– రాజకీయాలకు అడ్డుతొలిగించుకుంటున్న నాయకులు
పత్తికొండ : ఆదిపత్య రాజకీయాలకు నిలయమైన పత్తికొండ నియోజకవర్గంలో 35 ఏళ్ల పాటు ఇరువురు వర్గ నాయకుల మధ్య రసవత్తరమైన రాజకీయ అధిపత్యపోరుసాగింది. ఈ పోటా పోటిలో కొందరు నాయకులు వేట కొడవళ్లకు పదునుబెట్టారు. మరి కొందరు బాంబులు పేల్చారు. ఇంకొందరు ఆస్తులు, నివాసగృహలకు నిప్పు పెట్టారు. హత్య రాజకీయ పోరులో నాయకులతో పాటు ప్రజలు, ఉద్యోగులు ప్రాణాలు వదిలారు. అలు పెరగని రాజకీయ వర్గ పోరులో వందల సంఖ్యలో అమాయకులతో పాటు ముగ్గురు ఎమ్మెల్యేలు, మాజీ సోసైటి ప్రసిడెంటు, మాజీ జడ్‌పీటీసీ సభ్యుడు, వైఎస్‌ఆర్‌సీపీ పత్తికొండ నియోజకవర్గ ఇన్‌చార్జీ ప్రాణాలను కోల్పోయారు. పత్తికొండ నియోజకవర్గంలో 77 గ్రామాల్లో రాజకీయ పోరు సాగుతుంది.
రాజకీయాల్లో దూసుకొని పోతున్న చెరుకులపాడు:
2014 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి బరిలో నిలిచిన నారాయణరెడ్డి ఓటమి చవిచూసిన 31 వేల ఓట్లను సాదించి రాష్ట్రంలోనే రెండవ స్థానంలో నిలిచారు. 2014లో కాంగ్రెస్ పార్టీకి గుడ్‌బై చెప్పి, సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు, కార్యకర్తలు, నాయకులతో నారాయణరెడ్డి వైఎస్‌ఆర్‌సీపీలోకి చేరారు.
నియోజకవర్గంలోని క్రిష్ణగిరి, వెల్దుర్తి మండలాల్లో వైఎస్‌ఆర్‌సీపీ నియోజకవర్గ ఇన్‌చార్జీ చెరుకులపాడు నారాయణరెడ్డి రాజకీయలో దూసుకొని పోవడంతో ప్రత్యర్ధులకు మింగుడు పడటంలేదు. రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు గ్రామాల్లో గడపగడపకు వైఎస్‌ఆర్ పొగ్రామ్‌కు శ్రీకారం చుట్టిన నారాయణరెడ్డి ప్రభుత్వ వైఫల్యాలపై ద్వజమెత్తారు. దీంతో టీడీపీ నాయకులు, కార్యకర్తలు వైఎస్‌ఆర్‌సీపీలోకి చేరడం మొదలైయింది. క్రిష్ణగిరి, వెల్ధుర్తి మండలాల్లో టీడీపీ బీటలు పడటంతో ప్రత్యర్థులు జీర్ణించుకోలేకపోతున్నారు.
కొనసాగిన రాజకీయ హత్యలు:
– 1978లో రెండోసారి పత్తికొండలో ఎమ్మెల్యే స్థానానికి నామినేషన్ వేసి తిరిగి వెలుతున్న ఎర్రగుడి ఈశ్వరరెడ్డిపై ప్రత్యర్థులు హత్యయత్నం చేసినా ప్రాణాలతో బయట పడ్డారు. 1979 ఆగస్టు 4వతేదీన ఆదోనికి వెలుతున్న సమయంలో తుగ్గలి మండలంలోని గవనికొండ వద్ద బస్సులో నుంచి ఈశ్వరరెడ్డిని లాగి ప్రత్యర్థులు అతిధారుణంగా హత్య చేశారు.
– 1985 మార్చి11 వతేదీన టీడీపీ ఎమ్మెల్యేగా విజయం సాదించిన మహాబలేశ్వర గుప్తను 1985 ఏప్రిల్ 27 వతేదీన పట్టపగలు పత్తికొండ పట్టణంలోని శ్రీకన్యకా పరమేశ్వరి కళ్యాణ మండపం వద్ద రాజకీయ ప్రత్యర్థులు బాంబులు పేల్చి వేట కొడవళ్లతో దారణంగా హత్య చేశారు.
–ఎమ్మెల్యేగా రెండుసార్లు బరిలో నిలిచి ఓటమి పాలైన రామకృష్ణరెడ్డి 1985 జూన్11 వతేదీన కర్నూలు పట్టణంలో రాజకీయ ప్రత్యర్థుల చేతిలో దారణంగా హత్యకు గురయ్యారు.
– 1989లో పత్తికొండ ఎమ్మెల్యేగా పాటిల్ శేషిరెడ్డి విజయం సాదించారు. పార్లమెంటు ఎన్నికల ప్రచారంలో ఉన్న శేషిరెడ్డిని 1996 ఏప్రిల్ 18వతేదీన గోనేగండ్లలో ప్రత్యర్థులు వెంటాడి వేటాడి హత్య చేశారు. రాజకీయ అదిపత్య పోరులో వర్గనేతలే కాదు మాజీ ఎమ్మెల్యేలు కూడా ప్రాణాలు కోల్పోయ్యారు.
– పెండేకల్లు గ్రామంలో రాజకీయ పోరుతో 1990 ఏప్రిల్ 3న కాంగ్రెస్ పార్టీకి చెందిన నల్లారెడ్డి నివాస గృహంపై ప్రత్యర్తులు ప్లాన్ ప్రకారంగా కిరోసిన్ పోసి నిప్పు పెట్టడంతో భార్యభర్తలు మృతి చెందారు.
– చక్రాళ్ల గ్రామం నుంచి 1998 డిశంబరు 28న పత్తికొండకు బస్సులో వస్తున్న కాంగ్రెస్ పార్టీకి చెందిన నలుగురు కార్యకర్తలను ప్రత్యర్థులు హత్య చేశారు.
– కడమకుంట్ల గ్రామంలో 1998లో సీపీఐ నాయకుడు కాంతరెడ్డి, విశ్వనాథ్‌శర్మను రాజకీయ ప్రత్యుర్థులు వెంటాడి వేటాడి హత్య చేశారు. హత్య చేసిన ప్రత్యర్థిని 2011నవంబరు 28న కాంగ్రెస్ నాయకుడు అనిమిరెడ్డిని రైల్యేబ్రిడ్జి కింద హత మార్చారు.
– 2008 మే17న మాజీ జెడ్‌పీటీసీ సభ్యుడు కప్పటాళ్ల వెంకటనాయుడు తన స్వాగ్రామం నుంచి కర్నూలు వెళ్లుతున్న మార్గమధ్యంలో ప్రత్యర్థుల చేతిలో వెంకటప్పనాయుడుతో పాటు10 మంది హతమయ్యారు. వీరిలో ఇద్దరు సోసైటీ ఉద్యోగులు, గ్రామస్తులు ప్రాణాలు వదిలారు.
–వైఎస్‌ఆర్‌సీపీ పత్తికొండ నియోజకవర్గ ఇన్‌చార్జీ చెరుకులపాడు నారాయణరెడ్డిపై 2017 మే 21న (ఆదివారం) క్రిష్ణగిరి, చెరుకులపాడు మార్గమద్యలో ప్రత్యర్థులు కాపుకాసి వేటకొడవళ్లతో నరికి, రాళ్లతో కొట్టి అతికీరాతకంగా హత్య చేశారు.