నిరూపిస్తే అనంత నుంచి వెళ్లిపోతా: పెద్దారెడ్డి | ysrcp leader peddareddy takes on jc diwakar reddy | Sakshi
Sakshi News home page

నిరూపిస్తే అనంత నుంచి వెళ్లిపోతా: పెద్దారెడ్డి

Published Sat, Jun 3 2017 9:04 PM | Last Updated on Thu, Aug 9 2018 8:35 PM

నిరూపిస్తే అనంత నుంచి వెళ్లిపోతా: పెద్దారెడ్డి - Sakshi

నిరూపిస్తే అనంత నుంచి వెళ్లిపోతా: పెద్దారెడ్డి

అనంతపురం : టీడీపీ ఎంపీ జేసీ దివాకర్‌ రెడ్డిపై తాడిపత్రి వైఎస్‌ఆర్‌ సీపీ ఇంఛార్జ్‌ కేతిరెడ్డి పెద్దారెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఆయన శనివారమిక్కడ మాట్లాడుతూ... పదవుల కోసమే రెడ్డి సామాజికవర్గాన్ని దూషిస్తున్నారన్నారు. వైఎస్‌ రాజశేఖరరెడ్డి పాలనలో లబ్ది పోందలేదని ఏ ఒక్కరైనా నిరూపిస్తే అనంతపురం జిల్లా నుంచి తాను వెళ్లిపోయేందుకు సిద్ధమని పెద్దారెడ్డి అన్నారు.

ఈ సందర్భంగా ఎంపీ మిథున్‌ రెడ్డి మాట్లాడుతూ చెరుకులపాడు నారాయణరెడ్డి హత్య వెనుక డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి హస్తముందని ఆరోపించారు. చంద్రబాబు హత్యా రాజకీయాలను ప్రోత్సహిస్తున్నారని, అవినీతికి కేరాఫ్‌ అడ్రస్‌గా చంద్రబాబు పాలన కొనసాగుతోందని ఆయన అన్నారు.

మరోవైపు అనంతపురం జిల్లా శింగనమల వైఎస్సార్ సీపీ సమన్వకర్త జొన్నలగడ్డ పద్మావతి చేపట్టిన పాదయాత్ర ముగిసింది. రైతు సమస్యలు పరిష్కరించాలన్న డిమాండ్ తో శింగనమల నియోజకవర్గంలో గత తొమ్మిది రోజులుగా పద్మావతి పాదయాత్ర చేస్తున్న విషయం తెలిసిందే. యల్లనూరు నుంచి గార్లదిన్నె దాకా 150 కిలోమీటర్ల మేర ఆమె పాదయాత్ర చేశారు.

గార్లదిన్నెలో శనివారం సాయంత్రం జరిగిన ముగింపు సభకు భారీ సంఖ్యలో రైతులు హాజరయ్యారు. టీడీపీ నేతల ఒత్తిడితో పాదయాత్రకు పోలీసులు అనేక అడ్డంకులు సృష్టించారని... వైఎస్సార్సీపీ కి లభిస్తున్న ఆదరణ చూసి చంద్రబాబు తట్టుకోలేక పోతున్నారని అనంతపురం మాజీ ఎంపీ అనంతవెంకట్రామిరెడ్డి ఆరోపించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement