Cherukulapadu Narayana Reddy
-
నారాయణరెడ్డి హత్యకేసు సీబీఐకి అప్పగించాలి
పత్తికొండ టౌన్: చెరుకులపాడు నారాయణరెడ్డి హత్యకేసును సీబీఐకి అప్పగించాలని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి చెరుకులపాడు ప్రదీప్‌రెడ్డి డిమాండ్ చేశారు. గురువారం సాయంత్రం పత్తికొండలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా పత్తికొండకు వచ్చిన సీఎం చంద్రబాబు చెరుకులపాడు నారాయణరెడ్డి హత్యతో కేఈ శ్యాంబాబుకు సంబంధం లేదని చెప్పడం సిగ్గుచేటు అన్నారు. హత్యకేసుతో టీడీపీ నాయకులకు సంబంధం లేనప్పుడు సీబీఐ దర్యాప్తునకు ఎందుకు జంకుతున్నారని ఆయన ప్రశ్నించారు. అధికారం కోసం పిల్లనిచ్చిన మామను చంద్రబాబు వెన్నుపోటు పొడిస్తే, కేఈ శ్యాంబాబు ప్రతిపక్ష నాయకులను హత్యలు చేస్తున్నాడని ఆరోపించారు. టీడీపీ ఐదేళ్ల పాలనలో ప్రజలకు ఒరిగిందేమీ లేదన్నారు. ఎన్నికల ప్రచారంలో చెప్పుకునేందుకు ఏమీ లేక చంద్రబాబు.. ప్రతిపక్షనేత వైఎస్ జగన్‌ను విమర్శించడమే పనిగా పెట్టుకున్నారన్నారు. పసుపు–కుంకుమ ఇచ్చినందుకు ఆడపడుచులందరూ తమకే ఓట్లు వేయాలని అడుగుతున్న చంద్రబాబు, జిల్లాలో వందలాదిమంది మహిళల పసుపుకుంకుమలు పోవడానికి కారకులైన కోట్ల, కేఈ కుటుంబాలకు టికెట్లు ఇవ్వడం విడ్డూరంగా ఉందన్నారు. నారాయణరెడ్డి హత్యకేసు నిందితులను పక్కనే పెట్టుకుని, నీతిమాటలు వల్లెవేయడం బాబుకే చెల్లిందన్నారు. అధికారం కోసం హత్యారాజకీయాలను ప్రోత్సహిస్తున్న టీడీపీ నాయకులకు ఎన్నికల్లో ప్రజలే తగిన బుద్ధి చెబుతారని ఆయన అన్నారు. -
జంట హత్య కేసు: కేఈ శ్యాంబాబు అరెస్ట్‌కు ఆదేశాలు
-
కేఈ శ్యాంబాబు అరెస్ట్‌కు ఆదేశాలు
కర్నూలు జిల్లా: జంట హత్య కేసులో కేఈ శ్యాంబాబు, ఎస్ఐ నాగ తులసీ ప్రసాద్‌లను అరెస్ట్ చేయాలంటూ డోన్ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. పత్తికొండ వైఎస్సార్సీపీ సమన్వయకర్త చెరుకులపాడు నారాయణ రెడ్డి, ఆయన డ్రైవర్ సాంబశివుడు హత్య కేసులో వీరిని నిందితులుగా చేర్చాలంటూ 2017లో నారాయణ రెడ్డి భార్య చెరుకులపాడు శ్రీదేవి డోన్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీంతో కేఈ శ్యాంబాబు, నాగ తులసీ ప్రసాద్‌లను అరెస్ట్ చేయాలంటూ అప్పట్లో కోర్టు ఆదేశాలు జారీచేసింది. అనంతరం కేఈ శ్యాంబాబు, నాగ తులసీ ప్రసాద్‌లు హైకోర్టును ఆశ్రయించి స్టే తెచ్చుకున్నారు. స్టే గడువు ముగియడంతో వారిని అరెస్ట్ చేయాలంటూ ఆదేశాలు జారీ చేసింది. -
నిజాయితీకి మారుపేరు చెరుకులపాడు
వెల్దుర్తి: నీతి, నిజాయితీ కలిగిన రాజకీయ నాయకుడు దివంగత చెరుకులపాడు నారాయణరెడ్డి అని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు అన్నారు. అలాగే స్నేహశీలి, ప్రేమాభిమానాలు కలిగిన వ్యక్తి అంటూ ఆయనతో తన అనుబంధాన్ని తెలియబరిచారు. సోమవారం మండలంలోని చెరుకులపాడు గ్రామంలో వైఎస్సార్సీపీ నేత దివంగత చెరుకులపాడు నారాయణరెడ్డి వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అంబటితో పాటు అనంతపురం జిల్లా ఉరవకొండ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి, నెల్లూరు అర్బన్ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్, తెలంగాణ రాష్ట్ర పార్టీ నేత శ్రీధరరెడ్డి, వైఎస్సార్సీపీ కర్నూలు పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు బీవై రామయ్య, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌరువెంకటరెడ్డి,పాణ్యం మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి, కర్నూలు నియోజకవర్గ సమన్వయకర్త హఫీజ్‌ఖాన్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నారాయణరెడ్డికి ఘన నివాళులర్పించారు. రక్తదాన శిబిరంలో పాల్గొన్న వారిని అభినందించారు. అనంతరం నారాయణరెడ్డి సతీమణి, నియోజకవర్గ వైఎస్సార్సీపీ సమన్వయకర్త కంగాటి శ్రీదేవి, నారాయణరెడ్డి సోదరుడు, పార్టీ నేత ప్రదీప్‌రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన భారీ బహిరంగ సభలో మాట్లాడారు. అంబటి రాంబాబు మాట్లాడుతూ నారాయణరెడ్డికి ప్రజల్లో ఉన్న ఆదరణ చేసి ఓర్వలేక.. డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి రాబోవు ఎన్నికల్లో తన కుమారుడు కేఈ శ్యాంబాబుకు ఓటమి తప్పదని భావించే కుమారుడి ద్వారా హత్య చేయించారని ఆరోపించారు. ఇలాంటి పరిస్థితులు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నాయన్నారు. ప్రజలను కాపాడాల్సిన పోలీసు, నిఘా సంస్థలు చంద్రబాబు సొంత సంస్థల్లా పనిచేస్తున్నాయని ఆరోపించారు. పాలనను గాలికొదిలేసిన ముఖ్యమంత్రికి, హత్యా రాజకీయాలు పెంచి పోషిస్తున్న డిప్యూటీ సీఎంకు.. వారు కాని, వారు కుమారులు కాని, టీడీపీకి చెందిన ఎవరైనా రాబోవు రోజుల్లో డిపాజిట్లు కూడా లేకుండా ‘ఫ్యాను’ గాలికి కొట్టుకుపోతారన్నారు. జలదీక్ష సందర్భంగా జిల్లాకు వచ్చిన తనకు నారాయణరెడ్డితో ఏర్పడిన అనుబంధం, అనురాగాన్ని అంబటి గుర్తు చేసుకున్నారు. నారాయణరెడ్డి కుటుంబానికి, కార్యకర్తలకు పార్టీ చేదోడుగా ఉంటుందన్నారు. తమ నాయకుడి హత్య జరిగినా చెక్కుచెదరకుండా ఆయన కుటుంబానికి ఆసరాగా ఉన్న వేలాది మంది కార్యకర్తల మనోధైర్యానికి హ్యాట్సాఫ్ చెప్పారు. ఉరవకొండ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో శాంతి భద్రతలు అదుపు తప్పాయన్నారు. టీడీపీ నాయకుల వల్లే హత్యలు, దోపిడీలు, అధికారులపై దాడులు, రాజధాని పేరుతో అవినీతి, పోలవరంలో అక్రమాలు, ప్రమాదాలు పెరిగిపోయాయన్నారు. చంద్రబాబు ప్రత్యేక హోదాపై దొంగ దీక్షలు చేస్తున్నారని, ఎన్నికల హామీలను పూర్తిగా విస్మరించారని దుయ్యబట్టారు. హత్యా రాజకీయాలకు తెరదించేలా పత్తకొండలో డిప్యూటీ సీఎంకు బుద్ధి చెప్పాల్సిన అవసరం ప్రజలకుందన్నారు. నెల్లూరు అర్బన్ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ బీసీల పార్టీగా చెప్పుకునే నేటి డూప్లికేట్ టీడీపీ ఆ వర్గాలకు చేసిందేమీలేదని దుయ్యబట్టారు. బీసీలకు ఎవరైనా మేలు చేశారు అంటే అది కేవలం ఎన్టీఆర్, వైఎస్సార్ మాత్రమేనని స్పష్టం చేశారు. రాబోవు రోజుల్లో వైఎస్ జగన్మోహన్రెడ్డి ద్వారా బీసీలతో పాటు అన్ని సామాజికవర్గాలకు న్యాయం జరుగుతుందన్నారు. కర్నూలు జిల్లాలో కేఈ కుటుంబీకులే పదవులు ఏలుతున్నారు గానీ ఇతరులకు అవకాశాలిచ్చిందేమీలేదన్నారు. పార్టీ అధినేత జగన్మోహన్రెడ్డి మొట్టమొదటగా ప్రకటించిన పార్టీ అభ్యర్థి కంగాటి శ్రీదేవినేనని, ఆమెను భారీ మెజారిటీతో గెలిపించుకుని ఈ సీటును జగనన్నకు కానుకగా ఇద్దామని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. వైఎస్సార్సీపీ కర్నూలు పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు బీవై రామయ్య మాట్లాడుతూ ప్రతి కార్యకర్త సైనికుడిలా పనిచేసి కంగాటి శ్రీదేవిని గెలిపించుకోవడం ద్వారా దివంగత చెరుకులపాడు నారాయణరెడ్డి ఆశయాలను సాధించుకుందామన్నారు. హత్యా రాజకీయాలకు బెదిరేది లేదని చాటి చెబుదామన్నారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి కావడం ఎంత ఖాయమో, పత్తికొండలో కంగాటి శ్రీదేవి గెలవడం కూడా అంతే ఖాయమన్నారు. కంగాటి శ్రీదేవి మాట్లాడుతూ హత్యలు, అక్రమాలు, ఇతరులు పదవులు అనుభవించరాదనే నీచమైన ఆలోచనలు కేఈ కుటుంబానివని దుయ్యబట్టారు. తన భర్త నారాయణరెడ్డిని కేఈ కుటుంబం హత్య చేయించి తమ ఆత్మస్థైర్యం దెబ్బతీయాలని చూసిందని, అయితే..అది సాధ్యం కాలేదని అన్నారు. కార్యకర్తల అండతో నారాయణరెడ్డి ఆశయాలను సాధిస్తానన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నియోజకవర్గ నేత చెరుకులపాడు ప్రదీప్‌రెడ్డి, జిల్లా, నియోజకవర్గ, మండల నేతలు, కన్వీనర్లు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
కేఈ శ్యాంబాబు నిందితుడే
సాక్షి ప్రతినిధి, కర్నూలు: కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గ వైఎస్సార్సీపీ సమన్వయకర్త చెరుకులపాడు నారాయణరెడ్డి హత్య కేసులో ఉపముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి తనయుడు కేఈ శ్యాంబాబుతోపాటు టీడీపీకి చెందిన ఆస్పరి మండల జెడ్పీటీసీ సభ్యురాలు కప్పట్రాళ్ల బొజ్జమ్మ, అప్పటి వెల్దుర్ది ఎస్ఐ నాగతులసీ ప్రసాద్‌లను డోన్ కోర్టు నిందితులుగా పేర్కొంది. ముగ్గురిపై నాన్ బెయిలబుల్ వారెంట్లు జారీ చేసింది. ఈ మేరకు డోన్ ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి ఆంజనేయులు శుక్రవారం తీర్పు వెలువరించారు. ‘‘నారాయణరెడ్డి హత్య ఘటనలో కేఈ శ్యాంబాబు, బొజ్జమ్మ, నాగతులసీ ప్రసాద్‌ల పాత్రపై ఆధారాలను బట్టి కచ్చితంగా కోర్టు విచారణ జరపాల్సిందే. అందువల్లే ఐపీసీ సెక్షన్ 147, 148, 149 (గుంపుగా మారణాయుధాలతో తిరగడం), 302(హత్య), 109(తప్పు చేసేందుకు సహకరించడం), మారణాయుధాల చట్టంతోపాటు ఐపీసీ సెక్షన్ 120(బీ)(కుట్ర చేయడం) కింద వీరిపై కేసులు నమోదు చేయాలి. ఇందుకు అనుగుణంగా ఈ ముగ్గురిపై నాన్ బెయిలబుల్ వారెంట్లు జారీ చేస్తున్నాం. తదుపరి విచారణను మార్చి 1వ తేదీన చేపడతాం’’అని న్యాయమూర్తి ఇచ్చిన తీర్పులో స్పష్టం చేశారు. -
నారాయణరెడ్డి హత్య కేసులో కేఈ కుటుంబానికి షాక్
-
నారాయణ రెడ్డి హత్య కేసులో సంచలన తీర్పు
సాక్షి, కర్నూలు : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పత్తికొండ ఇన్ఛార్జ్ చెరుకులపాడు నారాయణరెడ్డి హత్య కేసులో ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి కుటుంబానికి షాక్ తగిలింది. ఈ కేసులో డిప్యూటీ సీఎం కుమారుడు శ్యామ్ బాబుతో సహా మరో ఇద్దరిని నిందితులుగా చేర్చి, అరెస్ట్ చేయాలని డోన్ న్యాయస్థానం సంచలన తీర్పునిచ్చింది. కాగా తన భర్త హత్య కేసు విచారణలో అన్యాయం జరిగిందంటూ చెరుకులపాడు నారాయణరెడ్డి భార్య కంగాటి శ్రీదేవి న్యాయస్థానాన్ని ఆశ్రయించిన విషయం తెలిసిందే. (చెరుకులపాడు నారాయణరెడ్డి గత ఏడాది మే 22న దారుణ హత్యకు గురైన విషయం విదితమే) తన భర్త నారాయణరెడ్డితో పాటు మరో వ్యక్తిని అతి కిరాతకంగా హత్యచేసిన శ్యాంబాబు అనుచరులు అటు తరువాత పోలీసులపై ఒత్తిడి తెచ్చి చార్జీషీట్లో పేర్లు తొలగించుకోవడం పట్ల ఆమె తీవ్ర అభ్యంతరం చేస్తూ... నిందితులుగా కేఈ శ్యాంబాబుతో పాటు ఆస్పరి జెడ్పీటీసీ కప్పెట్రాల బొజ్జమ్మ, అప్పటి వెల్దుర్తి ఎస్ఐ నాగతులసీ ప్రసాద్‌లను తన భర్త హత్యకేసులో ముద్దాయిలుగా చేర్చాలని పేర్కొంటూ కర్నూలు జిల్లా డోన్ కోర్టులో శ్రీదేవి ప్రైవేట్ ఫిర్యాదు దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం కేఈ కృష్ణమూర్తి కుమారుడు శ్యామ్ బాబు, బొజ్జమ్మ, వెల్దుర్తి ఎస్ఐ నాగప్రసాద్‌లను నిందితులుగా చేర్చాలని సూచించింది. -
డిప్యూటీ సీఎం కొడుకును ఎలా తప్పిస్తారు?
-
నిరూపిస్తే అనంత నుంచి వెళ్లిపోతా: పెద్దారెడ్డి
అనంతపురం : టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డిపై తాడిపత్రి వైఎస్ఆర్ సీపీ ఇంఛార్జ్ కేతిరెడ్డి పెద్దారెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఆయన శనివారమిక్కడ మాట్లాడుతూ... పదవుల కోసమే రెడ్డి సామాజికవర్గాన్ని దూషిస్తున్నారన్నారు. వైఎస్ రాజశేఖరరెడ్డి పాలనలో లబ్ది పోందలేదని ఏ ఒక్కరైనా నిరూపిస్తే అనంతపురం జిల్లా నుంచి తాను వెళ్లిపోయేందుకు సిద్ధమని పెద్దారెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఎంపీ మిథున్ రెడ్డి మాట్లాడుతూ చెరుకులపాడు నారాయణరెడ్డి హత్య వెనుక డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి హస్తముందని ఆరోపించారు. చంద్రబాబు హత్యా రాజకీయాలను ప్రోత్సహిస్తున్నారని, అవినీతికి కేరాఫ్ అడ్రస్‌గా చంద్రబాబు పాలన కొనసాగుతోందని ఆయన అన్నారు. మరోవైపు అనంతపురం జిల్లా శింగనమల వైఎస్సార్ సీపీ సమన్వకర్త జొన్నలగడ్డ పద్మావతి చేపట్టిన పాదయాత్ర ముగిసింది. రైతు సమస్యలు పరిష్కరించాలన్న డిమాండ్ తో శింగనమల నియోజకవర్గంలో గత తొమ్మిది రోజులుగా పద్మావతి పాదయాత్ర చేస్తున్న విషయం తెలిసిందే. యల్లనూరు నుంచి గార్లదిన్నె దాకా 150 కిలోమీటర్ల మేర ఆమె పాదయాత్ర చేశారు. గార్లదిన్నెలో శనివారం సాయంత్రం జరిగిన ముగింపు సభకు భారీ సంఖ్యలో రైతులు హాజరయ్యారు. టీడీపీ నేతల ఒత్తిడితో పాదయాత్రకు పోలీసులు అనేక అడ్డంకులు సృష్టించారని... వైఎస్సార్సీపీ కి లభిస్తున్న ఆదరణ చూసి చంద్రబాబు తట్టుకోలేక పోతున్నారని అనంతపురం మాజీ ఎంపీ అనంతవెంకట్రామిరెడ్డి ఆరోపించారు. -
మలుపులో మాటు!
►నారాయణరెడ్డి హత్యకు రెండు ప్రాంతాల్లో స్పాట్ ►రామకృష్ణాపురం వద్ద కొండల్లో మరో టీం కాపు ►మొదటి స్పాట్ పూర్తి కాగానే ఫోన్లో సమాచారం ►జంట హత్యల్లో మరో కోణంపై విస్తృత చర్చ ►ఆ వ్యక్తులు ఎవరనే విషయం సస్పెన్స్ ►పోలీసుల దర్యాప్తు ఆ దిశగా సాగాలనే డిమాండ్ సాక్షి ప్రతినిధి, కర్నూలు: వెఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పత్తికొండ నియోజకవర్గ ఇన్చార్జి చెరుకులపాడు నారాయణ రెడ్డిని హత్య చేసేందుకు పక్కా ప్లాన్ సాగిందా? ఒకవేళ కల్వర్టు వద్ద దాడి చేసే అవకాశం దక్కకపోతే మరో ప్రాంతంలో అటాక్ చేసేందుకు పథకం రచించారా? రామకృష్ణాపురం సమీపంలో కొండ చరియల మలుపుల వద్ద మరో 25 మంది టీంతో అటాక్ చేసేందుకు సిద్ధంగా ఉన్నారా? అక్కడ కూడా మరో రెండు ట్రాక్టర్లు, వేట కొడవళ్లు, బాంబులతో దాడి చేసే ప్లాన్ ఉందా? కల్వర్టు ప్రాంతంలోనే దాడి జరిగి నారాయణ రెడ్డి హతం కావడంతో రెండో ప్రాంతంలో ఉన్న టీం కాస్తా తప్పించుకుందా? అనే వరుస ప్రశ్నలకు అవుననే సమాధానం వస్తోంది. ఒకవేళ నారాయణ రెడ్డిపై కల్వర్టు ప్రాంతంలో దాడి చేసేందుకు వీలుపడకపోతే.. కొండ చరియల మలుపుల వద్ద దాడి జరిగే అవకాశం ఉందని అక్కడ సంచరించిన వారితో పాటు గ్రామస్తులు తెలుపుతున్న వివరాల ప్రకారం తెలుస్తోంది. కల్వర్టు ప్రాంతంలోనే నారాయణ రెడ్డి చనిపోవడంతో అక్కడ కాపు కాసిన టీంకు ఫోన్ల ద్వారా ఇక్కడి వారు సమాచారం చేరవేయడంతో వారు తప్పించుకున్నట్టు తెలుస్తోంది. ఈ కోణంలో పోలీసులు విచారిస్తే మరింత మంది నిందితుల పేర్లు బయటకు వచ్చే అవకాశం ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అక్కడ కాపు కాసిందెవరు?.. వాస్తవానికి ఇప్పటి వరకు నారాయణ రెడ్డి హత్య కేసులో హత్య జరిగిన ప్రాంతంలో ఉన్న నిందితుల పేర్లు మాత్రమే బయటకు వచ్చాయి. ఒకవేళ కల్వర్టు వద్ద నారాయణ రెడ్డిని హతమార్చడం మిస్ అయితే.. రామకృష్ణాపురం గ్రామానికి సమీపంలో కొండ మలుపుల వద్ద మరోసారి అటాక్ చేసేందుకు నిందితులు పక్కా ప్లాన్ రచించుకున్నారు. ఇక్కడ కూడా మరో 25 మంది కాపు కాసినట్టు తెలుస్తోంది. మరి ఇక్కడ కాపు కాసి.. అటాక్ చేసేందుకు ఎవరెవరు ఉన్నారనే కోణంలో పోలీసుల దర్యాప్తు సాగాల్సిన అవసరం ఉంది. వారి పేర్లు ఇప్పటివరకు బయటకు రాలేదు. అంతేకాకుండా ప్రస్తుతం దొరికిన 12 మంది నిందితులు కూడా కొండ చరియల వద్ద మరో టీం ఉందనే విషయం బయటకు వెల్లడించలేదు. ఈ పరిస్థితుల్లో కొండ చరియల వద్ద కాపు కాసిన టీంలోని వారిని కూడా అదుపులోకి తీసుకుంటే తప్ప ఈ హత్య కేసులో ఉన్న లోతెంతో అర్థమయ్యే పరిస్థితి లేదనే అభిప్రాయాన్ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు వెలిబుచ్చుతున్నారు. కల్వర్టు పనులను ఆపిందెవరు?.. కల్వర్టు ప్రాంతంలో హత్య చేసేందుకు వీలుగా 15 రోజుల నుంచి రెక్కీ జరిగిందని తెలుస్తోంది. పక్కాగా 20 నుంచి 25 మంది వ్యక్తులు నేరుగా అక్కడ సంచరించి మాత్రమే హత్యకు ప్లాన్ చేయాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో అక్కడ జరగాల్సిన పనులను చేయవద్దంటూ అధికార పార్టీ నేతల నుంచే ఒత్తిళ్లు వచ్చినట్టు సమాచారం. ఒకవేళ రోడ్డు పనులు జరిగితే పనులు చేసే వారు సంచరిస్తూ తమ ప్లాన్‌కు అడ్డు వస్తారని భావించే పనులు నిలిపివేశారని తెలుస్తోంది. దీంతో అసలు పనులు చేయవద్దని వారించి నిలువరించిందెవరనే కోణంలోనూ పోలీసులు విచారణ సాగించాల్సి ఉంది. అయితే, ఇప్పటికే నిందితులు జ్యుడీషియల్ రిమాండ్‌లో ఉన్నందున ఈ వివరాలన్నింటినీ పోలీసులు సేకరించే అవకాశం ఉందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో వారిని పోలీసు కస్టడీకి అడిగితే తప్ప కేసులో మరింత లోతైన విషయాలు బయటకు వచ్చే అవకాశం లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. -
చంపుతారేమోనని చంపేశారు : డీఐజీ
-
చంపుతారేమోనని చంపేశారు : డీఐజీ
నారాయణరెడ్డి హత్య కేసులో 12 మంది అరెస్టు కర్నూలు: చెరుకులపాడు గ్రామానికి చెందిన పెద్ద బీసన్న కుమారుడు రామాంజనే యులు, కోతుల రామానాయుడులను చంపుతామని నారాయణరెడ్డి మనుషులు బెదిరించడం వల్లే పత్తికొండ నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ ఇన్చార్జి చెరుకులపాడు నారా యణరెడ్డి, ఆయన అనుచరుడు బోయ సాంబశివుడులను ప్రత్యర్థులు హత్య చేసిన ట్లు పోలీసులు విచారణలో తేల్చారు. నారా యణరెడ్డి హత్య కేసులో 12 మంది నింది తులను డోన్ డీఎస్పీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక టీమ్ కాల్వబుగ్గ వద్ద అరెస్టు చేశారు. నేరానికి ఉపయోగించిన రెండు ట్రాక్టర్లు, వేటకొడవళ్లను స్వాధీనం చేసుకొని బుధవారం సాయంత్రం జిల్లా కేంద్రానికి తీసుకొచ్చి డీఐజీ రమణకుమార్, ఎస్పీ ఆకె రవికృష్ణ ఎదుట హాజరు పరిచారు. నిందితులను మీడియా ముందు హాజరు పరిచారు. కాగా, ఈనెల 21వ తేదీన నారాయణరెడ్డి, బోయ సాంబశివుడు కృష్ణగిరి పొలిమేరల్లో హత్యకు గురయ్యారని గొళ్ల కృష్ణమోహన్ ఫిర్యాదు మేరకు కృష్ణగిరి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసుకొని డోన్ డీఎస్పీ బాబా ఫకృద్దీన్ నేతృత్వంలో మూడు బృందాలుగా ఏర్పడి నిందితులను పట్టుకున్నట్లు డీఐజీ వెల్లడించారు. ఎఫ్ఐఆర్లో లేని మరో ఐదుగురి పేర్లు కూడా విచారణలో బైటకి వచ్చాయన్నారు. కేసు విచారణ ఫలితాన్ని బట్టి సంబంధిత వ్యక్తులపై చర్యలు తీసుకుంటామని డీఐజీ చెప్పారు. -
అధైర్య పడొద్దు.. అండగా ఉంటాం
నారాయణ రెడ్డి కుటుంబానికి వైఎస్ జగన్ భరోసా - సాంబశివుడి కుటుంబానికీ ప్రతిపక్ష నేత పరామర్శ సాక్షి ప్రతినిధి, కర్నూలు: ‘‘అధికార పార్టీ హత్యా రాజకీయాలకు భయపడాల్సిన అవసరం లేదు. ప్రజల సమస్యలను తెలుసుకుంటూ, వాటి పరిష్కారానికి పోరాడుతూ నారాయణ రెడ్డి మంచి నాయకుడిగా పేరు తెచ్చుకున్నారు. ఆయన అభివృద్ధిని చూసి ఓర్వలేకనే హత్య చేశారు. మీరెవ్వరూ అధైర్యపడొద్దు. అండగా మేమున్నాము’’ అని చెరుకులపాడు నారాయణరెడ్డి కుటుంబ సభ్యులకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి భరోసానిచ్చారు. నారాయణ రెడ్డి అమర్ రహే అనే నినాదాలు, భారీ జనసందోహం మధ్య నారాయణ రెడ్డి అంత్యక్రియలు ఆయన స్వగ్రామం చెరుకులపాడులో సోమవారం జరిగాయి. అంత్యక్రియలకు హాజరైన సందర్భంగా వారి కుటుంబ సభ్యులను జగన్ పరామర్శించారు. ‘ఏం భయపడొద్దు అమ్మా నేనున్నాను’ అని నారాయణ రెడ్డి కూతురు స్నేహా రెడ్డికి ధైర్యం చెప్పారు. అన్నా మీరే మాకు దిక్కు అని కుమారుడు మోహన్ రెడ్డి.. జగన్‌ను పట్టుకుని భోరున విలపించారు. పిల్లలను జాగ్రత్తగా చూసుకోమ్మా అని నారాయణ రెడ్డి భార్య శ్రీదేవికి జగన్ ధైర్యం చెప్పారు. నారాయణ రెడ్డితో పాటు హత్యకు గురైన సాంబశివుడు కుటుంబాన్ని కూడా జగన్ ఈ సందర్భంగా పరామర్శించారు. భారీగా హాజరైన జనసందోహం: నారాయణరెడ్డి, సాంబశివుడుల మృతదేహలకు కర్నూలులోని ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్టుమార్టం ఉదయం తొమ్మిదిన్నర గంటలకు ప్రారంభించి 11 గంటలకు పూర్తి చేశారు. అనంతరం ఆయన మృతదేహాన్ని పోలీసు బందోబస్తు మధ్య స్వగ్రామానికి తరలించారు. ఈ సందర్భంగా ఆసుపత్రి వద్దకు పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు భారీ సంఖ్యలో చేరుకున్నారు. మృత దేహాంతో పాటు ప్రజలు నినాదాలు చేస్తూ చెరుకులపాడుకు తరలివెళ్లారు. సాయంత్రం 5 గంటల ప్రాంతంలో అంత్యక్రియలు ముగిశాయి. -
నారాయణరెడ్డికి వైఎస్ జగన్ ఘన నివాళి
-
త్వరలోనే నిందితుల్ని పట్టుకుంటాం: ఎస్పీ
కర్నూలు: పత్తికొండ నియోజకవర్గ వైఎస్సార్సీపీ ఇన్చార్జి చెరుకులపాడు నారాయణరెడ్డి హత్యకేసులో నిందితులను త్వరలోనే పట్టుకుంటామని ఎస్పీ రవికృష్ణ తెలిపారు. ఆయన సోమవారమిక్కడ విలేకరులతో మాట్లాడుతూ హత్య జరిగిన వెంటనే సీఐ, డీఎస్పీ, ఎస్ఐ ఘటనా స్థలికి చేరుకున్నారన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ కారణంగానే నారాయణరెడ్డి వెపన్ డిపాజిట్ చేశారన్నారు. ఎన్నికల అనంతరం సమాచారం ఇచ్చినా వెపన్ తీసుకోలేదని ఎస్పీ పేర్కొన్నారు. రెన్యువల్ కాలేదని వెపన్ సీజ్ చేసిన సందర్భం గత అయిదేళ్లుగా జిల్లాలో ఒక్కటీ కూడా జరగలేదన్నారు. ప్రాణహాని ఉన్నవారు హఠాత్తుగానే ప్రయాణాలు చేయాలని తప్ప, ముందస్తుగా ఎవరికీ సమాచారం ఇవ్వకూడదని ఎస్పీ రవికృష్ణ అన్నారు. స్థానిక పోలీసులకు ముందస్తు సమాచారంతోనే ప్రయాణాలు చేయాలని సూచించారు. ఫ్యాక్షన్ వల్ల జిల్లాతో పాటు పలు గ్రామాలు చాలా నష్టపోతున్నాయన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠినంగా వ్యవహరించాలని ఆదేశాలు జారీ చేశామని ఎస్పీ వెల్లడించారు. -
నారాయణరెడ్డికి వైఎస్ జగన్ ఘన నివాళి
-
ప్రత్యర్థుల చేతిలో రాజకీయ హత్యలు
-
నీవు లేక నీ జ్ఞాపకాలే తోడుగా..
♦ ప్రజాదరణ నేతగా ఎదిగిన చెరుకులపాడు నారాయణరెడ్డి ♦ కష్టాలను ఎదురీదుతూ ప్రజలకు వెన్నుదన్నుగా నిలుస్తూ ♦ కుట్రలను ఛేదిస్తూ.. ప్రత్యర్థులను అధిగమిస్తూ.. ♦ కొండంత అండను కోల్పోయిన పత్తికొండ చెరుకులపాడు నారాయణ రెడ్డి ప్రజానేత. ప్రజాసమస్యల పరిష్కారానికి నిరంతరం తపించే నాయకుడు. పత్తికొండ నియోజకవర్గంలో మంచికి మారుపేరుగా ప్రజల మనసు చూరగొన్నారు. వైఎస్ఆర్సీపీ నియోజకవర్గ ఇన్‌చార్జీగా ఎక్కడ ఏ సమస్య వచ్చినా వెళ్లేవారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపేవారు. అధికార పార్టీ నేతల అక్రమాలను నిలదేసేవారు. ఇటీవల తాగు నీటి సమస్య పరిష్కారం కోసం ప్రజల తో కలిసి భారీ ధర్నా కూడా నిర్వహించారు. ప్రజాక్షేత్రంతో దూసుకుపోతున్న నారాయణ రెడ్డికి అడ్డుకట్ట వేసేందుకు టీడీపీ నాయకులు ఎన్నో ఎత్తుగడలు పన్నారు. ఆయన వర్గీయులను బెదిరింపు లకు గురిచేశారు. పలువురిపై దాడులు కూడా చేశారు. అయినా బెదరక.. కార్యకర్తలకు, తన వర్గీయులకు చెరుకులపాడు అండగా నిలబడ్డారు. ప్రజల కోసం..వారికి ప్రభుత్వం నుంచి అందాల్సిన సౌకర్యాల కోసం పోరాడారు. దీంతో ప్రత్యర్థి శిబిరంలో వణుకు పుట్టింది. వచ్చే ఎన్నికల్లో గెలవలేమనే భయంతో అతన్ని హతమార్చేందుకు పక్కా ప్రణాళిక రూపొందించారు. కాపుకాసి..బాంబులు వేసి..వేటకొడవళ్లలో ఆదివారం ఉదయం 10.30 గంటల సమయంలో వెల్దుర్తి మండం కృష్ణగిరి వద్ద దారుణంగా నరికి హతమార్చారు. దారుణ హత్యలో టీడీపీకి చెందిన కీలక నేత హస్తముందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇది ముమ్మాటికీ రాజకీయ హత్యేనని వైఎస్ఆర్సీపీ నేతలు పేర్కొంటున్నారు. ఇందుకు ప్రభుత్వం బాధ్యత వహించాలని, సోమవారం జిల్లా బంద్‌కు పార్టీ నేతలు పిలుపునిచ్చారు. కర్నూలు(అర్బన్): అధికార పార్టీ ఆది నుంచి చెరుకులపాడు నారాయణరెడ్డిని ప్రాబల్యాన్ని తగ్గించేందుకు ... అవసరమైతే అంతమొందించేందుకు అనేక రూపాల్లో కుట్రలు పన్నుతూనే వచ్చింది. అయినా ప్రత్యర్థుల బెదిరింపులకు భయపడకుండా, ప్రజల ఆశీస్సులు ఉంటే చాలంటు ... పత్తికొండ ప్రజలకు అండగా నిలిచారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో దివాళా తీసిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పత్తికొండ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి 32 వేల ఓట్లను సాధించారంటే ... ప్రజల్లో ఆయనకున్న అభిమానం ఎలాంటిదో తెలుస్తోంది. అతి చిన్న వయస్సులోనే తండ్రి శివారెడ్డి హత్యతో ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చిన నారాయణరెడ్డి కాంగ్రెస్ పార్టీలో ఉంటు పత్తికొండ, డోన్, పాణ్యం నియోజకవర్గాల్లోని అభ్యర్థుల విజయావకాశాలను శాసించే స్థాయికి ఎదిగారు. దీంతో అధికార తెలుగుదేశం పార్టీ నాటి నుంచే నారాయణరెడ్డిని ఎదో ఒక విధంగా దెబ్బ తీయాలని చూస్తూనే వచ్చింది. పత్తికొండ అభివృద్ధికి అహర్నిషలు కృషి... అధికారం ఉన్నా, లేకపోయినా పత్తికొండ నియోజకవర్గ అభివృద్ధికి చెరుకులపాడు ఎంతో కృషి చేశారు. పత్తికొండ మండల పరిధిలోని దేవనబండ, జూటూరు, మందగిరి, పులికొండ, చక్రాళ్ల, చందోలి తదితర గ్రామాల్లో తాగునీటి బోర్ల ఏర్పాటు చేయించారు. అలాగే పత్తికొండలోని కటికేవీధిలోని ముస్లింల శ్మశాన వాటిక ప్రహరీ, సిమెంట్ రోడ్డు నిర్మాణం నారాయణ రెడ్డి చొరవతో పూర్తయింది. యువతకు జాబ్‌మేళాతో 20 మంది యువకులకు ఉపాధి అవకాశాలతో పాటు, పేదలకు వైద్యసాయం అందించేందుకు సహకారం అందించారు. మద్దికెర మండలంలో సుమారు రూ.2కోట్లతో అభివృద్ధి పనులను చేపట్టారు. కొత్తపల్లి మద్దికెరకు రూ.98 లక్షలతో రోడ్డు నిర్మాణం, మద్దికెరలోని నేసే వీధిలో ఓవర్‌హెడ్ ట్యాంకు ఏర్పాటు చేయించారు. అలాగే పెరవలి, మద్దికెర గ్రామాల్లో సీసీరోడ్ల నిర్మాణాలు చేపట్టారు. ఎంపీ బుట్టారేణుక సహకారంతో యశ్వంత్‌పూర్–కాచిగూడా రైలు మద్దికెరలో నిలిపేందుకు కృషి చేశారు. ఆపదలో ఉన్న వారికి వైద్య సాయం, ఎర్రగుడి, తుగ్గలి, జొన్నగిరి, పెండేకల్, రాంపురం గ్రామాల్లో సీసీరోడ్ల నిర్మాణం చేపట్టారు. ఒకే రోజు 27 శుభకార్యాలకు హాజరు తనకు పరిచయం ఉన్న ఎవరి ఇంట్లో శుభకార్యం జరిగినా, తప్పక హాజరయ్యే మనస్థత్వం నారాయణరెడ్డిది. ఒకానొక సందర్భంలో ఒకే రోజు 27 శుభ కార్యాలకు హాజరైన నారాయణరెడ్డిని చూసి‡ వైఎస్సార్సీపీ నేతలే విస్తు పోయారు. చిన్న, పెద్ద తారతమ్యం లేకుండా పల్లె ప్రజలను ఆప్యాయంగా పలుకరిస్తు, ఎంతో ఆత్మీయతను సంపాదించుకున్నారు. ముఖ్యంగా ఆయా గ్రామాలకు చెందిన వారు ఎవరు అనారోగ్యాలకు గురై కర్నూలు ఆసుపత్రుల్లో చికిత్సకు చేరినా, వారికి నేనున్నాంటు భరోసా ఇస్తు ఆయా ఆసుపత్రుల యాజమాన్యలతో మాట్లాడి ఫీజులు తగ్గిస్తు మెరుగైన వైద్యం చేయించేందుకు కృషి చేస్తు వచ్చారు. చెరుకులపాడు శ్రీమంతుడు కర్నూలు (అర్బన్): ముఠాకక్షల ఖిల్లాగా ముద్రపడిన చెరుకులపాడు గ్రామాభివృద్ధికి నారాయణరెడ్డి ఎంతో కృషి చేశారు. 1995లో నారాయణరెడ్డి తండ్రి శివారెడ్డిపేరుతో స్మారక సంస్థను ఏర్పాటు చేసి ఆ గ్రామంలో ఉన్నత పాఠశాలను నిర్మించారు. అప్పటి వరకు ప్రాథమికోన్నత పాఠశాల మాత్రమే నడుస్తున్న ఆ గ్రామంలో ఆ పాఠశాలను పదోతరగతి వరకు అప్‌గ్రేడ్ చేయడంలో జిల్లా విద్యాధికారులతో సంప్రదించి పాఠశాల అభివృద్ధి కోసం కృషి చేశారు. గ్రామ వాసులందరితో శ్రమదానం చేయించి పాఠశాలను నిర్మింపజేశారు. జిల్లాలోని ప్రతిభ కలిగిన ఉపాధ్యాయులను గుర్తించి విద్య అధికారులతో చర్చించి ఆ ఉపాధ్యాయులను తన పాఠశాలకు రప్పించి తొలి సంవత్సరంలోనే ఆ పాఠశాలలో రికార్డు స్థాయి ఫలితాలు సాధించేందుకు కృషి చేశారు. అప్‌గ్రేడ్ చేసి పదోతరగతి ప్రారంభించిన తొలి సంవత్సరంలో చెరుకులపాడు పాఠశాల పదోతరగతిలో 512 మార్కులు సాధించి జిల్లాలోనే ఒక ఉత్తమ పాఠశాలగా పేరు గడించింది. అనంతరం ప్రతి సంవత్సరం నూటికి 100శాతం ఫలితాలను సాధిస్తూ చెరుకులపాడు పాఠశాల వెల్దుర్తి మండలంలోఉత్తమ పాఠశాలగా పలువురి మన్నలను పొందడానికి నారాయణరెడ్డే కారణం. 24 గంటల్లో అంగన్వాడీ కేంద్ర నిర్మాణం: విద్యారంగ అభివృద్ధి కోసం అంకితమై పని చేసిన నారాయణరెడ్డి చెరుకులపాడు గ్రామంలో తానే దగ్గరుండి 24 గంటల్లో అంగన్వాడీ కేంద్ర నిర్మాణం చేపట్టి రాష్ట్రంలోనే ఒక సంచలనాన్ని సృష్టించారు. ఈ సంఘటననే అన్ని టీవీ చానళ్లు ప్రచారం చేశాయి. ఉన్నత పాఠశాలలో ప్రతి సంవత్సరం వార్షికోత్సవాలు నిర్వహిస్తూ విద్యారంగ మేధావులను ఆహ్వానిస్తూ సన్మానించిన నారాయణరెడ్డి చెరుకులపాడు గ్రామంలో విద్యార్థుల అభివృద్ధి కోసం కృషి చేశారు. ఆ గ్రామంలోని పసుపురాతి హరిత అనే విద్యార్థిని ప్రపంచ స్థాయిలో వెయిట్‌లిఫ్టింగ్‌లో పతకం సాధించడంతో అప్పటి జిల్లా కలెక్టర్ రాజేశ్వర్తివారిని, నంద్యాల ఎంపీ ఎస్పీవై రెడ్డిని ఆహ్వానించి ఆమెను ఘనంగా సన్మానించారు. కప్పట్రాళ్ల కేసులో నిర్దోషి జిల్లాలో సంచలనం రేపిన కప్పట్రాళ్ల వెంకటప్ప నాయుడు హత్య కేసులో చెరుకులపాడు నారాయణరెడ్డిని నిందితునిగా చేర్చి ఇబ్బంది పెట్టాలని అధికార పార్టీ పన్నిన పన్నాగాన్ని ఆదోని న్యాయ స్థానం తిప్పికొట్టింది. తనపై ఆపాదించబడిన కేసులో తీవ్ర మనస్తాపానికి గురైన నారాయణరెడ్డి తీర్పు చివరి రోజున తనను న్యాయస్థానం నిర్దోషిగా ప్రకటించడంతో చిన్నపిల్లాడిలా కన్నీటి పర్యంతమయ్యారు. ఫ్యాక్షన్ కోరల్లో చిక్కుకున్న వారి మానసిక పరిస్థితి ఎలా ఉంటుందనే విషయాన్ని స్వయంగా అనుభవించానని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. పగవాడికి సైతం ఇలాంటి దుస్థితి రాకూడదని బోరున విలపించారు. సామాజిక మాధ్యమాల్లో చురుగ్గా సందేశాలు: ఇటీవలి కాలంలో చెరుకులపాడు నారాయణరెడ్డి సామాజిక మాధ్యమాల్లో చురుగ్గా సందేశాలను తన మిత్రులు, సన్నిహితులకు నిత్యం పంపేవారు. ప్రతి రోజు తాను పా ల్గొంటున్న కార్యక్రమాలకు సంబంధించిన ఫొటోలను అప్ లోడ్ చేసే వారు. ఈ నేపథ్యంలోనే తాను మరికొన్ని గంట ల్లో హత్యకు గురవుతానని తెలియక ముందు వెల్దుర్తిలోని లిమ్రా ఫంక్షన్ హాల్లో జరిగిన ఓ వివాహానికి హాజరైన ఫొటోలను కూడా చివరి సారిగా తన సెల్‌ఫోన్ వాట్సాఫ్ ద్వారా పోస్టు చేశారు. వాట్సాఫ్‌లో వచ్చిన ఫోటోలను చూసి ఆయన బంధుమిత్రులు, సన్నిహితులు కన్నీటి పర్యంతమవుతున్నారు. 30 ఏళ్ల రాజకీయ చరిత్ర పత్తికొండ : కంగాటి లక్ష్మీ నారాయణరెడ్డి 1986లో కాంగ్రెస్ పార్టీలో చేరి కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్నారు. ⇔ 1987లో చెరుకులపాడు గ్రామ సర్పంచుగా విజయం సాధించారు. ⇔ డీసీసీ ప్రధాన కార్యదర్శిగా 15 ఏళ్లు బాధ్యతలను నిర్వహించారు. ⇔ కృష్ణగిరి మండల జడ్పీటీసీగా బరిలో నిలిచి ప్రత్యర్థుల చేతిలో ఓటమి పాలైయ్యాడు. పదవులు అందివచ్చినా రాకపోయినా పార్టీ అభివృద్ధి, ప్రజల సమస్యల పరిష్కారానికి నిరంతరం శ్రమించారు. ⇔ 1999లో వైఎస్ఆర్ అభయంతో పత్తికొండ అసెంబ్లీ నుంచి బరిలో నిలుస్తున్న సమయంలో మాజీ మంత్రి ఎస్సీ సుబ్బారెడ్డి, తనయుడు ఎస్సీ మోహన్‌రెడ్డి టీడీపీకి గుడ్‌బై చెప్పి కాంగ్రెస్‌లోకి రావడంతో ఆనాడు నారాయణరెడ్డిని బుజ్జగించి ఎస్పీ మోహన్‌రెడ్డిని బరిలో దించారు. ⇔ 2014లో ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి బరిలో నిలిచి ఓటమిపాలయ్యాడు. రాష్ట్ర విభజన ఎఫెక్ట్‌తో రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ నాయకులకు డిపాజిట్లు కోల్పోతే, నారాయణరెడ్డికి మాత్రం 31 వేలకు పైగా ఓట్లు పోలయ్యాయి. రాష్ట్రంలో అత్యధిక ఓట్లు సాధించిన కాంగ్రెస్ నాయకుల్లో రెండో స్థానంలో నిలిచారు. ⇔ ఎన్నికల్లో ఓటమి చెందిన తర్వాత కొద్ది రోజులకే వైఎస్ఆర్సీపీ పత్తికొండ ఇన్చార్జ్గా బాధ్యతలు చేపట్టారు. ⇔ నియోజకవర్గంలో 168 గ్రామాల్లో గడపగడపకు వెళ్లి ప్రభుత్వ ప్రజా వ్యతిరేక తీరును, అవినీతిని ప్రజలకు వివరిస్తూ ముందుకెళ్తున్నారు. ⇔ నారాయణరెడ్డి తన నియోజకవర్గంలో దూసుకెళ్తుండటంతో టీడీపీ నాయకులు, కార్యకర్తలు కూడా వైఎస్ఆర్సీపీలోకి రావడం మొదలెట్టారు. ఇది జీర్ణించుకోలేని రాజకీయ నాయకులు అతడిని మట్టుబెట్టాలని కుట్రలు పన్నారు. ఈ క్రమంలోనే ప్రత్యర్థులు మాటు వేసి ఆదివారం హత్య చేశారు. చెరుకులపాడులో విషాదఛాయలు కర్నూలు (వైఎస్‌ఆర్‌సర్కిల్): వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పత్తికొండ నియోజకవర్గ ఇన్చార్జి చెరుకులపాడు నారాయణరెడ్డి హత్యతో ఆయన స్వగ్రామం చెరుకులపాడులో విషాదఛాయలు అలుముకున్నాయి. ఆయన మరణవార్తను తెలుసుకున్న గ్రామస్తులు పెద్ద ఎత్తున సంఘటన స్థలానికి చేరుకున్నారు. ఆ తర్వాత ఆయన మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కర్నూలు ఆసుపత్రికి తరలించడంతో గ్రామస్తులు, అభిమానులు, కార్యకర్తలు మృతదేహాన్ని చూసేందుకు కర్నూలు ఆసుపత్రికి తరలివెళ్లారు. దీంతో గ్రామంలోని వీధులన్నీ నిర్మాణుష్యంగా మారాయి. దాహార్తి తీర్చిన జలదాత గ్రామంలో నిత్యం ఏ కార్యం జరిగినా ఉచితంగా నీటిని సరఫరా చేసేందుకు నారాయణరెడ్డి ఉచితంగా మంచినీటి ట్యాంకర్‌ను ఏర్పాటు చేశారు. అయితే ఆయన మృతి చెందడంతో గ్రామస్తులు ఆయన సేవలను గుర్తు చేసుకుంటున్నారు. టీడీపీవి హత్యా రాజకీయాలే తెలుగు దేశం పార్టీ హత్యా రాజకీయాలను పోషిస్తుంది. ప్రజల్లో ఆదరణ కోల్పోయి ఇలాంటి చర్యలకు పాల్పడుతోంది. ఆ పార్టీ నాయకులకు ప్రజలే బుద్ధిచెబుతారు. ప్రశాంతంగా జిల్లాలో హత్యా రాజకీయాలకు పాల్పడటం మంచి పద్ధతి కాదు. అడ్డువచ్చిన వారిని చంపుకుంటూ పోతే మళ్లీ పాత రోజులే వచ్చి పల్లెలు నాశనమవుతాయి. – కె.తిరుమల్‌రెడ్డి, పెట్రోల్ బంకు యజమాని, చనుగొండ్ల రాజకీయంగా ఎదుర్కోవాలి సమాజంలో హత్య రాజకీయాలు మంచివి కావు. సాధారణ పౌరుల ప్రశాంత జీవనానికి అవి భంగం కలిగిస్తాయి. గతంలో ఉన్న ఫ్యాక్షన్ తగ్గిపోవడంతో అంతా బాగున్నాం. తిరిగి జిల్లాను ఈ తరహా రాజకీయాలు నెలకొనడం భయాందోళనలు కలిగిస్తున్నాయి. రాజకీయంగా ఎదుర్కొనేవారికే భవిష్యత్ ఉంటుంది. – పువాడి భాస్కర్, వ్యాపారి, ఆత్మకూరు రాజకీయానికి మాయని మచ్చ అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రజాస్వామ్యంలో రెండు కళ్లు లాంటివి. అధికార పక్షం ప్రతిపక్ష నాయకులను హత్య చేయిస్తూ పోతే తిరిగి అధికారంలోకి వస్తే ఇలాంటి సంఘటనలే పునరావృతమయ్యే అవకాశం ఉంది. ఆధిపత్యం కోసం జరుగుతున్న హత్యలు ప్రజాస్వామ్యంలో రాజకీయానికి ఉన్న అర్థాన్ని మార్చి వేస్తున్నాయి. దారుణంగా హత్య చేసిన సంఘటన ప్రజాస్వామ్యానికి తలవంపులు తెచ్చేవిధంగా ఉంది. – సి.నారాయణ, పత్తికొండ హత్యలు అనాగరిక చర్య ఓ వైపు అన్ని రంగాల్లో దూసుకెళ్తున్న దేశంలో ఇంకా హత్యలు చేసుకోవడం అనాగరిక చర్య. పార్టీలకతీతంగా అందరూ రాజకీయ హత్యలను ఖండించాలి. ఆధిపత్య పోరులో విభేదాలు ఏర్పడితే శాంతియుతంగా పరిష్కరించుకోవాలి. ఇలాంటి ఘటనలో చోటు చేసుకుండా సమస్యాత్మక గ్రామాల్లో పోలీసులు నిఘా పెంచాలి. – టి.మాధవరెడ్డి, సీనియర్ న్యాయవాది ఫ్యాక్షన్‌ను చిచ్చు రేపుతున్నారు టీడీపీ నేతలు ఫ్యాక్షన్ చిచ్చు రేపుతున్నారు. చెరుకులపాడు నారాయణరెడ్డి తన ప్రాణాలకు ముప్పుందని ఎన్నో మార్లు ప్రభుత్వానికి, పోలీసులకు బహిరంగంగా విన్నవించుకున్నా రక్షణ కల్పించలేకపోయింది. నియోజవర్గ స్థాయి నాయకుడే తనకు ప్రాణహాని ఉందని మొరపెట్టుకున్నా పోలీసులు చోద్యం చూశారు. ప్రభుత్వమే హత్యా రాజకీయాలు పోత్సహించడం దురదృష్టకరం. – గుండామణి, ఆళ్లగడ్డ -
తప్పించుకునే వీల్లేకుండా స్కెచ్
సాక్షి ప్రతినిధి, కర్నూలు: పత్తికొండ నియోజకవర్గం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి చెరకులపాడు నారాయణ రెడ్డి హత్యకు ప్రత్యర్థులు పక్కాగా స్కెచ్ వేశారు. తప్పించుకునేందుకు ఎలాంటి వీలు లేకుండా పథకం ప్రకారం దాడి చేశారు. ఇందుకోసం 15 రోజుల నుంచి వారు అక్కడ రెక్కీ నిర్వహించినట్టు సమాచారం. దాడికి మూడు ట్రాక్టర్లను వినియోగించారని, దాడిలో 25 మంది వరకు పాల్గొన్నారని ప్రత్యక్ష సాక్షులు అందించిన వివరాలను బట్టి తెలుస్తోంది. స్కెచ్ వేశారిలా...! చెరకులపాడు నుంచి రామకృష్ణాపురం గ్రామానికి వెళ్లే దారిలో రోడ్డు విస్తరణ పనులు జరుగుతున్నాయి. సరిగ్గా విద్యుత్ సబ్‌స్టేషన్ దాటిన తర్వాత కల్వర్టు పనులు నడుస్తున్నాయి. అక్కడ దారి ఇరుకుగా ఉంది. అక్కడ ఏ వాహనమైనా...నెమ్మదిగా వెళ్లాల్సిందే. పక్కకు వెళ్లేందుకు దారి లేదు. అక్కడ కల్వర్టు పైపులు రెండు ఉన్నాయి. ఇందులో 10 మంది వరకూ దాక్కున్నారు. ఇందులో దాక్కున్న వారు వాహనంలో వెళుతున్న వారికి కనిపించే అవకాశం లేదు. మరోవైపు బెండ తోట ఉంది. ఇక్కడ ఓ ఐదుగురు దాక్కున్నారు. కల్వర్టు దాటిన తర్వాత కుడి వైపున పొలం ఉంది. ఈ పొలం లోపల ట్రాక్టర్‌తో పనిచేయిస్తున్నట్టుగా పది మంది వరకూ ఉన్నారు. కల్వర్టు దాటిన తర్వాత మరో ట్రాక్టర్ ఆగి ఉంది. అక్కడ రోడ్డు పనులు జరుగుతుండటంతో అందుకోసమే ఉన్నట్టుగా అనుమానం రాకుండా నిలిపి ఉంచారు. దాడి జరిగిందిలా....! నారాయణరెడ్డి వాహనం కల్వర్టు దాటుతున్న సమయంలోనే ఆయన అనుచరులు వెళుతున్న ముందు వాహనంపై బండరాళ్లతో దాడికి దిగారు. అయితే, ఆ వాహనం వేగంగా పోలీసు స్టేషన్ వైపునకు వెళ్లింది. ఇక వెనుక నుంచి వస్తున్న నారాయణ రెడ్డి వాహనం కల్వర్టు దాటుతున్న సమయంలో వెనుక ఉన్న ట్రాక్టర్ నుంచి గట్టిగా ఢీ కొట్టారు. అదే సందర్భంలో పొలం వైపునకు వెళ్లకుండా పొలంలో ఉన్న ట్రాక్టర్‌తో ముందుకు వచ్చి మరోసారి వాహనాన్ని ఢీ కొట్టారు. ఇదే అదనుగా కల్వర్టు పైపుల్లో దాక్కున్న వారు, బెండ తోటలో దాక్కున్న వారు మూకుమ్మడిగా దాడికి దిగారు. ట్రాక్టర్లలో ఉన్న వారు కూడా కత్తులు, వేటకొడవళ్లు, బండరాళ్లతో దాడికి దిగారు. వాహనం పోతున్న దారిలో ఎడమవైపున లోతైన గుంత ఉంది. ఈ గుంతలోకి వాహనం పోయేట్టుగా ముందు ట్రాక్టర్ నుంచి ఢీకొట్టారు. తద్వారా నారాయణ రెడ్డి తప్పించుకునేందుకు వీలు లేకుండా చేశారు. ఆయన వెళుతున్న ఫార్చూనర్కారు అద్దాలను పగలగొట్టేందుకు భారీ బండరాళ్లను వినియోగించారు. నారాయణరెడ్డిని, ఆయనను కాపాడేందుకు ప్రయత్నించిన సాంబశివుడిని హత్య చేసిన అనంతరం దుండగులు చెరకులపాడు గ్రామం వైపునకు వెళ్లిపోయారని తెలుస్తోంది. -
రాజకీయ రావణకాష్టం
నారాయణ రెడ్డి దారుణ హత్య! – పెళ్లికి వెళ్తుండగా దారి మధ్యలో కత్తులు, రాళ్లతో దాడి – కల్వర్టు పనులు జరుగుతున్న ప్రాంతాన్ని ఎన్నుకున్న ప్రత్యర్థులు – తప్పించుకునే దారి లేని విధంగా ప్రణాళిక రచన – మూడు ట్రాక్టర్లతో వాహనాన్ని గుద్దిన వైనం... – అనంతరం మూకుమ్మడిగా 20–25 మంది దాడి – హత్యకు కారణం కేఈ కుటుంబమేనని కుటుంబీకుల ఆరోపణ – తనకు ప్రాణహాని ఉందని పదే పదే ఫిర్యాదులు – అయినా పట్టించుకోని పోలీసు యంత్రాంగం – గన్‌లైసెన్స్ లేదని తెలుసుకుని మాటు వేసి మరీ దాడి – దాడిలో అనుచరులు సాంబశివుడు హతం సాక్షి ప్రతినిధి, కర్నూలు: అధికారపార్టీ హత్య రాజకీయాలకు కర్నూలు జిల్లాలో తెరలేపింది. రాజకీయంగా ప్రజల మద్దతుతో ఎదుగుతున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పత్తికొండ నియోజకవర్గ ఇంచార్జీ చెరకులపాడు నారాయణ రెడ్డి ఆదివారం దారుణహత్యకు గురయ్యారు. కృష్ణగిరి మండలంలోని రామకృష్ణాపురం గ్రామంలో శుభకార్యానికి హాజరయ్యేందుకు వెళ్తుండగా ఆయనపై కత్తులు, కొడవళ్లు, రాళ్లతో దాడి చేసి హతమర్చారు. ఉదయమే నంద్యాలకు వెళ్లి ఒక శుభకార్యంలో పాల్గొన్న నారాయణ రెడ్డి... అక్కడి నుంచి వెల్దుర్తి చేరుకుని కొత్త దంపతులను ఆశీర్వదించారు. అనంతరం కోసానపల్లెకు చేరుకుని నూతన వధూవరులను ఆశీర్వదించి హనుమాన్ జయంతి వేడుకల్లో పాల్గొన్నారు. అక్కడి నుంచి కృష్ణగిరి మండలంలోని రామకృష్ణాపురం గ్రామంలో పెళ్లి వేడుకల్లో పాల్గొనేందుకు బయలుదేరారు. ఆయన సొంతగ్రామం చెరకులపాడును దాటి రామకృష్ణాపురం చేరుకోవాల్సి ఉంటుంది. చెరకులపాడు దాటి 3 కిలోమీటర్లు దాటిన తర్వాత రోడ్డు మార్గంలో కల్వర్టు పనులు జరుగుతున్నాయి. ఈ ప్రాంతాన్ని ఆయన ప్రత్యర్థులు తమ దాడికి అనువైన ప్రాంతంగా ఎంపిక చేసుకున్నారు. అక్కడ కల్వర్టు పనుల కోసం ఏర్పాటు చేసిన సిమెంటు పైపులల్లో కొంత మంది దాక్కున్నారు. మరికొంత మంది రోడ్డు పక్కనే ఉన్న బెండకాయ తోటలో ఉన్నారు. ఇక మిగిలిన వారిలో కొంత మంది పొలంలో ట్రాక్టరుతో పనిచేయిస్తున్నట్టు ఉన్నారు. మరికొంత మంది కల్వర్టు పని కోసం ట్రాక్టర్‌ను నిలుపుకున్నట్టు నటించారు. నారాయణ రెడ్డి వాహనంతో పాటు ముందుగా మరో వాహనం వెళుతోంది. మొదటి వాహనం కల్వర్టు పనులు జరుగుతున్న ప్రాంతానికి చేరుకోగానే భారీ రాళ్లతో దాడి మొదలు పెట్టారు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేద్దామని ముందు వాహనంలోని వారు వేగంగా ముందుకు కదలారు. ఇదే సందర్భంలో నారాయణ రెడ్డి ప్రయాణిస్తున్న వాహనాన్ని వెనుక నుంచి ఒక ట్రాక్టర్... ముందు నుంచి మరో ట్రాక్టర్లతో గుద్ది ముందుకు వెళ్లకుండా అడ్డుకాచి నేరుగా ఆయన వాహనంపై రాళ్లతో దాడి చేసి అద్దాలను ధ్వంసం చేశారు. అనంతరం ఆయన తలపై కత్తులు, కొడవళ్లు, రాళ్లతో బలంగా మోది హత్య చేశారు. ఈ దాడిలో ఆయన తల వెనుక భాగం పూర్తిగా ధ్వంసం కాగా... మెదడు ఊడి కారులో పడిపోయింది. ఆయన చనిపోయాడని తెలిసిన తర్వాత కూడా వాహనం నుంచి బయటకు పడేసి మరీ కత్తులతో దాడి చేశారు. ఈ దాడిలో ఆయన అనుచరులు సాంబశివుడు కూడా హత్యకు గురయ్యారు. ఈ దాడిలో పాల్గొన్న వారిలో మూతికి కొందరు గుడ్డలు కట్టుకుని ఉన్నారు. తనపై దాడి జరుగుతుందని తెలిసిన వెంటనే నారాయణ రెడ్డి.... మీరు వెళ్లండంటూ తనతో పాటు వాహనంలో ఉన్న వారిని హెచ్చరించారు. అయితే, తమ నేతపై దాడి జరగకుండా ఆయన అనుచరుడు సాంబశివుడు ప్రయత్నించారు. దీంతో సాంబశివుడిని వెంటాడి 100 మీటర్ల వరకు ఉరికెత్తించి మరీ ఆయన్ను చంపారు. ఈ దాడిలో మొత్తం 20 నుంచి 25 మంది వరకూ పాల్గొని ఉంటారని ప్రత్యక్ష సాక్షులు పేర్కొంటున్నారు. అయితే, తన భర్త హత్యకు కేఈ కుటుంబమే ప్రధాన కారణమని ఆరోపించింది. తన భర్తకు ప్రాణహాని ఉందని పదే పదే ఫిర్యాదు చేసినప్పటికీ పట్టించుకోలేదని వాపోయింది. తమ కుటుంబానికి కేఈ కుటుంబంతో తప్పే వేరే రాజకీయ వైరం లేదని ఆయన సోదరుడు ప్రదీప్ రెడ్డి పేర్కొన్నారు. తన సోదరుడు హత్య చేయించిన వారి వెనుక ఉందని కేఈ కుటుంబమేనని ఆరోపించారు. పునరుద్ధరించని లైసెన్స్... రాజకీయ కక్షల నేపథ్యంలో నారాయణ రెడ్డికి గన్‌లైసెన్స్ ఉంది. ఈ ఏడాది మార్చి నెల మొదటి వారంలో తనకు ఉన్న గన్ లైసెన్స్‌ను తిరిగి పునరుద్దరించాలని నారాయణ రెడ్డి దరఖాస్తు చేసుకున్నారు. అయితే, ఇప్పటివరకు రెన్యువల్ కాలేదు. ఈ విషయం కూడా ప్రత్యర్థులకు సమాచారం అందిందని తెలుస్తోంది. ప్రత్యర్థులకు ఈ సమాచారం ఎలా అందిందని తెలియాల్సి ఉంది. అయితే, పోలీసుల నుంచే ఈ సమాచారం అధికారపార్టీ నేతలకు తెలిసిందని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. అందుకే కేవలం కత్తులు, రాళ్లతోనే దాడికి తెగబడ్డారని సమాచారం. గన్‌లైసెన్స్ సకాలంలో పునరుద్ధరణ కాకపోవడం.... హత్య చేయాలని నిర్ణయించిన ప్రాంతం తప్పించుకుపోవడానికి అవకాశం లేకపోవడంతో దారుణహత్యకు ఆయన గురయ్యారు. కనిపించని క్రైం సీన్ మేనేజ్మెంట్ హత్య జరిగిన తర్వాత సాధారణంగా ఆ ప్రాంతాన్ని మొత్తం పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకుంటారు. అక్కడకు ఎవ్వరినీ రానివ్వకుండా ఆధారాల కోసం అన్వేషిస్తారు. తద్వారా హత్య చేసిన నిందితులకు సంబంధించిన ఆధారాలు ఏమైనా లభించే అవకాశం ఉంటుంది. అయితే, నారాయణ రెడ్డి హత్య జరిగిన ప్రాంతంలో ఇటువంటి క్రైమ్ సీన్ ఏమీ కనపడలేదు. సాధారణ జనంతో పాటు అందరూ కూడా నారాయణ రెడ్డి హత్య జరిగిన ప్రాంతమంతా కలియతిరిగారు. అంతేకాకుండా దాడికి గురైన వాహనాన్ని కూడా అందరూ పట్టుకుని మరీ పరిశీలించారు. ఉదయం 11 గంటల ప్రాంతంలో హత్య జరిగితే... ఇంత జరిగిన తర్వాత మధ్యాహ్నాం రెండున్నర గంటల ప్రాంతంలో పోలీసులు వేలిముద్రల కోసం (ఫింగర్ ప్రింట్స్) ప్రయత్నించడం విమర్శల పాలవుతోంది. శవంలోనూ రాజకీయమే..! చెరకులపాడు నారాయణ రెడ్డి హత్య ఆదివారం 11 గంటల ప్రాంతంలో జరిగింది. నారాయణ రెడ్డితో పాటు వేరే వాహనంలో ప్రయాణించిన వారు పోలీసులకు ఫిర్యాదు కూడా అందించారు. అయితే, క్లూస్ టీం, డాగ్స్ టీం రావడంతో పాటు మొత్తం ప్రక్రియ ఆలస్యంగా జరిగిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా హత్య జరిగిన రెండు గంటల తర్వాత కానీ హాస్పిటల్‌కు నారాయణ రెడ్డి మృతదేహాన్ని తరలించలేదు. దీంతో ఆదివారం కావడంతో మృతదేహానికి ఒంటి గంట దాటిన తర్వాత పోస్టుమార్టం చేయమని డాక్టర్లు స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో ఆదివారం మొత్తం మృతదేహం మార్చురీలోనే ఉండిపోయింది. సోమవారం ఉదయం మృతదేహానికి పోస్టుమార్టం చేయనున్నారు. అధికారపార్టీ నేతల ఒత్తిళ్లతోనే ఈ ప్రక్రియ ఆలస్యంగా సాగినట్టు తెలుస్తోంది. తద్వారా ఆదివారం మొత్తం కుటుంబ సభ్యులకు మృతదేహాన్ని చూసుకునే అవకాశమే లేకుండా పోయింది. శవంతోనూ అధికారపార్టీ నేతలు రాజకీయం చేస్తున్నారనే విమర్శలు వ్యక్తమయ్యాయి. పదే పదే ఫిర్యాదు చేసినా... వాస్తవానికి తనకు డిప్యూటీ సీఎం కేఈ కుటుంబం నుంచి ప్రాణహాని ఉందని నారాయణ రెడ్డి, ఆయన భార్య శ్రీదేవి పదే పదే చెప్పేవారు. రాజకీయంగా తన ఎదుగుదలను చూసి ఓర్వలేక తనను అంత మొందించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని స్పష్టంగా పేర్కొనేవారు. ఇందులో భాగంగా సొంత గ్రామం చెరకులపాడులో తన ఇంటి ముందు ఉన్న జీపుపై దాడులు చేయడం... గ్రామ పంచాయతీ తీర్మానం లేకుండానే తెలుగుదేశం పార్టీ జెండాను పాతడం వంటి చర్యలకు పాల్పడుతున్నారని పదే పదే ఫిర్యాదు చేశారు. అంతేకాకుండా తమపై దాడులు జరిగితే... తమపైనే కేసులు పెట్టారని కూడా ఆయన వాపోయారు. తన భర్తకు హాని జరిగితే కేఈ కుటుంబానిదే బాధ్యత అని శ్రీదేవి కూడా అనేకసార్లు విలేకరుల సమావేశాల సాక్షిగా వెల్లడించారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్‌నుంచి పోటీ చేసిన ఆయన అనంతరం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. పార్టీలో చేరినప్పటి నుంచి పత్తికొండ నియోజకవర్గంలో గడపగడపకు వైఎస్సార్సీపీ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈ సందర్భంగా ప్రజల నుంచి అనూహ్య స్పందన వచ్చింది. అదేవిధంగా ప్రజలు వెల్లడించిన సమస్యల పరిష్కారం కోసం పోరాటాలు చేశారు. దీంతో వచ్చే ఎన్నికల్లో రాజకీయంగా గెలుపు నారాయణ రెడ్డిదే అనే వాతావరణం వచ్చింది. ఈ నేపథ్యంలోనే రాజకీయంగా తన ఎదుగుదలను చూసి తట్టుకోలేక తనను హత్య చేసే అవకాశం ఉందని ఆయన తన సన్నిహితులతో ఆయన పదే పదే అనేవారు. అంతేకాకుండా ఇదే విషయంపై పోలీసు ఉన్నతాధికారులకు విన్నవించారు. అయినప్పటికీ భద్రత కల్పించడంలో పోలీసు యంత్రాంగం విఫలమయ్యింది. ప్రత్యర్థులను చేరదీసిన అధికారపార్టీ...! నారాయణరెడ్డి ప్రత్యర్థులను అధికారపార్టీ నేతలు చేరదీశారు. ఎన్నో ఏళ్ల క్రితం ఊరు విడిచి వెళ్లిపోయిన వారిని సైతం తిరిగి గ్రామాల్లోకి చేర్పించారు. అంతేకాకుండా వారు విచ్చలవిడిగా అక్రమ ఇసుక వ్యాపారం చేసుకునేందుకు కూడా అండగా నిలిచారు. ఫలితంగా ఆర్థికంగా బలపడటంతో పాటు గ్రామంలో చిన్న విషయానికి గొడవ పెట్టుకునేందుకు పురికొల్పడంలో అధికారపార్టీ నేతల హస్తం ఉందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇక అక్రమ ఇసుక వ్యవహారంలో రోజురోజుకీ భూగర్బజలాలు తరిగిపోయి.... తాగునీటికీ ఇబ్బందులు వస్తున్నాయంటూ ఏకంగా హైకోర్టులో గ్రామస్తులు కేసు వేశారు. అక్రమ ఇసుక వ్యాపారంలో కేఈ శ్యాంబాబు పాత్ర ఉందని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో ఆయన పాత్రపై హైకోర్టు ఆదేశాలతో విచారణ జరుగుతోంది. ఈ మొత్తం ఫిర్యాదు వెనుక నారాయణ రెడ్డి నాయకత్వం వహిస్తున్నారని ఆయన ప్రత్యర్థులు ఆయనపై గుర్రుగా ఉన్నారు. కేఈ సోదరులే కారణం– నారాయణ రెడ్డి భార్య శ్రీదేవి, సోదరుడు ప్రదీప్ రెడ్డి ఇసుక మాఫియాకు వ్యతిరేకంగా పోరాడినందుకే నారాయణ రెడ్డిని హత్య చేశారు. పత్తికొండలో కేఈ అరాచకాలు పెరిగిపోయాయి. కేఈ దౌర్జన్యాలకు వ్యతిరేకంగా నారాయణ రెడ్డి పోరాడుతున్నారు. డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి, ఆయన కుమారుడు కేఈ శ్యాంబాబుతో పాటు వెల్దుర్తి ఎస్ఐ నాగతులసీ ప్రసాద్ హత్యలో కీలక పాత్రదారులు. గన్మెన్లను ఇవ్వాలని ఉన్నతాధికారులను కోరినప్పటికీ పట్టించుకోలేదు. గన్‌లైసెన్స్ రెన్యువల్ కోసం దరఖాస్తు చేసుకుని మూడు నెలలు గడిచినా ఇవ్వకపోవడం వల్లే హత్య జరిగింది. నెలన్నర క్రితం ఎస్పీ, డీఐజీతో పాటు ఇంటలిజెన్స్ డీఐజీని కూడా కలిసి కేఈ కుటుంబం నుంచి తనకు ప్రాణహాని ఉందని విన్నవించారు. అయినప్పటికీ ఏం చర్యలు తీసుకోకపోవడం వల్లే ఈ దారుణం జరిగింది. -
డోన్‌తో విడదీయరాని బంధం
డోన్: పత్తికొండ నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇన్చార్జ్ చెరుకులపాడు నారాయణ రెడ్డి ఆదివారం పెళ్లికి వెళ్లి తిరిగివస్తుండగా రాజకీయ ప్రత్యర్ధులు దారికాచి దారుణంగా హత్య చేశారు. ఈ హత్యపట్ల డోన్ నియోజక వర్గంలోని ఆయన సహచరులు, మిత్రులు, బంధువర్గంతో పాటు వైఎస్ఆర్సీపీ శ్రేణులు తీవ్ర దిగ్ర్భాంతికి లోనయ్యారు. రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కర్ రెడ్డికి బంధువు. అంతేకాక చెరుకులపాడు నారాయణ రెడ్డి స్వర్గీయ వైఎస్ రాజశేఖర్ రెడ్డికు ప్రియ శిష్యునిగా పేరుగాంచారు. గత ఎన్నికల తర్వాత జరిగిన పరిణామాల మూలంగా కేంద్ర మాజీ మంత్రి కోట్ల జయ సూర్యప్రకాశ్ రెడ్డితో విభేదించి వైఎస్ఆర్సీపీలో చేరారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్ధిగా పత్తికొండ నుంచి డిప్యూటీ సీఎం కేఈ క్రిష్ణమూర్తి పై పోటీ చేసి స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయారు. ప్రస్తుతం పత్తికొండ వైఎస్ఆర్సీపీ ఇన్చార్జ్గా ఉన్నారు. నారాయణ రెడ్డి పత్తికొండ, డోన్ నియోజకవర్గ ప్రజలతో, ముఖ్యనాయకులతో సత్సంబంధాలు కొనసాగిస్తూనే ఉన్నారు. డోన్ నియోజకవర్గంలోని అన్ని గ్రామాల ప్రజలు, ముఖ్యనాయకల ఇళ్లలో జరిగే శుభకార్యాలకు నారాయణ రెడ్డి తప్పక హాజరౌతుంటారు. ఈ ప్రాంతం ప్రజలు, ముఖ్యనాయకులను పేరుపేరునా పలకరిస్తూ అందరి అప్యాయత, అనురాగాలను పొందారు. డోన్‌తో విడదీయరాని బంధం: నారాయణ రెడ్డి ప్రాధమిక విధ్య అనంతరం స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 1982 వరకు చదివారు. తరువాత తన తండ్రి శివారెడ్డి హత్యానంతరం ఉన్నత చదువులు కొనసాగించ లేక తండ్రి రాజకీయ వారసునిగా మారారు. ప్యాపిలి మండలం, బూరుగల గ్రామానికి చెందిన సత్యకంబగిరి రెడ్డి కుమార్తె శ్రీదేవితో నారాయణరెడ్డికి వివాహాం జరిగింది. డోన్ మండలం ఎద్దుపెంట గ్రామానికి చెందిన ఎల్లారెడ్డి కుమారుడు ప్రస్తుతం ఉపాధ్యాయులు వేంకటేశ్వర రెడ్డికి తన చెల్లెలు విజయలక్ష్మిని ఇచ్చి వివాహాం జరిపించారు. గ్రామ గ్రామాన రాజకీయ పరిచయాలతో పాటు వ్యక్తిగతంగా కూడా ప్రజలతో బంధం ఏర్పరుచుకున్న నారాయణ రెడ్డి హత్యకు గురయ్యారని తెలిసి ఈ ప్రాంతం ప్రజలు తీవ్ర ఆవేదన చెందుతున్నారు. నారాయణ రెడ్డి హత్య వార్త తెలిసిన వెంటనే వేలాది మంది ప్రజలు సంఘటనా స్థలానికి, కర్నూల్ ప్రభుత్వాసుపత్రికి తరలివెళ్లారు. -
ప్రత్యర్థుల చేతిలో రాజకీయ హత్యలు
– రాజకీయాలకు అడ్డుతొలిగించుకుంటున్న నాయకులు పత్తికొండ : ఆదిపత్య రాజకీయాలకు నిలయమైన పత్తికొండ నియోజకవర్గంలో 35 ఏళ్ల పాటు ఇరువురు వర్గ నాయకుల మధ్య రసవత్తరమైన రాజకీయ అధిపత్యపోరుసాగింది. ఈ పోటా పోటిలో కొందరు నాయకులు వేట కొడవళ్లకు పదునుబెట్టారు. మరి కొందరు బాంబులు పేల్చారు. ఇంకొందరు ఆస్తులు, నివాసగృహలకు నిప్పు పెట్టారు. హత్య రాజకీయ పోరులో నాయకులతో పాటు ప్రజలు, ఉద్యోగులు ప్రాణాలు వదిలారు. అలు పెరగని రాజకీయ వర్గ పోరులో వందల సంఖ్యలో అమాయకులతో పాటు ముగ్గురు ఎమ్మెల్యేలు, మాజీ సోసైటి ప్రసిడెంటు, మాజీ జడ్పీటీసీ సభ్యుడు, వైఎస్ఆర్సీపీ పత్తికొండ నియోజకవర్గ ఇన్చార్జీ ప్రాణాలను కోల్పోయారు. పత్తికొండ నియోజకవర్గంలో 77 గ్రామాల్లో రాజకీయ పోరు సాగుతుంది. రాజకీయాల్లో దూసుకొని పోతున్న చెరుకులపాడు: 2014 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి బరిలో నిలిచిన నారాయణరెడ్డి ఓటమి చవిచూసిన 31 వేల ఓట్లను సాదించి రాష్ట్రంలోనే రెండవ స్థానంలో నిలిచారు. 2014లో కాంగ్రెస్ పార్టీకి గుడ్‌బై చెప్పి, సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు, కార్యకర్తలు, నాయకులతో నారాయణరెడ్డి వైఎస్ఆర్సీపీలోకి చేరారు. నియోజకవర్గంలోని క్రిష్ణగిరి, వెల్దుర్తి మండలాల్లో వైఎస్ఆర్సీపీ నియోజకవర్గ ఇన్చార్జీ చెరుకులపాడు నారాయణరెడ్డి రాజకీయలో దూసుకొని పోవడంతో ప్రత్యర్ధులకు మింగుడు పడటంలేదు. రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు గ్రామాల్లో గడపగడపకు వైఎస్ఆర్ పొగ్రామ్కు శ్రీకారం చుట్టిన నారాయణరెడ్డి ప్రభుత్వ వైఫల్యాలపై ద్వజమెత్తారు. దీంతో టీడీపీ నాయకులు, కార్యకర్తలు వైఎస్ఆర్సీపీలోకి చేరడం మొదలైయింది. క్రిష్ణగిరి, వెల్ధుర్తి మండలాల్లో టీడీపీ బీటలు పడటంతో ప్రత్యర్థులు జీర్ణించుకోలేకపోతున్నారు. కొనసాగిన రాజకీయ హత్యలు: – 1978లో రెండోసారి పత్తికొండలో ఎమ్మెల్యే స్థానానికి నామినేషన్ వేసి తిరిగి వెలుతున్న ఎర్రగుడి ఈశ్వరరెడ్డిపై ప్రత్యర్థులు హత్యయత్నం చేసినా ప్రాణాలతో బయట పడ్డారు. 1979 ఆగస్టు 4వతేదీన ఆదోనికి వెలుతున్న సమయంలో తుగ్గలి మండలంలోని గవనికొండ వద్ద బస్సులో నుంచి ఈశ్వరరెడ్డిని లాగి ప్రత్యర్థులు అతిధారుణంగా హత్య చేశారు. – 1985 మార్చి11 వతేదీన టీడీపీ ఎమ్మెల్యేగా విజయం సాదించిన మహాబలేశ్వర గుప్తను 1985 ఏప్రిల్ 27 వతేదీన పట్టపగలు పత్తికొండ పట్టణంలోని శ్రీకన్యకా పరమేశ్వరి కళ్యాణ మండపం వద్ద రాజకీయ ప్రత్యర్థులు బాంబులు పేల్చి వేట కొడవళ్లతో దారణంగా హత్య చేశారు. –ఎమ్మెల్యేగా రెండుసార్లు బరిలో నిలిచి ఓటమి పాలైన రామకృష్ణరెడ్డి 1985 జూన్11 వతేదీన కర్నూలు పట్టణంలో రాజకీయ ప్రత్యర్థుల చేతిలో దారణంగా హత్యకు గురయ్యారు. – 1989లో పత్తికొండ ఎమ్మెల్యేగా పాటిల్ శేషిరెడ్డి విజయం సాదించారు. పార్లమెంటు ఎన్నికల ప్రచారంలో ఉన్న శేషిరెడ్డిని 1996 ఏప్రిల్ 18వతేదీన గోనేగండ్లలో ప్రత్యర్థులు వెంటాడి వేటాడి హత్య చేశారు. రాజకీయ అదిపత్య పోరులో వర్గనేతలే కాదు మాజీ ఎమ్మెల్యేలు కూడా ప్రాణాలు కోల్పోయ్యారు. – పెండేకల్లు గ్రామంలో రాజకీయ పోరుతో 1990 ఏప్రిల్ 3న కాంగ్రెస్ పార్టీకి చెందిన నల్లారెడ్డి నివాస గృహంపై ప్రత్యర్తులు ప్లాన్ ప్రకారంగా కిరోసిన్ పోసి నిప్పు పెట్టడంతో భార్యభర్తలు మృతి చెందారు. – చక్రాళ్ల గ్రామం నుంచి 1998 డిశంబరు 28న పత్తికొండకు బస్సులో వస్తున్న కాంగ్రెస్ పార్టీకి చెందిన నలుగురు కార్యకర్తలను ప్రత్యర్థులు హత్య చేశారు. – కడమకుంట్ల గ్రామంలో 1998లో సీపీఐ నాయకుడు కాంతరెడ్డి, విశ్వనాథ్శర్మను రాజకీయ ప్రత్యుర్థులు వెంటాడి వేటాడి హత్య చేశారు. హత్య చేసిన ప్రత్యర్థిని 2011నవంబరు 28న కాంగ్రెస్ నాయకుడు అనిమిరెడ్డిని రైల్యేబ్రిడ్జి కింద హత మార్చారు. – 2008 మే17న మాజీ జెడ్పీటీసీ సభ్యుడు కప్పటాళ్ల వెంకటనాయుడు తన స్వాగ్రామం నుంచి కర్నూలు వెళ్లుతున్న మార్గమధ్యంలో ప్రత్యర్థుల చేతిలో వెంకటప్పనాయుడుతో పాటు10 మంది హతమయ్యారు. వీరిలో ఇద్దరు సోసైటీ ఉద్యోగులు, గ్రామస్తులు ప్రాణాలు వదిలారు. –వైఎస్ఆర్సీపీ పత్తికొండ నియోజకవర్గ ఇన్చార్జీ చెరుకులపాడు నారాయణరెడ్డిపై 2017 మే 21న (ఆదివారం) క్రిష్ణగిరి, చెరుకులపాడు మార్గమద్యలో ప్రత్యర్థులు కాపుకాసి వేటకొడవళ్లతో నరికి, రాళ్లతో కొట్టి అతికీరాతకంగా హత్య చేశారు. -
ఏడాది కాలంగా టార్గెట్!
-
నారాయణరెడ్డి చివరి క్షణాలు..
కర్నూలు: పత్తికొండ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి చెరుకులపాడు నారాయణ రెడ్డి హత్య ఆంధ్రప్రదేశ్‌లో తీవ్ర సంచలనం రేపింది. వెల్దుర్తిలో పెళ్లికి హాజరై తిరిగి వస్తున్న ఆయనను ప్రత్యర్థులు అత్యంత పాశవికంగా హత్య చేశారు. పథకం ప్రకారం ఆయనపై దాడి చేసి, హతమార్చారు. ఈ సంఘటన జరగడానికి గంట ముందు నారాయణరెడ్డి.. వెల్దుర్తిలోని లీమ్రా ఫంక్షన్ హాల్లో పెళ్లికి హాజరయ్యారు. వధూవరులను ఆశీర్వదించి వారితో ఫొటోలు దిగారు. తన మద్దతుదారులతో పిచ్చాపాటి మాట్లాడారు. అక్కడి నుంచి తిరిగివెళుతున్న ఆయనపై ప్రత్యర్థులు దాడికి పాల్పడ్డారు. కృష్ణగిరి వద్ద కాపుకాసి ఆయనను దారుణంగా చంపేశారు. కొద్దిసేపటి క్రితమే తమతో ఆనందంగా గడిపిన నారాయణరెడ్డి అంతలోనే హత్యకు గురయ్యారన్న విషయం తెలుసుకుని ఆయన మద్దతుదారుల హతాశులయ్యారు. తమ నాయకుడిని పొట్టనపెట్టుకున్న వారిని అరెస్ట్ చేసి చట్టప్రకారం శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. -
ఏడాది కాలంగా టార్గెట్!
కర్నూలు: పత్తికొండ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి చెరుకులపాడు నారాయణ రెడ్డిని ఏడాది కాలంగా ప్రత్యర్థులు టార్గెట్ చేసినట్టు తెలుస్తోంది. నారాయణరెడ్డికి వ్యతిరేకంగా చెరుకులపాడులో ప్రత్యర్థి వర్గాన్ని టీడీపీ చేరదీసింది. కొన్ని రోజులుగా వీరికి టీడీపీ కీలక నేత నిధులు అందజేస్తున్నట్టు ఆరోపణలున్నాయి. ఏడాది కాలంగా నారాయణరెడ్డి ప్రత్యర్థులు అరాచకాలు సాగిస్తున్నట్టు స్థానికులు చెబుతున్నారు. అధికారమే అండగా రెచ్చిపోయిన వీరు చెరుకులపాడులో చిన్నచిన్న ఫంక్షన్లకు లక్షల నిధులు ఖర్చు చేసినట్టు తెలుస్తోంది. ఈ వ్యవహారంపై పోలీసులు చూసీచూడనట్టు వ్యవహారించారన్న ఆరోపణలు విన్పిస్తున్నాయి. నారాయణ రెడ్డిని హత్య చేసిన నిందితులు 20, 30 ఏళ్ల మధ్యవారేనని తెలుస్తోంది. పథకం ప్రకారం ప్రత్యర్థులు ఆదివారం ఆయనను కిరాతకంగా హత్య చేశారు. ఆయన అనుచరుడు సాంబశివుడిని కూడా చంపేశారు. -
‘ఆయన హత్య వార్త విని దిగ్భ్రాంతి చెందా’
-
నారాయణరెడ్డి దగ్గర ఆయుధం లేదని తెలిసే..
-
ప్రాణాలకు ముప్పుందని ఆయన ముందే చెప్పినా..!
కర్నూలు: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత, పత్తికొండ ఇంచార్జ్ చెరుకులపాడు నారాయణరెడ్డి దారుణహత్యకు గురవడంపై గౌరు వెంకటరెడ్డి, ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డిలు తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఫ్యాక్షన్హత్యపై గౌరు చరితా రెడ్డి మాట్లాడుతూ.. 'నేను నంద్యాలలో వేరే పెళ్లిలో ఉన్నాను. నారాయణరెడ్డి హత్య విషయం వినగానే దిగ్భ్రాతి చెందాను. దివంగత నేత వైఎస్ఆర్ సీఎంగా ఉన్నప్పుడు ఫ్యాక్షన్ హత్యలు పూర్తిగా ఆగిపోయాయి. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని మళ్లీ ప్రోత్సహిస్తున్నారు. తన ప్రాణాలకు ముప్పు ఉందని నారాయణరెడ్డి ఎన్నోసార్లు బహిరంగంగానే చెప్పారు. కానీ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం వల్లే ఈ దారుణం చోటుచేసుకుంది. గతంలో పరిస్థితులు మళ్లీ తలెత్తడంతో వైఎస్ఆర్సీపీ నేతలను ఆందోళనకు గురిచేస్తుంది' అన్నారు. వైఎస్ఆర్సీపీ నేత గౌరు వెంకటరెడ్డి మట్లాడుతూ.. 'మొన్న ఆళ్లగడ్డలో మా పార్టీ కార్యకర్తలను చంపేశారు. ఇప్పుడు ఏకంగా పార్టీ కీలక నేతలను హత్యచేస్తున్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఫ్యాక్షన్ హత్యలు పెరుగుతున్నాయి. టీడీపీ సర్కార్ పోలీసులను వారి కనుసన్నల్లో పెట్టుకుంటుంటే.. పోలీసులు ఏ విధంగానూ ప్రతిపక్ష పార్టీ నేతలు, కార్యకర్తలకు, ప్రజలకు న్యాయం చేయలేకపోతున్నారు. వారి ప్రాణాలకు రక్షణ కల్పించలేకపోతున్నారు. అందుకు ఈ దారుణ ఘటనే నిదర్శనమని చెప్పవచ్చు. పశ్చిమగోదావరి జిల్లాలో టీడీపీ ఎమ్మెల్యే ఆరమిల్లి రాధాకృష్ణ తన ఇంటికి పిలిపించి మరీ ఇరగవరం ఎస్ఐ, రైటర్లను నిర్బంధించారని గుర్తుచేశారు. అధికార పార్టీ నేతలే తమ ఇష్టరీతిన నడుచుకుంటే పోలీసుశాఖ మాత్రం ఏం చేస్తుందన్నారు. పార్టీతో సంబంధంలేకుండా వ్యక్తిని గౌరవించే నేత ఆయన. పార్టీని ఎన్నో రకాలుగా అభివృద్ధి చేసిన వ్యక్తిని ప్రత్యర్థులు హత్య చేయడం దురదృష్టకరమని' వ్యాఖ్యానించారు. బాంబులు, కత్తులతో ప్రత్యర్థులు చేసిన దాడిలో పత్తికొండ ఇంచార్జ్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్న చెరుకులపాడు నారాయణ రెడ్డితో పాటు ఆయన అనుచరుడు సాంబశివుడు దారుణహత్యకు గురైన విషయం తెలిసిందే. పెళ్లికి వెళ్లి తిరిగొస్తుండగా కృష్ణగిరి మండలం రామకృష్ణాపురం వద్ద ఈ దారుణం చోటు చేసుకుంది. -
నారాయణరెడ్డి దగ్గర ఆయుధం లేదని తెలిసే..
పత్తికొండ: కర్నూలు జిల్లా వైఎస్సార్సీపీ కీలక నేత, పత్తికొండ నియోజకవర్గ ఇన్చార్జి చెరుకులపాడు నారాయణరెడ్డిని దారుణంగా హతమార్చిన దుండగులు పక్కాపథకం ప్రకారం వ్యవహరించినట్లు తెలిసింది. నారాయణరెడ్డి దగ్గర ఎలాంటి ఆయుధాలు లేవని నిర్ధారించుకున్న తర్వాతే దాడికి దిగినట్లు స్పష్టంగా అర్థమవుతోంది. తన గన్ లైసెన్స్ రెన్యూవల్ చేయాల్సిందిగా నారాయణరెడ్డి పదేపదే అభ్యర్థన చేసినా పట్టించుకోని పోలీసు శాఖపై అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ వ్యవహారంలో టీడీపీ ‘ముఖ్య’నేతల పాత్రపై విమర్శలు వినిపిస్తున్నాయి. వీటన్నింటి నేపథ్యంలో కర్నూలు జిల్లా ఎస్పీ రవికృష్ణ వివరణ కీలకంగా మారింది. ఆదివారం నారాయణరెడ్డి హత్య జరిగిన కొద్ది సేపటికి ఎస్పీ రవికృష్ణ ‘సాక్షి’తో మాట్లాడారు. నారాయణరెడ్డి హత్య బాధాకరమైన సంఘటన అని, ఇది జరగకుండా ఉండాల్సిందన్న ఎస్పీ రవికృష్ణ.. బాధ్యులపట్ల కఠినంగా వ్యవహరిస్తామని చెప్పారు. గత కొంత కాలంగా కర్నూలు జిల్లాలో ఫ్యాక్షన్ తగ్గుముఖం పట్టిందని, ఈ హత్యకుగల కారణాలను శోధిస్తామని తెలిపారు. ఇటీవలే జిల్లాలోని అన్ని స్టేషన్లనూ అప్రమత్తం చేశామని, గస్తీని పెంచామని వివరించారు. కాగా, నారాయణరెడ్డి గన్ రెన్యూవల్ చేయని విషయం తనకు తెలయదని, అధికారుల నుంచి సమాచారం తెల్సుకుంటానని ఎస్పీ రవికృష్ణ చెప్పారు. ఎలా జరిగిదంటే.. కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గ వైఎస్సార్సీపీ ఇన్చార్జి చెరుకులపాడు నారాయణరెడ్డిని ప్రత్యర్థులు బాంబులతో దాడిచేసి వేటకొడవళ్లతో నరికి దారుణంగా హత్యచేశారు. నంద్యాలలో సూర్యనారాయణరెడ్డి కుమార్తె వివాహానికి హాజరై ఆదివారం ఉదయం 11.30 గంటలకు కారులో స్వగ్రామానికి వస్తుండగా కృష్ణగిరి మండలం రామకృష్ణాపురం గ్రామ శివారులో కల్వర్టు వద్ద ఈ దాడి జరిగింది. నారాయణరెడ్డి ప్రయాణిస్తున్న కారు కల్వర్టు వద్ద స్లో కావడంతో అక్కడే కాపు కాసిన ప్రత్యర్థులు ట్రాక్టర్లతో కారును ఢీకొట్టి నారాయణరెడ్డిని, ఆయన అనుచరుడు సాంబశివుడిని లాగి వేటకొడవళ్లతో నరికి కిరాతకంగా హతమార్చారు. తొలుత బాంబులు విసిరిన ప్రత్యర్థులు కారును చుట్టుముట్టి హతమార్చినట్లు తెలుస్తోంది. నారాయణరెడ్డి కదలికలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్న ప్రత్యర్థులు పథకరచనచేసి కల్వర్టు వద్ద కారు ఎలాగూ వేగం తగ్గుతుందని భావించి అక్కడే ట్రాక్టర్లతో మాటువేసి హతమార్చారు. కొద్దిరోజుల ముందే నారాయణరెడ్డి తన వద్ద వున్న లైసెన్సు రివాల్వర్‌ను పునరుద్ధరించుకునేందుకు పోలీసులకు అప్పగించారు. ఈ విషయం కూడా ప్రత్యర్థులకు తెలిసే ఉంటుందని భావిస్తున్నారు. ఆయన నిరాయుధుడిగా ఉన్నాడన్న సమాచారంతో సమయం చూసి దాడిచేశారు. -
వైఎస్ఆర్సీపీ నేత దారుణ హత్య
కర్నూలు: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత దారుణ హత్యకు గురయ్యారు. పత్తికొండ ఇంచార్జ్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్న చెరుకులపాడు నారాయణ రెడ్డిపై ప్రత్యర్థులు కొందరు, బాంబులు, కత్తులతో దాడికి పాల్పడ్డారు. ఆయన తలను చిద్రం చేశారు. పెళ్లికి వెళ్లొస్తున్న ఆయన కారుపై తొలుత బాంబులు వేసి అనంతరం చాలా విచక్షణ రహితంగా కత్తులతో నరికి చంపారు. ఈ ఘటన వెల్దుర్తి మండలం కృష్ణగిరి వద్ద చోటు చేసుకుంది. ఈ దాడిలో ఆయనకు కీలక అనుచరుడిగా ఉన్న సాంబశివుడు కూడా చంపేశారు. తనకు ప్రత్యర్థుల నుంచి ముప్పు ఉందని కొద్ది రోజుల కిందటే తన లైసెన్స్ ఆయుధాన్ని తిరిగి కొనసాగించేందుకు అనుమతికోసం పోలీసులను ఆశ్రయించినా వారు స్పందించలేదు. ఆయన వద్ద ఎలాంటి ఆయుధాలు లేవని తెలుసుకున్న తర్వాతే ప్రత్యర్థులు పకడ్బందీగా ప్రణాళిక రచించి ఈ హత్య చేశారు. ఆదివారం ఉదయం నారాయణ రెడ్డి నంద్యాలలో సూర్యనారాయణరెడ్డి కుమార్తె వివాహానికి, అలాగే, వెల్దుర్తి మండలంలోని కొసనాపల్లెలో కే సాక్షి హనుమంతు కుమారుడు కే రమేశ్ వివాహానికి హాజరయ్యారు. అనంతరం ఉదయం 11.30 గంటలకు కారులో స్వగ్రామానికి వస్తుండగా కృష్ణగిరి మండలం రామకృష్ణాపురం గ్రామ శివారులో కల్వర్టు వద్ద కాపు కాసిన ప్రత్యర్థులు తొలుత ఆయన ప్రయాణిస్తున్న కారును వెనుక నుంచి ట్రాక్టర్‌తో ఢీ కొట్టించారు. ఆ తర్వాత ఎదురుగా మూడు ట్రాక్టర్లు పెట్టి ఆ వెంటనే బాంబులు విసిరారు. ఆ వెంటనే దాదాపు నారాయణపై దాదాపు 15 నుంచి 20 మంది ఒకేసారి దాడికి పాల్పడ్డారు. వేట కొడవళ్లతో విచక్షణా రహితంగా నరికేశారు. గత ఎన్నికల్లో ఆయన కేఈ కృష్ణమూర్తిపై ఎన్నికల్లో పోటీ చేశారు. ప్రస్తుతం నారాయణ రెడ్డికి విపరీతమైన ప్రజాబీమానం పెరగడం, క్రీయాశీలకంగా వ్యవహరించడం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి భారీ మద్దతు పెరుగుతున్న నేపథ్యంలో అధికార పార్టీకి చెందిన వాళ్లే ఈ హత్య చేయించినట్లు పలువురు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు.