తాడిపత్రి : వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, రాష్ట్ర ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఈ నెల 26న యల్లనూరు మండలం తిమ్మంపల్లికి రానున్నారు. తాడిపత్రి నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త కేతిరెడ్డి పెద్దారెడ్డి కుమారుడు హర్షవర్దన్‌రెడ్డి వివాహం ఈ నెల 18న వైఎస్సార్‌జిల్లా ప్రొద్దుటూరులో జరిగింది. ఈ వివాహానికి అనివార్య కారణాల వల్ల జగన్‌మోహన్‌రెడ్డి హాజరు కాలేకపోయారు. దీంతో ఈ నెల 26న తిమ్మంపల్లిలో నూతన దంపతులు హర్షవర్దన్‌రెడ్డి, సాయి అర్చితలను ఆశీర్వదించేందుకు వస్తున్నట్లు కేతిరెడ్డి పెద్దారెడ్డి తెలిపారు.