‘పసుపు కుంకుమ’తో మరో మోసం | YSRCP MLA Charitha Reddy Fires On Chandrababu Naidu | Sakshi
Sakshi News home page

‘పసుపు కుంకుమ’తో మరో మోసం

Published Sat, Jan 26 2019 7:08 PM | Last Updated on Sun, Jan 27 2019 7:56 AM

YSRCP MLA Charitha Reddy Fires On Chandrababu Naidu - Sakshi

సాక్షి, కర్నూలు  : ఎన్నికలు సమీపిస్తున్న వేళ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మహిళపై కపట ప్రేమ చూసిస్తున్నారని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే చరితారెడ్డి విమర్శించారు. శనివారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. గత ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు మహిళలకు అనేక హామీలు ఇచ్చి మోసం చేశారని, మళ్లీ ఇప్పుడు ‘పసుపు - కుంకుమ’ పథకం పేరుతో మరో సారి మోసం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. మూడు విడతలుగా రుణాలు మాఫీ చేస్తామని చెప్పిన చంద్రబాబు ఇంత వరకూ ఒక్క రూపాయి కూడా మాఫీ చేయలేదన్నారు.

 తన ఓటు బ్యాంకు కోసం గత నాలుగున్నరేళ్లుగా నెరవేర్చని హామీలను ఇప్పుడు చేస్తామంటూ.. చంద్రబాబు కపట ప్రేమను చూపిస్తున్నారని మండిపడ్డారు. ఎన్నికలు దగ్గర పడడడంతో మళ్లీ చంద్రబాబు మాయమాటలు చెబుతున్నారని విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబుకు మహిళలందరూ గట్టిగా బుద్ది చెప్పాలని కోరారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement