pattikonda ysrcp leader
-
మోసకారి ప్రభుత్వాన్ని సాగనంపుదాం
పత్తికొండ రూరల్(కర్నూలు): అమలుకు నోచుకోని హామీలతో గద్దెనెక్కి, ప్రజాసంక్షేమాన్ని ఏమాత్రం పట్టించుకోని టీడీపీ ప్రభుత్వాన్ని సాగనంపుతామని వైఎస్సార్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త కంగాటి శ్రీదేవి సూచించారు. సోమవారం మండల పరిధిలోని చందోలి గ్రామంలో రచ్చబండ కార్యక్రమంలో భాగంగా గ్రామానికి చేరుకున్న శ్రీదేవికి నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పత్తికొండలో కొన్నేళ్లుగా ఎన్నికల హామీగానే మిగిలిపోయిన టమాట జ్యూస్ ఫ్యాక్టరీ.. జగనన్న సీఎం కాగానే తప్పకుండా నెరవేరుతుందన్నారు. ఎన్నికల్లో ఓటమి భయం పట్టుకున్న అధికార పార్టీ నాయకులు గ్రామాల్లో తిరుగుతూ మాయమాటలు చెబుతున్నారని విమర్శించారు. చంద్రబాబు పాలనలో అన్ని వర్గాల ప్రజలు కష్టాలు ఎదుర్కొంటున్నారన్నారు. బాబు సీఎం కుర్చీ దిగిపోతేనే నిరుద్యోగులకు జాబు వస్తుందన్నారు. చెరువులు నింపే హామీ మాటల్లోనే ఉందికానీ చేతల్లో ఎక్కడా కనిపించడం లేదన్నారు. ప్రజాసంక్షేమం కోసం జగనన్న అలుపెరగని పాదయాత్ర సాగిస్తున్నారన్నారు. జగనన్న ప్రవేశపెట్టిన నవరత్నాలతో అన్నివర్గాలకు సంక్షేమ ఫలాలు అందుతాయన్నారు. కార్యక్రమంలో పార్టీ మండల కన్వీనర్ జూటూరు బజారప్ప, నాయకులు జయభరత్‌రెడ్డి, మధుసూదన్, చందోలి కష్ణారెడ్డి, రామకష్ణారెడ్డి, రామన్న, చంద్రన్న, రామిరెడ్డి, గాడెప్పగారి సుంకన్న, రామాంజిని, సుభాష్, రవిశేఖర్‌రెడ్డి, బాబు తదితరులు పాల్గొన్నారు . పూజల్లో పాల్గొన్న శ్రీదేవి.. మండల పరిధిలోని కోతిరాళ్ల గ్రామంలో సీతారామాంజనేయస్వామి విగ్రహ, ధ్వజ స్తంభ ప్రతిష్టలను గ్రామస్తులు సోమవారం ఘనంగా నిర్వహించారు. పూజల్లో వైఎస్సార్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త కంగాటి శ్రీదేవి పాల్గొన్నారు. -
మోసానికి బ్రాండ్ అంబాసిడర్ చంద్రబాబు
పత్తికొండ టౌన్ : ప్రత్యేక హోదా అంటే జైలుకే అన్న సీఎం చంద్రబాబు ఇపుడెందుకు యూటర్న్ తీసుకున్నాడో ప్రజలకు సమాధానం చెప్పాలని వైఎస్సార్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త కంగాటి శ్రీదేవి, జిల్లా కార్యదర్శి శ్రీరంగడు డిమాండ్ చేశారు. ఏపీకి ప్రత్యేక హోదా కోసం తమ పదవులకు రాజీనామా చేసి, ఢిల్లీలో ఆమరణ నిరాహార దీక్షలు చేస్తున్న వైఎస్సార్సీపీ ఎంపీలకు మద్దతుగా రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు పత్తికొండలో చేపట్టిన రిలే నిరాహార దీక్షలు ఆదివారంతో 9వ రోజు చేరుకున్నాయి. దీక్షలో వైఎస్సార్సీపీ నాయకులు హరీశ్‌రెడ్డి, ఇమ్రాన్, నజీర్, షేక్ లాలు, బొంబాయి శ్రీనివాసులు, కారుమంచప్ప, కోతికొండ చిరంజీవి, కోతికొండ లాలు, హుసేన్, మాణిక్యం, పరమేశ్ కూర్చున్నారు. టీడీపీకి పోరాడే నైతికహక్కు లేదు... వారు మాట్లాడుతూ ప్రత్యేక హోదా కోసం పోరాడిన విపక్ష నాయకులు, కార్యకర్తలపై కేసులు పెట్టి, జైళ్లలో పెట్టించిన సీఎం చంద్రబాబు, టీడీపీ నాయకులకు ఇపుడు హోదా కోసం పోరాడే నైతిక హక్కు లేదన్నారు. దేశంలోనే సీనియర్ రాజకీయ నాయకుడని గొప్పలు చెప్పుకునే సీఎం చంద్రబాబు, హోదా సాధించడంలో నీ సీనియారిటీ ఏమైందని ప్రశ్నించారు. మోసానికి బ్రాండ్ అంబాసిడర్ చంద్రబాబు అని, పూటపూటరూ రంగులు మార్చే ఊసరవెల్లిలా, ఏ అవసరాని ఆ మాట మాట్లాడుతూ పబ్బం గడుపుకుంటున్నారని ధ్వజమెత్తారు. ప్రత్యేక హోదా కోసం చిత్తశుద్ధితో పోరాడుతున్న నాయకుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. ఏపీకి ప్రత్యేకహోదా సాధించుకునే ఉద్యమంలో కడదాకా పోరాడదామని, ఇందులో ప్రజలందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. బంద్‌ను జయప్రదం చేయండి... ఏపీకి ప్రత్యేక హోదా సాధన కోసం సోమవారం చేపట్టనున్న రాష్ట్ర బంద్‌ను జయప్రదం చేయాలని కంగాటి శ్రీదేవి విజ్ఞప్తి చేశారు. వైఎస్సార్సీపీ, సీపీఐ, సీపీఎం, ఇతర విపక్షాలు, ప్రజాసంఘాలు, ఉద్యోగ, ఉపాధ్యా, కార్మిక, రైతు, మహిళా, యువ సంఘాలతో కలిసి బంద్‌లో పాల్గొంటున్నట్లు ఆమె తెలిపారు. ఈ బంద్‌కు అన్ని వర్గాలు సహకరించాలని కోరారు. కార్యక్రమంలో మండల కన్వీనర్ జూటూరు బజారప్ప, చక్రాళ్ల, శభాశ్పురం సర్పంచులు శ్రీరాములు, హనుమంతు, జిల్లా కమిటీ సభ్యుడు ఎర్రగుడి రామచంద్రారెడ్డి, నాయకులు కారం నాగరాజు, రవికుమార్ నాయుడు, బురుజుల భరత్‌రెడ్డి, దేవన్న, పెద్దహుల్తి నాగరాజు, తిప్పన్న, పోతుగల్లు వెంకటేశ్, మల్లికార్జునరెడ్డి, రంగానాయక్ తదితరులు పాల్గొన్నారు. -
నారాయణరెడ్డి చివరి క్షణాలు..
-
ఏడాది కాలంగా టార్గెట్!
-
నారాయణరెడ్డి చివరి క్షణాలు..
కర్నూలు: పత్తికొండ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి చెరుకులపాడు నారాయణ రెడ్డి హత్య ఆంధ్రప్రదేశ్‌లో తీవ్ర సంచలనం రేపింది. వెల్దుర్తిలో పెళ్లికి హాజరై తిరిగి వస్తున్న ఆయనను ప్రత్యర్థులు అత్యంత పాశవికంగా హత్య చేశారు. పథకం ప్రకారం ఆయనపై దాడి చేసి, హతమార్చారు. ఈ సంఘటన జరగడానికి గంట ముందు నారాయణరెడ్డి.. వెల్దుర్తిలోని లీమ్రా ఫంక్షన్ హాల్లో పెళ్లికి హాజరయ్యారు. వధూవరులను ఆశీర్వదించి వారితో ఫొటోలు దిగారు. తన మద్దతుదారులతో పిచ్చాపాటి మాట్లాడారు. అక్కడి నుంచి తిరిగివెళుతున్న ఆయనపై ప్రత్యర్థులు దాడికి పాల్పడ్డారు. కృష్ణగిరి వద్ద కాపుకాసి ఆయనను దారుణంగా చంపేశారు. కొద్దిసేపటి క్రితమే తమతో ఆనందంగా గడిపిన నారాయణరెడ్డి అంతలోనే హత్యకు గురయ్యారన్న విషయం తెలుసుకుని ఆయన మద్దతుదారుల హతాశులయ్యారు. తమ నాయకుడిని పొట్టనపెట్టుకున్న వారిని అరెస్ట్ చేసి చట్టప్రకారం శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. -
ఏడాది కాలంగా టార్గెట్!
కర్నూలు: పత్తికొండ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి చెరుకులపాడు నారాయణ రెడ్డిని ఏడాది కాలంగా ప్రత్యర్థులు టార్గెట్ చేసినట్టు తెలుస్తోంది. నారాయణరెడ్డికి వ్యతిరేకంగా చెరుకులపాడులో ప్రత్యర్థి వర్గాన్ని టీడీపీ చేరదీసింది. కొన్ని రోజులుగా వీరికి టీడీపీ కీలక నేత నిధులు అందజేస్తున్నట్టు ఆరోపణలున్నాయి. ఏడాది కాలంగా నారాయణరెడ్డి ప్రత్యర్థులు అరాచకాలు సాగిస్తున్నట్టు స్థానికులు చెబుతున్నారు. అధికారమే అండగా రెచ్చిపోయిన వీరు చెరుకులపాడులో చిన్నచిన్న ఫంక్షన్లకు లక్షల నిధులు ఖర్చు చేసినట్టు తెలుస్తోంది. ఈ వ్యవహారంపై పోలీసులు చూసీచూడనట్టు వ్యవహారించారన్న ఆరోపణలు విన్పిస్తున్నాయి. నారాయణ రెడ్డిని హత్య చేసిన నిందితులు 20, 30 ఏళ్ల మధ్యవారేనని తెలుస్తోంది. పథకం ప్రకారం ప్రత్యర్థులు ఆదివారం ఆయనను కిరాతకంగా హత్య చేశారు. ఆయన అనుచరుడు సాంబశివుడిని కూడా చంపేశారు.