mla isaiah
-
హోదాపై చంద్రబాబుది పూటకో మాట
సాక్షి, కర్నూలు : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీరుపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఐజయ్య మండిపడ్డారు. నాలుగేళ్లుగా చంద్రబాబు పరిపాలన అంతా అవినీతిమయంగా మారిందని ధ్వజమెత్తారు. కేవలం రెండు ఎకరాల ఆసామి అయిన చంద్రబాబుకు లక్ష వేల కోట్ల రూపాయలు ఎక్కడినుండి వచ్చాయో చెప్పాలని నిలదీశారు. శనివారం కర్నూలులో ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రత్యేక హోదాపై చంద్రబాబు పూటకో మాట మాట్లాడుతూ.. ఏపీ ప్రజలను మోసం చేస్తున్నారని మండిపడ్డారు. పార్లమెంటులో వైఎస్ఆర్సీపీ అవిశ్వాస తీర్మానానికి మద్దత్తు ఇస్తానని చెప్పిన చంద్రబాబు ఇప్పుడు మళ్ళీ యూటర్న్ తీసుకున్నారని ఆరోపించారు. బీజేపీతో కాపురం చేసి 24 సార్లు ఢిల్లీకి వెళ్ళానని చెప్తున్న చంద్రబాబు ఏం సాధించాడో ప్రజలకు చెప్పాలన్నారు. నాలుగేళ్లు గడిచినా ఒక్క నిరుద్యోగికైనా చంద్రబాబు ఉద్యోగం కల్పించారా అని ప్రశ్నించారు. శేఖర్ రెడ్డికి, లోకేష్ బాబుకు మధ్య ఏం సంబంధం ఉందో చంద్రబాబు బయటపెట్టాలని డిమాండ్ చేశారు. శేఖర్ రెడ్డిని అడ్డుపెట్టుకొని లోకేష్ వేల కోట్లు సంపాదించారని ఆరోపించారు. ప్రత్యేక హోదా కోసం సోమవారం పార్లమెంటులో చేపట్టనున్న అవిశ్వాస తీర్మానానికి మద్దతుగా ప్రజలతో మమేకమై ప్రజాసంకల్ప మానవహారం చేపట్టబోతున్నామని ఐజయ్య వెల్లడించారు. -
ఎమ్మెల్యేపై పిటిషన్ కొట్టివేత
హైదరాబాద్: కర్నూలు జిల్లా నందికొట్కూరు ఎమ్మెల్యే ఐజయ్య ఎస్సీ కాదంటూ వేసిన పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. ఐజయ్య ఎస్సీ కులానికి చెందిన వారు కాదంటూ, తప్పుడు పత్రాలు సృష్టించి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడంటూ పిటిషన్లో గుంపుల రవికుమార్ అనే వ్యక్తి పేర్కొన్నాడు. అయితే కేసు విచారణకు వచ్చే సమయానికి గుంపుల రవి కుమార్ అనారోగ్యంతో మృతిచెందడంతో కేసును న్యాయమూర్తి కొట్టేశారు. -
ఆంధ్రజ్యోతికి బాగా అలవాటైపోయింది..
కర్నూలు : ఆంధ్రజ్యోతి దినపత్రికపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఐజయ్య తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గిరిజన ఎమ్మెల్యేలను వైఎస్ జగన్ అవమానించారనడం అవాస్తవమని ఆయన గురువారమిక్కడ అన్నారు. మేం వేసిన రోడ్లపై నడుస్తూ, మేం ఇచ్చిన పెన్షన్లు తీసుకుంటూ, మాకు ఓటు వేయరా అని ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడినప్పుడు ఎల్లో మీడియా ఎందుకు స్పందించలేదని ఐజయ్య సూటిగా ప్రశ్నించారు. తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌పై బురద చల్లడం ఆంధ్రజ్యోతికి బాగా అలవాటైందని ఆయన ధ్వజమెత్తారు. బీరు హెల్దీ డ్రింక్ అని మంత్రి జవహర్ మాట్లాడినా...ఎల్లో మీడియా ఎందుకు పట్టించుకోలేదని గుర్తు చేశారు. కాగా రాష్ట్రపతి అభ్యర్థి రామ్‌నాథ్ కోవింద్ పరిచయ కార్యక్రమంలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దళిత, గిరిజన ఎమ్మెల్యేలపై ఆగ్రహం ప్రదర్శించారంటూ ఆంధ్రజ్యోతి పత్రికలో బుధవారం ఓ కథనం ప్రచురించిన విషయం తెలిసిందే. -
కాంట్రాక్టర్ల కోసమే హంద్రీనీవా విస్తరణ పనులు
- నందికొట్కూరు ఎమ్మెల్యే ఐజయ్య పగిడ్యాల: కాంట్రాక్టర్లను బతికించడానికే రూ. 1000 కోట్లతో హంద్రీనీవా సుజల స్రవంతి కాలువ విస్తరణ పనులను టెండర్లు పిలిచారని నందికొట్కూరు ఎమ్మెల్యే వై. ఐజయ్య ఆరోపించారు. సోమవారం వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ రమాదేవి స్వగృహంలో కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హంద్రీనీవా కాలువకు సంబంధించి పిల్ల కాలువలు, నీటి కుంటలు, తూములు ఏర్పాటు చేయకుండా విస్తరణ పనులు చేసి పలమనేరుకు నీరు తరలించాలని చూస్తే సహించబోమన్నారు. విస్తరణ పనులను అడ్డుకుంటామని హెచ్చరించారు. రెండు పంప్‌లను పూర్తి చేయించి ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకాన్ని జాతికి అంకితం చేయడంలోని ఆంతర్యమేమిటో చెప్పాలన్నారు. జూన్ ఒకటో తేదీన నందికొట్కూరు పట్టణం అక్షర శ్రీ పాఠశాలలో వైఎస్సార్సీపీ నియోజకవర్గ ఫ్లీనరీ నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. టీడీపీ మోసాలను ప్రజల ముందు ఉంచి పలు తీర్మానాలను చేస్తామన్నారు. టీడీపీ మహానాడుకు ఎన్టీఆర్ కుటుంబ సభ్యులైన హరికృష్ణ, బాలకృష్ణలకు ఆహ్వానించకపోవడం విచారకరమన్నారు. సీఎం చంద్రబాబు నాయుడు.. తన మూడేళ్ల పాలనలో ఎన్నికల వాగ్దానాలను పూర్తిగా విస్మరించి అన్ని వర్గాల ప్రజలను మోసం చేశారని ధ్వజమెత్తారు. విలేకరుల సమావేశంలో వైఎస్సార్సీపీ నాయకులు గంగి రవి, రమణారెడ్డి, వెంకటరామిరెడ్డి, భూపాల్‌రెడ్డి, చిట్టిరెడ్డి, కిరణ్‌రెడ్డి, డీలర్ నారాయణ, పక్కిరెడ్డి, ఇస్మాయిల్, నరసింహులు, బోయ జయరాముడు తదితరులు పాల్గొన్నారు. -
‘ఆయన హత్య వార్త విని దిగ్భ్రాంతి చెందా’
కర్నూలు: ‘నిన్ననే నారాయణరెడ్డి ఆప్యాయంగా పలకరించారు. 30న జరగనున్న వైఎస్పార్ సీపీ ప్లీనరీ గురించి చర్చించారు. ఇవాళ ఆయన హత్య వార్త విని దిగ్భ్రాంతికి గురయ్యాన’ని వైఎస్సార్ సీపీ ఎంపీ బుట్టా రేణుక అన్నారు. పత్తికొండ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి చెరుకులపాడు నారాయణ రెడ్డిని ప్రత్యర్థులు కిరాతకంగా హత్య చేయడాన్ని ఆమె ఖండించారు. రాజకీయ పార్టీ నాయకుల కదలికలపై పోలీసులకు సమాచారం ఉంటుందని, ఇలాంటి ఘటనలను అరికట్టాల్సిన బాధ్యత పోలీసులదే అన్నారు. నారాయణరెడ్డి మృతి బాధాకరమని వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే ఐజయ్య వ్యాఖ్యానించారు. చంద్రబాబు అండతోనే టీడీపీ నేతలు రెచ్చిపోతున్నారని మండిపడ్డారు. చంద్రబాబు ఆదేశాలతోనే దౌర్జన్యాలకు దిగుతున్నారని ఆరోపించారు. నారాయణరెడ్డి రాబోయే ఎన్నికల్లో గెలిచే అభ్యర్థి అని, అదును చూసి ఆయనను హత్య చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. -
‘ఆయన హత్య వార్త విని దిగ్భ్రాంతి చెందా’
-
ఇళ్ల మధ్య ఓపెన్ బ్లాస్టింగ్ తగదు
- పారుమంచాలలో దెబ్బతిన్న గృహాలను పరిశీలించిన ఎమ్మెల్యే - బాధితులకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ పారుమంచాల(జూపాడుబంగ్లా): నివాస గృహాల మధ్య ఓపెన్ బ్లాస్టింగ్ చేయడం తగదని నందికొట్కూరు ఎమ్మెల్యే ఐజయ్య కాంట్రాక్టర్‌ను హెచ్చరించారు. బ్లాసి్టంగ్తో ఇళ్లు దెబ్బతింటున్నాయని చెప్పారు. శుక్రవారం ఎమ్మెల్యే గ్రామానికెళ్లి దెబ్బతిన్న గృహాలను పరిశీలించారు. బాధిత ప్రజలతో మాటా్లడి న్యాయం జరిగేలా చూస్తానని భరోసా ఇచ్చారు. పారుమంచాల వంతెన నిర్మాణంలో భాగంగా పునాదులను కూలీలు, యంత్రాలతో చేయిస్తే ఖర్చు ఎక్కువవుతుందని, బ్లాస్టింగ్ చేయిస్తే సహించనన్నారు. ప్రజల అనుమతులు లేకుండా ఇలా చేయడం చట్టరీత్యనేరమన్నారు. బ్లాస్టింగ్‌తో ఇప్పటికే చాలా ఇళు్ల దెబ్బతిన్నాయని, వాటికి పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. అనంతరం వంతెన నిర్మాణం పనులను పరిశీలించారు. వంతెన పనులు దక్కించుకున్న కాంట్రాక్టరే, ఈ పనులు చేపట్టాలని, సబ్‌కాంట్రాక్టర్‌ను తొలగించాలన్నారు. అలాగే వంతెన నిర్మాణాన్ని నిర్ణీత సమయంలో పూర్తిచేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ విజయ్‌కుమార్, చంద్రశేఖరరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
‘ప్రత్యేక హోదా పోరుకు కలిసి రండి’
- జల్లికట్టు స్ఫూర్తితో ముందుకు సాగుదాం – 26న కొవ్వొత్తుల ప్రదర్శనను జయప్రదం చేయండి -వివిధ వర్గాల ప్రజలకు వైఎస్ఆర్సీపీ నేతల పిలుపు కర్నూలు(ఓల్డ్‌సిటీ): తమిళనాడు ప్రజలు పోరాడి సాధించుకున్న జల్లికట్టు క్రీడను స్ఫూర్తిగా తీసుకుని మనం ఏపీకి ప్రత్యేక హోదాను సాధించుకుందామని పాణ్యం శాసన సభ్యురాలు గౌరు చరితారెడ్డి పిలుపునిచ్చారు. మంగళవారం స్థానిక కృష్ణకాంత్ ప్లాజాలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నందికొట్కూరు శాసన సభ్యుడు ఐజయ్య, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి.వై.రామయ్యలతో కలిసి గౌరుచరిత విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్ర విభజన చట్టం ప్రకారం ప్రత్యేక హోదా మన హక్కు అనా్నరు. అయితే, ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేక ప్యాకేజీకి మొగ్గు చూపడంతో హోదా విషయంలో మనకు అనా్యయం జరిగిందన్నారు. హోదాతోనే రాష్ట్రాభివృద్ధి, యువతకు ఉద్యోగ అవకాశలు లభిస్తాయని తమ పార్టీ అధినేత జగన్మోహన్రెడ్డి అలుపెరగని పోరాటం చేస్తున్నారని చెప్పారు. ఆయన పిలుపు మేరకు ప్రత్యేక హోదా కోసం ఈనెల 26వ తేదీన సాయంత్రం 5 గంటలకు స్థానిక జెడ్పీ కార్యాలయ సమీపంలోని గాంధీ విగ్రహం వద్ద కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించనున్నామన్నారు. యువకులు, విద్యార్థులు, అన్నివర్గాల ప్రజలు పార్టీలు, రాజకీయాలకు అతీతంగా పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. దండుకునేందుకే ప్యాకేజీపై మొగ్గు లక్షల కోట్లు వస్తే దండుకోవచ్చనే ముఖ్యమంత్రి చంద్రబాబుతో సహా టీడీపీ నాయకులు ప్యాకేజీకి మొగ్గు చూపిస్తున్నారని నందికొట్కూరు శాసన సభ్యుడు ఐజయ్య ఆరోపించారు. ఎన్నికలకు ముందు ముఖ్యమంత్రితో పాటు కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు పోటీపడి ప్రత్యేక హోదాపై ప్రకటనలు చేశారని, అధికారంలోకి వచ్చాక ఆ ఊసే ఎత్తడం లేదని మండిపడ్డారు. విభజన చట్టం ప్రకారం రాష్ట్రానికి హోదా ఇవ్వాల్సిందేనన్నారు. లేదంటే ప్రజల తిరుగుబాటు చూడాల్సి వస్తుందని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు హెచ్చరించారు. ఈనెల 26న జరిగే కొవ్వొత్తుల ప్రదర్శన అందులో ఓ భాగమన్నారు. హోదా ఉద్యమంలో కలిసి రండి.. శరీరంలో చీము, నెత్తురు ఉంటే ప్రత్యేక హోదా సాధన ఉద్యమంలో తమతో కలిసి రావాలని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి.వై.రామయ్య టీడీపీ నాయకులను కోరారు. ప్రత్యేక హోదా సాధనలో ముందుండాల్సిన ముఖ్యమంత్రి ధర్నాలు, బంద్‌లు చేయొద్దంటూ ఆర్డినెన్స్‌లు జారీ చేయడం సరికాదన్నారు. నిషేధించిన జల్లికట్టు క్రీడను ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కేంద్రంతో పోరాడి సాధించుకున్నారని మన ముఖ్యమంత్రి తన స్వార్థం కోసం హోదాను కేంద్రానికి తాకట్టు పెట్టారని ఆరోపించారు. నిధులు తీసుకొస్తానంటూ విదేశాలకు తిరుగుతూ ప్రజాధనం వృథా చేస్తున్నారని ఆరోపించారు. అనంతరం పార్టీ జిల్లా అధికార ప్రతినిధి తోట వెంకటకృష్ణారెడ్డి మాట్లాడారు. కార్యక్రమంలో ఎస్సీసెల్ రాష్ట్ర కార్యదర్శి సి.హెచ్.మద్దయ్య, సేవాదళ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి.సత్యంయాదవ్, రైతు విభాగం రాష్ట్ర సంయుక్త కార్యదర్శి పిట్టం ప్రతాప్‌రెడ్డి, నగర అధ్యక్షుడు పి.జి.నరసింహులు యాదవ్, యువజన, ట్రేడ్‌యూనియన్, మహిళా విభాగాల అధ్యక్షులు పి.రాజా విష్ణువర్దన్‌రెడ్డి, టి.వి.రమణ, శౌరి విజయకుమారి, నగర నాయకులు గోపినాథ్ యాదవ్, సురేశ్, ఈశ్వర్, బుజ్జి, మంగమ్మ తదితరులు పాల్గొన్నారు. -
ముచ్చుమర్రికి ఆద్యుడు వైఎస్ఆర్
ముఖ్యమంత్రికి ఎమ్మెల్యే సూటి ప్రశ్న - సభలో మాట్లాడుతుంటే మైక్ కట్ చేయిస్తారా అంటూ మండిపాటు - వైఎస్సార్సీపీ నుంచి బయటకు వెళ్లిన ఎమ్మెల్యేలు సినిమా డైలాగులు చెప్పడం దెయ్యాలు వేదాలు వల్లించడమే.. - విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే ఐజయ్య ఆగ్రహం నెహ్రూనగర్(పగిడ్యాల): ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకాన్ని జాతికి అంకితం చేసినట్లు గొప్పగా చెప్పుకోవడం కాదు.. ఈ పథకానికి ఆద్యుడు దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి అనే విషయం తెలుసుకోవాలని నందికొట్కూరు ఎమ్మెల్యే వై.ఐజయ్య ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును ఉద్దేశించి అన్నారు. సోమవారం నెహ్రూనగర్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యేగా పాల్గొన్న తనకు బహిరంగ సమావేశంలో మాట్లాడటానికి అవకాశం కల్పించి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకానికి శ్రీకారం చుట్టిన అపర భగీరథుడు అని చెప్పగానే మైక్ కట్ చేయించి అవమానిస్తారా అంటూ మండిపడ్డారు. చివరి దాకా మాట్లాడకుండా మధ్యలోనే మైక్ లాగేసుకుని తనను అవమాన పరిచేలా ముఖ్యమంత్రి వ్యవహరించారని ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం స్థాయిలో ఉండి తనను ఈ మీటింగ్‌లో పాల్గొనడానికి అవకాశం లేదని ఓ దళిత ఎమ్మెల్యేని అవమానించారన్నారు. ప్రొటోకాల్ ప్రకారం తనకు ఆహ్వానం వచ్చినందువల్లే సమావేశానికి హజరయ్యానని.. ప్రొటోకాల్‌కు తిలోదకాలు ఇచ్చేలా ముఖ్యమంత్రే వ్యవహరిస్తే కింది స్థాయి అధికారులు ఎలా పాటిస్తారని ప్రశ్నించారు. ప్రాజెక్ట్ ఎవరు చేపట్టారని కాదు.. ఎవరు ముగించారన్నది ముఖ్యమని పోకిరి సినిమా డైలాగులను వైఎస్సార్సీపీ నుంచి బయటకు వెళ్లిన ఎమ్మెల్యేలు చెప్పడం దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉందన్నారు. 2007 ఆగస్టులో ప్రారంభమైన ఈ ప్రాజెక్ట్ కోసం వైఎస్ రాజశేఖరరెడ్డి రూ.120 కోట్లు వ్యయం చేసి 90 శాతం పనులు పూర్తి చేయించారని.. మిగిలిన రూ.75 కోట్ల పనిని పూర్తి చేయడానికి తెలుగుదేశం ప్రభుత్వానికి దాదాపు మూడేళ్లు పట్టిందని విమర్శించారు. రూ.1500 కోట్ల వ్యయంతో చేపట్టిన పట్టిసీమ ప్రాజెక్ట్‌ను ఏడాదిలో పూర్తి చేసి ముచ్చుమర్రి ఎత్తిపోతలను పూర్తి చేయడంలో ఏళ్ల తరబడి జాప్యం చేయడంతోనే ముఖ్యమంత్రికి రాయలసీమపై ఎంతో ప్రేమ ఉందో స్పష్టంగా తెలుస్తోందన్నారు. వైఎస్ హయాంలో రూపుదిద్దుకున్న ప్రాజెక్ట్‌లను పూర్తి చేయకుండా నిర్లక్ష్యం వహించడమే కాకుండా ప్రభుత్వ కార్యక్రమంలో తనను మాట్లాడనీయకుండా అడ్డుకోవడం ఎంత వరకు విజ్ఞత అనిపించుకుంటుందో ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. విలేకరుల సమావేశంలో వైఎస్సార్సీపీ నాయకులు చంద్రమౌళి, మహబూబ్ బాషా, చాంద్‌బాషా, శేఖర్, రాజు, పి. మధు, శ్రీను, దేవరాజు తదితరులు పాల్గొన్నారు.