వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ పత్తికొండ ఇన్‌ఛార్జ్ చెరుకులపాడు నారాయణరెడ్డి హత్య కేసులో ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి కుటుంబానికి షాక్ తగిలింది. ఈ కేసులో డిప్యూటీ సీఎం కుమారుడు శ్యామ్ బాబుతో సహా మరో ఇద్దరిని నిందితులుగా చేర్చి, అరెస్ట్ చేయాలని డోన్ న్యాయస్థానం సంచలన తీర్పునిచ్చింది. కాగా తన భర్త హత్య కేసు విచారణలో అన్యాయం జరిగిందంటూ చెరుకులపాడు నారాయణరెడ్డి భార్య కంగాటి శ్రీదేవి న్యాయస్థానాన్ని ఆశ్రయించిన విషయం తెలిసిందే. (చెరుకులపాడు నారాయణరెడ్డి గత ఏడాది మే 22న దారుణ హత్యకు గురైన విషయం విదితమే)