
మాట్లాడుతున్న వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త కంగాటి శ్రీదేవి
పత్తికొండ రూరల్(కర్నూలు): అమలుకు నోచుకోని హామీలతో గద్దెనెక్కి, ప్రజాసంక్షేమాన్ని ఏమాత్రం పట్టించుకోని టీడీపీ ప్రభుత్వాన్ని సాగనంపుతామని వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ సమన్వయకర్త కంగాటి శ్రీదేవి సూచించారు. సోమవారం మండల పరిధిలోని చందోలి గ్రామంలో రచ్చబండ కార్యక్రమంలో భాగంగా గ్రామానికి చేరుకున్న శ్రీదేవికి నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పత్తికొండలో కొన్నేళ్లుగా ఎన్నికల హామీగానే మిగిలిపోయిన టమాట జ్యూస్ ఫ్యాక్టరీ.. జగనన్న సీఎం కాగానే తప్పకుండా నెరవేరుతుందన్నారు. ఎన్నికల్లో ఓటమి భయం పట్టుకున్న అధికార పార్టీ నాయకులు గ్రామాల్లో తిరుగుతూ మాయమాటలు చెబుతున్నారని విమర్శించారు.
చంద్రబాబు పాలనలో అన్ని వర్గాల ప్రజలు కష్టాలు ఎదుర్కొంటున్నారన్నారు. బాబు సీఎం కుర్చీ దిగిపోతేనే నిరుద్యోగులకు జాబు వస్తుందన్నారు. చెరువులు నింపే హామీ మాటల్లోనే ఉందికానీ చేతల్లో ఎక్కడా కనిపించడం లేదన్నారు. ప్రజాసంక్షేమం కోసం జగనన్న అలుపెరగని పాదయాత్ర సాగిస్తున్నారన్నారు. జగనన్న ప్రవేశపెట్టిన నవరత్నాలతో అన్నివర్గాలకు సంక్షేమ ఫలాలు అందుతాయన్నారు. కార్యక్రమంలో పార్టీ మండల కన్వీనర్ జూటూరు బజారప్ప, నాయకులు జయభరత్‌రెడ్డి, మధుసూదన్, చందోలి కష్ణారెడ్డి, రామకష్ణారెడ్డి, రామన్న, చంద్రన్న, రామిరెడ్డి, గాడెప్పగారి సుంకన్న, రామాంజిని, సుభాష్, రవిశేఖర్‌రెడ్డి, బాబు తదితరులు పాల్గొన్నారు
.
పూజల్లో పాల్గొన్న శ్రీదేవి..
మండల పరిధిలోని కోతిరాళ్ల గ్రామంలో సీతారామాంజనేయస్వామి విగ్రహ, ధ్వజ స్తంభ ప్రతిష్టలను గ్రామస్తులు సోమవారం ఘనంగా నిర్వహించారు. పూజల్లో వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ సమన్వయకర్త కంగాటి శ్రీదేవి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment