
ఏడాది కాలంగా టార్గెట్!
కర్నూలు: పత్తికొండ వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి చెరుకులపాడు నారాయణ రెడ్డిని ఏడాది కాలంగా ప్రత్యర్థులు టార్గెట్ చేసినట్టు తెలుస్తోంది. నారాయణరెడ్డికి వ్యతిరేకంగా చెరుకులపాడులో ప్రత్యర్థి వర్గాన్ని టీడీపీ చేరదీసింది. కొన్ని రోజులుగా వీరికి టీడీపీ కీలక నేత నిధులు అందజేస్తున్నట్టు ఆరోపణలున్నాయి.
ఏడాది కాలంగా నారాయణరెడ్డి ప్రత్యర్థులు అరాచకాలు సాగిస్తున్నట్టు స్థానికులు చెబుతున్నారు. అధికారమే అండగా రెచ్చిపోయిన వీరు చెరుకులపాడులో చిన్నచిన్న ఫంక్షన్లకు లక్షల నిధులు ఖర్చు చేసినట్టు తెలుస్తోంది. ఈ వ్యవహారంపై పోలీసులు చూసీచూడనట్టు వ్యవహారించారన్న ఆరోపణలు విన్పిస్తున్నాయి. నారాయణ రెడ్డిని హత్య చేసిన నిందితులు 20, 30 ఏళ్ల మధ్యవారేనని తెలుస్తోంది. పథకం ప్రకారం ప్రత్యర్థులు ఆదివారం ఆయనను కిరాతకంగా హత్య చేశారు. ఆయన అనుచరుడు సాంబశివుడిని కూడా చంపేశారు.