సాక్షి, అనంతపురం: తాడిపత్రి అల్లర్ల కేసులో కొత్త ట్విస్ట్ నెలకొంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలపై మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి ఫిర్యాదు చేయలేదు. మొదటి నుంచి ఊకదంపుడు ముచ్చట్లు, కవ్వింపు చర్యలతో ఎమ్మెల్యే పెద్దారెడ్డి వర్గాన్ని రెచ్చగొడుతున్న జేసీ వర్గం తోకముడిచింది. ఎమ్మెల్యే పెద్దారెడ్డి, వైఎస్సార్‌సీపీ నేతలపై ఆరోపణలకే పరిమితమైంది జేసీ వర్గం. ఇక జేసీ వర్గీయుల దాడిలో గాయపడ్డ వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు మనోజ్, బ్రహ్మేంద్ర జేసీ ప్రభాకర్ రెడ్డి, ఆయన కొడుకు అస్మిత్ రెడ్డిపై లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. తమను కులం పేరుతో దూషించారని ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన మనోజ్, బ్రహ్మేంద్ర ఫిర్యాదు చేయడంతో మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి, అస్మిత్‌రెడ్డిపై పోలీసులు అట్రాసిటీ కేసులు నమోదు చేశారు.
(చదవండి: తాడిపత్రిలో 144 సెక్షన్ : ఎస్పీ)
ఐపీసీ 307, 306 సెక్షన్ల కింద జేసీ వర్గానికి చెందిన 27 మందిపై పోలీసులు కేసులు బుక్ చేశారు. దీంతోపాటు గొడవలకు కారణమైన యూట్యూబ్ ఛానల్ విలేకరి వలిపై కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు. ఈ సందర్భంగా తాడిపత్రి డీఎస్పీ చైతన్య మీడియాతో శుక్రవారం మాట్లాడుతూ... తాడిపత్రిలో పోలీసులు నిష్పక్షపాతంగా వ్యవహరిస్తున్నారు. మాకు ఏ రాజకీయ పార్టీ తో సంబంధం ఉండదు. తప్పు చేసే వారు ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదు. తాడిపత్రిలో అల్లర్ల పై ఇప్పటిదాకా 3 కేసులు నమోదు చేశాం. ఫిర్యాదుల ఆధారంగానే కేసులు నమోదు చేస్తాం. వారం రోజుల పాటు తాడిపత్రి లో 144 సెక్షన్ అమల్లో ఉంటుందని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment