KE Shyam Babu
-
కేఈ శ్యాంబాబుకు సొంతిల్లు లేదట!
కర్నూలు(సెంట్రల్): పత్తికొండ టీడీపీ అభ్యర్థి కేఈ కుటుంబానికి అమరావతిలో రూ.5.54 కోట్ల విలువ చేసే 38,002 చదరపు అడుగుల ఖాళీ స్థలం ఉన్నప్పటికీ సొంత ఇల్లు లేదని అఫిడవిట్లో చూపారు. తండ్రి డిప్యూటీ సీఎంగా పనిచేసినా కుమారుడికి మాత్రం సొంతిల్లు లేకపోవడం గమనార్హం. ఇటీవల ఆయన పత్తికొండ నియోజకవర్గ టీడీపీ అభ్యర్థిగా నామినేషన్ వేయగా..తాను ఎన్నికల కమిషన్‌కు సమర్పించిన అఫిడవిట్లో ఆస్తుల వివరాలను వెల్లడించారు. తన పేరిట కృష్ణగిరి, కంబాలపాడులలో రూ.19.40 లక్షల విలువ చేసే 12.33 ఎకరాల పొలం, రూ.31.79 లక్షల విలువ చేసే ఫార్చునర్ కారు ఉన్నట్లు చూపారు. భార్యకు రూ.32 లక్షల విలువ చేసే 46.58 తులాల బంగారు, రూ.15 లక్షల విలువ చేసే 16.50 కేజీల వెండి ఆభరణాలు ఉన్నాయని పేర్కొన్నారు. తన పేరిట రూ. 3,23,18,090 చరాస్తులు, భార్యకు రూ..1,32,14,007 చరాస్తులు ఉన్నట్లు చూపారు. ఆయన కుటుంబ సభ్యులు, బంధువుల దగ్గర రూ.1,19,76,800 అప్పు తీసుకున్నట్లు, తన భార్యకు రూ.19.50 లక్షల అప్పు ఇచ్చినట్లు చెప్పారు. తనపై ఒక్క కేసు కూడా లేదని అఫిడవిట్లో పేర్కొన్నారు. రాఘవేంద్రారెడ్డికి రెండు కార్లు మంత్రాలయం టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఎన్.రాఘవేంద్రారెడ్డికి రెండు కార్లు ఉన్నాయి. అంతేగాక అతను, అతని భార్య ఎన్.యశోదమ్మకు దాదాపు 31 ఎకరాల పొలాలు ఉన్నాయి. మాధవరంలో ముగ్గురి భాగస్తుల్లో కమర్షియల్ కాంప్లెక్స్ అతనిపేరిట ఉంది. అతని ఎలాంటి కేసులు లేవని ఎన్నికల ఆఫిడవిట్లో పొందుపరచారు. ఆయనకు రూ.3.92 లక్షల విలువ చేసే 5.6 తులాల బంగారు అభరణాలు, భార్య ఎన్. యశోదమ్మకు రూ.9.10 లక్షల విలువ చేసే 13 తులాల బంగారం అభరణాలు ఉన్నట్లు తెలిపారు. అంతేకాక ఆయన పేరిట రూ.40.70 లక్షల చరాస్తి, భార్యకు రూ.26.26 లక్షల చరాస్తితోపాటు రూ.33 లక్షల విలువ చేసే స్థిరాస్తులు ఉన్నాయి. ఆయన పేరిట స్థిరాస్తులు మాత్రం రూ.2.94 కోట్లుగా ఉన్నట్లు చెప్పారు. కుమారుడు రాకే‹Ùరెడ్డి పేరిట 35 లక్షల స్థిరాస్తి, రూ.20 లక్షల చరాస్తి ఉన్నట్లు చూపారు. రాఘవేంద్రారెడ్డికి రూ.1.68 కోట్ల అప్పులు, భార్యకు రూ.21 లక్షల అప్పు ఉన్నట్లు ప్రకటించారు. వై.బాలనాగిరెడ్డికి వ్యవసాయ భూములే ఆస్తులు మంత్రాలయం వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న వై.బాలనాగిరెడ్డి, ఆయన భార్య జయమ్మకు కలిపి 44.06 ఎకరాల వ్యవసాయ పొలాలు ఉన్నాయి. ఇందులో బాలనాగిరెడ్డి పేరిట 37.45 ఎకరాలు, భార్య పేరిట 6.61 ఎకరాల పొలం ఉంది. ఆయనకు పేరిట ఒకకారు, భార్య పేరిట మరొక కారు ఉంది. ఆయన రూ.12 లక్షల విలువ చేసే 400 గ్రాములు బంగారు ఆభరణాలు, రూ.4 లక్షల విలువ చేసే 10 కేజీల వెండి ఆభరణాలు ఉన్నాయి. అలాగే ఆయన భార్య పేరిట రూ.4.85 లక్షల విలువ చేసే 15 తులాల బంగారు ఆభరణాలు, రూ.2.5 లక్షల విలువ చేసే 5 కేజీల వెండి ఉంది. కాగా, బాలనాగిరెడ్డిపై 2012లో కోసిగి పోలీసు స్టేషన్లో నమోదైన కేసు విచారణలో ఉంది. ఇంతియాజ్‌కు సొంత వాహనం లేదు సెర్ప్ సీఈఓ, సీసీఎల్ఏ అదనపు కార్యదర్శిగా పనిచేస్తూ స్వచ్ఛంద పదవీ విరమణ చేసి రాజకీయాల్లోకి వచ్చిన ఏఎండీ ఇంతియాజ్‌కు సొంత వాహనం లేదు. బుధవారం ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫునన కర్నూలు అసెంబ్లీ స్థానానికి నామినేషన్ వేశారు. ఈ సందర్భంగా సమర్పించిన ఆవిడవిట్‌లో తనకున్న ఆస్తి వివరాలను ప్రకటించారు. తన చరాస్తిగా రూ.41.36 లక్షలు, భార్య సమీనకు చరాస్తిగా రూ.18.42 లక్షలు మాత్రమే ఉన్నట్లు ప్రకటించారు. ఇందులో వారికి విలువైన వాహనాలుగాని, ఖరీదైనా వజ్రాలు, బంగారు, వెండి, అభరణాలేవి లేవు. స్థిరాస్తుల్లో ఆయన భార్య సమీనకు కర్నూలులోని ఎన్ఆర్ పేటలో 378 చదరపు అడుగుల్లో నిర్మించిన ఇల్లు ఉంది. అలాగే ఆయనకు రాజధాని క్యాపిటల్ సిటీలోని ఐనవోలులో 4500 చదరపు అడుగుల కాళీ స్థలం, ఆయన భార్య సమీనకు కల్లూరులో 2800 చదరపు అడుగుల ఖాళీ స్థలం ఉంది. స్థిరాస్తి విలువలో ఇంతియాజ్‌కు రూ.30 లక్షలు, ఆయన భార్యకు రూ.30 లక్షలు ఉన్నాయి. మొత్తంగా ఆయనకు చరాస్థిరాస్తులు కలిపి రూ. 71,36,560, ఆయన భార్య సమీనకు 68, 42,603 లక్షల రూపాయలు ఉన్నాయి. ఆయనపై ఎలాంటి కేసులు లేవు. -
మత చిచ్చు.. అదే పచ్చ స్కెచ్చు!
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో మత విద్వేషాన్ని రెచ్చగొట్టేందుకు విగ్రహాల విధ్వంసం ఘటనలను తెలుగుదేశం పార్టీ ఉపయోగించుకున్న తీరుపై పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ఆలయ ఘటనల్లో టీడీపీ స్కెచ్ పక్కాగా అమలైనట్టు ఇప్పటికే నిర్ధారణకు వచ్చిన పోలీసులు.. అందుకు కారణమైన సూత్రధారులు, పాత్రధారులపై దృష్టి సారించారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలకు సానుకూల ప్రచారం రాకుండా ఉండేందుకే ఆలయ ఘటనలను ఆసరాగా తీసుకుని ఆలజడిని రేపుతున్నారని పోలీసులు నిర్ధారణకు వచ్చారు. ఈ నేపథ్యంలోనే దేవాలయాల్లో విగ్రహాల ధ్వంస రచనకు పాల్పడటం, పాత ఘటనలను కొత్తగా తెరమీదకు తెచ్చి అలజడి రేపడం, ఎటువంటి ఘటనలు జరగకపోయినా జరిగినట్టు దుష్ప్రచారం చేయడం వంటి చర్యలపై పోలీసులు లోతుగా ఆరా తీస్తున్నారు. విశిష్ట చరిత్ర కలిగిన అంతర్వేది లక్ష్మీనరసింహాస్వామి ఆలయానికి చెందిన రథం అగ్నికి ఆహుతైన దురదృష్టకర ఘటన గతేడాది సెపె్టంబర్ 5న జరిగింది. ప్రజల మనోభావాలతో ముడిపడిన ఇటువంటి సున్నితమైన అంశాన్ని వివాదం చేసి రాజకీయ లబ్ధి పొందే ప్రయత్నాలు జరిగాయి. టీడీపీ, బీజేపీలు రంగంలోకి దిగి దేవుడి సెంటిమెంట్‌ను రెచ్చగొట్టి మతపరమైన అలజడులను సృష్టించే ప్రయత్నాలు చేయగా, పోలీసులు అప్రమత్తంగా వ్యవహరించి అడ్డుకోగలిగారు. అయినప్పటికీ వరుస ఘటనలు జరగడం, వాటిని ఆసరాగా తీసుకుని విపక్షాలు రాద్ధాంతం చేయడం తెలిసిందే. ఇలా సెపె్టంబర్ 5 తర్వాత దేవాయాలకు సంబంధించి 44 కేసులు నమోదయ్యాయి. వాటిలో ఇప్పటికే 29 కేసులను చేధించిన పోలీసులు 81 మందిని అరెస్టు చేశారు. ఆయా కేసుల్లో లోతుగా దర్యాప్తు చేపట్టిన పోలీసులు రాజకీయ కుట్ర కోణాన్ని గుర్తించారు. తొమ్మిది కేసుల్లో టీడీపీ, బీజేపీలకు చెందిన వారికి ప్రత్యక్ష, పరోక్ష ప్రమేయం ఉందని గుర్తించి, 15 మందిని అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఆయా ఘటనల్లో అరెస్టు అయిన వారి పూర్వాపరాలను ఆరా తీస్తున్న పోలీసులు తాజాగా మరికొన్ని నిజాలను గుర్తించారు. మద్దమ్మ ఆలయ ఘటనలో నలుగురు టీడీపీ నేతలు కర్నూలు జిల్లా మద్దికెర పోలీస్ స్టేషన్ పరిధిలో మద్దమ్మ దేవాలయంలో గతేడాది డిసెంబర్ 20వ తేదీన గుప్తనిధుల తవ్వకాలు జరిపిన ఘటనలో ఎనిమిది మంది ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. వారిలో నలుగురు తెలుగుదేశం పార్టీకి చెందిన కీలక నేతలు కావడం పలు అనుమానాలకు తావిస్తోంది. వారిలో ఒక నిందితుడు ఎస్డీ ఫక్రుద్దీన్ బాషా టీడీపీకి చెందిన మాజీ ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి తనయుడు కేఈ శ్యాంబాబుకు ప్రధాన అనుచరుడు కావడం గమనార్హం. మరో నిందితుడు రామాంజనేయులు అనంతపురం జిల్లా గుంతకల్లు మండలంలోని నల్ల దాసరిపల్లి గ్రామ సర్పంచ్ పదవికి టీడీపీ మద్దతుదారుడిగా పోటీ చేసి ఓటమిపాలయ్యాడు. మరో నిందితుడు కర్నూలు జిల్లా చిప్పగిరి గ్రామానికి చెందిన జయరాముడు. అతని తల్లి 2019 ఎన్నికల్లో టీడీపీ నాయకుడు వైకుంఠం మల్లికార్జున్ మద్దతుతో ఎంపీటీసీ సభ్యురాలిగా పోటీ చేసింది. మరో నిందితుడు గొల్ల పెద్దయ్య టీడీపీ కార్యకర్త కావడం గమనార్హం. ఈ మొత్తం వ్యవహారం వెనుక టీడీపీ కీలక నేతల పాత్రపై ఆరా తీస్తున్నారు. బుచ్చయ్య డైరెక్షన్! రాజమండ్రి బొమ్మూరు పోలీస్ స్టేషన్ పరిధిలో వినాయకుని విగ్రహాన్ని మలినంతో అపవిత్రం చేశారంటూ ఉద్దేశ పూర్వకంగా వివిధ సామాజిక మాధ్యమాలలో టీడీపీకి చెందిన వాళ్లు తప్పుడు ప్రచారం చేశారు. దీంతో పోలీసులు రంగంలోకి దిగి దాన్ని ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించి పరీక్ష చేయించడంతో అది జీవ సంబంధ మలినం కాదని రిపోర్టు వచ్చింది. ఈ కేసులో వెల్లంపల్లి ప్రసాద్‌బాబు (బాబు ఖాన్ చౌదరి)ను పోలీసులు అరెస్టు చేశారు. చిటికెన సందీప్ (టీడీపీ), అడపా సందీప్ (బీజేపీ), కరుటూరి శ్రీనివాసరావులు నిందితులుగా ఉన్నారు. సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేసి ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం చేసిన చిటికెన సందీప్ టీడీపీ మాజీ మంత్రి బుచ్చయ్య చౌదరికి వ్యక్తిగత కార్యదర్శి కావడంతో మరిన్ని అనుమానాలు బలపడుతున్నాయి. దీంతో ఇదంతా బుచ్చయ్య చౌదరీ డైరెక్షన్లోనే జరిగిందా? అనే కోణంలో పోలీసులు లోతైన దర్యాప్తు చేపట్టారు. పనిగట్టుకుని దుష్ప్రచారం – విశాఖ జిల్లా గోలుగొండ మండలం ఏటిగైరంపేటలో రామాలయంలోని వినాయకుడి విగ్రహాన్ని ధ్వంసం చేశారంటూ.. గతంలో ఎప్పుడో దెబ్బ తిన్న విగ్రహం తాజాగా దెబ్బతిన్నట్టు సోషల్ మీడియాలో టీడీపీ నాయకుడు పైల సత్తిబాబు, కల్లిద నరేష్‌లు తప్పుడు ప్రచారం చేయించారు. – వారిని అరెస్టు చేసిన క్రమంలో టీడీపీ మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడి కుమారుడు పోలీసు స్టేషన్‌కు వెళ్లి హడావుడి చేశాడు. ఈ ఘటనలో ఆయన పోలీస్ స్టేషన్‌కు ఎందుకు వెళ్లాల్సి వచ్చింది? వినాయకుడి విగ్రహంపై జరిగిన దుష్ప్రచారం వెనుక ఉన్న టీడీపీ నేతలు ఎవరు? అనే కోణంలో పోలీసులు కూపీ లాగుతున్నారు. – వైఎస్సార్ కడప జిల్లా బద్వేలు పోలీస్ స్టేషన్ పరిధిలోని హనుమంతుడి విగ్రహానికి చెప్పుల దండ వేయడం, కర్నూలు జిల్లాలో ఆంజనేయ స్వామి గోపురాన్ని ధ్వంసం చేశారని, ప్రకాశం జిల్లా సింగరాయకొండ శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో విగ్రహాన్ని ధ్వంసం చేశారని, గుంటూరు జిల్లా నరసరావుపేటలోని శృంగేరి శంకర మఠంలో సరస్వతి విగ్రహాన్ని గుర్తు తెలియని దుండగులు అపవిత్రం చేశారంటూ పలు ఘటనల్లో వాస్తవాలకు విరుద్ధంగా తప్పుడు ప్రచారం చేసిన టీడీపీ నేతల వెనుక ఉన్న వారి కోసం పోలీసులు ఆరా తీస్తున్నారు. – శ్రీకాకుళం జిల్లా సోంపేటలో హనుమంతుని విగ్రహం, ఎచ్చెర్ల పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న పాఠశాలలో సరస్వతి దేవి విగ్రహం ఎప్పుడో దెబ్బతింటే ఇప్పుడు జరిగినట్టు సోషల్ మీడియాలో ప్రచారం చేసి ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నాలు చేసిన వారి వెనకుండి కథ నడిపిన సూత్రధారుల కోసం పోలీసులు లోతైన దర్యాప్తు చేస్తుండటం గమనార్హం. -
టీడీపీ ఫ్యామిలీ ప్యాకేజీలు కొట్టుకుపోయాయి..
సాక్షి, అమరావతి: వైఎస్సార్సీపీ సునామీలో టీడీపీ ఫ్యామిలీ ప్యాకేజీలు కొట్టుకుపోయాయి. రాయలసీమలో కేంద్ర మాజీ మంత్రి కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి దంపతులు కాంగ్రెస్ నుంచి టీడీపీలో చేరి టికెట్లు దక్కించుకుంటే వారికి ఘోర పరాజయం తప్పలేదు. దశాబ్దాల వైరాన్ని మరచి డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తితో సర్దుబాటు చేసుకుని మరీ పోటీకి దిగిన ఆ కుటుంబానికి చేదు అనుభవమే మిగిలింది. చంద్రబాబుకు ముందస్తుగా విధించిన షరతు మేరకు కోట్ల తాను కర్నూల్ లోక్‌సభ స్థానం నుంచి తన భార్య సుజాతమ్మను ఆలూరు శాసనసభ స్థానం నుంచి బరిలోకి దించారు. వైఎస్సార్సీపీ అభ్యర్థుల చేతిలో వారిద్దరూ ఓడిపోయారు. డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి ఎన్నికల్లో పోటీ చేయకుండా తన కుమారుడు కేఈ శ్యాంబాబును పత్తికొండ నుంచి సోదరుడు కేఈ ప్రతాప్‌ను డోన్ నుంచి బరిలోకి దించారు. వారిద్దరూ వైఎస్సార్సీపీ ముందు నిలవలేకపోయారు. భూమా అఖిలప్రియ ఆళ్లగడ్డ నుంచి.. నంద్యాల నుంచి ఆమె సోదరుడు, సిట్టింగ్ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి టీడీపీ తరఫున పోటీ చేసి వైఎస్సార్సీపీ అభ్యర్థుల చేతిలో పరాజయం పాలయ్యారు. నంద్యాల ఎంపీ ఎస్పీవై రెడ్డి జనసేన తరఫున నంద్యాల లోక్‌సభ స్థానం నుంచి.. ఆయన అల్లుడు, కుమార్తెలు నంద్యాల, శ్రీశైలం, బనగానపల్లె శాసనసభ స్థానాల నుంచి పోటీ చేశారు. పోలింగ్ అయ్యాక ఎస్పీవై రెడ్డి మరణించారు. కానీ.. ఆ ఫ్యామిలీ మొత్తం ఓడింది. జేసీ దివాకర్‌రెడ్డి, జేసీ ప్రభాకర్‌రెడ్డి తనయులు జేసీ పవన్‌కుమార్‌రెడ్డి, జేసీ అస్మిత్ రెడ్డిని టీడీపీ తరఫున బరిలోకి దిగి ఓటమి చవిచూశారు. సినీ నటుడు బాలకృష్ణ పెద్ద అల్లుడు నారా లోకేష్ మంగళగిరి నుంచి.. చిన్న అల్లుడు భరత్ విశాఖ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసి ఘోరంగా ఓడిపోయారు. నెల్లూరు జిల్లా ఉదయగిరి నుంచి బొల్లినేని రామారావు, ఆత్మకూరు నుంచి ఆయన సోదరుడు కృష్ణయ్య టీడీపీ తరఫున బరిలోకి దిగి ఓడిపోయారు. మంత్రి గంటా శ్రీనివాసరావు.. మరో మంత్రి పి.నారాయణ, భీమవరం మాజీ ఎమ్మెల్యే పూలపర్తి రామాంజనేయులు వియ్యంకులు. గంటా విశాఖపట్నం ఉత్తర నియోజకవర్గంలో ఓటమి అంచున ఉన్నారు. నెల్లూరు, భీమవరం నుంచి పోటీ చేసిన ఆయన ఇద్దరు వియ్యంకులు ఓటమిపాలయ్యారు. విజయనగరం లోక్‌సభ స్థానం నుంచి పోటీచేసిన అశోక్ గజపతిరాజు, విజయనగరం శాసనసభ స్థానం నుంచి పోటీ చేసిన ఆయన కుమార్తె అథితి ఓడిపోయారు. -
పత్తికొండలో కేఈ శ్యామ్‌బాబు వర్గీయుల వీరంగం
-
నారాయణరెడ్డి హత్యకేసు సీబీఐకి అప్పగించాలి
పత్తికొండ టౌన్: చెరుకులపాడు నారాయణరెడ్డి హత్యకేసును సీబీఐకి అప్పగించాలని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి చెరుకులపాడు ప్రదీప్‌రెడ్డి డిమాండ్ చేశారు. గురువారం సాయంత్రం పత్తికొండలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా పత్తికొండకు వచ్చిన సీఎం చంద్రబాబు చెరుకులపాడు నారాయణరెడ్డి హత్యతో కేఈ శ్యాంబాబుకు సంబంధం లేదని చెప్పడం సిగ్గుచేటు అన్నారు. హత్యకేసుతో టీడీపీ నాయకులకు సంబంధం లేనప్పుడు సీబీఐ దర్యాప్తునకు ఎందుకు జంకుతున్నారని ఆయన ప్రశ్నించారు. అధికారం కోసం పిల్లనిచ్చిన మామను చంద్రబాబు వెన్నుపోటు పొడిస్తే, కేఈ శ్యాంబాబు ప్రతిపక్ష నాయకులను హత్యలు చేస్తున్నాడని ఆరోపించారు. టీడీపీ ఐదేళ్ల పాలనలో ప్రజలకు ఒరిగిందేమీ లేదన్నారు. ఎన్నికల ప్రచారంలో చెప్పుకునేందుకు ఏమీ లేక చంద్రబాబు.. ప్రతిపక్షనేత వైఎస్ జగన్‌ను విమర్శించడమే పనిగా పెట్టుకున్నారన్నారు. పసుపు–కుంకుమ ఇచ్చినందుకు ఆడపడుచులందరూ తమకే ఓట్లు వేయాలని అడుగుతున్న చంద్రబాబు, జిల్లాలో వందలాదిమంది మహిళల పసుపుకుంకుమలు పోవడానికి కారకులైన కోట్ల, కేఈ కుటుంబాలకు టికెట్లు ఇవ్వడం విడ్డూరంగా ఉందన్నారు. నారాయణరెడ్డి హత్యకేసు నిందితులను పక్కనే పెట్టుకుని, నీతిమాటలు వల్లెవేయడం బాబుకే చెల్లిందన్నారు. అధికారం కోసం హత్యారాజకీయాలను ప్రోత్సహిస్తున్న టీడీపీ నాయకులకు ఎన్నికల్లో ప్రజలే తగిన బుద్ధి చెబుతారని ఆయన అన్నారు. -
మార్పు తథ్యం!
సాక్షి, పత్తికొండ: పత్తికొండ నియోజకవర్గ రాజకీయాలు ఎప్పుడూ ఆసక్తికరమే..రాష్ట్ర రాజకీయాలను మలుపు తిప్పిన సంఘటనలు కూడా ఇక్కడే జరిగాయి. నియోజకవర్గంలో ఇప్పటి వరకు 15 సార్లు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 6 సార్లు కాంగ్రెస్, 7 సార్లు టీడీపీ, ఒక సారి సీపీఎం, ఇండిపెండెంట్ అభ్యర్థులు గెలిచారు. రెండు సార్లు ఉప ఎన్నికలు జరిగాయి. కేఈ సోదరులకు రెండు పర్యాయాలు మద్దతు పలికినా నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి పనులు చేయకపోవడంతో ప్రజలు వారిపై నిరసన వ్యక్తం చేస్తున్నారు. మరోసారి జనం ముందుకు ఓట్లడగటానికి వస్తుండటంతో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రధాన సమస్యలను విస్మరించడంతో రైతులు, ప్రయాణికులు, విద్యార్థుల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ప్రకాశం పంతులు ప్రభుత్వాన్ని కూల్చిన పత్తికొండ ఎమ్మెల్యే 1952లో ముఖ్యమంత్రి ప్రకాశం పంతులు ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెట్టగా అప్పటి పత్తికొండ ఎమ్మెల్యే ముడుమాల శంకరరెడ్డి వ్యతిరేకంగా ఓటు వేయడంతో ప్రభుత్వం పడిపోయింది. అంతకుముందు రెండుసార్లు నియోజకవర్గాన్ని పునర్విభజించగా 2007లో మూడోసారి విభజించారు. పత్తికొండ, మద్దికెర, తుగ్గలి, కృష్ణగిరి, వెల్దుర్తి మండలాలతో నియోజకవర్గాన్ని ఏర్పాటు చేశారు. నియోజకవర్గం నుంచి ఎస్వీ సుబ్బారెడ్డి మూడుసార్లు హ్యాట్రిక్ విజయం సాధించారు. అమలు కాని హామీలు పందికోన, కొత్తపల్లి, రిజర్వాయరు నుంచి 32,200 ఎకరాలకు, కృష్ణగిరిలో రిజర్వాయరు నుంచి 5,100 ఎకరాలకు సాగునీరందించి 68 చెరువులకు జలకళ తెస్తామని టీడీపీ నాయకులు హామీ ఇచ్చారు.అంతేకాక ఆర్టీసీ మినీ డిపో నుంచి పూర్తిగా స్థాయిలో ఏర్పాటు, పాలిటెక్నిక్ కళాశాల, బీసీ బాలికలకు వసతి గృహం ఏర్పాటు, 80 గ్రామాలకు తాగు నీరు సరఫరా చేస్తామని హామీ ఇచ్చి గెలిచిన తరువాత పట్టించుకోలేదు. కేఈ కుటుంబంపై ఆగ్రహం రెండుసార్లు కేఈ కుటుంబానికి మద్దతు పలికినా హామీల గురించి మాటెత్తకుండా మూడోసారి కేఈ శ్యాం కుమార్ (కేఈ కృష్ణమూర్తి కుమారుడు) బాబుకు ఓట్లు వేయాలని అడుగుతుంటే ఓటర్లు జీర్ణించు కోలేకపోతున్నారు. వైఎస్ఆర్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త చెరుకులపాడు నారాయణరెడ్డిని పట్టపగలే దారుణంగా హత్య చేయించారనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. ఏడాది పాటు శ్యామ్‌బాబు అజ్ఞాతంలోకి వెళ్లారు. ఇక ఆర్అండ్బీ రోడ్లు, నీరుచెట్టు ,చెక్‌డ్యాంలు, సీసీ రోడ్లు నిర్మాణాల్లో టీడీపీ నేతలు జేబులు నింపుకున్నారు. పక్కాగృహం మంజూరు కావాలంటే రూ.50వేలు ఇవ్వాల్సిందే. ఇలా లక్షల రూపాయలు వసూలు చేశారని లబ్ధిదారులు వాపోతున్నారు. నియోజకవర్గ అభివృద్ధి పట్టించుకోకపోవడంతో కేఈ సోదరులపై ప్రజా వ్యతిరేకత, చంద్రబాబు ప్రకటించిన 650 çహామీల్లో ఒక్కటీ అమలు చేయకపోవడం వైఎస్సార్సీపీకి కలిసొచ్చే అంశం. జోరుగా ఫ్యాను గాలి.. నియోజకవర్గంలో టీడీపీ నాయకుల అవినీతి, ఆక్రమాలు, ప్రత్యర్థుల చేతిలో భర్తను కోల్పోయిన శ్రీదేవికి నియోజకవర్గ ప్రజలు నీరాజనాలు పలుకుతున్నారు. ఓటమి ఖాయమని గ్రహించిన కేఈ సోదరులు డబ్బులు విచ్చలవిడిగా ఖర్చు చేస్తున్నారు. ఎన్ని కుట్రలు, కుతంత్రాలు పన్నినా ఈ ఎన్నికల్లో కంగాటి శ్రీదేవికి పట్టం కట్టడానికి ఓటర్లు సిద్ధమయ్యారు. ఈఎన్నికల్లో ఫ్యాన్ గాలికి సైకిళ్లు లేచిపోవడం ఖాయమని భావిస్తున్నారు. – పూజారి గోపాల్, పత్తికొండ ఓటర్ల వివరాలు మొత్తం 1,89,409 పురుషులు 95,751 మహిళలు 93,640 ఇతరులు 18 -
జంట హత్య కేసు: కేఈ శ్యాంబాబు అరెస్ట్‌కు ఆదేశాలు
-
కేఈ శ్యాంబాబు అరెస్ట్‌కు ఆదేశాలు
కర్నూలు జిల్లా: జంట హత్య కేసులో కేఈ శ్యాంబాబు, ఎస్ఐ నాగ తులసీ ప్రసాద్‌లను అరెస్ట్ చేయాలంటూ డోన్ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. పత్తికొండ వైఎస్సార్సీపీ సమన్వయకర్త చెరుకులపాడు నారాయణ రెడ్డి, ఆయన డ్రైవర్ సాంబశివుడు హత్య కేసులో వీరిని నిందితులుగా చేర్చాలంటూ 2017లో నారాయణ రెడ్డి భార్య చెరుకులపాడు శ్రీదేవి డోన్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీంతో కేఈ శ్యాంబాబు, నాగ తులసీ ప్రసాద్‌లను అరెస్ట్ చేయాలంటూ అప్పట్లో కోర్టు ఆదేశాలు జారీచేసింది. అనంతరం కేఈ శ్యాంబాబు, నాగ తులసీ ప్రసాద్‌లు హైకోర్టును ఆశ్రయించి స్టే తెచ్చుకున్నారు. స్టే గడువు ముగియడంతో వారిని అరెస్ట్ చేయాలంటూ ఆదేశాలు జారీ చేసింది. -
నాన్ బెయిలబుల్ వారెంట్ కొట్టేయాలి
సాక్షి, హైదరాబాద్: వైఎస్సార్సీపీ నేత చెరుకులపాడు నారాయణరెడ్డి హత్య కేసులో కర్నూలు జిల్లా డోన్ మొదటి తరగతి జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ కోర్టు నాన్‌బెయిలబుల్ వారెంట్ జారీ చేయడాన్ని సవాల్ చేస్తూ ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి తనయుడు కేఈ శ్యాంబాబు హైకోర్టును ఆశ్రయించారు. నారాయణరెడ్డి భార్య కె.శ్రీదేవి దాఖలు చేసిన ప్రైవేటు పిటిషన్‌ను విచారించిన డోన్ మేజిస్ట్రేట్ కోర్టు శ్యాంబాబుకు ఎన్బీడబ్ల్యూ జారీ చేసింది. ఇదే కేసులో డోన్ కోర్టు జారీ చేసిన ఉత్తర్వులపై ఎస్సై నాగతులసీప్రసాద్ హైకోర్టు నుంచి స్టే ఉత్తర్వులు పొందారని, వారెంట్‌పై స్టే మంజూరు చేయాలని కేఈ శ్యాంబాబు తరఫు సీనియర్ న్యాయవాది పి.వీరారెడ్డి కోరారు. గురువారం కేసు విచారణ ప్రారంభం కాగానే శ్రీదేవి తరఫు న్యాయవాది పొన్నవోలు సుధాకర్‌రెడ్డి లేచి.. శ్యాంబాబు దాఖలు చేసిన పిటిషన్లో డోన్ కోర్టు జరిపే విచారణను కొట్టేయాలని కోరలేదని, ఈ వ్యాజ్యం చెల్లదన్నారు. వ్యాజ్యాన్ని టైపింగ్ చేసే దశలో సాంకేతికంగా జరిగిన పొరపాటు వల్ల అలా జరిగిందని వీరారెడ్డి బదులిచ్చారు. సవరణలతో వ్యాజ్యాన్ని తిరిగి దాఖలు చేస్తామని కోరారు. అయినా హైకోర్టు నోటీసులు జారీ చేయకుండానే ప్రతివాది అయిన శ్రీదేవి కౌంటర్ పిటిషన్ ఏవిధంగా దాఖలు చేస్తారని ప్రశ్నించారు. పిటిషనర్ కేఈ శ్యాంబాబును ఏనాడైనా పోలీసులు అరెస్ట్ చేసే అవకాశముందని, స్టే మంజూరు చేయాలన్నారు. వాదనల అనంతరం పిటిషన్‌ను సరవరించి దాఖలు చేసేందుకు న్యాయమూర్తి జస్టిస్ షమీమ్ అక్తర్ అనుమతించారు. విచారణను వచ్చే బుధవారానికి వాయిదా వేశారు. కర్నూలు జిల్లా చెరుకులపాడు గ్రామానికి చెందిన నారాయణరెడ్డి హత్యకేసులో శ్యాంబాబు, జెడ్పీటీసీ కప్పట్రాళ్ల బొజ్జమ్మలను నిందితులుగా చేస్తూ పోలీసులు కేసు నమోదు చేశారు. అనంతరం చార్జిషీటులో వారి పేర్లను తొలగించారు. దాంతో లక్ష్మీనారాయణరెడ్డి భార్య శ్రీదేవి డోన్ కోర్టులో ప్రైవేటు కేసు దాఖలు చేశారు. దీనిని విచారించిన డోన్ మేజిస్ట్రేట్ కోర్టు శ్యాంబాబుకు ఎన్బీడబ్ల్యూ జారీ చేసింది. -
కేఈ కుటుంబం నుంచి ప్రాణహాని..
సాక్షి, కర్నూలు: డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి కుటుంబం నుంచి తమ కుటుంబానికి ప్రాణహాని ఉందని పత్తికొండ నియోజకవర్గ వైఎస్సార్సీపీ సమన్వయకర్త కంగాటి శ్రీదేవి అన్నారు. చెరుకులపాడు నారాయణరెడ్డి, సాంబశివుడు హత్య కేసులోని నిందితుడు శ్యామ్‌బాబు తమను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం ఆమె స్థానిక వైఎస్సార్సీపీ జిల్లా కార్యాలయంలో పార్టీ కర్నూలు పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు బీవై రామయ్యతో కలిసి విలేకరులతో మాట్లాడారు. నారాయణరెడ్డి, సాంబశివుడులను 2017 మే 21న అతికిరాతంగా హత్య చేశారని గుర్తు చేశారు. ఈ కేసులో కేఈ శ్యామ్‌బాబు, జెడ్పీటీసీ సభ్యురాలు బొజ్జమ్మ, అప్పటి వెల్దుర్తి ఎస్ఐ నాగతులసీ ప్రసాద్‌తో సహా 15 మందిని నిందితులుగా చేర్చారని, అయితే.. డిప్యూటీ సీఎం తన పలుకుబడిని ఉపయోగించి కేఈశ్యామ్‌బాబు, బొజ్జమ్మ, నాగతులసీప్రసాద్పై కేసును తొలగించారని తెలిపారు. దీనిపై తాము డోన్ కోర్టుకు వెళ్లగా.. వారిని కేసులో ముద్దాయిలుగా చేర్చుతూ మార్చి ఒకటో తేదీలోపు అరెస్టు చేయాలని ఆదేశించిందన్నారు. అయితే.. కేఈ శ్యామ్‌బాబుకు హైకోర్టులో స్టే వచ్చినట్లు శుక్రవారం ఆంధ్రజ్యోతి పత్రికలో ప్రచురితమైందని, అది వాస్తవం కాదని తెలిపారు. హైకోర్టులో శ్యామ్‌బాబుకు ఎలాంటి స్టే రాలేదన్నారు. దీనిపై ఏ ఆధారాలతో వార్త ప్రచురించారో ఆంధ్రజ్యోతి యాజమాన్యం, డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి చెప్పాలని డిమాండ్ చేశారు. కోర్టు తీర్పును సైతం ఆంధ్రజ్యోతి అపహాస్యం చేస్తోందని, దీనికి టీడీపీ నాయకులు వంత పాడుతున్నారని విమర్శించారు. తమ కుటుంబం, అనుచరులను భయభ్రాంతులకు గురి చేసేందుకు కుట్ర పన్నుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఒకవేళ నిందితులకు హైకోర్టులో స్టే వచ్చినా తాము సుప్రీంకోర్టుకు వెళ్తామని, వారిని అరెస్టు చేసే వరకు న్యాయ పోరాటం చేస్తానని స్పష్టం చేశారు. కాగా, ఈ కేసులో ఎస్ఐ నాగతులసీ ప్రసాద్‌కు హైకోర్టులో స్టే వచ్చినట్లు చెబుతున్నారని, అయితే దీనిపై ఇంతవరకు తమకు సమాచారం లేదని చెప్పారు. దీనిపై కూడా మళ్లీ పిటిషన్ వేసినట్లు తెలిపారు. చెరుకులపాడులో నారాయణరెడ్డి హంతకులు విచ్ఛలవిడిగా ఇసుకా దందాకు పాల్పడుతున్నారన్నారు. వారిని ఏమైనా అంటే దాడులు చేస్తున్నారని, ఈ విషయాన్ని పలుమార్లు పోలీసుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడంలేదని తెలిపారు. డోన్ కోర్టు తీర్పు ప్రకారం శ్యామ్‌బాబు, బొజ్జమ్మ, నాగతులసీప్రసాద్లను అరెస్టు చేయడానికి మరో ఐదు రోజులు మాత్రమే గడువు ఉందన్నారు. పోలీసులు నిష్పక్షపాతంగా కేసును విచారించి నిందితులను అరెస్టు చేయాలని బీవై రామయ్య కోరారు. గతంలో పోలీసులు సక్రమంగా విచారణ చేయకపోవడం వల్లే నిందితులను అరెస్టు చేయలేదన్నారు. తిరిగి అదేవిధంగా విచారణ కొనసాగితే వారి పనితనాన్ని తప్పు పట్టాల్సి వస్తుందన్నారు. మార్చి ఒకటో తేదీలోపు నిందితులను అరెస్టు చేస్తారన్న విశ్వాసంతో ఉన్నామన్నారు. -
పచ్చపార్టీ తప్పుడు ప్రచారం: కంగాటి శ్రీదేవి
కర్నూలు జిల్లా : వైఎస్సార్సీపీ నాయకుడు చెరుకులపాడు నారాయణరెడ్డి హత్య కేసులో పచ్చ పార్టీ తప్పుడు ప్రచారం చేస్తోందని పత్తికొండ వైఎస్సార్సీపీ ఇంచార్జ్ కంగాటి శ్రీదేవి విమర్శించారు. ఆమె శుక్రవారం పత్తికొండలో విలేకరులతో మాట్లాడుతూ.. ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి కుమారుడు కేఈ శ్యాంబాబుకు హైకోర్టులో ఊరట అంటూ సొంత మీడియాలో తప్పుడు వార్తలు రాయించిందన్నారు. డోన్ కోర్టు ఇచ్చిన తీర్పుపై హైకోర్టు స్టే ఇచ్చినట్టు తప్పుడు వార్తలతో కోర్టులను కించపరిచే విధంగా కేఈ కుటుంబం వ్యవహరిస్తోందన్నారు. తప్పుడు వార్తల అంశాన్ని కోర్టు దృష్టికి తీసుకెళ్తామని కంగాటి శ్రీదేవి తెలిపారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని, పోలీసు వ్యవస్థని నిర్వీర్యం చేస్తూ ప్రజాస్వామ్యాన్ని ఉప ముఖ్యమంత్రి అపహాస్యం చేస్తున్నారని మండిపడ్డారు. ఆంధ్ర జ్యోతి పత్రికలో వచ్చిన కథనంపై కేఈ కృష్ణమూర్తి సమాధానం చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు. వార్తా పత్రికలు బాధ్యతగా వ్యవహరిస్తే హుందాగా ఉంటుందని శ్రీదేవి వ్యాఖ్యానించారు. -
నారాయణ రెడ్డి హత్య కేసులో సంచలన తీర్పు
సాక్షి, కర్నూలు : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పత్తికొండ ఇన్ఛార్జ్ చెరుకులపాడు నారాయణరెడ్డి హత్య కేసులో ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి కుటుంబానికి షాక్ తగిలింది. ఈ కేసులో డిప్యూటీ సీఎం కుమారుడు శ్యామ్ బాబుతో సహా మరో ఇద్దరిని నిందితులుగా చేర్చి, అరెస్ట్ చేయాలని డోన్ న్యాయస్థానం సంచలన తీర్పునిచ్చింది. కాగా తన భర్త హత్య కేసు విచారణలో అన్యాయం జరిగిందంటూ చెరుకులపాడు నారాయణరెడ్డి భార్య కంగాటి శ్రీదేవి న్యాయస్థానాన్ని ఆశ్రయించిన విషయం తెలిసిందే. (చెరుకులపాడు నారాయణరెడ్డి గత ఏడాది మే 22న దారుణ హత్యకు గురైన విషయం విదితమే) తన భర్త నారాయణరెడ్డితో పాటు మరో వ్యక్తిని అతి కిరాతకంగా హత్యచేసిన శ్యాంబాబు అనుచరులు అటు తరువాత పోలీసులపై ఒత్తిడి తెచ్చి చార్జీషీట్లో పేర్లు తొలగించుకోవడం పట్ల ఆమె తీవ్ర అభ్యంతరం చేస్తూ... నిందితులుగా కేఈ శ్యాంబాబుతో పాటు ఆస్పరి జెడ్పీటీసీ కప్పెట్రాల బొజ్జమ్మ, అప్పటి వెల్దుర్తి ఎస్ఐ నాగతులసీ ప్రసాద్‌లను తన భర్త హత్యకేసులో ముద్దాయిలుగా చేర్చాలని పేర్కొంటూ కర్నూలు జిల్లా డోన్ కోర్టులో శ్రీదేవి ప్రైవేట్ ఫిర్యాదు దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం కేఈ కృష్ణమూర్తి కుమారుడు శ్యామ్ బాబు, బొజ్జమ్మ, వెల్దుర్తి ఎస్ఐ నాగప్రసాద్‌లను నిందితులుగా చేర్చాలని సూచించింది. -
కేఈ శ్యాంబాబు దొరికేనా?
♦ముందుకు సాగని ‘చెరకులపాడు’ హత్య కేసు ♦లభించని డిప్యూటీ సీఎం కుమారుడి ఆచూకీ ♦హత్య జరిగి వందరోజులైనా..పురోగతిలేని దర్యాప్తు ♦కేఈ శ్యాంబాబును కేసు నుంచి తప్పించే యత్నాలు ♦పోలీసుల వ్యవహార శైలిపై అనుమానాలు! ఏదైనా హత్య జరిగితే హడావుడి చేసే పోలీసులు.. వైఎస్ఆర్సీపీ నేత చెరకులపాడు నారాయణ రెడ్డి హత్య కేసులో మాత్రం తాత్సారం చేస్తున్నారు. ప్రధాన నిందితుడు కేఈ శ్యాంబాబును అరెస్ట్ చేయకుండా నిర్లక్ష్యం చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. అధికార పార్టీకి చెందిన నేత, డిప్యూటీ సీఎం కుమారుడు కావడమే ఇందుకు కారణమని తెలుస్తోంది. నారాయణ రెడ్డి హత్య జరిగి వంద రోజులవుతున్నా.. ఈ కేసు దర్యాప్తు నత్తనడకన సాగుతుండడం వెనక ప్రభుత్వ పెద్దల హస్తం ఉందనే విమర్శలు వస్తున్నాయి. ఇప్పటి వరకు ప్రధాన నిందితుడి ఆచూకీని పోలీసులు కనుక్కోలేకపోవడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సాక్షి , కర్నూలు: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పత్తికొండ నియోజకవర్గ ఇన్చార్జ్ చెరకులపాడు నారాయణ రెడ్డి హత్య కేసు విచారణలో పోలీసుల వైఖరి విమర్శలకు తావిస్తోంది. ఈ కేసులో అధికారపార్టీకి చెందిన డిప్యూటీ సీఎం తనయుడు కేఈ శ్యాంబాబును అరెస్టు చేయడంలో అధికారులు మీనమేషాలు లెక్కిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. మే 21వ తేదీన హత్య జరగగా.. ఇప్పటివరకు కేఈ శ్యాంబాబు కోణంలో విచారణ ముందుకు సాగలేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వంద రోజులు గడిచినప్పటికీ కనీసం ఆయన ఆచూకీ కనుక్కోలేకపోయారు. శ్యాంబాబు కోణంలో విచారణ కూడా జరపడం లేదని తెలుస్తోంది. అధికారపార్టీకి చెందిన నేత కుమారుడు కావడం, వచ్చే ఎన్నికల్లో అధికారపార్టీ నుంచి పోటీ చేయాలని భావిస్తున్న నేపథ్యంలో పోలీసులు..దర్యాప్తులో అడుగు ముందుకు వేయలేకపోతున్నారని సమాచారం. హత్య జరిగిన తర్వాత నాలుగైదు రోజుల్లోనే నిందితుల్లో అధికశాతం మందిని పట్టుకున్న పోలీసులు కేఈ శ్యాంబాబు విషయంలో మాత్రం తాత్సారం చేస్తున్నారు. మొత్తం మీద పోలీసుల వ్యవహారశైలిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. హడావుడి చేసి.. పత్తికొండ నియోజకవర్గంలో డిప్యూటీ సీఎం అండదండలతో సాగుతున్న అనేక అరాచకాలను చెరకులపాడు నారాయణ రెడ్డి బలంగా ఎదుర్కొన్నారు. ప్రధానంగా ఇసుక అక్రమ రవాణాపై హైకోర్టులో కేసులు వేయడం... దానిపై హైకోర్టు ఏకంగా విచారణకు ఆదేశించడం వారికి మింగుడుపడలేదు. ఇసుక అక్రమ రవాణా ద్వారా వచ్చే ఆదాయానికి గండిపడడంతో నారాయణరెడ్డిపై వారు కసి పెంచుకున్నారు. అంతేకాకుండా వచ్చే ఎన్నికల్లో నారాయణ రెడ్డిదే గెలుపు అనే భావన కూడా ప్రజల్లో బలపడిపంది. ఈ నేపథ్యంలోనే రాజకీయ కోణంలోనే హత్య జరిగిందని నారాయణ రెడ్డి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. దీనిపై ఏకంగా గవర్నర్‌కు కూడా ఫిర్యాదులు వెళ్లాయి. దీంతో హత్య అనంతరం పోలీసులు హడావుడి చేసి కిందిస్థాయి నేతలను అరెస్టు చేసి జైలుకు పంపారు. అయితే హత్యలో ప్రధాన పాత్ర పోషించాడని ఆరోపణలు ఎదుర్కొంటున్న కేఈ శ్యాంబాబు విషయంలో మాత్రం అడుగు ముందుకు వేయడం లేదనేది ఇప్పుడు వినిపిస్తున్న వాదన. పైగా ఆయన పాత్ర లేదనే రీతిలో కేసును ముగించాలనే ఒత్తిళ్లు కూడా వస్తున్నట్టు తెలుస్తోంది. మరోవైపు పోలీసులకు ఈ నియోజకవర్గంలో పనిచేయడమే కత్తిమీద సాముగా తయారైంది. అధికారపార్టీ నేతలకు తలొగ్గి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ అనేక మంది పోలీసులు ఇబ్బందులపాలైన సందర్భాలూ అనేకం ఉన్నాయి. ఆరోపణలు..సస్పెన్షన్లు.. డిప్యూటీ సీఎం సొంత నియోజకవర్గమైన పత్తికొండలో పనిచేస్తున్న పోలీసులపై చాలా ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో పలువురు సస్పెండ్‌కు కూడా గురయ్యారు. జిల్లాలో ఏ నియోజకవర్గంలో కూడా ఈ స్థాయిలో పోలీసులపై చర్యలు తీసుకున్న సందర్భాలు లేవు. వివిధ ఆరోపణలతో సీఐలు, ఎస్ఐలు వీఆర్‌కు పంపించారు. వెల్దుర్తి ఎస్ఐ మారుతీ శంకర్ సస్పెండై వీఆర్‌కు వెళ్లారు. వీఆర్‌కు వెళ్లిన ఇదే ఎస్ఐను జొన్నగిరి స్టేషన్‌కు పంపించారు. అక్కడ కూడా సివిల్ పంచాయితీలో తలదూర్చి వీఆర్‌కు వెళ్లారు. పత్తికొండ సీఐ తలారీ శ్రీనివాసులు కూడా వీఆర్‌కు వెళ్లారు. మరో పత్తికొండ సీఐ గంటా సుబ్బారావు కూడా వీఆర్‌కు పంపించారు. వెల్దుర్తి ఎస్ఐ తులసీ నాగప్రసాద్ కూడా ఆరోపణలతోనే వీఆర్‌కు వెళ్లారు. కర్నూలు జిల్లాలో ఏ నియోజకవర్గంలో లేని విధంగా పత్తికొండలోనే పోలీసులపై ఆరోపణలు వస్తున్నాయి. ఆరోపణలు వచ్చిన పోలీస్ అధికారులనే అధికారపార్టీ నేతలు నెత్తికెక్కించుకున్నారు. దీనిని గమనిస్తే వారు.. పోలీసులను ఏ విధంగా ఉపయోగించుకుంటున్నారనే విషయం అర్థమవుతోంది. ఇప్పటికైనా అధికారపార్టీ నేతల ఒత్తిళ్లకు లొంగకుండా పోలీసు ఉన్నతాధికారులు.. నారాయణ రెడ్డి హత్య కేసులో ముందడుగు వేయాలని ఆయన కుటుంబీకులు కోరుతున్నారు.