సాక్షి, కర్నూలు : రాష్ట్ర తొలి రాజధానిగా గుర్తింపు పొందిన కర్నూలులో ఇప్పటివరకు 16 పర్యాయాలు ఎన్నికలు జరిగాయి. కర్నూలు లోక్‌సభ స్థానానికి 1952లో జరిగిన తొలి ఎన్నికల్లో కాంగ్రెస్ ఆభ్యర్థి హెచ్.సీతారామిరెడ్డి ఎంపీగా ఎన్నికయ్యారు. ఈ నియోజకవర్గం నుంచి కోట్ల విజయభాస్కర్‌రెడ్డి ఆరుసార్లు లోక్‌సభ సభ్యునిగా గెలుపొందారు. కేంద్ర మంత్రిగా పనిచేసిన ఆయన రాష్ట్ర ముఖ్యమంత్రి పదవిని కూడా అలంకరించారు.
2009లో నియోజకవర్గాల పునర్విభజనలో కర్నూలు లోక్‌సభ పరిధిలో కొత్తగా ఏర్పాటైన మంత్రాలయం అసెంబ్లీ సెగ్మెంట్ కలిసింది. డోన్ అసెంబ్లీ సెగ్మెంట్ కర్నూలు నుంచి విడిపోయి నంద్యాల లోక్‌సభ నియోజకవర్గంలో భాగమైంది. అంతకుముందు రెండుసార్లు కోట్ల జయసూర్య ప్రకాష్‌రెడ్డి కాంగ్రెస్ తరఫున ఎంపీగా గెలుపొంది కేంద్ర మంత్రివర్గంలో స్థానం పొందారు. 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున కోట్ల జయసూర్య ప్రకాష్‌రెడ్డి, టీడీపీ తరఫున బీటీ నాయుడు, వైఎస్సార్ సీపీ తరఫున బుట్టా రేణుక పోటీ చేశారు.
టీడీపీ అభ్యర్థిపై బుట్టా 44,131 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. కాంగ్రెస్ నుంచి టీడీపీలో చేరిన కోట్ల జయసూర్య ప్రకాష్‌రెడ్డి టీడీపీ తరఫున, డాక్టర్ ఎస్.సంజీవకుమార్ వైఎస్సార్ సీపీ తరఫున ప్రస్తుతం బరిలో ఉన్నారు. గత ఎన్నికల్లో కర్నూలు స్థానం వైఎస్సార్ సీపీ ఖాతాలోనే ఉండటం ఆ పార్టీకి కలిసివచ్చే అంశం.
బీసీలే అధికం
రాయలసీమలో అనంతపురం జిల్లా తరువాత బీసీలు అత్యధికంగా ఉన్నది కర్నూలు జిల్లాలోనే. ముఖ్యంగా, కర్నూలు పార్లమెంటరీ పరిధిలో అధిక శాతం బీసీ కులాలు ఉన్నాయి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మొదటినుంచీ బీసీలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తోంది. ఇందులో భాగంగానే ఈ పార్లమెంట్ స్థానంలో బీసీ వర్గానికి చెందిన వ్యక్తిని బరిలో దింపారు. టీడీపీ బీసీలను కేవలం ఓటర్లుగానే చూస్తోంది. సీట్ల కేటాయింపులో మాత్రం వారికి ఏమాత్రం ప్రాధాన్యత ఇవ్వలేదు.
డాక్టర్ శింగరి సంజీవకుమార్ (వైఎస్సార్ సీపీ)
సానుకూల అంశాలు
బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కావడం. బీసీ ఓటు బ్యాంకు అధికంగా ఉండటం. ప్రముఖ వైద్యునిగా గుర్తింపు పొందటం, సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుండటం. ప్రతి అంశంపై సూటిగా, సామాన్యులకు అర్థమయ్యే రీతిలో మాట్లాడగలగటం. పోటీ పరీక్షలకు వెళ్లే వందలాది యువతకు ఉచితంగా కోచింగ్ ఇప్పించి, ఉద్యోగాలు పొందేలా ప్రోత్సాహం అందించటం. పేదలకు వివాహ పరిచయ వేదికలు ఏర్పాటు చేసి.. పెళ్లిళ్లకు సహాయం అందించటం. జిల్లాలో వైఎస్సార్ సీపీ క్యాడర్ బాగా కలిసిరావటం, దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌పై చెక్కు చెదరని ప్రజాభిమానం,
వైఎస్ జగన్‌పై ప్రజలకు నమ్మకం ఉండటం.
కోట్ల జయసూర్య ప్రకాష్‌రెడ్డి (టీడీపీ)
సానుకూలాంశాలు : కుటుంబానికి రాజకీయ నేపథ్యం ఉండటం. మాజీ ఎంపీ కావటం. కేంద్ర మంత్రిగా పనిచేయటం. ఆర్థికంగా స్థితిమంతుడు కావటం.
బలహీనతలు : ఐదు దశాబ్దాలకు పైగా కాంగ్రెస్‌లో ఉండి ఇటీవల టీడీపీలో చేరడం.రాజకీయంగా గుర్తింపు పొంది కూడా ప్రజాసమస్యలు పరిష్కరించకపోవడం. కేంద్ర మంత్రిగా పనిచేసినా కరువు నివారణ కోసం ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం. సాగునీటి ప్రాజెక్టుల కోసం పట్టించుకోకపోవటం. సొంత నియోజకవర్గమైన కోడుమూరు ప్రాంతంలో తాగునీటి సమస్యకు శాçశ్వత పరిష్కారం చేయకపోవడం. అనుచరుల అరాచకాలు, హత్యలు చేశారనే అపనిందలు. రాజకీయంగా విరోధం గల వ్యక్తులతో కలిసి ఎన్నికల్లో పోటీ చేయడం. కుటుంబ సభ్యులు కోట్ల హరిచక్రపాణిరెడ్డి, కోట్ల హర్షవర్దన్‌రెడ్డి వేర్వేరు పార్టీల్లో ఉండటం.
ఇది ‘రాజు’ల కోటనే..
ఆ పాంత్రంలో ముగ్గురు మినహా అంతా ‘రాజు’లే పరిపాలిస్తున్నారు. అందుకే అది ‘రాజు’ల కోటగా భావిస్తారు. అంటే, ఉండి నియోజకవర్గంలో గెలిచిన అభ్యర్థులంతా పేరు చివర రాజు అని ఉన్నవారే.. 1952 నుంచి 2014 వరకు జరిగిన ఎన్నికల్లో గెలిచిన వి.శివరామరాజు, పాతపాటి సర్రాజు, కె. రామచంద్రరాజు, గోకరాజు రంగరాజు, జి. జగన్నాధరాజు, డి. నారాయణ రాజు అందరి పేర్లలో రాజు ఉండటం గమనార్హం. 1962 లో కె. కుసుమేశ్వరరావు గెలవగా ఆయన మరణాంతం ఆతని భార్య పోటీ చేసి గెలుపొందారు. 1972లో
డి. పేరయ్య గెలిచారు.
కోర్టు తీర్పుతో ఎన్నికైన దొర
సాలూరు నియోజకవర్గానికి చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. కోర్టు తీర్పు ద్వారా ఎన్నికైన రాజన్నదొర వరుసగా మూడుసార్లు ఎమ్మెల్యేగా ఇక్కడే విజయం సాధించారు. ఈ నియోజకవర్గంలో దాదాపు అన్ని పార్టీలు.. వైఎస్పార్‌సీపీ, కాంగ్రెస్, టీడీపీ, సీపీఐ, పి.ఎస్.పి, కె.ఎల్.పి, స్వతంత్ర అభ్యర్థులను పోటీలో గెలిపించి, ప్రజలు కూడా ఎన్నికల్లో వైవిధ్యతను చాటారు. 2004లో సాలూరులో టీడీపీ అభ్యర్థి భంజ్‌దేవ్ గెలుపొందగా, ఇతను ఎస్టీ కాదని రాజన్నదొర కోర్టుకు వెళ్లి న్యాయపోరాటం చేశారు. తత్ఫలితంగా రాజన్నదొరనే గెలిచిన అభ్యర్థిగా కోర్టు ప్రకటించింది. అనంతరం భంజ్‌దేవ్ గిరిజనుడిగానే నిర్ధారణ కావడంతో ఆయన తిరిగి పోటీ చేసినా విజయం సాధించలేకపోయారు.
మొత్తం ఓటర్లు : 14,22,542
పురుషులు : 7,12,160
మహిళలు : 7,10,209
ఇతరులు : 173
– కె.రామకృష్ణ, కర్నూలు
Comments
Please login to add a commentAdd a comment