Done
-
హైదరాబాద్‌లో భారీ కేక్.. ఏకంగా 2254 కేజీలు (ఫొటోలు)
-
‘డోన్’టాక్..!
సాక్షి, నంద్యాల: అడకత్తెరలో పోకచెక్కలా తయారైంది నంద్యాల జిల్లా డోన్ అసెంబ్లీ నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జి ధర్మవరం సుబ్బారెడ్డి పరిస్థితి. ఆయనకే టికెట్ అంటూ గతంలో ప్రకటించిన పార్టీ అధిష్టానం ఇప్పుడు కనీస గౌరవం కూడా ఇవ్వడం లేదు. పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు, ఆయన తనయుడు నారా లోకేశ్‌ను కలిసేందుకు యత్నించినా అపాయింట్మెంట్ ఇవ్వడం లేదు. దీంతో సుబ్బారెడ్డి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇన్నాళ్లూ పార్టీ కోసం కష్టపడితే ఇలా నమ్మించి మోసం చేస్తారా.. అంటూ మండిపడుతున్నారు. ఫిబ్రవరి 1న శ్రీశైలం దేవస్థానానికి కుటుంబ సభ్యులతో సహా వచ్చిన నారా లోకేశ్ టికెట్ కోసం అయితే తనతో మాట్లాడొద్దని ముఖం మీద చెప్పేయడమే కాకుండా... ఫిబ్రవరి 3న డోన్ నుంచి కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి పోటీ చేస్తారని అనుకూల మీడియా నుంచి పార్టీ లీకులు ఇవ్వడంపై సుబ్బారెడ్డి తీవ్ర ఆగ్రహానికి గురైనట్లు సమాచారం. అదేరోజు ఉదయం విజయవాడకు వెళ్లిన ఆయన రెండురోజులుగా అక్కడే మకాం వేశారు. పార్టీ పెద్దలను అపాయింట్ కోరినా పట్టించుకోవట్లేదని సమాచారం. గతంలో చంద్రబాబు స్వయంగా టికెట్ ప్రకటించి ఇప్పుడు మోసం చేయడం ఏమిటని సుబ్బారెడ్డి ప్రశ్నిస్తున్నట్టు తెలుస్తోంది. రాత్రికి రాత్రే మారిన సీన్ ! ఫిబ్రవరి 3న సుబ్బారెడ్డి విజయవాడ వెళ్లగానే సీటు నీకేనంటూ పార్టీ నుంచి సమాచారం రావడంతో సుబ్బారెడ్డి అనుచరులు పట్టణంలో పెద్ద ఎత్తున బాణసంచా పేల్చారు. బైక్‌లతో హల్చల్ చేశారు. ఈ విషయాన్ని కోట్ల వర్గీయులు అధిష్టానం దృష్టికి తీసుకెళ్లడంతో సుబ్బారెడ్డిని తీవ్రంగా మందలించినట్లు సమాచారం. దీంతో ఆయనకు అపాయింట్మెంట్ కూడా ఇవ్వకుండా పొమ్మనకుండా పొగపెడుతున్నారని ఆ పార్టీ నాయకులే చెప్పుకోవడం గమనార్హం. వాడీవేడిగా విమర్శలు ! మూడు రోజులుగా సోషల్ మీడియా వేదికగా కోట్ల వర్గీయులు, సుబ్బారెడ్డి వర్గీయులు రెండు గ్రూపులుగా ఏర్పడి విమర్శలు, ప్రతి విమర్శలు చేసుకుంటున్నారు. మరోవైపు టికెట్‌పై స్పష్టమైన హామీ ఇచ్చిన తరువాతే నియోజకవర్గంలో అడుగు పెట్టాలని సుబ్బారెడ్డిపై అనుచరులు ఒత్తిడి తెస్తున్నారు. మొత్తానికి చంద్రబాబును నమ్మి సుబ్బారెడ్డి మోసపోయారని ఆ పార్టీ నేతలే వ్యాఖ్యానిస్తూ ఉండడం గమనార్హం. -
అనుమానాస్పద స్థితిలో వివాహిత మృతి
సాక్షి, డోన్ : మండల పరిధిలోని బొంతిరాళ్ల గ్రామానికి చెందిన ఓ వివాహిత పొలానికి వెళ్లే దారిలో అనుమానాస్పద స్థితిలో విగతజీవిగా పడివుంది. భర్త గుర్తించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. కాగా తలపై గాయాలు ఉండటంతో అల్లుడే తమ కూతురిని హత్య చేశాడని మృతురాలి తల్లి, బంధువులు ఆరోపించారు. ఘటన వివరాలు.. మండలంలోని ధర్మవరం గ్రామానికి చెందిన హరిజన నడిపి ఎల్లయ్య, మారెమ్మ కుమార్తెను లలిత అలియాస్ పెద్ద మద్దక్క(29)ను పదేళ్ల క్రితం బొంతిరాళ్ల గ్రామానికి చెందిన హరిజన మారెప్ప, మంగమ్మల కుమారుడు అర్జున్‌కు ఇచ్చి వివాహం జరిపించారు. వీరికి సూర్యకళ (8), రాకేష్ (6), అక్షర (4) సంతానం. కాన్పు సమయంలో లలితకు ఆరోగ్యం దెబ్బతిని వినికిడి సమస్య ఏర్పడింది. బుధవారం ఉదయం భార్య, భర్త పొలానికి వెళ్లారు. మధ్యాహ్నం 2 గంటల సమయంలో తన భార్య పొలం దారిలో మృతిచెంది ఉందని మృతదేహం తీసుకొని అర్జున్ ఇంటికి వచ్చాడు. కాగా తలపై రక్త గాయాలు ఉండటంతో మృతురాలి తల్లితో పాటు బంధువులు భర్తే హత్య చేశాడని ఆరోపించారు. గ్రామస్తులు కూడా మృతిపై అనుమానాలు వ్యక్తం చేశారు. రూరల్ సీఐ సుధాకర్ రెడ్డి, ఎస్ఐ మధుసూదన్‌రావ్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. భర్త అర్జున్‌తో పాటు అతని సోదరున్ని కూడా పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. లలితను భర్తే పథకం ప్రకారం హత్య చేశాడా? సరిపోని వ్యక్తులెవరైనా హతమార్చారా అనే కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
వైఎస్ఆర్ లేని లోటును జగన్‌బాబు తీరుస్తాడు
-
ఫ్యాన్ గుర్తుకు ఓటేసి గెలిపించాలని కోరుకుంటున్నా
-
జంట హత్య కేసు: కేఈ శ్యాంబాబు అరెస్ట్‌కు ఆదేశాలు
-
కేఈ శ్యాంబాబు అరెస్ట్‌కు ఆదేశాలు
కర్నూలు జిల్లా: జంట హత్య కేసులో కేఈ శ్యాంబాబు, ఎస్ఐ నాగ తులసీ ప్రసాద్‌లను అరెస్ట్ చేయాలంటూ డోన్ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. పత్తికొండ వైఎస్సార్సీపీ సమన్వయకర్త చెరుకులపాడు నారాయణ రెడ్డి, ఆయన డ్రైవర్ సాంబశివుడు హత్య కేసులో వీరిని నిందితులుగా చేర్చాలంటూ 2017లో నారాయణ రెడ్డి భార్య చెరుకులపాడు శ్రీదేవి డోన్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీంతో కేఈ శ్యాంబాబు, నాగ తులసీ ప్రసాద్‌లను అరెస్ట్ చేయాలంటూ అప్పట్లో కోర్టు ఆదేశాలు జారీచేసింది. అనంతరం కేఈ శ్యాంబాబు, నాగ తులసీ ప్రసాద్‌లు హైకోర్టును ఆశ్రయించి స్టే తెచ్చుకున్నారు. స్టే గడువు ముగియడంతో వారిని అరెస్ట్ చేయాలంటూ ఆదేశాలు జారీ చేసింది. -
కుక్కల దాడిలో 40 గొర్రెపిల్లల హతం
డోన్ టౌన్ : కృష్ణగిరి మండలం కర్లకుంట శివారులో ఆదివారం కుక్కలు దాడి చేయడంతో 40 గొర్రెపిల్లలు మృతి చెందాయి. బాధితుల వివరాల మేరకు..మండలంలోని వెంకటాపురం గ్రామానికి చెందిన గొల్ల శ్రీనివాసులు, వీరకుమార్ మేపు కోసం మందను కృష్ణగిరి మండలం కర్లకుంటకు తీసుకెళ్లారు. ఉదయం గొర్రెపిల్లలను కల్లం(ముళ్లకంప మధ్య)లో ఉంచి గొర్రెల మేపు కోసం బయటకు తీసుకెళ్లారు. ఇంతలో ఊరకుక్కలు కల్లంలో ఉన్న గొర్రె పిల్లలపై దాడి చేశాయి. ఘటనలో 40 గొర్రెపిల్లలు మృతి చెందాయి. మరో పదింటికి తీవ్రగాయాలయ్యాయి. కొద్దిసేపటి తర్వాత ఘటనా స్థలికి చేరుకున్న కాపరులు అక్కడ ఉన్న దృశ్యాన్ని చూసి కన్నీరుమున్నీరయ్యారు. దాదాపు రూ.1.6 లక్షల నష్టం వాటిల్లినట్లు బాధితులు వాపోయారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని వారు కోరారు. -
గర్భవతిని చేసి.. పెళ్లి పేరుతో దారుణం!
సాక్షి, డోన్ : ప్రేమపేరుతో ఒక యువతిని వంచించడమే కాక గర్భవతిని చేసి.. పెళ్లి చేసుకోమని అడిగిన పాపానికి ఓ కిరాతకుడు ఆమెను దారుణంగా హతమార్చాడు. కర్నూలు జిల్లా డోన్ మండలంలోని ఎర్రగుంట్ల గ్రామశివారులో ఈ దారుణం చోటుచేసుకుంది. ఆ వివరాలిలా ఉన్నాయి.. స్థానిక కొండపేటకు చెందిన లక్ష్మీదేవి, మల్లేష్‌ల కుమార్తె రమిజాబికి ఐదేళ్ల క్రితం పట్టణానికి చెందిన ఓ యువకునితో వివాహం జరిగింది. వీరికి సంతానం అఖిల్ కుమార్(4) ఉన్నాడు. రమిజాబితో ఏర్పడిన విబేదాల కారణంగా భర్త రెండేళ్ల క్రితం విడాకులు తీసుకోవడంతో రమిజాబి తన కుమారునితో పాటు తల్లివద్దనే ఉంటోంది. నమ్మించి హతమార్చాడు కుటుంబ పోషణ నిమిత్తం పాతబస్టాండ్‌లోని మెహతాజ్ వస్త్ర దుకాణంలో పనిచేస్తున్న కాలంలో రమిజాబికి షాపు యజమాని షేక్ మహమ్మద్ పహిల్మాన్ కుమారుడైన షేక్ రషీద్ అలియాజ్ సిద్దు (22) అనే యువకుడితో పరిచయం ఏర్పడింది. అది వివాహేతర సంబంధానికి దారితీసింది. ఈ క్రమంలో తనను పెళ్లిచేసుకునేందుకు నిరాకరిస్తున్నాడని రమిజాబి తన ప్రియుడు షేక్ రషీద్ (సిద్దు) పై పోలీసులకు పిర్యాదు కూడా చేసింది. కొందరు పెద్దలు జోక్యం చేసుకొని ఇరువురి మధ్య రాజీ కుదర్చడం ద్వారా స్టేషన్లో కేసు లేకుండా చేసుకున్నారు. ఆ తర్వాత షేక్ రసీద్ తన పద్దతి మార్చుకోకుండా రమిజాబితో తన సంబంధాన్ని కొనసాగించాడు. ఈ క్రమంలో రమిజాబి గర్భవతి కావడంతో పెళ్లిచేసుకోవాలంటూ మరోసారి ప్రియుడిపై ఒత్తిడి పెంచింది. ఆమెను హతమార్చేందుకు రషీద్ పథకం పన్నాడు. నంద్యాలలో ఇద్దరం కలిసి జీవించవచ్చని నమ్మబలికి రమిజాబిని గత నెల 20న కొండపేటలోని ఆమె ఇంటి నుంచి బస్సులో ఎర్రగుంట్ల గ్రామానికి తీసుకెళ్లాడు. సమీపంలోని అటవీ ప్రాంతానికి తీసుకెళ్లి గర్భవతి రమిజాబి గొంతును చున్నితో బిగించి హతమార్చాడు. అనంతరం మృతదేహాన్ని అక్కడే పూడ్చిపెట్టి తిరిగి పట్టణానికి చేరుకున్నాడు. తల్లి పిర్యాదుతో వెలుగులోకి... వారం రోజులైనా తన కూతురు నుంచి ఎలాంటి సమాచారం అందకపోవడంతో అనుమానించిన రమిజాబి తల్లి లక్ష్మిదేవి పోలీసులకు రషీద్ పై గత మంగళవారం పిర్యాదు చేసింది. స్థానిక పోలీసులు తనకు న్యాయం చేయడం లేదంటూ తన కూతురు ఆచూకి కోసం డోన్ పోలీసులకు ఆదేశాలివ్వాలని కూడా ఆమె జిల్లా ఎస్పీని కూడా ఇటీవల కోరింది. ఎస్పీ ఆదేశాల మేరకు రంగంలోకి దిగిన పోలీసులు నిందితుడు షేక్ రషీద్‌ను విచారించగా రమిజాబి హత్యకేసు మిస్టరీ వీడింది. రమిజాబి మృతితో ఆమె కుమారుడు చిన్నారి అఖిల్ అనాథగా మారాడు. సంఘటనా స్థలంలోనే పోస్టుమార్టం నిందితుని సహాయంతో రమిజాబి హత్య జరిగిన స్థలాన్ని ఆదివారం సీఐ శ్రీనివాసులు గౌడ్, ఎస్ఐ శ్రీనివాసులు సందర్శించి మృతదేహాన్ని వెలికితీశారు. తహశీల్దార్ మునిక్రిష్ణయ్య, ఆర్ఐ మధు కుమార్ల సమక్షంలో ప్రభుత్వాసుపత్రి వైధ్యులు డాక్టర్ సుంకన్న, బాలచంద్రారెడ్డి సహాయంతో శవపరిక్షలు నిర్వహించి మృతదేహాన్ని బందువులకు అప్పగించారు. నిందితుని పై కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నట్లు సీఐ శ్రీనివాసులు గౌడ్ తెలిపారు. గర్భవతిని చేసి.. పెళ్లి పేరుతో దారుణం -
పంజాబ్‌లో ప్రశాంతంగా పోలింగ్ పూర్తి
-
మాటలే.... చేతల్లేవ్....!
ఆది పుష్కరాల ముగింపులో రాజమహేంద్రవరంపై సీఎం వరాల జల్లు అంత్య పుష్కరాలు ముగుస్తున్నా అమలు ఊసేలేదు పుష్కరుడికి వీడ్కోలు పలికేందుకు నేడు సీఎం చంద్రబాబు రాక ఆశల చిగుళ్లతో బాబు ముందుకు నగర ప్రజలు సాక్షి, రాజమహేంద్రవరం : గతేడాది గోదావరి పుష్కరాల ముగింపు రోజున రాజమహేంద్రవరం అభివృద్ధిపై సీఎం చంద్రబాబు ఆర్భాటంగా ప్రకటించిన హామీలు ఏడాది తరువాత కూడా వెక్కిరిస్తున్నాయి. ప్రణాళిక దశలోనే ‘అఖండ గోదావరి’ రాజమహేంద్రవరాన్ని టూరిజం హబ్‌గా అభివృద్ధి చేస్తామని అఖండ గోదావరి ప్రాజెక్టును ప్రకటించగా ప్రస్తుతం అది ప్రతిపాదనల దశలోనే ఉంది. ఈ ప్రాజెక్టుకు ప్రత్యేక అధికారిని నియమిస్తూ రూ.100 కోట్లు ఇస్తున్నట్లు సీఎం ప్రకటించారు. ఆ పనులు ఎండమావులవుతున్నాయి. తాగునీరేదీ? 10వ డివిజన్ గాయత్రి నగర్లో రూ.40 కోట్ల అంచనాతో మంచినీటి ట్యాంకు, మెయిన్ పంపింగ్ వ్యవస్థ ఏర్పాటుకు నగర కన్వెన్షన్ సెంటర్‌తోపాటు శంకుస్థాపన చేశారు. ఆ పనులు ఊరిస్తూనే ఉన్నాయి. పేరు మారినా తీరు మారలేదు రాజమండ్రి పేరును రాజమహేంద్రవరంగా మార్చారు. మెగా సిటీగా, ఆధునిక నగరంగా తీర్చిదిద్దుతామని సీఎం ప్రకటించారు. ఏడాదైనా పేరు గొప్ప ఊరు దిబ్బలాగే నగరం తీరు మారింది. గట్టిగా వర్షం పడితే రోడ్లు గోదావరి కాలువలను తలపిస్తాయి. జనాభా పెరిగినా ఇప్పటికీ బ్రిటిషు కాలం నాటి డ్రైనేజీ వ్యవస్థే దిక్కు. మెయిన్ రోడ్డు, తాడితోట, శ్యామలా సెంటర్ ప్రాంతాల్లో ఇరుకు రోడ్లతో ట్రాఫిక్ సమస్యలు. శిలాఫలకంలోనే నగర కన్వెన్షన్ సెంటర్... నగర కన్వెన్షన్ సెంటర్ నిర్మాణానికి 2015 మే ఒకటో తేదీన రూ.40 కోట్ల అంచనా వ్యయంతో ఆర్ట్స్ కాలేజీ ప్రాంగణంలో శంకుస్థాపన చేశారు. సెంట్రల్ జైలు ఎదుట ఆరు ఎకరాల విస్తీర్ణంలో పర్యాటక శాఖ ఆధ్వర్యంలో దీన్ని నిర్మించడానికి నిర్ణయించారు. ఇందులో ఫుడ్ కోర్టులు, సమావేశ మందిరం, మల్టిప్లెక్స్ థియేటర్ నిర్మిస్తామన్నారు. ఈ ప్రతిపాదనలు ఇప్పటి వరకూ కార్యరూపం దాల్చలేదు. ఇదే ప్రాంతంలో ఫైవ్‌స్టార్ హోటల్ నిర్మిస్తామని హామీ ఇచ్చారు. ఇది కూడా హామీలకే పరిమితమైంది. కందుకూరికీ తప్పని హామీ మోసం సంఘ సంస్కర్త కందుకూరి వీరేశలింగం పంతులు నిర్మించిన పుర మందిరానికి పూర్వవైభవం తెస్తానని సీఎం ప్రజల సమక్షంలో హామీ ఇచ్చారు. పురమందిరం(టౌన్ హాలు)ను అభివృద్ధి చేసి పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దుతానని ఆ సందర్భంగా చెప్పారు. ఈ మాట చెప్పి ఏడాది కాలం గడుస్తున్నా నేటì కీ అతీ గతీ లేదు. పురమందిరం పూర్తిగా శిథిలమైంది. అలాగే కందుకూరి పేరుతో ఉన్న వీటీ కాలేజీని, గౌతమీ గ్రంథాలయం, దామోదర ఆర్ట్స్ గ్యాలరీని అభివృద్ధి చేస్తామని ప్రకటించి మరిచిపోయారు. గుర్తు చేయాల్సిన తెలుగు తమ్ముళ్లూ గజనీ వేషాలు వేస్తున్నారు. గోదావరి మహా పుష్కర వనానికి మోక్షమెప్పుడు? గోదావరి మహాపుష్కరాలు గుర్తుండేలా లాలా చెరువు సమీపంలో 240 ఎకరాల్లో మహాపుష్కర వనానికి 2015 జూలై 26న సీఎం చంద్రబాబు శంకుస్థాపన చేశారు. 30 రోజుల్లో దీన్ని అందుబాటులోకి తీసుకువస్తామని ప్రకటించారు. మహాపుష్కరాల పైలాన్‌కు కూడా ఆవిష్కరించారు. అంతకు మించి వనంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదు. ఈ వనంలోనే సైన్సు విద్యార్థులకు ఉపయోగపడేలా బొటానికల్ గార్డెన్, ‘రాశి’ వనం దశ తికగలేదు. -
రెండో విడత 136 ఎస్‌ఎంసీల ఎన్నిక
బాలాజీచెరువు (కాకినాడ) : మొదటి విడతలో వాయిదా పడిన స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ(ఎస్ఎంసీ)లకు సంబంధించి రెండో విడత నిర్వహించిన ఎన్నికల్లో జిల్లావ్యాప్తంగా 136 కమిటీలు ఎన్నికైనట్లు ఎన్నికల అధికారి ఇంటి వెంకట్రావు శనివారం తెలిపారు. రెండో విడతలో 30 కమిటీల ఎన్నికలు వివిధ కారణాలతో మరోసారి వాయిదా పడ్డాయని, ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు వీటిని నిర్వహిస్తామని పేర్కొన్నారు. -
గడువులోగా పూర్తి చేయాలి
నాగార్జునసాగర్ : గడువులోగా పుష్కర పనులు పూర్తి చేయాలని, లేనట్లయితే సదరు కాంట్రాక్టర్లను బ్లాక్‌లిస్టులో పెడతామని జెడ్పీ సీఈఓ మహేందర్‌రెడ్డి హెచ్చరించారు. గురువారం పెద్దవూర మండలంతో పాటు సాగర్‌లో నిర్మిస్తున్న పుష్కరఘాట్లను సందర్శించారు. సాగర్‌లో కాంట్రాక్టర్లు పనులు నిలిపివేసి అక్కడ లేకుండా పోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నెలాఖరు నాటికైనా పనులు పూర్తి కాకుంటే ఎలా? అని ప్రశ్నించారు. ఘాట్లతో పాటు తాగునీరు, విద్యుత్, శానిటరీ పనుల్లో వేగం పెంచి సకాలంలో పూర్తి చేయాలని ఎస్ఈకి సూచించారు. ఆయన వెంట ఈఈ విష్ణుప్రసాద్,ఏఈ వెంకటేశ్వర్లు, డీఈ విజయకుమార్, జేఈ జనార్దన్, తహశిల్దార్ పాండునాయక్ తదితరులు పాల్గొన్నారు. -
24 శాతం వరినాట్లు పూర్తి
lఆగస్టు 10 నాటితో నూరు శాతం నాట్లు అందుబాటులో 67 వేల మెట్రిక్ టన్నుల ఎరువులు వ్యవసాయశాఖ జేడీ ప్రసాద్ బిక్కవోలు : జిల్లాలో ఇప్పటి వరకు 24 శాతం ఖరీఫ్ వరినాట్లు పూర్తయ్యాయని జిల్లా వ్యవసాయ సంయుక్త సంచాలకుడు కేఎస్వీ ప్రసాద్ తెలిపారు. బిక్కవోలులో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈ ఖరీఫ్‌లో 2 లక్షల, 33 వేల హెక్టార్ల విస్తీర్ణంలో వరిసాగు లక్ష్యం కాగా, ఇప్పటి వరకు 54వేల,106 హెక్టార్లలో నాట్లు పూర్తయ్యాయన్నారు. ఇందులో 15 శాతం వెదజల్లు విధానంలో రైతులు వరిని సాగు చేస్తున్నారన్నారు. ఈ నెలాఖరుకు 90 శాతం, అగస్టు పదో తేదీలోగా వంద శాతం నాట్లు పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. అలాగే జిల్లాకు లక్షా,85 వేల మెట్రిక్ టన్నుల ఎరువులు అవసరమవుతాయని తెలిపారు. ప్రస్తుతం 67 వేల మెట్రిక్ టన్నుల ఎరువులు అందుబాటులో ఉన్నాయన్నారు. ఫసల్ బీమాతో రైతులకు లబ్ధి పంట రుణాలు తీసుకోని రైతులకు ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన వరం లాంటిదని జేడీ తెలిపారు. ఎకరానికి కేవలం రూ.640 ప్రీమియం చెల్లిస్తే పంటను నష్టపోయినపుడు రూ.32 వేల వరకు పరిహారాన్ని పొందవచ్చన్నారు. పంట నష్టం లెక్కింపునకు ఇప్పటి వరకూ మండలాన్ని యూనిట్‌గా తీసుకునేవారని ఈ పథకంలో మాత్రం గ్రామాన్ని యూనిట్‌గా తీసుకుంటారని వెల్లడించారు. జిల్లాలో లక్షా 32 వేల రుణఅర్హత కార్డుదారులు ఉన్నారని చెప్పారు. వారికి రూ.4250 కోట్ల పంట రుణంగా అందించవలసి ఉండగా ఇప్పటి వరకు రూ.850 కోట్లు ఇప్పించామన్నారు. పప్పుధాన్యాల దిగుబడి పెంచడంలో భాగంగా రైతులు పొలం గట్లపై చల్లుకోవడానికి కంది విత్తనాలను ప్రభుత్వం ఉచితంగా అందిస్తోందన్నారు. ఇందుకోసం 40 వేల హెక్టార్లలో సాగుకు సరిపడా కంది విత్తనాలను ఇప్పటికే మండల కేంద్రాలకు పంపించామని చెప్పారు. అలాగే సూక్ష్మ పోషకాలైన జింకు, బోరాన్, జిప్సంలను 50 శాతం సబ్సిడీపై రైతులకు అందిస్తున్నామని తెలిపారు. ఖరీఫ్ సీజన్లో రైతులు స్వర్ణేతర విత్తనాలను మాత్రమే సాగు చేయాలని జేడీ ప్రసాద్ సూచించారు. ఈ సీజన్లో వర్షాలు, గాలి దుమారాలకు స్వర్ణ రకం నేలకొరిగి రైతులు తీవ్రంగా నష్టపోతున్న దృష్ట్యా ప్రభుత్వం ఇతర రకాల వరి విత్తనాలకు సబ్సీడీ ఇచ్చి ప్రోత్సహిస్తోందన్నారు. -
'అన్ని వర్గాలనూ ఒకేలా చూసిన వైఎస్స్'
-
కాంగ్రెస్ హయాంలో ధరలన్నీ ఆకాశంలోనే: షర్మిల
-
కాంగ్రెస్ హయాంలో ధరలన్నీ ఆకాశంలోనే: షర్మిల
వైఎస్ పాలనలో ఒక్క రూపాయి కూడా చార్జీలు పెంచలేదని, అదే ఇప్పటి కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో అన్నింటి ధరలు పెరిగాయని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు షర్మిల ధ్వజమెత్తారు. కర్నూలు జిల్లా డోన్‌లో సమైక్య శంఖారావం సభలో ఆమె మాట్లాడారు. ఉదయం షర్మిల డోన్‌కు చేరుకోడానికి ముందునుంచే అశేష సంఖ్యలో ప్రజలు, అభిమానులు ఆమె రాక కోసం వేచి చూశారు. రాగానే ఆమెను అభివాదాలతో ముంచెత్తారు. జైజగన్, జై సమైక్యాంధ్ర నినాదాలు ఆ ప్రాంతమంతా మిన్నంటాయి. అనంతరం డోన్‌లో జరిగిన సభలో షర్మిల ప్రసంగించారు. వైఎస్ పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని, కేవలం కేంద్రంలో రాహుల్‌ను ప్రధానమంత్రిగా చేయాలన్న ఏకైక కారణంతోనే కాంగ్రెస్ ప్రభుత్వం విభజన చేస్తోందని ఆమె విమర్శించారు. ఓట్లు -సీట్లు కోసమే రాష్ట్రాన్ని కాంగ్రెస్ విభజిస్తోందని ఆమె అన్నారు. అసలు రాష్ట్ర విభజనకు కారణం టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబేనని షర్మిల మండిపడ్డారు. సమైక్యాంధ్రలో ఉద్యమం జరుగుతున్ననా చంద్రబాబులో చలనం లేదని, ఆయన విభజనకు అనుకూలంగా లేఖ ఇవ్వకుంటే విభజనకు కాంగ్రెస్ సాహసం చేసేది కాదని చెప్పారు. చంద్రబాబుకు ఏ మాత్రం నిజాయతీ ఉన్నా.. తన ఎంపీలు, ఎమ్మెల్యేలతో రాజీ నామా చేయించాలని డిమాండ్ చేశారు. ఏ మొహం పెట్టుకుని చంద్రబాబు సీమాంధ్రలో ఆత్మగౌరవ యాత్ర చేస్తున్నారని ప్రశ్నించారు. కాంగ్రెస్‌తో వైఎస్ఆర్సీపీ కుమ్మక్కయ్యి ఉంటే జగనన్న జైలులో ఉండేవారా అని ఆమె ప్రజలను అడిగారు. కాంగ్రెస్ పార్టీతో చంద్రబాబు కుమ్మక్కయ్యారో.. వైఎస్ఆర్ సీపీ కుమ్మక్కయిందో మీరే తేల్చాలని ప్రజలకు తెలిపారు.