సాక్షి, అనంతపురం: జేసీ ట్రావెల్స్ ఫోరర్జీ కేసులో సీబీఐ రంగంలోకి దిగింది. తాడిపత్రిలోని జేసీ దివాకర్ రెడ్డి ముఖ్య అనుచరుడు చవ్వా గోపాల్‌రెడ్డి ఆఫీసులో సీబీఐ అధికారులు సోదాలు నిర్వహించారు.
ఈ క్రమంలో బీఎస్-3 వాహనాలను స్క్రాప్ కింద కొనుగోలు చేసి బీఎస్-4గా అక్రమ రిజిస్ట్రేషన్లు చేసినట్టు సీబీఐ అధికారులు గుర్తించారు. జేసీ ట్రావెల్స్ 154 వాహనాలను నాగాలాండ్‌లో రిజిస్ట్రేషన్ చేసిందన్నారు. కాగా, జేసీ ట్రావెల్స్ ఫోర్జరీ కేసులో ఇప్పటికే రూ.22 కోట్ల ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది.
Comments
Please login to add a commentAdd a comment