మాట్లాడుతున్న పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి, చిత్రంలో వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌరు వెంకటరెడ్డి తదితరులు
కర్నూలు, నందికొట్కూరు: వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి చేసుకోవడమే తమ లక్ష్యమని ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌరు వెంకటరెడ్డి , పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి అన్నారు. ఊపిరి ఉన్నంత వరకు వైఎస్సార్ కుటుంబం వెంటే ఉంటామని స్పష్టం చేశారు. బ్రాహ్మణకొట్కూరు గ్రామంలోని స్వగృహంలో సోమవారం ఆత్మీయ సమావేశం నిర్వహించారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భారీగా హాజరయ్యారు. ఈ సందర్భంగా గౌరు వెంకటరెడ్డి మాట్లాడుతూ..కొందరు పనికట్టుకుని తమపై దుష్ప్రచారం చేస్తున్నారన్నారు.
అలగనూర్ రిజర్వాయర్ పనుల్లో ఎలాంటి పర్సెంటేజీలు తీసుకోలేదన్నారు. వైఎస్సార్ ఆశీస్సులతో నందికొట్కూరు నియోజకవర్గానికి ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకాన్ని మంజూరు చేయించామన్నారు. పథకం పూర్తయ్యే వరకు అనంతపురం జిల్లాకు చుక్క నీరు తీసుకెళ్లకుండా కేసీ కెనాల్‌కే తాగు, సాగు నీరు ఇచ్చే జీఓను కూడా విడుదల చేయించామన్నారు. ఎత్తిపోతల పథకాల నిర్మాణ కాంట్రాక్టులు ఎస్పీవై రెడ్డి తీసుకుని, జాప్యం చేశారన్నారు. టీడీపీ పాలనలో అర్హులకు సంక్షేమ పథకాలు అందడం లేదన్నారు. వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వస్తే పార్టీలకు అతీతంగా పథకాలు అమలవుతాయన్నారు.
రాజకీయ భిక్ష పెట్టింది నందికొట్కూరునియోజకవర్గ ప్రజలే..
నందికొట్కూరు నియోజకవర్గ ప్రజలు ఆడపడచులాగ ఆదరించి తనకు రాజకీయ భిక్ష పెట్టారని పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి అన్నారు. నియోజకవర్గ ప్రజలను ఎన్నటికీ మరవలేనన్నారు. అనివార్య కారణాలతో నియోజకవర్గానికి దూరంగా ఉండాల్సి వచ్చిందని పేర్కొన్నారు. నందికొట్కూరు నియోజకవర్గంలో ఫ్యాక్షన్‌ను రూపుమాపిన చరిత్ర గౌరు కుటుంబానికే దక్కిందన్నారు. నెహ్రూనగర్ వద్ద పుట్టి ప్రమాదంలో మృతి చెందిన కుటుంబాలకు భూములు ఇవ్వడంతోపాటు సంక్షేమ పథకాలు వైఎస్సార్ మంజూరు చేశారని గుర్తు చేశారు. టీడీపీ పాలనలో వర్షాలు కురవక, కేసీ కెనాల్‌కు నీరు రాక కరువుతో అన్నదాతలు అల్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
జగనన్న సీఎం అయితే గుండ్రేవుల ప్రాజెక్టు పూర్తయి జిల్లా సస్యశ్యామలం అవుతుందన్నారు. మండలంలోని కోనేటమ్మపల్లికి చెందిన టీడీపీ నాయకులు రామిరెడ్డి, దామోదర్‌రెడ్డి ఆధ్వర్యంలో 100 యువకులు వైఎస్సార్‌సీపీలో చేరారు. ఆత్మీయ సమావేశంలో బ్రాహ్మణకొట్కూరు సహకార సొసైటీ అధ్యక్షుడు జయరామిరెడ్డి, మాజీ మార్కెట్ యార్డు చైర్మన్ కస్వ శంకరరెడ్డి, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు మురళీధర్‌రెడ్డి, పార్టీ నాయకులు శివానందరెడ్డి, జనార్దన్‌రెడ్డి, గోవింద్‌గౌడు, రమణమ్మ, రాములమ్మ, రామిరెడ్డి, సురేష్, జంగాల పెద్దన్న, గోవర్దన్‌రెడ్డి, ప్రకాశం, నారాయణరెడ్డి, రాఘవరెడ్డి, ఎంపీటీసీ మాజీ సభ్యులు వెంకటేశ్వర్లు, పధ్మనాభరెడ్డి, సలాంఖాన్, నాగలక్ష్మిరెడ్డి, సుధాకర్, రామోహన్‌రెడ్డి, మండ్లెం రఘురెడ్డి, ఎర్రమఠం రామిరెడ్డి, ప్రవీణ్‌కుమార్‌రెడ్డి, అశోక్‌రెడ్డి, వెంకటెడ్డి, జయరామిరెడ్డి, రఘునాథరెడ్డి, గోపాల్, శివ, రఫి, శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment