
కేఈ శ్యాంబాబు
కర్నూలు జిల్లా: జంట హత్య కేసులో కేఈ శ్యాంబాబు, ఎస్‌ఐ నాగ తులసీ ప్రసాద్‌లను అరెస్ట్ చేయాలంటూ డోన్ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. పత్తికొండ వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త చెరుకులపాడు నారాయణ రెడ్డి, ఆయన డ్రైవర్ సాంబశివుడు హత్య కేసులో వీరిని నిందితులుగా చేర్చాలంటూ 2017లో నారాయణ రెడ్డి భార్య చెరుకులపాడు శ్రీదేవి డోన్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీంతో కేఈ శ్యాంబాబు, నాగ తులసీ ప్రసాద్‌లను అరెస్ట్ చేయాలంటూ అప్పట్లో కోర్టు ఆదేశాలు జారీచేసింది. అనంతరం కేఈ శ్యాంబాబు, నాగ తులసీ ప్రసాద్‌లు హైకోర్టును ఆశ్రయించి స్టే తెచ్చుకున్నారు. స్టే గడువు ముగియడంతో వారిని అరెస్ట్ చేయాలంటూ ఆదేశాలు జారీ చేసింది.
Comments
Please login to add a commentAdd a comment