ప్రాణాలకు ముప్పుందని ఆయన ముందే చెప్పినా..! | Gowru Charita Reddy and Venkata Reddy reacts on narayana reddy murder | Sakshi
Sakshi News home page

ప్రాణాలకు ముప్పుందని ముందే చెప్పినా..!

Published Sun, May 21 2017 1:16 PM | Last Updated on Tue, Oct 30 2018 4:29 PM

ప్రాణాలకు ముప్పుందని ఆయన ముందే చెప్పినా..! - Sakshi

ప్రాణాలకు ముప్పుందని ఆయన ముందే చెప్పినా..!

కర్నూలు: వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నేత, పత్తికొండ ఇంచార్జ్‌ చెరుకులపాడు నారాయణరెడ్డి దారుణహత్యకు గురవడంపై గౌరు వెంకటరెడ్డి, ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డిలు తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఫ్యాక్షన్‌హత్యపై గౌరు చరితా రెడ్డి మాట్లాడుతూ.. 'నేను నంద్యాలలో వేరే పెళ్లిలో ఉన్నాను. నారాయణరెడ్డి హత్య విషయం వినగానే దిగ్భ్రాతి చెందాను. దివంగత నేత వైఎస్ఆర్ సీఎంగా ఉన్నప్పుడు ఫ్యాక్షన్ హత్యలు పూర్తిగా ఆగిపోయాయి. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని మళ్లీ ప్రోత్సహిస్తున్నారు. తన ప్రాణాలకు ముప్పు ఉందని నారాయణరెడ్డి ఎన్నోసార్లు బహిరంగంగానే చెప్పారు. కానీ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం వల్లే ఈ దారుణం చోటుచేసుకుంది. గతంలో పరిస్థితులు మళ్లీ తలెత్తడంతో వైఎస్ఆర్‌సీపీ నేతలను ఆందోళనకు గురిచేస్తుంది' అన్నారు.

వైఎస్ఆర్‌సీపీ నేత గౌరు వెంకటరెడ్డి మట్లాడుతూ.. 'మొన్న ఆళ్లగడ్డలో మా పార్టీ కార్యకర్తలను చంపేశారు. ఇప్పుడు ఏకంగా పార్టీ కీలక నేతలను హత్యచేస్తున్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఫ్యాక్షన్ హత్యలు పెరుగుతున్నాయి. టీడీపీ సర్కార్ పోలీసులను వారి కనుసన్నల్లో పెట్టుకుంటుంటే.. పోలీసులు ఏ విధంగానూ ప్రతిపక్ష పార్టీ నేతలు, కార్యకర్తలకు, ప్రజలకు న్యాయం చేయలేకపోతున్నారు. వారి ప్రాణాలకు రక్షణ కల్పించలేకపోతున్నారు. అందుకు ఈ దారుణ ఘటనే నిదర్శనమని చెప్పవచ్చు. పశ్చిమగోదావరి జిల్లాలో టీడీపీ ఎమ్మెల్యే ఆరమిల్లి రాధాకృష్ణ తన ఇంటికి పిలిపించి మరీ ఇరగవరం ఎస్ఐ, రైటర్‌లను నిర్బంధించారని గుర్తుచేశారు. అధికార పార్టీ నేతలే తమ ఇష్టరీతిన నడుచుకుంటే పోలీసుశాఖ మాత్రం ఏం చేస్తుందన్నారు. పార్టీతో సంబంధంలేకుండా వ్యక్తిని గౌరవించే నేత ఆయన. పార్టీని ఎన్నో రకాలుగా అభివృద్ధి చేసిన  వ్యక్తిని ప్రత్యర్థులు హత్య చేయడం దురదృష్టకరమని' వ్యాఖ్యానించారు.

బాంబులు, కత్తులతో ప్రత్యర్థులు చేసిన దాడిలో పత్తికొండ ఇంచార్జ్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్న చెరుకులపాడు నారాయణ రెడ్డితో పాటు ఆయన అనుచరుడు సాంబశివుడు దారుణహత్యకు గురైన విషయం తెలిసిందే. పెళ్లికి వెళ్లి తిరిగొస్తుండగా కృష్ణగిరి మండలం రామకృష్ణాపురం వద్ద ఈ దారుణం చోటు చేసుకుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement