రిలేదీక్షల్లో కూర్చున్న రాజీవ్‌గాంధీ నగర్ మహిళలు, వైఎస్సార్ సీపీ నాయకులు
మైదుకూరు టౌన్ : రాష్ట్రాభివృద్ధికి ప్రత్యేకహోదా సాధించడమే వైఎస్సార్ సీపీ అధినేత, ప్రతిపక్షనేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి లక్ష్యమని ఎమ్మెల్యే ఎస్ రఘురామిరెడ్డి పేర్కొన్నారు. పార్టీ పిలుపుమేరకు ప్రత్యేకహోదా సాధనకు స్థానిక కడప రోడ్డులోని బస్టాండ్ ఎదురుగా వైఎస్సార్ సీపీ రిలేదీక్షలు చేపట్టింది. ఆదివారం దీక్షలో రాజీవ్‌గాంధీ నగర్‌కు చెందిన మహిళలు, పార్టీ నాయకులు కూర్చున్నారు. ముందుగా వారు రాజీవ్‌గాంధీ నగర్ నుంచి ర్యాలీగా దీక్ష శిబిరం చేరుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రత్యేకహోదా విషయంలో టీడీపీ ప్రభుత్వం రోజుకో కొత్త నాటకం ఆడుతోందన్నారు. ఏదో పేరుకు బైక్‌ల ర్యాలీ, పార్లమెంట్‌లో దిండ్లు వేసుకుని పడుకుని నిరసన చేశారే తప్ప, ఉద్యమ స్ఫూర్తి టీడీపీ నాయకుల్లో లేదని ఆయన విమర్శించారు.
ప్రత్యేకహోదా ఉద్యమాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లేందుకు టీడీపీ ప్రభుత్వం ఏం చేసిందో చెప్పాలని ఎమ్మెల్యే ప్రశ్నించారు. తమ పార్టీ ఎంపీలు రాజీనామాలు చేసి ఆమరణ దీక్షలు చేపడితే, టీడీపీ ఎంపీలు ఏ ఉద్యమాలు చేయకుండా మీడియా ఎదుట కేంద్రంపై నాటకీయ విమర్శలు చేయడం ఎంతవరకు సబబని ఆయన ప్రశ్నించారు. రాష్ట్రానికి ప్రత్యేకహోదా తీసుకురావాలనే చిత్తశుద్ధి చంద్రబాబుకు ఉంటే తమ ఎంపీలచే రాజీనామాలు చేయించి, కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని సూచించారు. ప్రత్యేకహోదా కోసం పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు పోరాటం చేయాల్సి ఉందన్నారు. రిలే దీక్షల్లో రాజీవ్‌గాం«ధీ నగర్‌కు చెందిన సీవీ చలమయ్య, లక్ష్మిదేవి, ఆదిలక్షుమ్మ, చొక్కం శివ, పాములేటి, రఘురామయ్య, ఇర్షాద్, కొండపేట షరీఫ్, రాంశివ, బాలయ్య యాదవ్, బండి తిరుమలయ్య, చింతకుంట వీరారెడ్డి, గోశెట్టి లక్షుమయ్య, మాజీ ఎంపీటీసీ దండు రామయ్య, అధిక సంఖ్యలో కార్యకర్తలు కూర్చున్నారు. వీరికి సీపీఐ నియోజకవర్గ కార్యదర్శి పీ శ్రీరాములు, సుబ్బరాయుడు, కొండపేట షరీఫ్ తదితరులు మద్దతిచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment