మోసం..బాబు నైజం
♦ ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి
♦ 31వ వార్డులో ‘వైఎస్‌ఆర్ కుటుంబం’
కల్లూరు:
మోసం చేయడం సీఎం చంద్ర బాబు నైజమని పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి అన్నారు. శుక్రవారం కల్లూరు అర్బన్ 31వ వార్డు ముజఫర్‌నగర్‌లో వార్డు ఇన్‌చార్జ్ మంచాల సు«ధాకరరెడ్డి అధ్యక్షతన వైఎస్‌ఆర్ కుటుంబం కార్యక్రమాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. ఇంటింటికి తిరుగుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు మోసాలను వివరించారు. వైఎస్‌ఆర్ కుటుంబంలో 20 మంది కుటుంబ సభ్యులను చేర్చి సభ్యత్వాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. వైఎస్సార్ అమలు చేసిన సంక్షేమ పథకాలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తూట్లు పొడుస్తున్నారని విమర్శించారు. తమ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిని సీఎం అయితే నవరత్నాల పథకాలు అమలవుతాయని వివరించారు. కార్యక్రమంలో వార్డు బూత్ కమిటీ కన్వీనర్లు మూర్తిరెడ్డి, మనోహర్‌రెడ్డి, మోహన్, శివ, రాజు, కబీర్, సుంకన్న, మాదన్న, ఆనంద్, కుమార్, పరమేష్, శీను, ఎల్లరాముడు, వాజిద్, మహ్మద్, ప్రసాద్, సిరాజ్, మైనార్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు ఫిరోజ్ తదితరులు పాల్గొన్నారు.
19వ వార్డు ఇన్‌చార్జ్ సురేంద్రరెడ్డి అధ్యక్షతన కల్లూరు అర్బన్ ఇన్‌చార్జీ బెల్లం మహేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో మారుతి నగర్‌లో వైఎస్‌ఆర్ కుటుంబం కార్యక్రమాన్ని ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి ప్రారంభించారు. మూడేళ్ల పాలన ప్రజా వ్యతిరేకంగా, రాజ్యాంగ విరుద్ధఃగా సాగుతుందని కాలనీవాసులకు వివరించారు. కార్యక్రమంలో బూత్ కమిటీ కన్వీనర్లు, సభ్యులు అశోక్‌రెడ్డి, శ్రీనివాసరెడ్డి, రామిరెడ్డి, చిన్నా, 20వ వార్డు ఇన్‌చార్జ్ పల్లె రఘునాథ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
కల్లూరుపై వివక్ష చూపొద్దు – ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి
కల్లూరు : అభివద్ధి విషయంలో కల్లూరు కాలనీలపై వివక్ష చూపొద్దని మున్సిపల్ కమిషనర్ హరినాథ్ రెడ్డికి పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి సూచించారు. శుక్రవారం మున్సిపల్ కమిషనర్‌కు ఆయన చాంబర్‌లోనే సమస్యలను వివరించారు. కల్లూరు అర్బన్ వార్డుల్లో అభివద్ధి జరగడం లేదన్నారు. అనేక కాలనీల్లో సీసీ రోడ్లు, మురుగు కాలువలు లేవన్నారు. మూడు రోజులకు ఒకసారి తాగునీరు సరఫరా చేస్తున్నారని తెలిపారు. మౌలిక సదుపాయాల కల్పనలో పక్షపాతం చూపొద్దని విన్నవించారు. ఇప్పటికే భూమి పూజ నిర్వహించిన పనులు కూడా సక్రమంగా జరగడం లేదన్నారు. కార్యక్రమంలో వైఎస్‌ఆర్‌సీపీ అర్బన్ ఇన్‌చార్జ్ బెల్లం మహేశ్వరరెడ్డి, 19వ ఆవర్డు ఇన్‌చార్జ్ సురేంద్రరెడ్డి, నాయకులు అశోక్‌రెడ్డి, రామిరెడ్డి, యశ్వంత్‌రెడ్డి, శివకష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.