రిలే నిరాహార దీక్షలో పాల్గొన్న నియోజకవర్గ సమన్వయకర్త కంగాటి శ్రీదేవి, జిల్లా కార్యదర్శి శ్రీరంగడు
పత్తికొండ టౌన్ : ప్రత్యేక హోదా అంటే జైలుకే అన్న సీఎం చంద్రబాబు ఇపుడెందుకు యూటర్న్ తీసుకున్నాడో ప్రజలకు సమాధానం చెప్పాలని వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ సమన్వయకర్త కంగాటి శ్రీదేవి, జిల్లా కార్యదర్శి శ్రీరంగడు డిమాండ్ చేశారు. ఏపీకి ప్రత్యేక హోదా కోసం తమ పదవులకు రాజీనామా చేసి, ఢిల్లీలో ఆమరణ నిరాహార దీక్షలు చేస్తున్న వైఎస్సార్‌సీపీ ఎంపీలకు మద్దతుగా రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు పత్తికొండలో చేపట్టిన రిలే నిరాహార దీక్షలు ఆదివారంతో 9వ రోజు చేరుకున్నాయి. దీక్షలో వైఎస్సార్‌సీపీ నాయకులు హరీశ్‌రెడ్డి, ఇమ్రాన్, నజీర్, షేక్ లాలు, బొంబాయి శ్రీనివాసులు, కారుమంచప్ప, కోతికొండ చిరంజీవి, కోతికొండ లాలు, హుసేన్, మాణిక్యం, పరమేశ్ కూర్చున్నారు.
టీడీపీకి పోరాడే నైతికహక్కు లేదు...
వారు మాట్లాడుతూ ప్రత్యేక హోదా కోసం పోరాడిన విపక్ష నాయకులు, కార్యకర్తలపై కేసులు పెట్టి, జైళ్లలో పెట్టించిన సీఎం చంద్రబాబు, టీడీపీ నాయకులకు ఇపుడు హోదా కోసం పోరాడే నైతిక హక్కు లేదన్నారు. దేశంలోనే సీనియర్ రాజకీయ నాయకుడని గొప్పలు చెప్పుకునే సీఎం చంద్రబాబు, హోదా సాధించడంలో నీ సీనియారిటీ ఏమైందని ప్రశ్నించారు. మోసానికి బ్రాండ్ అంబాసిడర్ చంద్రబాబు అని, పూటపూటరూ రంగులు మార్చే ఊసరవెల్లిలా, ఏ అవసరాని ఆ మాట మాట్లాడుతూ పబ్బం గడుపుకుంటున్నారని ధ్వజమెత్తారు. ప్రత్యేక హోదా కోసం చిత్తశుద్ధితో పోరాడుతున్న నాయకుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. ఏపీకి ప్రత్యేకహోదా సాధించుకునే ఉద్యమంలో కడదాకా పోరాడదామని, ఇందులో ప్రజలందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
బంద్‌ను జయప్రదం చేయండి...
ఏపీకి ప్రత్యేక హోదా సాధన కోసం సోమవారం చేపట్టనున్న రాష్ట్ర బంద్‌ను జయప్రదం చేయాలని కంగాటి శ్రీదేవి విజ్ఞప్తి చేశారు. వైఎస్సార్‌సీపీ, సీపీఐ, సీపీఎం, ఇతర విపక్షాలు, ప్రజాసంఘాలు, ఉద్యోగ, ఉపాధ్యా, కార్మిక, రైతు, మహిళా, యువ సంఘాలతో కలిసి బంద్‌లో పాల్గొంటున్నట్లు ఆమె తెలిపారు. ఈ బంద్‌కు అన్ని వర్గాలు సహకరించాలని కోరారు. కార్యక్రమంలో మండల కన్వీనర్ జూటూరు బజారప్ప, చక్రాళ్ల, శభాశ్‌పురం సర్పంచులు శ్రీరాములు, హనుమంతు, జిల్లా కమిటీ సభ్యుడు ఎర్రగుడి రామచంద్రారెడ్డి, నాయకులు కారం నాగరాజు, రవికుమార్ నాయుడు, బురుజుల భరత్‌రెడ్డి, దేవన్న, పెద్దహుల్తి నాగరాజు, తిప్పన్న, పోతుగల్లు వెంకటేశ్, మల్లికార్జునరెడ్డి, రంగానాయక్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment