
‘ఆయన హత్య వార్త విని దిగ్భ్రాంతి చెందా’
‘నిన్ననే నారాయణరెడ్డి ఆప్యాయంగా పలకరించారు. వైఎస్పార్ సీపీ ప్లీనరీ గురించి చర్చించారు.
కర్నూలు: ‘నిన్ననే నారాయణరెడ్డి ఆప్యాయంగా పలకరించారు. 30న జరగనున్న వైఎస్పార్ సీపీ ప్లీనరీ గురించి చర్చించారు. ఇవాళ ఆయన హత్య వార్త విని దిగ్భ్రాంతికి గురయ్యాన’ని వైఎస్సార్ సీపీ ఎంపీ బుట్టా రేణుక అన్నారు. పత్తికొండ వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి చెరుకులపాడు నారాయణ రెడ్డిని ప్రత్యర్థులు కిరాతకంగా హత్య చేయడాన్ని ఆమె ఖండించారు. రాజకీయ పార్టీ నాయకుల కదలికలపై పోలీసులకు సమాచారం ఉంటుందని, ఇలాంటి ఘటనలను అరికట్టాల్సిన బాధ్యత పోలీసులదే అన్నారు.
నారాయణరెడ్డి మృతి బాధాకరమని వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే ఐజయ్య వ్యాఖ్యానించారు. చంద్రబాబు అండతోనే టీడీపీ నేతలు రెచ్చిపోతున్నారని మండిపడ్డారు. చంద్రబాబు ఆదేశాలతోనే దౌర్జన్యాలకు దిగుతున్నారని ఆరోపించారు. నారాయణరెడ్డి రాబోయే ఎన్నికల్లో గెలిచే అభ్యర్థి అని, అదును చూసి ఆయనను హత్య చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.