ఎన్నికలు సమీపిస్తున్న వేళ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మహిళపై కపట ప్రేమ చూసిస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే చరితారెడ్డి విమర్శించారు. శనివారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. గత ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు మహిళలకు అనేక హామీలు ఇచ్చి మోసం చేశారని, మళ్లీ ఇప్పుడు ‘పసుపు - కుంకుమ’ పథకం పేరుతో మరో సారి మోసం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.