వైఎస్సార్‌కాంగ్రెస్‌పార్టీ తాడిపత్రి నియోజకవర్గ సమన్వయకర్తగా కేతిరెడ్డి పెద్దారెడ్డిని నియమిస్తూ పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుంది.
– రాష్ట్ర కార్యదర్శులుగా వీఆర్ రామిరెడ్డి, రమేశ్‌రెడ్డి
– యువజనవిభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ధనుంజయయాదవ్
– యూత్ విభాగం జిల్లా అధ్యక్షుడిగా ఆలూరి సాంబశివారెడ్డి
అనంతపురం : వైఎస్సార్‌కాంగ్రెస్‌పార్టీ తాడిపత్రి నియోజకవర్గ సమన్వయకర్తగా కేతిరెడ్డి పెద్దారెడ్డిని నియమిస్తూ పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేసింది. వీఆర్ రామిరెడ్డి, రమేశ్‌రెడ్డిని పార్టీ రాష్ట్ర కార్యదర్శులుగా నియమించింది. దీంతో పాటు జిల్లా యువజన విభాగంలోనూ మార్పులు చేసింది. యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు ధనుంజయాదవ్‌ను ఈ విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పదోన్నతి కల్పించారు. యూత్ విభాగం జిల్లా అధ్యక్షుడిగా ఆలూరి సాంబశివారెడ్డి నియమించారు.
అధిష్టానానికి ప్రత్యేక కృతజ్ఞతలు:
వైఎస్సార్‌సీపీ పార్టీ తన పేరును ప్రకటించడంతో శుక్రవారం సాయంత్రం కేతిరెడ్డి పెద్దారెడ్డి తన అనుచరులతో కలసి తాడిపత్రి పట్టణంలోని చింతల వెంటకరమణ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆయన సాక్షితో మాట్లాడారు. నాపై నమ్మకంతో తాడిపత్రి నియోజక వర్గ బాధతలు అప్పగించిందుకు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షుడు శంకర్‌నారాయణ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అనంత వెంకటరామిరెడ్డి, రాష్ట్ర , జిల్లా నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. అప్పగించిన బాద్యతలను సమర్థవంతంగా నిర్వహించి, పార్టీ ఉన్నతి కోసం శ్రమిస్తామన్నారు. 2019 ఎన్నికల్లో తాడిపత్రిలో వైఎస్సార్‌సీపీ విజయమే లక్ష్యంగా కార్యకర్తలతో కలిసి పనిచేస్తానని తెలిపారు. పార్టీ నాయకులు ఎం.ఎ.రంగారెడ్డి, కంచంరామ్మోహన్‌రెడ్డి, పాలెం వెంకట్రామిరెడ్డి, జనార్ధన్‌రెడ్డి, చావ్వా రాజశేఖర్‌రెడ్డి, కిరణ్, ఓబుళరెడ్డి, వెంటేశ్ తదితరులు ఉన్నారు.
నేడు వైఎస్సార్ విగ్రహానికి నివాళి
వైఎస్సార్‌సీపీ తాడిపత్రి నియోజక వర్గ సమన్వయకర్తగా నూతనంగా బాధతలు స్వీకరించిన కెతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రి పట్టణంలోని వైఎస్సార్ సర్కిల్‌లో ఉన్న జననేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి విగ్రహానికి శనివారం ఉదయం ఘనంగా నివాళులర్పించనున్నారు. ఆయన స్వగ్రామం యల్లనూరు మండలం తిమ్మంపల్లి నుంచి తాడిపత్రికి వస్తారు. మొదట వై.ఎస్.రాజశేఖర్‌రెడ్డి విగ్రహానికి పూలమాలాలు వేసి నివాళులర్పిస్తారు. అనంతరం గాంధీజీ, చాల్ల సుబ్బరాయుడు, అంబేడ్కర్ విగ్రహాలకు కూడా పూలమాలలు వేసి నివాళులర్పిస్తారు.