి చేస్తే... నా భర్త కందిగోపుల మురళి పై అక్రమ కేసులా?. ఇదెక్కడి న్యాయం?’’:::మురళి భార్య రమాదేవి -
జేసీ ప్రభాకర్ రెడ్డికి కేతిరెడ్డి పెద్దారెడ్డి బహిరంగ సవాల్..
-
టీడీపీ నేత జేసీ దౌర్జన్యాలకు నిరసనగా ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ర్యాలీ
-
తాడిపత్రిలో ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ప్రజాసంక్షేమ యాత్ర
-
దేవుడా...జేసీకి మంచి బుద్ధి ప్రసాదించు!
సాక్షి, తాడిపత్రి అర్బన్: దేవుడా..జేసీ ప్రభాకర్ రెడ్డికి మంచి బుద్ధి ప్రసాదించాలని మీడియా సాక్షిగా ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి దేవుడిని వేడుకున్నాడు. మంగళవారం స్థానిక బండా మసీద్ దగ్గర ఆయన విలేకరులతో మాట్లాడారు. ఇటీవల జేసీ ప్రభాకర్‌రెడ్డి తరచూ విలేకర్లు, పోలీసులు, అధికార పార్టీ నాయకులపై ఆరోపణలు చేస్తూ మీడియా సమావేశాలు ఏర్పాటు చేయడాన్ని ఎమ్మెల్యే తప్పుపట్టారు. మున్సిపల్ ఎన్నికల్లో ఏడుపులు, పెడబొబ్బలు, అలవిగాని హామీలు ఇచ్చి చైర్మన్ పీఠం దక్కించుకున్నాడన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దయ, పోలీసుల చొరవతో చైర్మన్ అయ్యాను అని చెప్పిన జేసీకి ఇప్పుడు పోలీ సులు దుర్మార్గుల్లా కనిపిస్తున్నారా? అని ప్రశ్నించారు. మున్సిపల్ పార్కుకు మాత్రమే చైర్మనా... జేసీ ప్రభాకర్ రెడ్డి మున్సిపల్ చైర్మన్‌గా ఉన్నారా...లేక పెన్నానది ఒడ్డున ఉన్న మున్సిపల్ పార్కుకు మాత్రమే చైర్మన్‌గా ఉన్నారా? అని ఎమ్మెల్యే నిలదీశారు. మున్సిపల్ పార్కులో ఆదివారం శ్రీరామనవమి ఉత్సవాలను వైభవంగా నిర్వహించడాన్ని జీర్ణించుకోలేని జేసీ ప్రభాకర్‌రెడ్డి.. సోమవారం సాయంత్రం పార్కులో చెత్తసేకరణ కార్యక్రమం ద్వారా ప్రజలను తప్పుదోవపట్టించే ప్రయత్నం చేశాడన్నారు. గతంలో ప్రభుత్వం బీడీ కార్మికులకు ఇచ్చిన పట్టాలను తన అనుచరుల వద్ద ఉంచుకొని, ఇప్పుడు పంపిణీ చేస్తామని చెప్పడం హాస్యాస్పదమన్నారు. స్వార్థ రాజకీయాలకోసం మాయమాటలు చెప్తున్న జేసీ ప్రభాకర్‌రెడ్డిని నమ్మొద్దని ప్రజలకు పెద్దారెడ్డి సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం అర్హులైన పేదలను గుర్తించి పట్టాలు ఇవ్వడంతో పాటు ఇళ్లు కూడా నిర్మిస్తోందన్నారు. చదవండి: (నాగసులోచనా నన్ను క్షమించు..!.. నేను బాధపడుతూ నిన్ను మరింత బాధపెట్టలేను) స్టేషన్లకు తాళాలు వేసే సంస్కృతి మాది కాదు జేసీ సోదరులు అధికారంలో ఉన్నప్పుడు తాడిపత్రి ప్రాంతంలో చేయని దాష్టీకాలు లేవని ఎమ్మెల్యే విమర్శించారు. తాడిపత్రి ప్రాంతంలోని పోలీస్ స్టేషన్లకు వెళ్లి అధికారులను అసభ్యంగా మాట్లాడుతూ స్టేషన్లకు తాళాలు వేసిన సంస్కృతి జేసీ సోదరులదేనన్నారు. దౌర్జన్యంగా షాపులను మూసి వేయించడం, మట్కా కేంద్రాలు నిర్వహించడం లాంటివీ చేసిన జేసీ ప్రభాకర్‌రెడ్డి.. మీడియా ముందుకొచ్చి అన్యాయాలు, అక్రమాలపై మాట్లాడడం సిగ్గుచేటన్నారు. అన్యాయాలు, అక్రమాలపైన పోలీసు స్టేషన్సర్కిల్లో బహిరంగ చర్చకు సిద్ధమా అని ఎమ్మెల్యే సవాల్ విసిరారు. -
నా కుటుంబం జోలికొస్తే సహించను
సాక్షి, పెద్దవడుగూరు: తమ కుటుంబం జోలికి వస్తే ఎంతటివారినైనా సహించేది లేదని ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి హెచ్చరించారు. మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి తమపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. గతంలో కూడా తన కుమారులను బెదిరిస్తూ చానల్లో ఇంటర్వ్యూ ఇచ్చారని, ఇలాంటి వాటికి తాను భయపడేది లేదన్నారు. సోమవారం పెద్దారెడ్డి మిడుతూరులో మీడియాతో మాట్లాడారు. తాడిపత్రి నియోజకవర్గంలో ప్రజలు శాంతియుతంగా జీవనం గడపాలని తాము ఆకాంక్షిస్తున్నామన్నారు. జేసీ ప్రభాకర్‌రెడ్డి, ఆయన అనుచరులు సోషల్ మీడియాను వేదికగా చేసుకుని రెచ్చగొట్టే పోస్టింగ్‌లు పెడుతూ ప్రశాంతతకు భంగం కలిగించేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. ఈ నేపథ్యంలో రెచ్చగొట్టే పోస్టింగ్‌లకు చెక్ పెడదామని నాలుగు రోజుల క్రితం ప్రభాకర్‌రెడ్డి ఇంటికి వెళ్లానన్నారు. అయితే తాను దాడి చేయడానికి వచ్చానని, అక్కడున్న వారిని బెదిరించానని టీడీపీ నాయకులు పోలీసులు ఫిర్యాదు చేశారన్నారు. దీంతో పోలీసులు ఆదివారం తమపై కేసులు నమోదు చేశారన్నారు. పోలీసులు పక్షపాత ధోరణి ప్రదర్శించకుండా ఇరు వర్గాల వారిపైనా కేసులు నమోదు చేశారని చెప్పారు. టీడీపీ హయాంలో మాజీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి ఏకంగా పోలీస్ స్టేషన్‌కు తాళాలు వేసినా, ప్రబోధానంద ఆశ్రమంపై దాడులకు ఉసిగొల్పి అల్లర్లు సృష్టించినా అప్పటి ప్రభుత్వం కేసు నమోదు చేయకపోవడాన్ని గుర్తు చేశారు. నిష్పక్షపాత పాలన సాగిస్తున్న వైఎస్సార్సీపీపై అవాకులు చెవాకులు పేల్చుతున్న టీడీపీ నాయకులు గతంలో జరిగిన ఘటనలను గుర్తు పెట్టుకుని మాట్లాడితే బాగుంటుందని హితవు పలికారు. జేసీ సోదరులు అధికారంలో ఉన్నపుడే తాడిపత్రిలో ప్రజాస్వామ్యం కనుమరుగైపోయిందన్నారు. (చదవండి: జేసీ ఆరోగ్యం కాపాడుకో..) -
తాడిపత్రి అల్లర్ల కేసులో కొత్త ట్విస్టు
సాక్షి, అనంతపురం: తాడిపత్రి అల్లర్ల కేసులో కొత్త ట్విస్ట్ నెలకొంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలపై మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి ఫిర్యాదు చేయలేదు. మొదటి నుంచి ఊకదంపుడు ముచ్చట్లు, కవ్వింపు చర్యలతో ఎమ్మెల్యే పెద్దారెడ్డి వర్గాన్ని రెచ్చగొడుతున్న జేసీ వర్గం తోకముడిచింది. ఎమ్మెల్యే పెద్దారెడ్డి, వైఎస్సార్సీపీ నేతలపై ఆరోపణలకే పరిమితమైంది జేసీ వర్గం. ఇక జేసీ వర్గీయుల దాడిలో గాయపడ్డ వైఎస్సార్సీపీ కార్యకర్తలు మనోజ్, బ్రహ్మేంద్ర జేసీ ప్రభాకర్ రెడ్డి, ఆయన కొడుకు అస్మిత్ రెడ్డిపై లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. తమను కులం పేరుతో దూషించారని ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన మనోజ్, బ్రహ్మేంద్ర ఫిర్యాదు చేయడంతో మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి, అస్మిత్‌రెడ్డిపై పోలీసులు అట్రాసిటీ కేసులు నమోదు చేశారు. (చదవండి: తాడిపత్రిలో 144 సెక్షన్ : ఎస్పీ) ఐపీసీ 307, 306 సెక్షన్ల కింద జేసీ వర్గానికి చెందిన 27 మందిపై పోలీసులు కేసులు బుక్ చేశారు. దీంతోపాటు గొడవలకు కారణమైన యూట్యూబ్ ఛానల్ విలేకరి వలిపై కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు. ఈ సందర్భంగా తాడిపత్రి డీఎస్పీ చైతన్య మీడియాతో శుక్రవారం మాట్లాడుతూ... తాడిపత్రిలో పోలీసులు నిష్పక్షపాతంగా వ్యవహరిస్తున్నారు. మాకు ఏ రాజకీయ పార్టీ తో సంబంధం ఉండదు. తప్పు చేసే వారు ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదు. తాడిపత్రిలో అల్లర్ల పై ఇప్పటిదాకా 3 కేసులు నమోదు చేశాం. ఫిర్యాదుల ఆధారంగానే కేసులు నమోదు చేస్తాం. వారం రోజుల పాటు తాడిపత్రి లో 144 సెక్షన్ అమల్లో ఉంటుందని పేర్కొన్నారు. -
తాడిపత్రిలో జేసీ అలజడి
సాక్షి, తాడిపత్రి అర్బన్/అనంతపురం క్రైం: ప్రశాంతంగా ఉంటున్న అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణం గురువారం ఒక్కసారిగా అట్టుడికింది. టీడీపీకి చెందిన జేసీ సోదరుల వర్గీయులు రెచ్చిపోయారు. వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిపై ఉద్దేశపూర్వకంగా కవ్వింపు చర్యలకు పాల్పడి దాడికి దిగి బీభత్సం సృష్టించారు. అంతేకాక.. వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలపై రాళ్ల దాడికి పాల్పడి వాహనాల అద్దాలు ధ్వంసం చేశారు. స్థానికులను భయభ్రాంతులకు గురిచేసి.. తీవ్ర ఉద్రిక్త పరిస్థితులకు దారితీసిన ఈ ఘటన పూర్వాపరాలు.. స్థానికులు తెలిపిన వివరాలు ఇవీ.. కేతిరెడ్డి పెద్దారెడ్డి వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేగా ఎన్నికైన అనంతరం తాడిపత్రిలో ప్రశాంత వాతావరణం నెలకొంది. పార్టీలు, వర్గాలకు అతీతంగా ఎమ్మెల్యే సేవలు అందిస్తుండటాన్ని జేసీ కుటుంబం జీర్ణించుకోలేకపోయింది. జేసీ ఇంటి పైనుంచి పోలీసులపై రాళ్ల వర్షం కురిపిస్తున్న జేసీ అనుచరులు ఎలాగైనా ఎమ్మెల్యేను రెచ్చగొట్టి ప్రజలలో భయాందోళనలు సృష్టించాలని భావించారు. ఇందులో భాగంగానే కేతిరెడ్డి పెద్దారెడ్డిపై జేసీ వర్గీయులు సోషల్ మీడియా వేదికగా దుష్ప్రచారం చేస్తున్నారు. వీటికి స్పందించకుండా తన పని తాను చూసుకుంటున్న ఎమ్మెల్యేను రెచ్చగొట్టడానికి ఆయన కుటుంబీకులపై కుట్రపూరిత పోస్టింగ్‌లను, అసత్య ఆరోపణలతో సోషల్ మీడియాలో హోరెత్తించారు. పెద్దారెడ్డి కుటుంబీకులు ఇసుక బండ్ల నిర్వాహకుల నుంచి వసూళ్లు చేస్తున్నారని ఆరోపించారు. ఈ నేపథ్యంలో.. రాజకీయం చేయమంటే ఇంట్లో మహిళలపై దుష్ప్రచారం చేయడమేమిటని ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి అసహనానికి లోనయ్యారు. ఆ పోస్టింగులను ఖండించడంతో పాటు, ఆ విషయం మాట్లాడేందుకు ఎమ్మెల్యే కేతిరెడ్డి గురువారం జేసీ ప్రభాకర్‌రెడ్డి ఇంటికి వెళ్లారు. అయితే, అక్కడ జేసీ సోదరులెవరూ లేకపోవడంతో తిరిగి తన ఇంటికి వచ్చేశారు. రెచ్చగొట్టే ధోరణి జేసీ సోదరులదే : ఎమ్మెల్యే కేతిరెడ్డి ప్రజలను, గ్రామాల్లోని నాయకులను రెచ్చగొట్టి, గొడవలను సృష్టించి పబ్బం గడుపుకునే నీచ చరిత్ర జేసీ సోదరులదేనని తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి అన్నారు. తాడిపత్రిలోని తన నివాసంలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. జేసీ సోదరులు ఓటమిని జీర్ణించుకోలేక తమపై సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఇందుకు ఎక్కడి నుంచో మనుషులను పిలిపించి వారికి జీతభత్యాలు ఇచ్చి ప్రోత్సహిస్తున్నారన్నారు. వారి పోస్టింగులు మితిమీరిపోతుండటంతో.. వారితో చర్చించి వారి ఇబ్బంది తెలుసుకోవడం కోసమే గురువారం తాను జేసీ సోదరుల ఇంటికి వెళ్లానన్నారు. ఆ సమయంలో వారెవరూ ఇంట్లో లేకపోవడంతో తిరిగి వచ్చేశానన్నారు. మాట్లాడటానికి వెళ్తే దాడిచేయడానికి వచ్చానని తిరిగి మాపై అసత్య ప్రచారాలు చేస్తున్నారన్నారు. ఇప్పటికైనా జేసీ సోదరులు దుష్ప్రచారాలు మానుకోవాలని కేతిరెడ్డి హితవు పలికారు. టీడీపీ కార్యకర్తలతో కలసి దాడిచేయడానికి వస్తున్న మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి పథకం ప్రకారం రెచ్చగొట్టి.. అనంతరం గంట తర్వాత ఇంటికి వచ్చిన జేసీ ప్రభాకర్‌రెడ్డి, తనయుడు అస్మిత్‌రెడ్డి.. పెద్దారెడ్డి ఇంటికి వెళ్లే ప్రయత్నం చేశారు. దీంతో పెద్దారెడ్డి అనుచరులు ఎదురెళ్లేందుకు యత్నించగా.. తండ్రీకొడుకులు ఇద్దరూ దగ్గరుండి పోలీసులను సైతం లెక్కచేయకుండా వారిపై రాళ్లు రువ్వించారు. ఈ ఘటనలో పెద్దారెడ్డి అనుచరులు పలువురు గాయపడగా.. కొన్ని వాహనాలు ధ్వంసమయ్యాయి. అలాగే, అంతకుముందు... పథకం ప్రకారం జేసీ ప్రభాకర్‌రెడ్డి గ్రామాల నుంచి టీడీపీ కార్యకర్తలను పిలిపించి ఈ హంగామా సృష్టించారు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. తాడిపత్రిలో 144 సెక్షన్ : ఎస్పీ శాంతిభద్రతల పరిరక్షణ దృష్ట్యా తాడిపత్రిలో 144 సెక్షన్ అమల్లో ఉంటుందని ఎస్పీ బి. సత్యయేసు బాబు గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. ఐదుగురు, అంతకంటే ఎక్కువ మంది గుమికూడరాదన్నారు. తాడిపత్రిలో ఇప్పటికే ప్రత్యేక భద్రతా బలగాలను మోహరించామన్నారు. గ్రామీణ ప్రాంతాల నుంచి అనవసరంగా తాడిపత్రికి వచ్చి గ్రూపుల్లో చేరడం చేయరాదన్నారు. తాడిపత్రి పట్టణం, పరిసర ప్రాంతాల్లో సీసీ కెమెరాలు, డ్రోన్ల ద్వారా నిఘా ఉంచామని, శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే ఎవరినీ ఉపేక్షించేది లేదని ఎస్పీ హెచ్చరించారు. -
ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి పెద్ద మనసు
సాక్షి, తాడిపత్రి రూరల్: రాజకీయ నేపథ్యం లేదు. గ్రామంలో ఇతరులతో ఎలాంటి కక్షలూ లేవు. అయినా కుల పిచ్చి నెత్తికెక్కిన ఉన్మాదులు సాగించిన దాడిలో ఓ దళిత చిరుద్యోగి హతమయ్యాడు. అడ్డుకోబోయిన మరో వ్యక్తి కూడా తీవ్రంగా గాయపడి ప్రాణాలు కోల్పోయాడు. ఈ దురాగతంపై అప్పటి టీడీపీ ప్రభుత్వం నుంచి స్పందన కరువైంది. బాధిత కుటుంబాన్ని మరింత కష్టాల్లోకి నెట్టేసింది. ఆమె కష్టాన్ని తెలుసుకున్న ప్రస్తుత ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి చలించిపోయారు. ఆమెకు అండగా నిలిచారు. ప్రభుత్వ ఉద్యోగ కల్పనతో పాటు ఇతర పరిహారాలు అందేలా చేశారు. ఎమ్మెల్యే చొరవపై హర్షం వ్యక్తం చేస్తూ బాధిత మహిళ కృతజ్ఞతలు తెలిపారు. వివరాల్లోకి వెళితే... దళితుడి కింద పనిచేయడం ఇష్టం లేక.. తాడిపత్రి మండలం ఊరుచింతల గ్రామంలోని దళిత వెంకటరమణ, పద్మావతి దంపతులు. ఉపాధి హామీ పథకంలో ఫీల్ట్ అసిస్టెంట్‌గా వెంకటరమణ పనిచేసేవారు. విధి నిర్వహణలో నిక్కచ్చిగా వ్యవహరిస్తూ రావడం.. కొందరికి ఇబ్బందిగా మారింది. అదే సమయంలో ఓ దళితుడు చెప్పినట్లుగా తాము నడుచుకోవడమేమిటనే దురహంకారం వారిలో ప్రబలింది. ఫలితంగా 2018, సెప్టెంబర్ 21న పథకం ప్రకారం వెంకటరమణపై దాడి చేసి హతమార్చారు. అదే సమయంలో ఈ దారుణాన్ని అడ్డుకోబోయిన నాగరంగయ్య సైతం దుండగుల దాడిలో తీవ్రంగా గాయపడి మరణించాడు. ఆదుకోని గత టీడీపీ ప్రభుత్వం వెంకటరమణ హత్యకు గురి కావడంతో పద్మావతి దిక్కులేనిదైంది. ఘటనలో నిందితులపై పోలీసులు కేసులు నమోదు చేసి జైలుకు పంపారు. నామమాత్రపు ఆర్థికసాయం అందించి చంద్రబాబు ప్రభుత్వం చేతులేత్తిసింది. బాధిత కుటుంబానికి ఊరట కలిగించేలా పొలం కూడా ఇవ్వలేకపోయింది. ఉద్యోగ కల్పన ఊసే లేకుండాపోయింది. చదవండి: (ప్రసాద్ కుటుంబానికి 5 లక్షల సాయం) అండగా నిలిచిన పెద్దారెడ్డి పద్మావతి పరిస్థితి ఇటీవల తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి దృష్టికి వచ్చింది. నేరుగా ఎమ్మెల్యేని కలిసిన ఆమె తన దుర్భర స్థితిని ఏకరవు పెట్టింది. స్పందించిన ఎమ్మెల్యే ఆమెకు అండగా నిలిచారు. తాను ఇచ్చిన మాట మేరకు పెద్దవడుగూరు మండల ఎస్సీ బాలుర వసతి గృహంలో వంట మనిషి ఉద్యోగం దక్కేలా చేశారు. దీనిపై హర్షం వ్యక్తం చేస్తూ శనివారం అనంతపురానికి బయలుదేరిన ఎమ్మెల్యేను పుట్లూరు మండలం ఎ.కొండాపురం వద్ద పద్మావతి, మరికొందరు దళిత నాయకులు కలిసి మాట్లాడారు. ఉద్యోగం కల్పిస్తూ ప్రభుత్వం అందజేసిన ఉత్తర్వులను ఎమ్మెల్యేకు చూపి కృతజ్ఞతలు తెలిపారు. -
జేసీ ఆరోగ్యం కాపాడుకో..
సాక్షి, తాడిపత్రి : వ్యక్తిగత స్వార్థంతో పచ్చటి గ్రామాల్లో చిచ్చు రగిల్చే విధానాలను మానుకోవాలంటూ మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డికి తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి హితవు పలికారు. రైతులు ఒక్కప్పుడు అమ్మిన భూములను తిరిగి ఇప్పిస్తానంటూ మోసపూరిత రాజకీయాలకు తెరతీయడం సమంజసం కాదని అన్నారు. ఇది గ్రామాల్లో వర్గ కక్షలను ప్రేరేపించేలా ఉందని అన్నారు. మంగళవారం తాడిపత్రిలోని తన నివాసంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఎకరానికి రూ.20 వేలు ఎక్కువ ఇప్పిస్తా కేవలం తన చుట్టూ జనం తిరిగేలా చేసుకునేందుకే భూముల వ్యవహారంలో జేసీ ప్రభాకర్‌రెడ్డి తలదూర్చారని అన్నారు. ఒకసారి ఇతరులకు విక్రయించిన భూములను తిరిగి ఇప్పించడం ఎక్కడైనా ఉందా? అని ప్రశ్నించారు. జేసీ సోదరులు వారి స్వగ్రామమైన జూటూరులో రైతుల పొలాల గట్లను డోజర్లతో చదును చేయించి ఎకరాకు రూ.30 వేలు ఇచ్చి దౌర్జన్యంగా భూములను లాక్కొన్నది వాస్తవం కాదా అని ప్రశ్నించారు. ఆ భూములకు ఎకరాకు రూ.20 వేలు ఎక్కువగా తానిప్పిస్తానని, వాటిని అదే రైతులకు ఇచ్చే త్యాగబుద్ధి ఉందా అంటూ సవాల్ విసిరారు. (మూడు అంశాలే ప్రామాణికం!) స్వచ్ఛందంగా అమ్ముకున్నారు గతంలో వంగనూరు, బొందెలదిన్నె గ్రామాల సమీపంలోని భూములను రైతులు స్వచ్ఛందంగా అమ్ముకున్నారని గుర్తు చేశారు. ప్రస్తుతం కడప జిల్లా ఆర్ఎస్ కొండాపురం మండలం గండికోట ముంపు గ్రామాల ప్రజలు తాడిపత్రిలో గృహాలు నిర్మించుకునేందుకు ఆసక్తి కనబరుస్తున్నారని, ఫలితంగా తాడిపత్రి ప్రాంతంలో భూములకు డిమాండ్ పెరిగిందన్నారు. ఈ డిమాండ్‌ను ఆసరాగా చేసుకున్న జేసీ ప్రభాకర్ రెడ్డి రైతులను మభ్య పెడుతూ గతంలో అమ్ముకున్న భూములను తిరిగి ఇప్పిస్తానంటూ గ్రామాల్లో చిచ్చు రగిల్చేందుకు ప్రయత్నిస్తున్నాడని ఆరోపించారు. డబ్బు ఉంటే ఎవరైనా భూములను కొనుగోలు చేయవచ్చునని, అయితే ముందు అమ్మిన ధర కంటే ఎకరానికి రూ.20 వేలు, రూ.30 వేలు ఎక్కువ ఇస్తామనడం సరైన సంస్కృతి కాదని అన్నారు. మాయమాటలతో గ్రామాల్లో గొడవలు సృష్టించేందుకు ప్రయత్నిస్తే సహించబోమని మాజీ ఎమ్మెల్యేని హెచ్చరించారు. ఆరోగ్యం కాపాడుకో.. చట్టం తన పని తాను చేసుకుపోతుందని, ఎవరైతే నిబంధనలకు విరుద్ధంగా పనులు చేసి ఉంటే వారిపై మాత్రమే కేసులు నమోదవుతాయని ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి స్పష్టం చేశారు. వాహనాల అక్రమ రిజిస్ట్రేషన్లకు సంబం«ధించి కర్ణాటకలోని అధికారులు లేఖలు రాయడం జరిగిందని, వారు స్పందించకపోవడంతో లోకాయుక్తలో ఫిర్యా దు చేసినట్లు గుర్తు చేశారు. వాహనాల అక్రమ రిజిస్ట్రేషన్లకు సంబంధించి దివాకర్ ట్రావెల్స్, జఠాధర ఇండస్ట్రీస్ యజమానులుగా ఎవరైతే ఉంటారో వారిపైన మాత్రమే కేసులు నమోదు అవుతాయన్నారు. ఈ విషయంగా ఎలాంటి ఆందోళనకు గురికాకుండా ఆరోగ్యం జాగ్రత్తగా కాపాడుకోవాలని జేసీ ప్రభాకర్‌రెడ్డికి సూచించారు. -
ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఔదార్యం
సాక్షి, తాడిపత్రి రూరల్: ఎమ్మెల్యే పెద్దారెడ్డి తన మనసు కూడా చాలా పెద్దదేనని మరోసారి చాటుకున్నారు. తల్లి మృతి చెంది.. తండ్రి మద్యానికి బానిసై ఆలనాపాలనకు నోచుకోని చిన్నారిని అక్కున చేర్చుకున్నారు. సంరక్షణ బాధ్యతలు తీసుకుని ఆదర్శంగా నిలిచారు. తాడిపత్రి మండలంలోని పెద్దపొలమడకు చెందిన నాగలక్ష్మీ, అర్జున్‌రెడ్డి దంపతులకు అజయ్‌కుమార్‌రెడ్డి సంతానం. 15 రోజుల క్రితం నాగలక్ష్మి అనారోగ్యంతో మరణించింది. అప్పటికే మద్యానికి బానిసైన అర్జున్‌రెడ్డి కుమారుడి బాగోగులు విస్మరించాడు. దీంతో గ్రామస్తుల సహాయంతో ఇన్నాళ్లూ అజయ్ కుమార్‌రెడ్డి గడిపాడు. (టీడీపీ నేతల నిర్వాకం..) ఈ క్రమంలోనే కొందరు గ్రామస్తులు అజయ్ పరిస్థితిని ఎమ్మెల్యే పెద్దారెడ్డి దృష్టికి తీసుకురాగా, వెంటనే స్పందించిన ఆయన మంగళవారం తన కార్యాలయానికి పిలిపించి మాట్లాడారు. అండగా ఉంటానని, బాగా చదువుకోవాలని సూచించారు. అంతేకాక ఇక నుంచి అజయ్‌కుమార్ రెడ్డి సంరక్షణ భాధ్యతను తానే తీసుకుంటున్నట్లు ప్రకటించారు. చిన్నారి చదువులు, జీవనానికి అయ్యే ఖర్చును తానే భరిస్తానన్నారు. ఎమ్మెల్యే తీసుకున్న నిర్ణయంపై పెద్దపొలమడ గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. -
‘ఏబీఎన్’పై వెంటనే చర్యలు తీసుకోండి
సాక్షి, తాడిపత్రి: ప్రజలను భయభ్రాంతులకు గురి చేయడమే కాకుండా పార్టీ పటిష్టతను దెబ్బతీసి తద్వారా తన పరువుకు భంగం వాటిళ్లే విధంగా తప్పుడు కథనాలు ప్రచారం చేసిన ఏబీఎన్ ఛానల్, యాజమాన్యంపై వెంటనే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తెలిపారు. ఈమేరకు తన అనుచరుల ద్వారా శుక్రవారం పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. నియోజకవర్గంలోని పెద్దపప్పూరు మండలంలోని చాగల్లు రిజర్వాయర్‌కు భారీగా వరద నీరు చేరుకోవడంతో శాసన సభ్యుని హోదాలో జూలై 27న జలహారతి కార్యక్రమాన్ని నిర్వహించినట్లు చెప్పారు. అయితే కార్యక్రమం పూర్తయిన తర్వాత తన స్వగ్రామమైన యల్లనూరు మండలం తిమ్మంపల్లికి బయలుదేరి వెళ్లినట్లు పేర్కొన్నారు. ఫిర్యాదు చేస్తున్న ఎమ్మెల్యే పెద్దారెడ్డి అనుచరులు అయితే జూలై 28 తేదీన జలహారతి కార్యక్రమానికి సంబంధించి ఫొటోలను మార్ఫింగ్ చేయడమే కాకుండా తన వాహనంపై దాడి చేశారంటూ పదే పదే వీడియోలను ప్రసారం చేసి తన గౌరవ ప్రతిష్టలకు భంగం కలిగించేలా చేశారన్నారు. అలాగే వైఎస్సార్సీపీ ప్రతిష్టను దిగజార్చేందుకు యత్నించారన్నారు. పార్టీలో వర్గవిభేదాలున్నాయని, ఘర్షణలు జరిగాయని ప్రజలను భయభ్రాంతులకు గురిచేశారన్నారు. తప్పుడు కథనాలను ప్రసారం చేసిన ఏబీఎన్ ఛానల్, ఆంధ్రజ్యోతి మేనేజింగ్ డైరెక్టర్ వేమూరి రాధాక్రిష్ణ, జిల్లా స్టాఫ్ రిపోర్టర్ బి.సురేష్, స్థానిక ఛానల్ రిపోర్టర్ ఎ.వెంకటరమణపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే పెద్దారెడ్డి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. (పరిటాల శ్రీరామ్‌కు కండీషనల్ బెయిల్) -
జేసీ దివాకర్‌రెడ్డిని వెంటనే అరెస్ట్ చేయాలి
-
జేసీ దివాకర్‌రెడ్డిని కూడా అరెస్ట్ చేయాలి
సాక్షి, అనంతపురం: జేసీ ట్రావెల్స్ ఫోర్జరీ కేసులో మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి, జేసీ అస్మిత్‌రెడ్డి అరెస్ట్ చేయడాన్ని స్వాగతిస్తున్నామని తాడిపత్రి వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి అన్నారు. ఆయన శనివారం మీడియాతో మాట్లాడుతూ.. ఫోర్జరీ డాక్యూమెంట్స్‌తో 154 వాహనాలను జేసీ ప్రభాకర్‌రెడ్డి అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించారని తెలిపారు. మాజీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డిని కూడా అరెస్ట్ చేయాలన్నారు. దివాకర్‌రెడ్డి అండతోనే ఈ అక్రమాలు జరిగాయని మండిపడ్డారు. తాడిపత్రి సీఐ, ఎస్సై సంతకాలను కూడా జేసీ ట్రావెల్స్ ఫోర్జరీ చేసిందని పెద్దారెడ్డి విమర్శించారు. (మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి అరెస్ట్) జేసీ కుటుంబ సభ్యుల అరెస్ట్ వెనుక ఎలాంటి రాజకీయ కారణాలు లేవని పెద్దారెడ్డి తెలిపారు. జేసీ ప్రభాకర్‌రెడ్డి తప్పు చేశారని అందుకే అరెస్ట్ అయ్యారని తెలిపారు. వందలాది మంది ప్రయాణికులను జేసీ ట్రావెల్స్ పొట్టన పెట్టుకుందని దుయ్యబట్టారు. మాజీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డిపై కూడా కేసు నమోదు చేయాలన్నారు. జేసీ ట్రావెల్స్ అరాచకాలపై లోతుగా దర్యాప్తు చేయాలని పెద్దారెడ్డి అన్నారు. -
‘చంద్రబాబు ఆరోపణలు అర్థరహితం’
సాక్షి, అనంతపురం: కర్నూలులో హైకోర్టును ఏర్పాటు చేయటం ద్వారా రాయలసీమకు న్యాయం జరుగుతుందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి అన్నారు. శుక్రవారం అనంతపురంలో ఎమ్మెల్యేలు తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి, ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిలతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పరిపాలన అద్భుతమని, ఏపీలో మూడు రాజధానులు ఏర్పాటు చేయాలన్న ఆయన ప్రతిపాదనలు హర్షణీయమని పేర్కొన్నారు. ఏపీలోని అన్ని జిల్లాల అభివృద్ధికి సీఎం జగన్ కృషి చేస్తున్నారని వ్యాఖ్యానించారు. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఆరోపణలు అర్థరహితమని.. అమరావతి చుట్టూ చంద్రబాబు, ఆయన బినామీలు భూములు కొన్నారని ఎమ్మెల్యే తెలిపారు. రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి మాట్లాడుతూ.. చంద్రబాబు ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టేందుకు కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు. పోలీసులను జేసీ దివాకర్ రెడ్డి కించపరిస్తే.. చంద్రబాబు నవ్వటం దుర్మార్గ చర్య అని ధ్వజమెత్తారు. టీడీపీ నేతలు, కార్యకర్తలు హింసకు పాల్పడాలని చంద్రబాబు పరోక్షంగా ప్రోత్సహిస్తున్నారని దుయ్యబట్టారు. గత ఐదేళ్లలో వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలపై జరిగిన దాడులు చంద్రబాబుకు కనిపించలేదా అని ప్రశ్నించారు. తమ పార్టీ నేతల హత్యలకు చంద్రబాబు బాధ్యత వహించాలని ఆయన డిమాండ్ చేశారు. 40 ఏళ్ల పొలిటికల్ ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబు రాజకీయ హింసను ప్రేరేపిస్తున్నారని విమర్శించారు. సీఎం జగన్ శాంతి భద్రతలకు పెద్దపీట వేస్తున్నారని, ఆయన పరిపాలన దేశానికే ఆదర్శమని అన్నారు. సీఎం జగన్ నిర్ణయాలతో చంద్రబాబు బెంబేలెత్తిపోయి పోలీసులను బెదిరిస్తున్నారంటూ ఎద్దేవా చేశారు. తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి మాట్లాడుతూ.. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమక్షంలో పోలీసులపై మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేసిన కూడా ఆయన ఖండించకపోవడం సిగ్గుచేటన్నారు. 30 సంవత్సరాల నుంచి పోలీసు వ్యవస్థను అడ్డంపెట్టుకుని తాడిపత్రి నియోజకవర్గంలో ఎంతో మందిపై అక్రమ కేసులు బనాయిస్తూ ఇబ్బందులకు గురిచేశారని పేర్కొన్నారు. ప్రస్తుతం జేసీ సోదరుల ఆటలు సాగకపోయేసరికి పోలీసులపై అసభ్య పదజాలంతో అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. జేసీ సోదరులపై దాదాపు 15 కేసులకు పైగా నమోదయ్యాయని, కానీ ఒక్క కేసులో కూడా వారిని అరెస్టు చేయకపోవడం వల్లే పోలీసులంటే భయం పోయిందని ఆయన విమర్శించారు. (చదవండి: బూట్లు నాకే పోలీసులను పెట్టుకుంటా : జేసీ) -
జేసీ వర్గీయుల అక్రమాలు బట్టబయలు
సాక్షి, అనంతపురం : తాడిపత్రిలో జేసీ వర్గీయుల అవినీతి బయటపడిండి. మున్సిపల్ కాంప్లెక్స్ లీజులో జేసీ వర్గీయులు రూ.75 లక్షల స్వాహా చేసినట్టు తెలిసింది. మున్సిపల్ కాంట్రాక్టు ఉద్యోగి శ్రీనివాస్ ద్వారా వారు అక్రమాలు చేయించినట్టు వెల్లడైంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి సమీక్షా సమావేశంలో జేసీ వర్గీయుల దందా వెలుగు చూసింది. దీనిపై సమగ్ర విచారణ చేపట్టాలని ఎమ్మెల్యే ఆదేశాలు జారీ చేశారు. ఇకపై అద్దె, డిపాజిట్ సొమ్ము నేరుగా మున్సిపాలిటీకే చెల్లించాలని సూచించారు. -
చంద్రబాబుపై కేతిరెడ్డి పెద్దారెడ్డి ఫైర్
సాక్షి, తాడిపత్రి: అధికారంలో ఉన్నన్ని రోజులు గుర్తుకు రాని కార్యకర్తలు టీడీపీ అధినేత చంద్రబాబుకు ఇప్పుడు గుర్తొచ్చారని ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ప్రశ్నించారు. 2009 ఎన్నికల సందర్భంగా ఇబ్బందులు పడిన కార్యకర్తలను చంద్రబాబు ఎందుకు ఆదుకోలేదన్నారు. తాడిపత్రి మండలంలోని వీరాపురం గ్రామంలో ఇటీవల జరిగిన ఎన్నికల సందర్భంగా చోటు చేసుకున్న హింసాత్మక ఘటనలో మృతి చెందిన టీడీపీ కార్యకర్త చింతా భాస్కర్‌రెడ్డి కుటుంబానికి ఆర్థిక సాయం చేసేందుకు మంగళవారం చంద్రబాబు రానున్నారు. ఈ నేపథ్యంలో సోమవారం ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తన నివాసంలో విలేకరులతో మాట్లాడారు. పోలింగ్ రోజున దొంగ ఓట్లు వేసేందుకు ప్రయత్నించడంతో ఇరువర్గాల ఘర్షనలో చింతా భాస్కర్‌రెడ్డి మృతి చెందడం జరిగిందన్నారు. అప్పుడు కూడా చంద్రబాబు ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నాడని గుర్తు చేశారు. అప్పుడు పరామర్శకు రాని ఆయన... ఇప్పుడు రావడం రాజకీయ నాటకంలో భాగమన్నారు. టీడీపీ హయాంలోనే శాంతిభద్రతలు క్షీణించాయని ఎమ్మెల్యే ఆరోపించారు. తహసీల్దార్ వనజాక్షిపై దాడి చేసిన ఘటన ఇంకా రాష్ట్ర ప్రజలు మర్చిపోలేదన్నారు. జేసీ సోదరులు దాడి చేసినప్పుడు ఏమయ్యావ్..? 2009 ఎన్నికల అనంతరం కాంగ్రెస్‌లో ఉన్న జేసీ సోదరులు టీడీపీ నాయకుల ఇళ్లపై దాడి చేశారని.. టీడీపీ నాయకుడు, తెలుగు యువత జిల్లా మాజీ అధ్యక్షుడు మురళీప్రసాద్ ఇంటికి నిప్పు పెట్టారని పెద్దారెడ్డి గుర్తుచేశారు. అయితే అప్పట్లో మురళీప్రసాద్‌కు నష్టపరిహారం కింద రూ.20 లక్షలు ప్రకటించిన చంద్రబాబు.. నేటికీ ఆ మొత్తాన్ని ఇవ్వలేదన్నారు. ఆ ఐదేళ్లూ దురాగతాలే చంద్రబాబు ఐదేళ్ల పాలనలో ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారని, జేసీ సోదరుల దురాగతాల వల్ల పెద్దవడుగూరు మండలం అప్పేచెర్ల భాస్కర్‌రెడ్డి బలయ్యారని పెద్దారెడ్డి గుర్తు చేశారు. మరి వారి పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. కొద్ది రోజుల క్రితం తాడిపత్రిలో పోలీసుల తీరు చాలా బాగుందని పొగడ్తలు కురిపించిన వారే.. ఇప్పుడు పోలీసుల చర్యలను తప్పుపడుతున్నారని పెద్దారెడ్డి మండిపడ్డారు. శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా పోలీసులు వైఎస్సార్సీపీ, టీడీపీ కార్యకర్తలకు కౌన్సెలింగ్ ఇస్తున్నారని, దీనికి తామేమీ అడ్డుచెప్పలేదన్నారు. అయితే మాజీ ఎమ్మెల్యే జేసీ తన అనుచరులను పోలీసులు అరెస్టు చేశారనే అక్కసుతో పోలీసుల తీరుపై విమర్శలు చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు. చట్టం దృష్టిలో అందరూ సమానమేనని గుర్తించాలన్నారు. జేసీ పవన్ క్రికెట్ బుకీ పలుకేసుల్లో ముద్దాయిగా ఉన్న మాజీ ఎమ్మెల్యే జేసీ దర్జాగా పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి రావడం ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నామన్నారు. జేసీ పవన్ కుమార్‌రెడ్డి ఓ క్రికెట్ బుకీ అని, అసాంఘిక కార్యకలాపాలకు కొమ్ముకాస్తున్నారని ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి విమర్శించారు. తాము రైతు కుటుంబం నుంచి వచ్చామని, తనకు విద్య లేకపోయినా సంస్కారం ఉందన్నారు. అందువల్లే నియోజకవర్గ ప్రజలు తనకు పట్టం కట్టారని ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి మరోసారి స్పష్టంచేశారు. -
తాడిపత్రిలో ఖాళీ దిశగా టీడీపీ?
సాక్షి, తాడిపత్రి(అనంతపురం) : తాడిపత్రి టీడీపీలో ముసలం పుట్టింది. టీడీపీలో ఏకపక్ష నిర్ణయాలు, ఆధిపత్యాన్ని సహించలేక పోతున్న మున్సిపల్ కౌన్సిలర్లు ..ఒక్కొక్కరుగా ఆ పార్టీ వీడి వైఎస్సార్సీపీలో చేరుతున్నారు. ఇందులో భాగంగా ఆదివారం ముగ్గురు టీడీపీ కౌన్సిలర్లు తమ పదవులతో పాటు ఆ పార్టీకి రాజీనామా చేసి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి సమక్షంలో వైఎస్సార్ సీపీలో చేరారు. తాజాగా సోమవారం మరో ఇద్దరు కౌన్సిలర్లు అదే బాటలో నడిచారు. తాడిపత్రి పురపాలక సంఘంలోని 15వ, 17వ వార్డు కౌన్సిలర్లు కొండా ప్రవీణ, కొండా శిరీష.. తమ పదవులతో పాటు టీడీపీకి రాజీనామా చేసి వైఎస్సార్ సీపీ తీర్థంపుచ్చుకున్నారు. దాదాపు వంద కుటుంబాలు కూడా అదే బాట పట్టాయి. వీరిని ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి సాదరంగా ఆహ్వానించి, పార్టీలో చేర్చుకున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నాయకత్వంలో, తాడిపత్రి నియోజకవర్గ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ద్వారానే సంక్షేమ ఫలాలు ప్రతి ఒక్కరికీ అందుతాయనే ఆశాభావాన్ని ఈ సందర్భంగా వారు వ్యక్తం చేశారు. -
పెద్దారెడ్డికి రిమాండ్
అనంతపురం, గుత్తి: వైఎస్సార్సీపీ తాడిపత్రి నియోజకవర్గ సమన్వయకర్త కేతిరెడ్డి పెద్దారెడ్డికి గుత్తి జేఎఫ్‌సీఎం మంజులత 14 రోజుల రిమాండ్ విధించారు. రెండు రోజులుగా యల్లనూరు మండలం తిమ్మంపల్లిలో వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలపై టీడీపీ నాయకులు అకారణంగా దాడులకు పాల్పడుతున్నారు. దాడులను ఖండించినందుకు పెద్దారెడ్డిపై 147, 148, 448, 354, 307, 506 రెడ్ విత్ 149 సెక్షన్ల కింద పోలీసులు కేసులు పెట్టారు. గత గురువారం రాత్రి పెద్దారెడ్డిని తాడిపత్రి, యల్లనూరు పోలీసులు అరెస్టు చేసి పామిడి పోలీసుస్టేషన్‌కు తరలించారు. శుక్రవారం ఉదయం గుత్తి ఆస్పత్రిలో వైద్య పరీక్షలు చేయించారు. తదనంతరం జేఎఫ్‌సీఎం మంజులత ఎదుట హాజరు పరిచారు. 14 రోజులు రిమాండ్ విధిస్తూ తాడిపత్రి సబ్ జైలుకు తరలించాలని ఆదేశించారు. తాడిపత్రి సబ్‌జైలుకు తరలిస్తే అక్కడ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్ వస్తుందని పోలీసులు విన్నవించడంతో తర్వాత గుత్తి స్పెషల్ సబ్ జైలుకు తరలించాలని ఆదేశించారు. దీంతో పోలీసులు పెద్దారెడ్డిని గుత్తి సబ్‌జైలుకు భారీ బందోబస్తు మధ్య తరలించారు. నేతల పరామర్శ గుత్తి స్పెషల్ సబ్ జైల్లో రిమాండ్‌లో ఉన్న కేతిరెడ్డి పెద్దారెడ్డిని శుక్రవారం వైఎస్సార్సీపీ ధర్మవరం సమన్వయకర్త కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి, పార్టీ రాష్ట్ర నాయకులు ఆలూరు సాంబశివారెడ్డి, ఎమ్మెల్సీ వెన్నపూస గోపాల్‌రెడ్డిలతో కలిసి అనంత పరామర్శించారు. అనంతరం సబ్ జైలు ఎదుట ఆయన మీడియాతో మాట్లాడారు. జిల్లాలో జేసీ బ్రదర్స్ అరాచకాలు రోజురోజుకూ మితిమీరిపోతున్నాయని అనంత ధ్వజమెత్తారు. కార్యక్రమంలో ప్రముఖ న్యాయవాది బుసా సుధీర్‌రెడ్డి, జెడ్పీటీసీ సభ్యుడు ప్రవీణ్‌కుమార్ యాదవ్, పట్టణ కన్వీనర్ పీరా, జిల్లా కార్యదర్శి గురుప్రసాద్ యాదవ్ పాల్గొన్నారు. -
జేసీ సోదరుల అండతోనే ఇసుక అక్రమ రవాణా
తాడిపత్రి రూరల్: తాడిపత్రిలో జేసీ సోదరుల అండతోనే ఇసుక అక్రమ రవాణా సాగుతోందని, మైనింగ్ అధికారి ప్రతాప్‌రెడ్డిని బెదిరించిన వారిపై చర్యలు తీసుకోవాలని వైఎస్సార్సీపీ తాడిపత్రి నియోజకవర్గ సమన్వయకర్త కేతిరెడ్డి పెద్దారెడ్డి అన్నారు. ఆదివారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తాడిపత్రి ప్రాంతంలో జేసీ సోదరుల అరాచకాలు మితిమీరిపోతున్నాయన్నారు. వారి అండచూసుకుని కొందరు ‘పచ్చ’ నేతలు ఏడీ మైనింగ్ అధికారి ప్రతాప్‌రెడ్డిపై దౌర్జన్యానికి దిగుతున్నారని, అలాగే ఎమ్మెల్యే ఫోన్లో బెదరించాన్నారు. ఆ అధికారిపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేసేందుకు కుట్ర చేస్తున్నారన్నారు. ప్రతాప్‌రెడ్డి అక్రమ మైనింగ్‌పై దాడులు చేపట్టి ప్రతి ఏటా కోట్ల రూపాయల ఆదాయాన్ని ప్రభుత్వానికి సమకూర్చారని, ఇలాంటి ఆధికారిని అధికారిని బెదిరించడం దారుణమన్నారు. ప్రాణహాని ఉందని ప్రతాప్‌రెడ్డి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందేనన్నారు. ఆయనను బెదిరించిన వారిపై చర్యలు తీసుకోవాలన్నారు. తాడిపత్రి ప్రాంతం నుంచి రోజూ 300 ట్రాక్టర్ల ఇసుక తరలిపోతోందని రెవెన్యూ, పోలీసు అధికారులు మామూళ్లు తీసుకుని మాఫియాను సాగిస్తున్నారని విమర్శించారు. ఎస్పీ ఆశోక్‌కుమార్ స్పందించి ఇసుక అక్రమ రవాణాను అరికట్టి తాగునీటి ఎద్దడిని కాపాడాలని తెలిపారు. -
జేసీ సోదరుల అండతోనే దీపక్‌రెడ్డి భూకబ్జాలు
- జేసీ బ్రదర్స్‌ను టీడీపీ నుంచి సస్పెండ్ చేయాలి - వైఎస్సార్సీపీ తాడిపత్రి సమన్వయకర్త కేతిరెడ్డి పెద్దారెడ్డి డిమాండ్ అనంతపురం సప్తగిరి సర్కిల్ : అనంతపురం ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి- తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి అండతోనే అల్లుడు గుణపాటి దీపక్‌రెడ్డి భూ కబ్జాలకు పాల్పడుతున్నాడని వైఎస్సార్సీపీ తాడిపత్రి సమన్వయకర్త కేతిరెడ్డి పెద్దారెడ్డి విమర్శించారు. వైఎస్సార్సీపీ జిల్లా కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జేసీ సోదరులు అధికారులను బెదిరించి తమ పనులు చేయించుకుంటారని, మాట వినని వారిపై దౌర్జన్యాలకు సైతం పాల్పడుతున్నారని మండిపడ్డారు. జిల్లాలో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారన్నారు. ప్రజలకు ప్రశ్నించే హక్కు కూడా లేకుండా చేస్తున్నారన్నారు. అనంతపురంలోని టవర్‌క్లాక్ వద్ద ప్లాస్టిక్ కవర్లు విక్రయిస్తున్నావంటూ జేసీ దివాకర్‌రెడ్డి ఓ మార్వాడిని రోడ్డుపైకి ఈడ్చుకొచ్చి కొడితే పోలీసులు చోద్యం చూశారే తప్ప ఏమీ చేయలేకపోయారన్నారు. సామాన్య ప్రజలు ఇలాంటి చర్యలకు పాల్పడితే తీవ్రంగా పరిగణించే పోలీసులు.. ఇలాంటి వాటిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. ప్రస్తుతం పచ్చచొక్కా వేసుకుంటే ఇష్టమొచ్చినట్లు వ్యవహరించవచ్చనే ధోరణితో ప్రవర్తిస్తున్నారన్నారు. ‘అధికారం’ ముసుగులో ఎంతటి అరాచకాలకైనా పాల్పడవచ్చనే సంకేతాన్ని ప్రజలకు ఇస్తున్నారని దుయ్యబట్టారు. ‘చందాలు అడగరాదు’ అంటూ జేసీ సోదరులు తమ ఇంటి వద్ద పెద్ద పెద్ద బోర్డులు వేసుకున్నారన్నారు. అయితే అవి తమకు వర్తించవన్నట్టు గత ఏడాది అమ్మవారి గుడి కోసం, ఈ ఏడాది సాయిబాబా ఆలయం నిర్మాణం కోసం చందాలు వసూలు చేస్తున్నారన్నారు. వాటితో తమ కుటుంబం మాత్రమే సస్యశ్యామలంగా ఉండాలని వారు కోరుకుంటున్నారని విమర్శించారు. తాడిపత్రి నియోజకవర్గంలో ఫ్యాక్టరీలు ఉన్నప్పటికీ అందులో ఉద్యోగాల గురించి మాత్రం తమను అడగవద్దని చెప్పి నిరుద్యోగులను నిరుత్సాహానికి గురి చేస్తున్నారన్నారు. జేసీ సోదరులను ప్రజలు భయంతో గౌరవిస్తున్నారే తప్ప భక్తితో కాదన్నారు. వచ్చే ఎన్నికల్లో వారికి తగిన గుణపాఠం చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. అధికారులపై దురుసుగా ప్రవర్తించడం, వారిపై దాడులకు పాల్పడడం వారికి అలవాటైపోయిందన్నారు. జేసీ సోదరులను టీడీపీ నుంచి సస్పెండ్ చేసి, శిక్షించాలని కోరారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ జిల్లా కార్యదర్శి కుమ్మరి ఓబులేసు తదితరులు పాల్గొన్నారు. -
‘డబ్బులు వసూలు చేస్తున్న జేసీ బ్రదర్స్’
అనంతపురం: తాడిపత్రిలో అప్రజాస్వామిక పాలక నడుస్తోందని వైఎస్సార్ సీపీ నేతలు అనంత వెంకట్రామిరెడ్డి, కేతిరెడ్డి పెద్దారెడ్డి విమర్శించారు. వైఎస్సార్ సీపీ తాడిపత్రి నియోజకవర్గ ప్లీనరీలో మాట్లాడుతూ... జేసీ బ్రదర్స్ అవినీతికి కేరాఫ్ అడ్రస్‌గా మారారని, పరిశ్రమల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబు మెప్పు కోసమే జగన్‌ను విమర్శిస్తున్నారని మండిపడ్డారు. తాడిపత్రిలో వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ జెండా ఎగరడం ఖాయమన్నారు. జేసీ బ్రదర్స్ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటాన్ని ఉధృతం చేస్తామని ప్రకటించారు. -
నిరూపిస్తే అనంత నుంచి వెళ్లిపోతా: పెద్దారెడ్డి
అనంతపురం : టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డిపై తాడిపత్రి వైఎస్ఆర్ సీపీ ఇంఛార్జ్ కేతిరెడ్డి పెద్దారెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఆయన శనివారమిక్కడ మాట్లాడుతూ... పదవుల కోసమే రెడ్డి సామాజికవర్గాన్ని దూషిస్తున్నారన్నారు. వైఎస్ రాజశేఖరరెడ్డి పాలనలో లబ్ది పోందలేదని ఏ ఒక్కరైనా నిరూపిస్తే అనంతపురం జిల్లా నుంచి తాను వెళ్లిపోయేందుకు సిద్ధమని పెద్దారెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఎంపీ మిథున్ రెడ్డి మాట్లాడుతూ చెరుకులపాడు నారాయణరెడ్డి హత్య వెనుక డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి హస్తముందని ఆరోపించారు. చంద్రబాబు హత్యా రాజకీయాలను ప్రోత్సహిస్తున్నారని, అవినీతికి కేరాఫ్ అడ్రస్‌గా చంద్రబాబు పాలన కొనసాగుతోందని ఆయన అన్నారు. మరోవైపు అనంతపురం జిల్లా శింగనమల వైఎస్సార్ సీపీ సమన్వకర్త జొన్నలగడ్డ పద్మావతి చేపట్టిన పాదయాత్ర ముగిసింది. రైతు సమస్యలు పరిష్కరించాలన్న డిమాండ్ తో శింగనమల నియోజకవర్గంలో గత తొమ్మిది రోజులుగా పద్మావతి పాదయాత్ర చేస్తున్న విషయం తెలిసిందే. యల్లనూరు నుంచి గార్లదిన్నె దాకా 150 కిలోమీటర్ల మేర ఆమె పాదయాత్ర చేశారు. గార్లదిన్నెలో శనివారం సాయంత్రం జరిగిన ముగింపు సభకు భారీ సంఖ్యలో రైతులు హాజరయ్యారు. టీడీపీ నేతల ఒత్తిడితో పాదయాత్రకు పోలీసులు అనేక అడ్డంకులు సృష్టించారని... వైఎస్సార్సీపీ కి లభిస్తున్న ఆదరణ చూసి చంద్రబాబు తట్టుకోలేక పోతున్నారని అనంతపురం మాజీ ఎంపీ అనంతవెంకట్రామిరెడ్డి ఆరోపించారు. -
జేసీకి మతిభ్రమించింది
- సీమ ఫ్యాక్షన్‌కు జేసీ కుటుంబమే కారణం - దివాకర్రెడ్డేమీ ఐఏఎస్ చదవలేదు - ఘర్షణలతో కాదు.. రాజకీయంగానే ఎదుర్కొంటాం - వైఎస్సార్సీపీ తాడిపత్రి నియోజకవర్గ సమన్వయకర్త కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రి : ‘ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డికి మతిభ్రమించి ఏది పడితే అది మాట్లాడుతున్నారు. గండికోట ఎత్తిపోతల పథకం ప్రారంభ సభలో సాక్షాత్తు సీఎం చంద్రబాబు సమక్షంలోనే సభ్యత, సంస్కారం లేకుండా మాట్లాడిన తీరును ప్రజలందరూ చూశారు. నేను చదువుకున్నది ఏడో తరగతి కాదు..పదో తరగతి వరకు చదివా. జేసీ ఏమీ ఐఏఎస్ చదవలేదు! చదివింది పీయూసీ (ఇంటర్)నే. ఈ విషయాన్ని ఆయన గుర్తుంచుకోవాల’ని వైఎస్సార్సీపీ తాడిపత్రి నియోజకవర్గ సమన్వయకర్త కేతిరెడ్డి పెద్దారెడ్డి హితవు పలికారు. గురువారం ఆయన తాడిపత్రిలోని తన నివాసంలో విలేకరులతో మాట్లాడారు. జేసీ సోదరుల తీరుపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ‘చదువు మాత్రమే సంస్కారం నేర్పదు. ఏమీ చదువు లేకపోయినా అంజయ్య ముఖ్యమంత్రి కాలేదా? మా నాన్న సమితి అధ్యక్షులుగా పనిచేశారు. నేను రైతు కుటుంబం నుంచి వచ్చా. మీలా తెలంగాణ గద్వాల్ నుంచి ఇక్కడికి వలస రాలేదు. అసలు రాయలసీమలో ఫ్యాక్షన్‌కు మూలం మీరే. తాడిపత్రి సమన్వయకర్తగా నేను రావడం ఇష్టం లేక ఏవేవో మాట్లాడుతున్నారు. దివంగత వైఎస్ రాజారెడ్డి, మా అధినేత జగన్మోహన్రెడ్డి గురించి మాట్లాడే ఆర్హత మీకు లేదు. రాజారెడ్డిని హత్య చేసిన వారు కూడా నేడు స్వేచ్ఛగా తిరుగుతున్నారంటే..దీన్నిబట్టే వైఎస్ కుటుంబం ఔన్నత్యాన్ని తెలుసుకోండి. జేసీ సోదరుల నిజస్వరూపం ఎక్కడ బయటపడుతుందోనని భయపడుతున్నారు. మేం రాజకీయంగానే వారిని ఎదుర్కొంటాం. ఘర్షణలతో కాద’ని పెద్దారెడ్డి స్పష్టం చేశారు. ‘ప్రశాంతంగా ఉన్న గ్రామాల్లో చిచ్చు రేపుతున్నారు. యల్లనూరు మండలంలోని అన్ని గ్రామాల్లో గత ఆరు నెలలుగా కొందరికి వాహనాలు, డబ్బు సమకూర్చి ఫ్యాక్షన్ ప్రోత్సహిస్తున్నారు. నా స్వగ్రామం తిమ్మంపల్లిలోనూ ఇల్లు కొని గొడవలకు ఆజ్యం పోయాలని చూస్తున్నారు. తాడిపత్రిలో ఇన్నాళ్లూ బెదిరింపు రాజకీయాలు చేశారు. ఈ ప్రాంతంలో జరిగిన ప్రతి హత్యలోనూ వారికి సంబంధం ఉంది. ఎమ్మెల్యేపై ఉన్న 32 కేసులే ఇందుకు నిదర్శనం. అందరి వద్దా బహిరంగంగానే చందాలు వసూలు చేస్తారు. ఎదురు తిరిగితే భయపెడతారు. పోలీసులతో తప్పుడు కేసులు కూడా నమోదు చేయిస్తార’ని విమర్శించారు. తన గురించి మాట్లాడే అర్హత వారికి లేదన్నారు. చుట్టుపక్కల ఎన్ని పరిశ్రమలున్నా ఈ ప్రాంతంలోని విద్యావంతులకు, కార్మికులకు ఉపాధి దొరకడం లేదన్నారు. జేసీ సోదరులకు కావాల్సినవి దక్కకపోతే పరిశ్రమల వద్ద ధర్నాలు కూడా చేస్తారు కానీ ఈ ప్రాంత ప్రజలను మాత్రం పట్టించుకోరని విమర్శించారు. వారు చేసే దుర్మార్గాలను బయటపెడతామని, అరాచక రాజకీయానికి చరమగీతం పడే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని హెచ్చరించారు. సమావేశంలో వైఎస్సార్సీపీ నాయకులు పాలెం వెంట్రామిరెడ్డి, పట్టణ, రూరల్, యూత్ కన్వీనర్లు కంచం రామ్మోహన్‌రెడ్డి, నాగేశ్వరరెడ్డి, ఓబిరెడ్డి, కిరణ్‌కుమార్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.