gowru charitha reddy
-
టీడీపీ అభ్యర్థి గౌరు చరిత నోట జై జగన్!
సాక్షి, హైదరాబాద్ : కర్నూలు జిల్లా పాణ్యం అసెంబ్లీ నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి గౌరు చరితారెడ్డి నోట జై జగన్ అనే మాట రావడంతో తెలుగు తమ్ముళ్లు అవాక్కయ్యారు. ప్రచారంలో భాగంగా ఓ గ్రామానికి వెళ్లిన ఆమె.. తనకు ఓటేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఇక తన ప్రసంగాన్ని ముగిస్తూ జై జగన్ అంటూ నాలుక్కరుచుకున్నారు. దీంతో అక్కడున్నవారంతా షాక్‌కు గురయ్యారు. వెంటనే ఆమె జై చంద్రబాబు అంటూ తన తప్పిదాన్ని సవరించుకునే ప్రయత్నం చేశారు. ఇక ‘మేడం మీరే జై జగన్ అంటున్నారు ఏందీ..’ అంటూ అక్కడి కార్యకర్తలు ఆమెను ప్రశ్నించారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట హల్చల్ చేస్తోంది. ఈ వీడియో నెటిజన్లు తమకు తోచిన కామెంట్స్ చేస్తున్నారు. మేడమ్ మీరు పార్టీ మారారు.. మర్చిపోయారా? అని ఒకరు.. పార్టీ మారినా మనసంతా వైఎస్సార్‌సీపీపైనే అని మరొకరు సెటైర్లు వేస్తున్నారు. వైఎస్ జగన్ గెలుపు కాయమని టీడీపీ అభ్యర్థులు ఫిక్సయ్యారని, అందుకే వారి నోట జననేత పేరు వస్తుందని అభిప్రాయపడుతున్నారు. సరిగ్గా ఎన్నికల ముందే గౌరుచరితా రెడ్డి పార్టీ మారిన విషయం తెలిసిందే. 2014లో జరిగిన ఎన్నికల్లో పాణ్యం వైసీపీ అభ్యర్థిగా గౌరు చరిత పోటీ చేసి గెలుపొందారు. -
మేడం మీరే జై జగన్ అంటున్నారు ఏందీ..
-
‘పసుపు కుంకుమ’తో మరో మోసం
-
‘పసుపు కుంకుమ’తో మరో మోసం
సాక్షి, కర్నూలు : ఎన్నికలు సమీపిస్తున్న వేళ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మహిళపై కపట ప్రేమ చూసిస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే చరితారెడ్డి విమర్శించారు. శనివారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. గత ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు మహిళలకు అనేక హామీలు ఇచ్చి మోసం చేశారని, మళ్లీ ఇప్పుడు ‘పసుపు - కుంకుమ’ పథకం పేరుతో మరో సారి మోసం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. మూడు విడతలుగా రుణాలు మాఫీ చేస్తామని చెప్పిన చంద్రబాబు ఇంత వరకూ ఒక్క రూపాయి కూడా మాఫీ చేయలేదన్నారు. తన ఓటు బ్యాంకు కోసం గత నాలుగున్నరేళ్లుగా నెరవేర్చని హామీలను ఇప్పుడు చేస్తామంటూ.. చంద్రబాబు కపట ప్రేమను చూపిస్తున్నారని మండిపడ్డారు. ఎన్నికలు దగ్గర పడడడంతో మళ్లీ చంద్రబాబు మాయమాటలు చెబుతున్నారని విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబుకు మహిళలందరూ గట్టిగా బుద్ది చెప్పాలని కోరారు. -
జగనన్నను సీఎం చేయడమే లక్ష్యం
కర్నూలు, నందికొట్కూరు: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి చేసుకోవడమే తమ లక్ష్యమని ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌరు వెంకటరెడ్డి , పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి అన్నారు. ఊపిరి ఉన్నంత వరకు వైఎస్సార్ కుటుంబం వెంటే ఉంటామని స్పష్టం చేశారు. బ్రాహ్మణకొట్కూరు గ్రామంలోని స్వగృహంలో సోమవారం ఆత్మీయ సమావేశం నిర్వహించారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భారీగా హాజరయ్యారు. ఈ సందర్భంగా గౌరు వెంకటరెడ్డి మాట్లాడుతూ..కొందరు పనికట్టుకుని తమపై దుష్ప్రచారం చేస్తున్నారన్నారు. అలగనూర్ రిజర్వాయర్ పనుల్లో ఎలాంటి పర్సెంటేజీలు తీసుకోలేదన్నారు. వైఎస్సార్ ఆశీస్సులతో నందికొట్కూరు నియోజకవర్గానికి ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకాన్ని మంజూరు చేయించామన్నారు. పథకం పూర్తయ్యే వరకు అనంతపురం జిల్లాకు చుక్క నీరు తీసుకెళ్లకుండా కేసీ కెనాల్‌కే తాగు, సాగు నీరు ఇచ్చే జీఓను కూడా విడుదల చేయించామన్నారు. ఎత్తిపోతల పథకాల నిర్మాణ కాంట్రాక్టులు ఎస్పీవై రెడ్డి తీసుకుని, జాప్యం చేశారన్నారు. టీడీపీ పాలనలో అర్హులకు సంక్షేమ పథకాలు అందడం లేదన్నారు. వైఎస్సార్సీపీ అధికారంలోకి వస్తే పార్టీలకు అతీతంగా పథకాలు అమలవుతాయన్నారు. రాజకీయ భిక్ష పెట్టింది నందికొట్కూరునియోజకవర్గ ప్రజలే.. నందికొట్కూరు నియోజకవర్గ ప్రజలు ఆడపడచులాగ ఆదరించి తనకు రాజకీయ భిక్ష పెట్టారని పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి అన్నారు. నియోజకవర్గ ప్రజలను ఎన్నటికీ మరవలేనన్నారు. అనివార్య కారణాలతో నియోజకవర్గానికి దూరంగా ఉండాల్సి వచ్చిందని పేర్కొన్నారు. నందికొట్కూరు నియోజకవర్గంలో ఫ్యాక్షన్‌ను రూపుమాపిన చరిత్ర గౌరు కుటుంబానికే దక్కిందన్నారు. నెహ్రూనగర్ వద్ద పుట్టి ప్రమాదంలో మృతి చెందిన కుటుంబాలకు భూములు ఇవ్వడంతోపాటు సంక్షేమ పథకాలు వైఎస్సార్ మంజూరు చేశారని గుర్తు చేశారు. టీడీపీ పాలనలో వర్షాలు కురవక, కేసీ కెనాల్‌కు నీరు రాక కరువుతో అన్నదాతలు అల్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. జగనన్న సీఎం అయితే గుండ్రేవుల ప్రాజెక్టు పూర్తయి జిల్లా సస్యశ్యామలం అవుతుందన్నారు. మండలంలోని కోనేటమ్మపల్లికి చెందిన టీడీపీ నాయకులు రామిరెడ్డి, దామోదర్‌రెడ్డి ఆధ్వర్యంలో 100 యువకులు వైఎస్సార్సీపీలో చేరారు. ఆత్మీయ సమావేశంలో బ్రాహ్మణకొట్కూరు సహకార సొసైటీ అధ్యక్షుడు జయరామిరెడ్డి, మాజీ మార్కెట్ యార్డు చైర్మన్ కస్వ శంకరరెడ్డి, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు మురళీధర్‌రెడ్డి, పార్టీ నాయకులు శివానందరెడ్డి, జనార్దన్‌రెడ్డి, గోవింద్గౌడు, రమణమ్మ, రాములమ్మ, రామిరెడ్డి, సురేష్, జంగాల పెద్దన్న, గోవర్దన్‌రెడ్డి, ప్రకాశం, నారాయణరెడ్డి, రాఘవరెడ్డి, ఎంపీటీసీ మాజీ సభ్యులు వెంకటేశ్వర్లు, పధ్మనాభరెడ్డి, సలాంఖాన్, నాగలక్ష్మిరెడ్డి, సుధాకర్, రామోహన్‌రెడ్డి, మండ్లెం రఘురెడ్డి, ఎర్రమఠం రామిరెడ్డి, ప్రవీణ్‌కుమార్‌రెడ్డి, అశోక్‌రెడ్డి, వెంకటెడ్డి, జయరామిరెడ్డి, రఘునాథరెడ్డి, గోపాల్, శివ, రఫి, శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
అన్ని ఓట్లు ఎలా తగ్గాయి?
కర్నూలు(అగ్రికల్చర్): పాణ్యం నియోజకవర్గంలో భారీస్థాయిలో ఓట్లు ఎలా తగ్గాయని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి ప్రశ్నించారు. ఓటర్లు పెరగాల్సింది పోయి తగ్గడమేంటని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. శనివారం కలెక్టరేట్లో రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పాణ్యం నియోజకవర్గంలో 2014 ఎన్నికల్లో 2.80 లక్షల మంది ఓటర్లు ఉన్నారని తెలిపారు. ఇప్పుడు ఆ సంఖ్య 2.30 లక్షలకు తగ్గిందన్నారు. ఇందుకు కారణాలేమిటని ప్రశ్నించారు. కలెక్టర్ సమాధానమిస్తూ డీ డూప్లికేట్ సాఫ్ట్‌వేర్‌తో రెండు చోట్ల ఓటు కలిగిన వారందరినీ తొలగించామని, డోర్ టు డోర్ సర్వేకు వచ్చినప్పుడు ఇళ్లలో లేనివారిని కూడా తొలగించామని తెలిపారు. దీనివల్ల ఓటర్లు తగ్గారని చెప్పారు. ఓటరు నమోదు పెద్దఎత్తున చేపట్టేందుకు మునిసిపల్, తహసీల్దారు కార్యాలయాల్లో ప్రత్యేక సెంటర్లు ఏర్పాటు చేయాలని వైఎస్సార్సీపీ ప్రతినిధి తోట వెంకటకృష్ణారెడ్డి సూచించారు. ఓటరు నమోదుపై విస్తృత ప్రచారం చేయాలని, ముఖ్యంగా విద్యాసంస్థల్లో అవగాహన సదస్సులు ఏర్పాటు చేయాలని కోరారు. కర్నూలు నగరంలోని పలు పోలింగ్ కేంద్రాలకు బీఎల్వోలుగా పొదుపు మహిళలను నియమించడాన్ని సీపీఎం నేతలు రాముడు, షడ్రక్ తప్పుబట్టారు. వీరు అర్హులైన వారిని ఓటర్లుగా నమోదు చేయడం లేదని, అక్రమాలకు తావిస్తున్నారని ఆరోపించారు. వీరిని తొలగించి అంగన్వాడీ కార్యకర్తలను నియమించాలని కోరారు. దేవనకొండ మండలం తెర్నేకల్ గ్రామంలో 20 ఏళ్ల క్రితం ఊరొదిలి వెళ్లిన వారు ఇప్పటికీ అక్కడ ఓటర్లుగా ఉన్నారని, ఇదెలా సాధ్యమని కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి పెద్దారెడ్డి ప్రశ్నించారు. ఓటర్ల నమోదుకు అందరూ సహకరించాలి: కలెక్టర్ వచ్చే ఏడాది సాధారణ ఎన్నికలు జరగనున్నందున అర్హులైన ప్రతి ఒక్కరినీ ఓటర్లుగా నమోదు చేసేందుకు అన్ని రాజకీయ పార్టీలు సహకరించాలని కలెక్టర్ సత్యనారాయణ విజ్ఞప్తి చేశారు. గుర్తింపు పొందిన అన్ని పార్టీలు వెంటనే అన్ని పోలింగ్ కేంద్రాలకు బీఎల్ఏలను నియమించుకోవాలని సూచించారు. ఆ వివరాలను అక్టోబరు ఐదులోగా ఇవ్వాలన్నారు. ఓటర్ల జాబితా సవరణ అక్టోబరు 31 వరకు కొనసాగుతుందని, జనవరి నాలుగున తుది జాబితా ప్రకటిస్తామని తెలిపారు. తహసీల్దార్, మండల పరిషత్, మునిసిపల్ కార్యాలయాల్లో ఓటరు నమోదు దరఖాస్తులు వేసేందుకు ప్రత్యేక బాక్స్‌లు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. జనవరి ఒకటి నాటికి 18 ఏళ్లు నిండే యువతీ యువకులు, జాబితాలో లేని ఇతరులను ఓటర్లుగా నమోదు చేయాలని సూచించారు. 18–19 ఏళ్ల యువత జిల్లాలో 1.80 లక్షల మంది ఉండగా.. 30వేల మంది మాత్రమే ఓటర్లుగా ఉన్నారని, యువ ఓటర్ల నమోదుకు రాజకీయ పార్టీలు సంపూర్ణ సహకారం ఇవ్వాలని కోరారు. 19 నుంచి 30 ఏళ్ల మధ్య వారు కూడా చాలామంది ఓటుకు దూరంగా ఉన్నారని, వీరిపైనా దృష్టి సారించాలని అన్నారు. చనిపోయిన వారు, గ్రామాలు వదిలి వెళ్లిన వారు ఓటర్లుగా ఉంటే ఫారం–7 ద్వారా తొలగింపునకు దరఖాస్తు చేయవచ్చని సూచించారు. అర్హత కలిగిన వారందరూ ఓటర్లుగా నమోదయ్యేందుకు స్వీప్ కార్యక్రమాలను చేపడుతున్నట్లు తెలిపారు. విశ్వవిద్యాలయంతో పాటు డిగ్రీ కళాశాలలు, ఇతర వృత్తి విద్యాసంస్థల్లో స్వీప్ యాక్టివిటీ కింద అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. ఇప్పటికే పోలింగ్ కేంద్రాల రేషనలైజేషన్ పూర్తి అయ్యిందని, దీనివల్ల పోలింగ్ కేంద్రాల సంఖ్య 3,780కి పెరిగిందని తెలిపారు. ఇంకా ఎక్కడైనా కొత్త పోలింగ్ కేంద్రం అవసరమనుకుంటే తమకు చెప్పవచ్చని, ప్రతిపాదనలు పంపుతామని పేర్కొన్నారు. ఈ సందర్భంగా స్వీప్ కార్యాక్రమాలకు సంబంధించిన పోస్టర్లను కలెక్టర్ విడుదల చేశారు. ఓటరు నమోదు ప్రచార వాహనాలను కూడా జెండా ఊపి ప్రారంభించారు. సమావేశంలో డీఆర్వో వెంకటేశం, ఈఆర్వోలు శశీదేవి, సుధాకర్‌రెడ్డి, అనురాధ, సత్యం, జయకుమార్, కర్నూలు నగరపాలక సంస్థ కమిషనర్ హరినాథరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
నీళ్లివ్వకుంటే ప్రాజెక్టుల ముట్టడి
కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు) : జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టులకు నీళ్లివ్వకుంటే సంబంధిత ప్రాజెక్టులను ముట్టడిస్తామని ఎమ్మెల్సీ గంగుల ప్రభాకరరెడ్డి హెచ్చరించారు. నీళ్లిచ్చేదీ, లేనిదీ చెప్పడానికి ఈ ఒక్కరోజే గడువు అని కలెక్టర్‌తో స్పష్టం చేశారు. శ్రీశైలం ప్రాజెక్టులో 872 అడుగుల మేర నీళ్లున్నా హంద్రీ–నీవా, ఎస్ఆర్బీసీ, తెలుగుగంగ, వెలుగోడు, కేసీ కెనాల్‌తో పాటు ఇతర ప్రాజెక్టులకు ఎందుకు విడుదల చేయడం లేదని ప్రశ్నించారు. ఇటీవల జరిగిన నీటిపారుదల సలహా మండలి (ఐఏబీ) సమావేశంలో ఆగస్టు రెండు నుంచి నీటిని విడుదల చేస్తామని జిల్లా ఇన్చార్జ్ మంత్రి కాలవ శ్రీనివాసులు, జలవనరుల శాఖాధికారులు ప్రకటించినా.. ఇంతవరకు అతీగతీ లేదన్నారు. సోమవారం సాయంత్రం వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ గంగుల ప్రభాకరరెడ్డితో పాటు ఎమ్మెల్యేలు గౌరు చరితారెడ్డి, ఐజయ్య, నంద్యాల, కర్నూలు పార్లమెంటరీ జిల్లాల అధ్యక్షులు శిల్పా చక్రపాణిరెడ్డి, బీవై రామయ్య, రాష్ట్ర ప్రధానకార్యదర్శి కాటసాని రాంభూపాల్‌రెడ్డి, ఆళ్లగడ్డ నాయకులు గంగుల బిజేంద్రారెడ్డి..జిల్లా కలెక్టర్ ఎస్.సత్యనారాయణను ఆయన కార్యాలయంలో కలిసి ప్రాజెక్టుల నుంచి వెంటనే నీటిని విడుదల చేయాలని వినతిపత్రం ఇచ్చారు. ఇందుకు ఆయన స్పందిస్తూ తనకు ఒక్కరోజు సమయమిస్తే జలవనరుల శాఖాధికారులతో సమావేశం ఏర్పాటు చేసుకొని నీటిని విడుదల విషయాన్ని చెబుతాననడంతో అందుకు వారు అంగీకరించారు. నీళ్లు విడుదల చేసేదీ, లేనిదీ ఒక్కరోజులో చెబితే దాని ప్రకారం రైతుల పక్షాన పోరాటాలు చేసేందుకు ప్రణాళికలు రూపొందించుకుంటామన్నారు. అనంతరం ఎమ్మెల్సీ గంగుల ప్రభాకరరెడ్డి మీడియాతో మాట్లాడుతూ..సీఎం చంద్రబాబు శ్రీశైలం నీటిని కర్నూలు జిల్లా రైతాంగానికి ఇవ్వకుండా విద్యుత్ ఉత్పత్తి పేరుతో నాగార్జునసాగర్‌కు తీసుకెళ్లేందుకు కుట్ర పన్నుతున్నారన్నారు. పట్టిసీమ పేరుతో రాయలసీమ అన్నదాతకు అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు. నెల క్రితం ముందస్తు వానలతో రైతులు అరుతడి పంటలు వేసుకున్నారని, ఇప్పుడు వర్షాలు లేకపోవడంతో అవి ఎండుతున్నా అధికారులు నీటిని ఇవ్వకపోవడం అన్యాయమని అన్నారు. కలెక్టర్, జలవనరుల శాఖాధికారులు అమరావతి డైరెక్షన్లో నడుస్తూ జిల్లా రైతాంగానికి తీవ్ర అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు. అదృష్టం వరించినా సీఎం దక్కనీయడం లేదు: ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి మహారాష్ట్ర, కర్ణాటకల్లో కురిసిన వర్షాలతో జిల్లాలోని ప్రాజెక్టులు నిండి అదృష్టం వరించిందని, అయితే.. ఈ నీరు రైతుల పొలాలకు దక్కకుండా సీఎం చంద్రబాబు కుట్ర పన్నుతారని పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి విమర్శించారు. హెచ్ఎన్ఎస్ఎస్ నుంచి జిల్లా రైతాంగానికి నీళ్లు ఇవ్వకుండా అనంతపురానికి తీసుకెళ్తున్నారన్నారు. కేసీ కెనాల్లో నీళ్లు లేవని, ఎస్ఆర్బీసీకి 500 క్యూసెక్కులను మాత్రమే వదిలారని, దీంతో ఆరుతడి పంటలు కూడా ఎండిపోతుండడంతో అన్నదాతకు దిక్కుతోచడంలేదని వివరించారు. నందికొట్కూరు నియోజకవర్గంలో 10 వేల ఎకరాల్లో వేసిన ఆరుతడి పంటలు ఎండిపోతున్నాయని, కేసీ కెనాల్, నిప్పులవాగుకు నీళ్లు వదలాలని కోరుతున్నా ప్రభుత్వం, అధికారులు పట్టించుకోవడం లేదన్నారు. -
బాబు.. మీరు చెప్పింది ఏంటి? చేసింది ఏంటి ?
సాక్షి, కర్నూలు : జిల్లా ప్రజలను మోసం చేయడానికే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జిల్లా పర్యటన చేపట్టారని వైఎస్సార్సీపీ, పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత విమర్శించారు. 2014 ఆగస్టు 15న ఇచ్చినవన్నీ బూటకపు హామీలే అని మండిపడ్డారు. నాడు అరచేతిలో వైకుంఠం చూపించిన ముఖ్యమంత్రి ఏమోహం పెట్టుకొని జిల్లాకు వస్తున్నాడో చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు. జిల్లాలో శంకుస్థాపన చేసిన సంస్థలు ఎన్ని, వాటిలో పూర్తైనవి ఎన్నో చెప్పే ధైర్యం చంద్రబాబుకు ఉందా అని ఆమె నిలదీశారు. తెలుగుదేశం ప్రభుత్వం అన్ని రంగాల్లో ఘోరంగా విఫలమైందది దుయ్యబట్టారు. ఇండస్ట్రియల్ హబ్, టెక్స్టైల్ పార్క్, స్మార్ట్ సిటీ, గుండ్రేవుల ప్రాజెక్టు ఇలా జిల్లాకు ఇచ్చిన ప్రతి హామీ అమలులో చంద్రబాబు పూర్తిగా విఫమయ్యారని ఆమె ధ్వజమెత్తారు. పేదల భూములు లాక్కొని నష్టపరిహారం కూడా ఇవ్వలేదంటూ నిప్పులు చెరిగారు. కమీషన్ల కోసమే చంద్రబాబు శంకుస్థాపనలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. జిల్లాలో చంద్రాబాబును నమ్మే పరిస్థితి లేదని అన్నారు. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో మహిళలు, బాలికలకు రక్షణ లేకుండా పోయిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీ నాయకులు, మంత్రులే దారుణాలు చేస్తుంటే.. ప్రజలకు రక్షణ కల్పించేది ఎవరంటూ చరిత ప్రశ్నించారు. దాచేపల్లి ఘటన మరువక ముందే డోన్‌లో మైనర్ బాలికపై లైంగిక దాడి జరగడం సిగ్గుచేటని అన్నారు. నాలుగేళ్లలో ప్రభుత్వ వైఫల్యాలకు బాబు క్షమాపణ చెప్పాంటూ డిమాండ్ చేశారు. రాష్ట్రంలో మహిళలు, బాలికలపై జరుగుతున్న అకృత్యాలకు సీఎం నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. తెలుగుదేశం అరాచక పాలనకు ప్రజలు బుద్ది చెప్పే రోజులు దగ్గర పడ్డాయన్నారు. -
పార్టీని బలోపేతం చేద్దాం
కల్లూరు: వైఎస్సార్సీపీని ప్రజల్లోకి తీసుకెళ్లి బలోపేతం చేద్దామని పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి పిలుపునిచ్చారు. బుధవారం అర్బన్ పరిధిలోని శ్రీసాయిశ్రీనివాస గార్డెన్లో కల్లూరు 14వ వార్డుల్లోని బూతు కమిటీ సభ్యుల సమావేశం అర్బన్ ఇన్చార్జ్ బెల్లం మహేశ్వరరెడ్డి అధ్యక్షతన జరిగింది. ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి, వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌరు వెంకటరెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాబోయేది ఎన్నికల కాలమని, ప్రతి కార్యకర్త సైనికుడిలా పనిచేయాలని పిలుపునిచ్చారు. స్థానిక సమస్యలను ఎప్పటికప్పుడు అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషి చేయాలన్నారు. పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే అన్ని వర్గాల ప్రజలకు మేలు చేకూర్చే ‘నవరత్నాలు’ పథకాలను అమలు చేసేందుకు జననేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. నవరత్నాల గురించి ప్రజలకు అవగాహన కల్పించడంతోపాటు టీడీపీ ప్రభుత్వ వైఫల్యాలను, రాష్ట్ర ప్రజలకు చేస్తున్న మోసాలను వివరించాలన్నారు. గౌరు వెంకటరెడ్డి మాట్లాడుతూ నియోజకవర్గంలోని బూతు కమిటీలను బలోపేతం చేద్దామని, కమిటీ సభ్యులు ఇతర ప్రాంతాలకు వెళ్లి ఉంటే వారి స్థానాలను త్వరగా భర్తీ చేయాలని ఆదేశించారు. ఈ నెల 7, 8, 9వ తేదీల్లో నగర శివారులోని వీజేఆర్ ఫంక్షన్ హాలులో పార్టీ శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారని, పాణ్యం నియోజకవర్గానికి కేటాయించిన తేదీన జరిగే శిక్షణ తరగతులకు ప్రతి కార్యకర్త హాజరుకావాలని సూచించారు. రాబోయే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా మరోసారి గౌరు చరితారెడ్డిని అఖండ మెజార్టీతో గెలిపించుకోవాలని కోరా రు. జిల్లా నాయకులు తోట వెంకటకృష్ణారెడ్డి మాట్లాడుతూ జన్మభూమి కమిటీలు ప్రజల రక్త మాంసాలను పీక్కు తింటున్నాయని, కమిటీ సభ్యులు తోడేళ్ల గుంపుగా వ్యవహరిస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ నేతల అరాచకాలను ప్రజల దృష్టికి తీసుకెళ్లాలన్నారు. కార్యక్రమంలో మైనార్టీ నాయకులు ఫిరోజ్, 14 వార్డుల ఇన్‌చార్జ్‌లు, బూతు కన్వీనర్లు, సభ్యులు తదితరులు పాల్గొన్నారు. -
హత్యా రాజకీయాలు బైరెడ్డి నైజం
కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు) : హత్యా రాజకీయాలు బైరెడ్డి రాజశేఖరరెడ్డి, ఆయన కుటుంబం నైజమని వైఎస్ఆర్సీపీ పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి ధ్వజమెత్తారు. స్మగ్లింగ్, హత్యలు, దొంగసారా వ్యాపారం చేస్తూ రూ.కోట్లు గడించిన బైరెడ్డి బండారం రాష్ట్ర ప్రజలందరికీ తెలుసునన్నారు. నాలుగేళ్ల పాటు సీఎం చంద్రబాబును తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టి ఇప్పుడు అదే పార్టీలోకి వెళ్తున్నారని విమర్శించారు. గౌరు వెంకటరెడ్డి కుటుంబంపై విమర్శలు చేయడానికి ఆయనకు అర్హత ఏముందని ప్రశ్నించారు. మంగళవారం ఆమె కర్నూలులోని వైఎస్ఆర్సీపీ జిల్లా కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. తమ కుటుంబం శాంతియుతంగా నందికొట్కూరు, పాణ్యం నియోజకవర్గాల్లో ప్రజలకు సేవ చేస్తోందన్నారు. తాము ప్రతిపక్షంలో ఉన్నా పాణ్యం అభివృద్ధికి అనేక చర్యలు తీసుకుంటున్నామన్నారు. బైరెడ్డి సొంత గ్రామంలో సైతం తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలోనే సీసీరోడ్డు వేయించానని చెప్పారు. పాణ్యం అభివృద్ధిపై దమ్ముంటే బైరెడ్డి బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసిరారు. ఎన్నికలు వస్తున్నాయంటే హత్యలు, దాడులతో ప్రజలను భయపెట్టడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య అన్నారు. గత ఎన్నికల సమయంలో నందికొట్కూరు మార్కెట్ యార్డు ఉపాధ్యక్షుడు సాయిఈశ్వర్‌ను హత్య చేయించడం, రెండు రోజుల క్రితం కర్నూలులో రఘురామిరెడ్డిపై కొడుకు సిద్దార్థరెడ్డితో దాడి చేయించడమే ఇందుకు నిదర్శనమన్నారు. మరోవైపు బైరెడ్డి మాత్రం అందరూ తన ఆప్తులే అని చెప్పడం విడ్డూరమన్నారు. ఆయన హత్యా రాజకీయాలకు కాలం చెల్లిందన్నారు. ఆయన చెప్పించిన తప్పుడు సాక్ష్యాల వల్ల గౌరు వెంకటరెడ్డి జైలుకు వెళ్లి వచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు. బైరెడ్డిని ప్రజలు ఎప్పుడో మరచిపోయారని, నంద్యాల ఉప ఎన్నికల్లో ఆయన పార్టీకి 154 ఓట్లు రావడం, గత పాణ్యం ఎన్నికల్లో కూతురు శివానికి 500 ఓట్లు మాత్రమే వచ్చి డిపాజిట్‌ను కోల్పోవడం నిదర్శనమన్నారు. 2004 నుంచి కూడా తమదే పైచేయి అన్నారు. 2004లో తాను బైరెడ్డిపై ఎమ్మెల్యేగా గెలిచానని, 2009లో తాము బలపరిచిన అభ్యర్థి గెలుపొందారని, 2014లో మళ్లీ తానే గెలుపొందానని వివరించారు. ఇప్పుడు ఉనికి కోసమే బైరెడ్డి కుటుంబీకులు హత్యలు, దాడులతో ప్రజలను భయభ్రాంతులకు గురిచేసేందుకు యత్నిస్తున్నారని, ప్రజలెవరూ భయపడాల్సిన అవసరం లేదని అన్నారు. రెండు నియోజకవర్గాల్లోని ప్రజలకు గౌరు కుటుంబ వెన్నుదన్నుగా ఉంటుందన్నారు. బైరెడ్డికి నిజంగా దమ్ము ఉంటే 2019లో జరిగే ఎన్నికల్లో పాణ్యం నుంచి టీడీపీ తరఫున పోటీ చేయాలని, అప్పుడు ఎవరి సత్తా ఏమిటో తెలుస్తుందని సవాల్ విసిరారు. సమావేశంలో వైఎస్సార్సీపీ నగర అధ్యక్షుడు రాజా విష్ణువర్ధన్‌రెడ్డి, నాయకులు తీగల కృష్ణారెడ్డి, అబ్దుల్ రహమాన్, ఫీరోజ్, ఓసీఎం రంగ, కరుణాకరరెడ్డి, శ్రీధర్‌రెడ్డి, నాగేశ్వరరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
వారిని సస్పెండ్ చేస్తేనే అసెంబ్లీకి వస్తాం
కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు): వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచి టీడీపీలోకి ఫిరాయించిన ఎమ్మెల్యేలను సస్పెండ్ చేస్తేనే అసెంబ్లీకి వస్తామని పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి తెలిపారు. గురువారం తన నివాసంలో ఆమె విలేకరులతో మాట్లాడారు. ఫిరాయింపుదారులను సస్పెండ్ చేయాలనే డిమాండ్‌తో తమ పార్టీ అసెంబ్లీ బహిష్కరణకు పిలుపు ఇచ్చిందన్నారు. ఇలాంటి సమయంలో తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరం ఎమ్మెల్యే రాజేశ్వరికి సీఎం చంద్రబాబునాయుడు పచ్చకుండువా కప్పడం ఎంత వరకు సబబు అని ప్రశ్నించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నిర్వీర్యం చేయడం కోసమే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తమ పార్టీ సభ్యులను టీడీపీలోకి చేర్చుకుంటున్నారని అన్నారు. ఫిరాయింపుదారులు...డబ్బులు, ఇతర అవసరాల కోసం పట్టపగలు ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగ విలువలను మంటగలుపుతున్నారన్నారు. వారిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులు అంది రెండున్నరేళ్లు అవుతున్నా స్పీకర్ కోడెల శివప్రసాద్ ఎందుకు సస్పెండ్ చేయడం లేదని ప్రశ్నించారు. సీఎం చంద్రబాబునాయుడు, స్పీకర్ కోడెల శివప్రసాద్‌లు రాజ్యాంగేతర శక్తులుగా అవతరించి అప్రజాస్వామిక చర్యలకు పాల్పడుతున్న వారిని ప్రశ్నించే నాథుడే లేకపోవడం బాధాకరమన్నారు. తమ పార్టీ తరపున అసెంబ్లీ బహిష్కరణకు పిలుపునిస్తే కనీసం స్పీకర్ కోడెల శివప్రసాద్, అసెంబ్లీ వ్యవహారాల మంత్రి యనమల రామకృష్ణుడు సంప్రదింపులు చేయకపోవడం, తమ డిమాండ్లను తెలుసుకోకపోవడం బాధాకరమన్నారు. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసమే తమ పార్టీ అసెంబ్లీ బహిష్కరణకు పిలుపు ఇచ్చిందన్నారు. తమ పార్టీ నుంచి ఫిరాయించిన 21 మంది ఎమ్మెల్యేలపై ఎప్పుడైతే బహిష్కరణ వేటు వేస్తారో అప్పుడు అసెంబ్లీకి వస్తామన్నారు. కొందరు టీడీపీ మంత్రులు...సమస్యలపై చర్చించలేక వైఎస్సార్సీపీ పారిపోయిందని నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారని, అలాంటి వారికి నిజంగా దమ్ము, ధైర్యం ఉంటే ఫిరాయింపు ఎమ్మెల్యేలను సస్పెండ్ చేయించాలన్నారు. కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకుడు గౌరు వెంకటరెడ్డి పాల్గొన్నారు. -
మోసం..బాబు నైజం
♦ ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి ♦ 31వ వార్డులో ‘వైఎస్ఆర్ కుటుంబం’ కల్లూరు: మోసం చేయడం సీఎం చంద్ర బాబు నైజమని పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి అన్నారు. శుక్రవారం కల్లూరు అర్బన్ 31వ వార్డు ముజఫర్‌నగర్‌లో వార్డు ఇన్చార్జ్ మంచాల సు«ధాకరరెడ్డి అధ్యక్షతన వైఎస్ఆర్ కుటుంబం కార్యక్రమాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. ఇంటింటికి తిరుగుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు మోసాలను వివరించారు. వైఎస్ఆర్ కుటుంబంలో 20 మంది కుటుంబ సభ్యులను చేర్చి సభ్యత్వాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. వైఎస్సార్ అమలు చేసిన సంక్షేమ పథకాలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తూట్లు పొడుస్తున్నారని విమర్శించారు. తమ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిని సీఎం అయితే నవరత్నాల పథకాలు అమలవుతాయని వివరించారు. కార్యక్రమంలో వార్డు బూత్ కమిటీ కన్వీనర్లు మూర్తిరెడ్డి, మనోహర్‌రెడ్డి, మోహన్, శివ, రాజు, కబీర్, సుంకన్న, మాదన్న, ఆనంద్, కుమార్, పరమేష్, శీను, ఎల్లరాముడు, వాజిద్, మహ్మద్, ప్రసాద్, సిరాజ్, మైనార్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు ఫిరోజ్ తదితరులు పాల్గొన్నారు. 19వ వార్డు ఇన్చార్జ్ సురేంద్రరెడ్డి అధ్యక్షతన కల్లూరు అర్బన్ ఇన్చార్జీ బెల్లం మహేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో మారుతి నగర్లో వైఎస్ఆర్ కుటుంబం కార్యక్రమాన్ని ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి ప్రారంభించారు. మూడేళ్ల పాలన ప్రజా వ్యతిరేకంగా, రాజ్యాంగ విరుద్ధఃగా సాగుతుందని కాలనీవాసులకు వివరించారు. కార్యక్రమంలో బూత్ కమిటీ కన్వీనర్లు, సభ్యులు అశోక్‌రెడ్డి, శ్రీనివాసరెడ్డి, రామిరెడ్డి, చిన్నా, 20వ వార్డు ఇన్చార్జ్ పల్లె రఘునాథ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కల్లూరుపై వివక్ష చూపొద్దు – ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి కల్లూరు : అభివద్ధి విషయంలో కల్లూరు కాలనీలపై వివక్ష చూపొద్దని మున్సిపల్ కమిషనర్ హరినాథ్ రెడ్డికి పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి సూచించారు. శుక్రవారం మున్సిపల్ కమిషనర్‌కు ఆయన చాంబర్లోనే సమస్యలను వివరించారు. కల్లూరు అర్బన్ వార్డుల్లో అభివద్ధి జరగడం లేదన్నారు. అనేక కాలనీల్లో సీసీ రోడ్లు, మురుగు కాలువలు లేవన్నారు. మూడు రోజులకు ఒకసారి తాగునీరు సరఫరా చేస్తున్నారని తెలిపారు. మౌలిక సదుపాయాల కల్పనలో పక్షపాతం చూపొద్దని విన్నవించారు. ఇప్పటికే భూమి పూజ నిర్వహించిన పనులు కూడా సక్రమంగా జరగడం లేదన్నారు. కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ అర్బన్ ఇన్చార్జ్ బెల్లం మహేశ్వరరెడ్డి, 19వ ఆవర్డు ఇన్చార్జ్ సురేంద్రరెడ్డి, నాయకులు అశోక్‌రెడ్డి, రామిరెడ్డి, యశ్వంత్‌రెడ్డి, శివకష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
వైఎస్సార్ కుటుంబానికి విశేష స్పందన
- పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి – మూడోరోజు ఆరు నియోజకవర్గాల్లో కొనసాగిన కార్యక్రమం –1,480 మందికి పార్టీ సభ్యత్వం కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు) : వైఎస్సార్ కుటుంబం కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోందని పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి తెలిపారు. జిల్లా వ్యాప్తంగా ఏ గ్రామంలో చూసినా ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం తీసుకుంటున్నారని చెప్పారు. ముఖ్యంగా మహిళలు, యువకులు, రైతులు, వృద్ధులు సైతం తమ పార్టీవైపు ఆకర్షితులవుతున్నట్లు తెలిపారు. పాణ్యం నియోజకవర్గంలోని కల్లూరు అర్బన్‌లో జరిగిన వైఎస్సార్ కుటుంబం కార్యక్రమంలో ఆమె పాల్గొని ప్రసంగించారు. కాగా, మూడో రోజైన బుధవారం జిల్లాలోని ఆరు నియోజకవర్గాల్లో వైఎస్సార్ కుటుంబం కార్యక్రమం కొనసాగింది. పాణ్యం, ఆలూరు, పత్తికొండ, బనగానపల్లె, డోన్, కోడుమూరు నియోజకవర్గాల్లోని వివిధ మండలాల్లో బూత్ కమిటీ సభ్యులు ఇళ్లిళ్లూ తిరిగి 1,300 మందికి పార్టీ సభ్యత్వం ఇప్పించారు. ఆలూరు నియోజకవర్గంలోని ఆలూరు మండలం ముసానపల్లెలో 25 మందికి, హాలహర్విలో 24 మందికి కలిపి మొత్తం 49 మందికి, బనగానిపల్లె నియోజకవర్గంలోని బనగానిపల్లె, కొలిమిగుండ్ల, అవుకు మండలాల్లో మొత్తం 320 మందికి, పాణ్యం నియోజకవర్గంలోని కల్లూరు అర్బన్‌లో 49 మంది, రూరల్‌లో 84 మంది.. మొత్తం 133 మందికి, కోడుమూరులో 20 మందికి, డోన్ పట్టణంలోని ఐదో వార్డులో 110 మంది, అవులదొడ్డిలో 78 మంది, ప్యాపిలిలో 150 మంది, బేతంచెర్లలో 280 మంది కలిపి నియోజకవ్గంలో మొత్తం 618, పత్తికొండ నియోజకవర్గంలోని పత్తికొండ మండలంలో 92, మద్దికెరలో 33, తుగ్గలి 120, కృష్ణగిరి 75, వెల్దుర్తి 30 మంది.. మొత్తం 340 మందికి పార్టీ సభ్యత్వం ఇచ్చారు. -
ఏ ముఖం పెట్టుకుని ఓట్లడుగుతారు
- మంత్రి లోకేష్‌కు ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి సూటి ప్రశ్న కర్నూలు (వైఎస్ఆర్ సర్కిల్): అధికారంలోకి రావడానికి మీ తండ్రి చంద్రబాబు నాయుడు అన్ని వర్గాల ప్రజలను మోసం చేశారని ఇప్పుడు మీరు ఏ ముఖం పెట్టుకుని ఓట్లడగటానికి వస్తున్నారని పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి మంత్రి లోకేష్‌ను ప్రశ్నించారు. మంగళవారం ఆమె మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు జిల్లాకు ఇచ్చిన 32 హామీలలో ఓ ఒక్కటీ నెరవేర్చలేదన్నారు. గుండ్రేవుల రిజర్వాయర్, వేదవతి, సిద్ధేశ్వరం అలుగు నిర్మాణం తదితర ప్రాజెక్టులు ఇంత వరకు మొదలే కాలేదన్నారు. పాత పనులకు పైపై మెరుగులు దిద్ది అభివృద్ధి చేస్తున్నామంటూ ఊకదంపుడు ఉపన్యాసాలు ఇవ్వడం హాస్యాస్పదమన్నారు. దమ్ముంటే పెండింగ్ ప్రాజెక్టులకు అనుమతులు తీసుకొచ్చి నిర్మాణాలను త్వరితగతిన చేపట్టి ఓట్లు అడగాలని హితవుపలికారు. నంద్యాల నియోజకవర్గ ప్రజలు గతంలో రాష్ట్రపతిని, ప్రధానమంత్రిని చేసి తమ నైతికతను చాటుకున్నారనీ, మంత్రుల ముసుగులో తండ్రీ, కొడుకులు చేపట్టిన ప్రచారాన్ని చూసి ప్రజలు మభ్య పడే రోజులు పోయాయన్నారు. అసమ్మతి నాయకులను నామినేటెడ్ పదవులను ఎర చూపుతుండటాన్ని కూడా నంద్యాల ప్రజలు గమనిస్తున్నారని ఉప ఎన్నికలో తగిన గుణపాఠం చెబుతారని పేర్కొన్నారు. -
సైక్లిస్ట్‌కు ఆర్థిక చేయూత
కల్లూరు: పర్యావరణ పరిరక్షణ కోసం మౌంట్ ఎవరెస్టుకు సైకిల్ యాత్ర చేపట్టిన పాణ్యంకు చెందిన బీటెక్ విద్యార్థి శ్రీకాంత్‌కు ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు గౌరు వెంకటరెడ్డి ఆర్థిక చేయూతనిచ్చారు. సైక్లిస్ట్ శ్రీకాంత్ శుక్రవారం కర్నూలు నగరంలోని గౌరు దంపతులను వారి స్వగృహంలో కలిశారు. ఈ మేరకు వారు శ్రీకాంత్‌ను అభినందించి రూ 10 వేలు ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఈ సందర్భంగా శ్రీకాంత్ మాట్లాడుతూ 21 రోజులపాటు జరిగే సైకిల్ యాత్రను ఈ నెల 31వ తేదీన ప్రారంభించి జూన్ 20వ తేదీన మౌంట్ ఎవరెస్టు బేస్ క్యాంపు వద్ద ముగించనున్నానని తెలిపారు. ప్రతి ఒక్కరు శారీరకంగా మానసికంగా ఫిట్నెస్ ఉండేందుకు యోగా, ఫిట్నెస్ వ్యాయామం చేయాలన్నారు. సైకిల్ వాడకాన్ని పెంచి పర్యావరణ కాలుష్యాన్ని తగ్గించాలని విజ్ఞప్తి చేశారు. -
ప్రాణాలకు ముప్పుందని ఆయన ముందే చెప్పినా..!
కర్నూలు: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత, పత్తికొండ ఇంచార్జ్ చెరుకులపాడు నారాయణరెడ్డి దారుణహత్యకు గురవడంపై గౌరు వెంకటరెడ్డి, ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డిలు తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఫ్యాక్షన్హత్యపై గౌరు చరితా రెడ్డి మాట్లాడుతూ.. 'నేను నంద్యాలలో వేరే పెళ్లిలో ఉన్నాను. నారాయణరెడ్డి హత్య విషయం వినగానే దిగ్భ్రాతి చెందాను. దివంగత నేత వైఎస్ఆర్ సీఎంగా ఉన్నప్పుడు ఫ్యాక్షన్ హత్యలు పూర్తిగా ఆగిపోయాయి. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని మళ్లీ ప్రోత్సహిస్తున్నారు. తన ప్రాణాలకు ముప్పు ఉందని నారాయణరెడ్డి ఎన్నోసార్లు బహిరంగంగానే చెప్పారు. కానీ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం వల్లే ఈ దారుణం చోటుచేసుకుంది. గతంలో పరిస్థితులు మళ్లీ తలెత్తడంతో వైఎస్ఆర్సీపీ నేతలను ఆందోళనకు గురిచేస్తుంది' అన్నారు. వైఎస్ఆర్సీపీ నేత గౌరు వెంకటరెడ్డి మట్లాడుతూ.. 'మొన్న ఆళ్లగడ్డలో మా పార్టీ కార్యకర్తలను చంపేశారు. ఇప్పుడు ఏకంగా పార్టీ కీలక నేతలను హత్యచేస్తున్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఫ్యాక్షన్ హత్యలు పెరుగుతున్నాయి. టీడీపీ సర్కార్ పోలీసులను వారి కనుసన్నల్లో పెట్టుకుంటుంటే.. పోలీసులు ఏ విధంగానూ ప్రతిపక్ష పార్టీ నేతలు, కార్యకర్తలకు, ప్రజలకు న్యాయం చేయలేకపోతున్నారు. వారి ప్రాణాలకు రక్షణ కల్పించలేకపోతున్నారు. అందుకు ఈ దారుణ ఘటనే నిదర్శనమని చెప్పవచ్చు. పశ్చిమగోదావరి జిల్లాలో టీడీపీ ఎమ్మెల్యే ఆరమిల్లి రాధాకృష్ణ తన ఇంటికి పిలిపించి మరీ ఇరగవరం ఎస్ఐ, రైటర్లను నిర్బంధించారని గుర్తుచేశారు. అధికార పార్టీ నేతలే తమ ఇష్టరీతిన నడుచుకుంటే పోలీసుశాఖ మాత్రం ఏం చేస్తుందన్నారు. పార్టీతో సంబంధంలేకుండా వ్యక్తిని గౌరవించే నేత ఆయన. పార్టీని ఎన్నో రకాలుగా అభివృద్ధి చేసిన వ్యక్తిని ప్రత్యర్థులు హత్య చేయడం దురదృష్టకరమని' వ్యాఖ్యానించారు. బాంబులు, కత్తులతో ప్రత్యర్థులు చేసిన దాడిలో పత్తికొండ ఇంచార్జ్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్న చెరుకులపాడు నారాయణ రెడ్డితో పాటు ఆయన అనుచరుడు సాంబశివుడు దారుణహత్యకు గురైన విషయం తెలిసిందే. పెళ్లికి వెళ్లి తిరిగొస్తుండగా కృష్ణగిరి మండలం రామకృష్ణాపురం వద్ద ఈ దారుణం చోటు చేసుకుంది. -
తాగునీటి సమస్యను తీర్చండి
– మునిన్సపల్ శాఖ మంత్రికి ఎమ్మెల్యే గౌరు చరిత విన్నపం కల్లూరు (రూరల్): పాణ్యం నియోజకవర్గంలోని 14 వార్డుల్లో తాగునీటి సమస్యను తీర్చాలని మున్సిపల్ శాఖ మంత్రి నారాయణను ఎమ్మెల్యే గౌరు చరిత కోరారు. శనివారం స్టేట్ గెస్ట్‌హౌస్‌కు వచ్చిన మంత్రి దృష్టికి సమస్యను తీసుకెళ్లారు. కర్నూలుకు ప్రతి రోజూ మంచినీటిని సరఫరా చేస్తూ.. పాణ్యం నియోజకవర్గంలోని 14 వార్డులకు మూడు రోజులకు ఒకసారి నీటిని విడుదల చేస్తూ వివక్ష చూపుతున్నారన్నారు. మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యంతో అర్ధరాత్రి ఏ సమయంలో నీటిని సరఫరా చేస్తున్నారో ప్రజలకు అర్థం కాని పరిస్థితి నెలకొందన్నారు. కర్నూలు ప్రజలు ఇంటి, నీటి పన్నులు సక్రమంగా ఎలా చెల్లిస్తున్నారో అదే విధంగా పాణ్యం నియోజకవర్గంలోని ప్రజలు కూడా చెల్లిస్తున్నారని వివరించారు. మంచినీటి సరఫరా విషయంలో వివక్ష చూపొద్దని, ప్రజలు కన్నీటి కష్టాలను దృష్టిలో ఉంచుకుని సమస్యను పరిష్కరించాలని మంత్రిని కోరారు. సమస్యను రెండు రోజుల్లో పరిష్కరిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. -
నివాళ్లర్పించిన వైఎస్ఆర్సీపీ నేతలు
నంద్యాల: భూమా నాగిరెడ్డి మృతదేహన్ని నంద్యాల నుంచి ఆళ్లగడ్డకు తరలించారు. వైఎస్ఆర్సీపీ నేతలు మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి, ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి భూమా నాగిరెడ్డి మృతదేహనికి నివాళ్లర్పించారు. ఆళ్లగడ్డకు కార్యకర్తలు, అభిమానులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. రేపు ఆళ్లగడ్డలో భూమా నాగిరెడ్డి అంత్యక్రియలు జరగనున్నాయి. -
‘ప్రత్యేక హోదా పోరుకు కలిసి రండి’
- జల్లికట్టు స్ఫూర్తితో ముందుకు సాగుదాం – 26న కొవ్వొత్తుల ప్రదర్శనను జయప్రదం చేయండి -వివిధ వర్గాల ప్రజలకు వైఎస్ఆర్సీపీ నేతల పిలుపు కర్నూలు(ఓల్డ్‌సిటీ): తమిళనాడు ప్రజలు పోరాడి సాధించుకున్న జల్లికట్టు క్రీడను స్ఫూర్తిగా తీసుకుని మనం ఏపీకి ప్రత్యేక హోదాను సాధించుకుందామని పాణ్యం శాసన సభ్యురాలు గౌరు చరితారెడ్డి పిలుపునిచ్చారు. మంగళవారం స్థానిక కృష్ణకాంత్ ప్లాజాలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నందికొట్కూరు శాసన సభ్యుడు ఐజయ్య, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి.వై.రామయ్యలతో కలిసి గౌరుచరిత విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్ర విభజన చట్టం ప్రకారం ప్రత్యేక హోదా మన హక్కు అనా్నరు. అయితే, ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేక ప్యాకేజీకి మొగ్గు చూపడంతో హోదా విషయంలో మనకు అనా్యయం జరిగిందన్నారు. హోదాతోనే రాష్ట్రాభివృద్ధి, యువతకు ఉద్యోగ అవకాశలు లభిస్తాయని తమ పార్టీ అధినేత జగన్మోహన్రెడ్డి అలుపెరగని పోరాటం చేస్తున్నారని చెప్పారు. ఆయన పిలుపు మేరకు ప్రత్యేక హోదా కోసం ఈనెల 26వ తేదీన సాయంత్రం 5 గంటలకు స్థానిక జెడ్పీ కార్యాలయ సమీపంలోని గాంధీ విగ్రహం వద్ద కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించనున్నామన్నారు. యువకులు, విద్యార్థులు, అన్నివర్గాల ప్రజలు పార్టీలు, రాజకీయాలకు అతీతంగా పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. దండుకునేందుకే ప్యాకేజీపై మొగ్గు లక్షల కోట్లు వస్తే దండుకోవచ్చనే ముఖ్యమంత్రి చంద్రబాబుతో సహా టీడీపీ నాయకులు ప్యాకేజీకి మొగ్గు చూపిస్తున్నారని నందికొట్కూరు శాసన సభ్యుడు ఐజయ్య ఆరోపించారు. ఎన్నికలకు ముందు ముఖ్యమంత్రితో పాటు కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు పోటీపడి ప్రత్యేక హోదాపై ప్రకటనలు చేశారని, అధికారంలోకి వచ్చాక ఆ ఊసే ఎత్తడం లేదని మండిపడ్డారు. విభజన చట్టం ప్రకారం రాష్ట్రానికి హోదా ఇవ్వాల్సిందేనన్నారు. లేదంటే ప్రజల తిరుగుబాటు చూడాల్సి వస్తుందని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు హెచ్చరించారు. ఈనెల 26న జరిగే కొవ్వొత్తుల ప్రదర్శన అందులో ఓ భాగమన్నారు. హోదా ఉద్యమంలో కలిసి రండి.. శరీరంలో చీము, నెత్తురు ఉంటే ప్రత్యేక హోదా సాధన ఉద్యమంలో తమతో కలిసి రావాలని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి.వై.రామయ్య టీడీపీ నాయకులను కోరారు. ప్రత్యేక హోదా సాధనలో ముందుండాల్సిన ముఖ్యమంత్రి ధర్నాలు, బంద్‌లు చేయొద్దంటూ ఆర్డినెన్స్‌లు జారీ చేయడం సరికాదన్నారు. నిషేధించిన జల్లికట్టు క్రీడను ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కేంద్రంతో పోరాడి సాధించుకున్నారని మన ముఖ్యమంత్రి తన స్వార్థం కోసం హోదాను కేంద్రానికి తాకట్టు పెట్టారని ఆరోపించారు. నిధులు తీసుకొస్తానంటూ విదేశాలకు తిరుగుతూ ప్రజాధనం వృథా చేస్తున్నారని ఆరోపించారు. అనంతరం పార్టీ జిల్లా అధికార ప్రతినిధి తోట వెంకటకృష్ణారెడ్డి మాట్లాడారు. కార్యక్రమంలో ఎస్సీసెల్ రాష్ట్ర కార్యదర్శి సి.హెచ్.మద్దయ్య, సేవాదళ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి.సత్యంయాదవ్, రైతు విభాగం రాష్ట్ర సంయుక్త కార్యదర్శి పిట్టం ప్రతాప్‌రెడ్డి, నగర అధ్యక్షుడు పి.జి.నరసింహులు యాదవ్, యువజన, ట్రేడ్‌యూనియన్, మహిళా విభాగాల అధ్యక్షులు పి.రాజా విష్ణువర్దన్‌రెడ్డి, టి.వి.రమణ, శౌరి విజయకుమారి, నగర నాయకులు గోపినాథ్ యాదవ్, సురేశ్, ఈశ్వర్, బుజ్జి, మంగమ్మ తదితరులు పాల్గొన్నారు. -
ఎందుకింత నిర్లక్ష్యం?
- ఇంజినీరింగ్ కళాశాల యాజమాన్యంపై ఎమ్మెల్యే గౌరుచరిత ఆగ్రహం - విద్యార్థిని మృతికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి - కళాశాలల్లో ఆడపిల్లలకు రక్షణ కరువైందని ఆవేదన పాణ్యం: ఆర్జీఎం ఇంజినీరింగ్ కళాశాలలో ర్యాగింగ్ భూతానికి ఓ విద్యార్థిని బలికావడంపై ఎమ్మెల్యే గౌరుచరితారెడ్డి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ విషయంలో ఎందుకు నిర్లక్ష్యంగా వ్యవహరించారని కళాశాల యాజమాన్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం నెరవాడమెట్ట సమీపంలోని ఆర్జీఎం కళాశాలలో బద్వేల్‌కు చెందిన ఉషారాణి ర్యాగింగ్‌ను భరించలేక ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఆదివారం ఆ కళాశాలకు వెళ్లిన ఎమ్మెల్యే విద్యార్థిని మృతికి గలకారణాలను తోటి విద్యార్థులను, సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. కళాశాలలో జరుగుతున్న ర్యాగింగ్‌పై ఆరా తీశారు. లక్షల రూపాయాలు ఫీజుల రూపంలో దండుకోని ఆడపిల్లలకు రక్షణ కల్పించకపోతే ఎలా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ర్యాగింగ్ భూతం ఉన్న కళాశాలలపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవడం లేదన్నారు. తక్షణమే అలాంటి కళాశాలల గుర్తింపును రద్దు చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థిని ఉషారాణి తండ్రి ఐదు సార్లు మీకు ఫిర్యాదు ఇచ్చిన ఎందుకు చర్యలు తీసుకోలేదని కళాశాల ప్రిన్సిపాల్‌ను నిలదీశారు. విద్యార్థిని మృతికి కారణమైన సీనియర్ విద్యార్థులు ,అధ్యాపకుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లనున్నట్లు తెలిపారు. కళాశాల యాజమాన్యం నిర్లక్ష్యమే ఉషారాణి మృతికి కారణమన్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో ర్యాగింగ్ భూతానికి గుంటూరులో రిషితేశ్వరి అనే విద్యార్థిని ప్రాణాలు కోల్పోగా, తహసీల్దార్ వనజాక్షిపై సాక్షాత్తు ఎమ్మెల్యే దాడి తదితర సంఘటనలే ఇందుకు నిదర్శనమన్నారు. శాంతిరాంపై ఆగ్రహం కొండజుటూరు గ్రామంలోని పచ్చని పొలాల మధ్యలో నానో కెమికల్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు యత్నించి ఒకరి ప్రాణాలు తీశారు. ఇప్పుడు ఓ విద్యార్థినిని బలిగొన్నారని ఆర్జీఎం కళాశాల నిర్వహకుడు శాంతిరాముడు పై ఎమ్మెల్యే గౌరుచరితారెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదాయ మార్గాలను పక్కనపెట్టి కళాశాలలో ముందుగా ర్యాగింగ్‌ను నిర్మూలించుకోవాలని సూచించారు. -
'మోసం.. బాబు నైజం'
వైఎస్ఆర్ సీపీ పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి కల్లూరు: ఎన్నికల హామీలను తుంగలో తొక్కి అన్ని వర్గాల ప్రజలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మోసం చేశారని పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి ఆరోపించారు. మంగళవారం 21వ వార్డు సోమప్ప కాలనీలో గడపగడపకు వైఎస్ఆర్ కార్యక్రమం వార్డు ఇన్చార్జ్ కేవీ భాస్కర్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించారు. స్థానిక పార్కులో అభివృద్ధి పనులు చేపట్టాలని సుబ్బారాయుడు, తిమ్మారెడ్డి, గిరి, కాలనీలో సిమెంట్ రోడ్లు వేయించాలని ఆటో శివ, అయ్యస్వామి, శీను, తిరుపాలు కోరారు. 3 నెలలుగా మురుగు కాలువలను శుభ్రం చేయడం లేదని హరినాథ్‌రెడ్డి, హరిశ్చంద్రారెడ్డి ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ బాబు వస్తే జాబు గ్యారంటీ అంటూ నిరుద్యోగులను దగా చేశారన్నారు. రాష్ట్రంలో కరువు విలయతాండవం చేస్తుంటే పరిహారం ఇవ్వకుండా రైతులను మోసం చేస్తున్నాడని ఆరోపించారు. కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ మైనార్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు ఫిరోజ్, ఎస్సీ సెల్ సభ్యుడు అల్లిపీర, అర్బన్ 14 వార్డుల ఇన్చార్జ్ బెల్లం మహేశ్వరరెడ్డి, 19, 20, 21, 26, 29, 33, 35వ వార్డుల ఇన్చార్జ్ లు పాల్గొన్నారు. -
డ్వాక్రా మహిళలను నిండా ముంచారు
ప్రభుత్వంపై ధ్వజమెత్తిన ప్రతిపక్ష ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి సాక్షి, హైదరాబాద్: డ్వాక్రా మహిళల రుణాలు మాఫీ చేస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత టీడీపీ ప్రభుత్వం వారిని నిండా ముంచిందని విపక్ష వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి ధ్వజమెత్తారు.శనివారం పద్దుల మీద జరిగిన చర్చలో ఆమె పాల్గొన్నారు. గత రెండు బడ్జెట్లలో మహిళలకు అన్యాయం చేశారని.. ఈ బడ్జెట్లోనూ నిరాశే మిగిల్చిందన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా వైఎస్ రాజశేఖరరెడ్డి మహిళలకు పావలా వడ్డీకే రుణాలు ఇచ్చారని, కానీ ఈ ప్రభుత్వం మహిళలను మరింత చిక్కుల్లోకి నెట్టిందని ఆవేదన వ్యక్తం చేశారు. -
'రుణాల మాఫీ కాదు... హామీనే మాఫీ చేశారు'
హైదరాబాద్: డ్వాక్రా మహిళల రుణాలు మాఫీ చేస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత టీడీపీ ప్రభుత్వం మహిళలను నిండా ముంచిందని విపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి ధ్వజమెత్తారు. శనివారం పద్దుల మీద జరిగిన చర్చలో ఆమె మాట్లాడుతూ... డ్వాక్రా రుణాలు మాఫీ చేయడం కాకుండా, ఎన్నికల్లో ఇచ్చిన హామీనే ప్రభుత్వం మాఫీ చేసిందని ఎద్దేవా చేశారు. గత రెండు బడ్జెట్లలో మహిళలకు అన్యాయం చేసిన టీడీపీ ప్రభుత్వం.. ఈ బడ్జెట్లోనూ నిరాశే మిగిల్చిందన్నారు. రుణాలు మాఫీ అవుతాయనే ఉద్దేశంతో డ్వాక్రా మహిళలు రుణాలు చెల్లించకపోవడంతో సాధారణ వడ్డీలకు తోడు అపరాధ వడ్డీలు చెల్లించాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన సమయంలో 84 లక్షల మంది డ్వాక్రా మహిళలు రుణాలు తీసుకోగా, 2014-15 ఆర్థిక సంవత్సరంలో 35 లక్షల మంది, 2015-16లో 46 లక్షల మంది రుణాలు పొందారని వివరించారు. మిగిలిన మహిళలు బ్యాంకు రుణాలకు దూరంగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. రుణాలు మొత్తం మాఫీ చేస్తామని చెప్పి, ఇప్పుడు ఒక్కొక్కరికి రూ. 3 వేలు ఇస్తామంటున్నారని ఆమె చెప్పారు. 84 లక్షల మందికి రూ. 3 వేల చొప్పున ఇచ్చినా రూ. 2,500 కోట్లు కావాలని, కానీ ప్రభుత్వం రూ. 1000 కోట్లు మాత్రమే బడ్జెట్లో కేటాయించిందని.. అంటే మిగతా రూ. 1500 కోట్లు ఎగనామం పెడతారని అర్థమవుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. బెల్టు షాపులు రద్దు చేస్తామని రెండో సంతకం పెట్టారని, కానీ గ్రామాల్లో బెల్ట్ షాపులు ఎక్కువవుతున్నాయే గానీ, తగ్గడం లేదన్నారు. ప్రభుత్వం చెబుతున్న రెండంకెల వృద్ధి.. మద్యం అమ్మకాల్లోనే అని ఎద్దేవా చేశారు. దేశంలో ఎక్కడా లేని విధంగా వైఎస్ రాజశేఖరరెడ్డి మహిళలకు పావలా వడ్డీకే రుణాలు ఇచ్చారని, కానీ ఈ ప్రభుత్వం మహిళలను మరింత చిక్కుల్లోకి నెట్టిందని గౌరు చరితారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. -
చంద్రబాబు మైండ్ గేమ్ ఆడుతున్నారు...
హైదరాబాద్ : కర్నూలు జిల్లాకు చెందిన వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలు ఎవ్వరూ పార్టీని వీడరని, గతంలో కూడా ఈ విషయాన్ని స్పష్టం చేశామని ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి అన్నారు. తాము పార్టీని వీడుతున్నామంటు మీడియా దుష్ప్రచారం చేసిందని ఆయన శనివారమిక్కడ ఆవేదన వ్యక్తం చేశారు. కర్నూలు జిల్లాకు చెందిన వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలు పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా బుడ్డా రాజశేఖరరెడ్డి మాట్లాడుతూ...' చంద్రబాబు మైండ్ గేమ్ ఆడుతున్నారు. మీడియాలో ప్రతిరోజు వైఎస్ఆర్ సీపీకి వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారు. పార్టీలో అభద్రతా భావం తీసుకు రావాలని మీడియా ప్రయత్నిస్తోంది. ఎన్నికల్లో ఇచ్చిన ఒక్క హామీనైనా టీడీపీ నెరవేర్చగలిగిందా?. తెలంగాణలో టీడీపీ ఖాళీ అయిపోయింది. టీడీపీ చెప్పినట్లు చానల్స్ ఆడటం సరికాదు. మీడియా పట్ల మాకు గౌరవం ఉంది. దాన్ని నిలుపుకోవాలి' అని అన్నారు. మాపై ఎందుకు అభాండాలు పార్టీ మార్పు ప్రచారాన్ని తాము పదేపదే ఖండించామని, తోక పార్టీ మీడియాలు తమపై ఎందుకు అభాండాలు వేస్తున్నాయో అర్థం కావడం లేదని ఎమ్మెల్యే ఐజయ్య అన్నారు. తమ పేర్లు పెట్టి ఎందుకు మీడియా ప్రచారం చేస్తుందోనని, మీడియా ప్రచారాల వల్ల ప్రజలు తమని నిలదీస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. అలాంటిది ఎన్నిసార్లు వివరణ ఇచ్చినా మళ్లీ ఎందుకు బురద చల్లుతున్నారో తెలియట్లేదన్నారు. సీమ ప్రజలను టీడీపీ పూర్తిగా విస్మరించింది వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంలోనే తాము కొనసాగుతామని ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి తెలిపారు. రాయలసీమ ప్రజలను టీడీపీ పూర్తిగా విస్మరించిందని, ఉన్న టీడీపీ ఎమ్మెల్యేల వల్లే ఒక్క పనీ కావడం లేదని ఆమె అన్నారు. అమరావతి, ఉత్తరాంధ్ర వైపు చంద్రబాబు దృష్టి పెడుతున్నారని, సీమను ఏమాత్రం పట్టించుకోవడం లేదన్నారు. ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ప్రజల దృష్టిని మరల్చేందుకు వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలు టీడీపీలో చేరుతున్నారంటూ అసత్యాలు ప్రచారం చేస్తున్నారన్నారు. -
తేలుకుట్టిన దొంగల్లా టీడీపీ నేతలు: రోజా
హైదరాబాద్: బెజవాడలో కాల్‌మనీ సెక్స్‌రాకెట్ వ్యవహారంపై ఏసీ అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో చర్చ జరిపి బాధితులకు న్యాయం చేయాలని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా డిమాండ్ చేశారు. ఏపీ అసెంబ్లీలో గందరగోళం నెలకొనడంతో రెండోసారి కూడా వాయిదా పడింది. అనంతరం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద రోజా మాట్లాడుతూ.. కాల్‌మనీ వ్యవహారంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రులు, ఎమ్మెల్యేల డబ్బులన్నాయిని ఆమె ఆరోపించారు. అందుకే తేలుకుట్టిన దొంగల్లా నిందితులందరూ సహకరించుకుంటున్నారని విమర్శించారు. బుద్దా వెంకన్న, బోడె ప్రసాద్‌ను ఇప్పటివరకూ ఎందుకు అరెస్ట్ చేయలేదని ప్రశ్నించారు. నిందితులను అరెస్ట్ చేస్తేనే బాధితులకు న్యాయం జరుగుతుందని అన్నారు. అధికార పార్టీ నేతలే కాల్ మనీ సెక్స్ రాకెట్ సూత్రధారులని ఆమె చెప్పారు. కాల్‌మనీ వ్యవహారం వెనుక ఉన్న టీడీపీ పెద్దలందరినీ బయటకు లాగాలని రోజా డిమాండ్ చేశారు. ఈ కాల్‌మనీ ఘటనతో ఎన్నో కుటుంబాలు రోడ్డున పడ్డాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంత జరుగుతున్నా చంద్రబాబుకు మహిళల బాధలు పట్టడం లేదని దుయ్యబట్టారు. ఆఫీసుకెళ్లాలంటే ఉద్యోగినులు, కాలేజీలకు వెళ్లాలంటే విద్యార్థినులు భయపడుతున్నారని వాపోయారు. వనజాక్షి, రిషితేశ్వరి కేసులను చంద్రబాబు గాలికొదిలేశారని మండిపడ్డారు. ఇప్పుడు కాల్‌మనీ సెక్స్ రాకెట్ కేసును అలానే చేయాలనుకుంటున్నారని రోజా విమర్శించారు. నిందితులకు ప్రభుత్వం వంత పాడుతోంది: గౌరు చరితారెడ్డి కాల్‌మనీ సెక్స్‌రాకెట్ నిందితులకు ఏపీ ప్రభుత్వం వంత పాడుతోందని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే గౌరు చరితా రెడ్డి విమర్శించారు. ఈ కాల్‌మనీ కేసులో ఉన్న టీడీపీ నేతలను వెంటనే అరెస్ట చేయాలని ఆమె డిమాండ్ చేశారు.