‘ప్రత్యేక హోదా పోరుకు కలిసి రండి’
‘ప్రత్యేక హోదా పోరుకు కలిసి రండి’
Published Tue, Jan 24 2017 1:52 PM | Last Updated on Sat, Mar 23 2019 9:10 PM
- జల్లికట్టు స్ఫూర్తితో ముందుకు సాగుదాం
– 26న కొవ్వొత్తుల ప్రదర్శనను జయప్రదం చేయండి
-వివిధ వర్గాల ప్రజలకు వైఎస్‌ఆర్‌సీపీ నేతల పిలుపు
కర్నూలు(ఓల్డ్‌సిటీ): తమిళనాడు ప్రజలు పోరాడి సాధించుకున్న జల్లికట్టు క్రీడను స్ఫూర్తిగా తీసుకుని మనం ఏపీకి ప్రత్యేక హోదాను సాధించుకుందామని పాణ్యం శాసన సభ్యురాలు గౌరు చరితారెడ్డి పిలుపునిచ్చారు. మంగళవారం స్థానిక కృష్ణకాంత్ ప్లాజాలోని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నందికొట్కూరు శాసన సభ్యుడు ఐజయ్య, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి.వై.రామయ్యలతో కలిసి గౌరుచరిత విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్ర విభజన చట్టం ప్రకారం ప్రత్యేక హోదా మన హక్కు అనా్నరు. అయితే, ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేక ప్యాకేజీకి మొగ్గు చూపడంతో హోదా విషయంలో మనకు అనా్యయం జరిగిందన్నారు.
హోదాతోనే రాష్ట్రాభివృద్ధి, యువతకు ఉద్యోగ అవకాశలు లభిస్తాయని తమ పార్టీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి అలుపెరగని పోరాటం చేస్తున్నారని చెప్పారు. ఆయన పిలుపు మేరకు ప్రత్యేక హోదా కోసం ఈనెల 26వ తేదీన సాయంత్రం 5 గంటలకు స్థానిక జెడ్పీ కార్యాలయ సమీపంలోని గాంధీ విగ్రహం వద్ద కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించనున్నామన్నారు. యువకులు, విద్యార్థులు, అన్నివర్గాల ప్రజలు పార్టీలు, రాజకీయాలకు అతీతంగా పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.
దండుకునేందుకే ప్యాకేజీపై మొగ్గు
లక్షల కోట్లు వస్తే దండుకోవచ్చనే ముఖ్యమంత్రి చంద్రబాబుతో సహా టీడీపీ నాయకులు ప్యాకేజీకి మొగ్గు చూపిస్తున్నారని నందికొట్కూరు శాసన సభ్యుడు ఐజయ్య ఆరోపించారు. ఎన్నికలకు ముందు ముఖ్యమంత్రితో పాటు కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు పోటీపడి ప్రత్యేక హోదాపై ప్రకటనలు చేశారని, అధికారంలోకి వచ్చాక ఆ ఊసే ఎత్తడం లేదని మండిపడ్డారు. విభజన చట్టం ప్రకారం రాష్ట్రానికి హోదా ఇవ్వాల్సిందేనన్నారు. లేదంటే ప్రజల తిరుగుబాటు చూడాల్సి వస్తుందని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు హెచ్చరించారు. ఈనెల 26న జరిగే కొవ్వొత్తుల ప్రదర్శన అందులో ఓ భాగమన్నారు.
హోదా ఉద్యమంలో కలిసి రండి..
శరీరంలో చీము, నెత్తురు ఉంటే ప్రత్యేక హోదా సాధన ఉద్యమంలో తమతో కలిసి రావాలని వైఎస్‌ఆర్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి.వై.రామయ్య టీడీపీ నాయకులను కోరారు. ప్రత్యేక హోదా సాధనలో ముందుండాల్సిన ముఖ్యమంత్రి ధర్నాలు, బంద్‌లు చేయొద్దంటూ ఆర్డినెన్స్‌లు జారీ చేయడం సరికాదన్నారు. నిషేధించిన జల్లికట్టు క్రీడను ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కేంద్రంతో పోరాడి సాధించుకున్నారని మన ముఖ్యమంత్రి తన స్వార్థం కోసం హోదాను కేంద్రానికి తాకట్టు పెట్టారని ఆరోపించారు. నిధులు తీసుకొస్తానంటూ విదేశాలకు తిరుగుతూ ప్రజాధనం వృథా చేస్తున్నారని ఆరోపించారు.
అనంతరం పార్టీ జిల్లా అధికార ప్రతినిధి తోట వెంకటకృష్ణారెడ్డి మాట్లాడారు. కార్యక్రమంలో ఎస్సీసెల్ రాష్ట్ర కార్యదర్శి సి.హెచ్.మద్దయ్య, సేవాదళ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి.సత్యంయాదవ్, రైతు విభాగం రాష్ట్ర సంయుక్త కార్యదర్శి పిట్టం ప్రతాప్‌రెడ్డి, నగర అధ్యక్షుడు పి.జి.నరసింహులు యాదవ్, యువజన, ట్రేడ్‌యూనియన్, మహిళా విభాగాల అధ్యక్షులు పి.రాజా విష్ణువర్దన్‌రెడ్డి, టి.వి.రమణ, శౌరి విజయకుమారి, నగర నాయకులు గోపినాథ్ యాదవ్, సురేశ్, ఈశ్వర్, బుజ్జి, మంగమ్మ తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement