సాక్షి, అనంతపురం: జేసీ ట్రావెల్స్ ఫోర్జరీ కేసులో మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి, జేసీ అస్మిత్‌రెడ్డి అరెస్ట్ చేయడాన్ని స్వాగతిస్తున్నామని తాడిపత్రి వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి అన్నారు. ఆయన శనివారం మీడియాతో మాట్లాడుతూ.. ఫోర్జరీ డాక్యూమెంట్స్‌తో 154 వాహనాలను జేసీ ప్రభాకర్‌రెడ్డి అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించారని తెలిపారు. మాజీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డిని కూడా అరెస్ట్ చేయాలన్నారు. దివాకర్‌రెడ్డి అండతోనే ఈ అక్రమాలు జరిగాయని మండిపడ్డారు. తాడిపత్రి సీఐ, ఎస్సై సంతకాలను కూడా జేసీ ట్రావెల్స్ ఫోర్జరీ చేసిందని పెద్దారెడ్డి విమర్శించారు. (మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి అరెస్ట్)
జేసీ కుటుంబ సభ్యుల అరెస్ట్ వెనుక ఎలాంటి రాజకీయ కారణాలు లేవని పెద్దారెడ్డి తెలిపారు. జేసీ ప్రభాకర్‌రెడ్డి తప్పు చేశారని అందుకే అరెస్ట్ అయ్యారని తెలిపారు. వందలాది మంది ప్రయాణికులను జేసీ ట్రావెల్స్ పొట్టన పెట్టుకుందని దుయ్యబట్టారు. మాజీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డిపై కూడా కేసు నమోదు చేయాలన్నారు. జేసీ ట్రావెల్స్ అరాచకాలపై లోతుగా దర్యాప్తు చేయాలని పెద్దారెడ్డి అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment