సాక్షి, హైదరాబాద్ : కర్నూలు జిల్లా పాణ్యం అసెంబ్లీ నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి గౌరు చరితారెడ్డి నోట జై జగన్ అనే మాట రావడంతో తెలుగు తమ్ముళ్లు అవాక్కయ్యారు. ప్రచారంలో భాగంగా ఓ గ్రామానికి వెళ్లిన ఆమె.. తనకు ఓటేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఇక తన ప్రసంగాన్ని ముగిస్తూ జై జగన్ అంటూ నాలుక్కరుచుకున్నారు. దీంతో అక్కడున్నవారంతా షాక్‌కు గురయ్యారు. వెంటనే ఆమె జై చంద్రబాబు అంటూ తన తప్పిదాన్ని సవరించుకునే ప్రయత్నం చేశారు. ఇక ‘మేడం మీరే జై జగన్ అంటున్నారు ఏందీ..’ అంటూ అక్కడి కార్యకర్తలు ఆమెను ప్రశ్నించారు.
దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట హల్‌చల్ చేస్తోంది. ఈ వీడియో నెటిజన్లు తమకు తోచిన కామెంట్స్ చేస్తున్నారు. మేడమ్ మీరు పార్టీ మారారు.. మర్చిపోయారా? అని ఒకరు.. పార్టీ మారినా మనసంతా వైఎస్సార్‌సీపీపైనే అని మరొకరు సెటైర్లు వేస్తున్నారు. వైఎస్ జగన్ గెలుపు కాయమని టీడీపీ అభ్యర్థులు ఫిక్సయ్యారని, అందుకే వారి నోట జననేత పేరు వస్తుందని అభిప్రాయపడుతున్నారు. సరిగ్గా ఎన్నికల ముందే గౌరుచరితా రెడ్డి పార్టీ మారిన విషయం తెలిసిందే. 2014లో జరిగిన ఎన్నికల్లో పాణ్యం వైసీపీ అభ్యర్థిగా గౌరు చరిత పోటీ చేసి గెలుపొందారు.
Comments
Please login to add a commentAdd a comment