cherukulapadu narayana reddy murder
-
చెరుకులపాడు నారాయణరెడ్డి హత్యకేసులో మొదటి నిందితుడి ఆత్మహత్యాయత్నం
సాక్షి, కర్నూలు: వైఎస్సార్సీపీ నాయకుడు చెరుకులపాడు నారాయణరెడ్డి హత్యకేసులో మొదటి నిందితుడిగా ఉన్న బీసన్నగారి రామాంజనేయులు పురుగు మందు తాగి ఆత్మహత్యకు ప్రయత్నించాడు. ఇతను ఇసుక, మద్యం అక్రమ రవాణా చేస్తూ కొంతమందిని కలుపుకుని ఒక గ్రూపుగా తయారై చెరుకులపాడు గ్రామంలో ప్రశాంతతకు భంగం కలిగిస్తూ గూండాయిజం, బెదిరింపులకు పాల్పడుతుండటంతో వెల్దుర్తి, కృష్ణగిరి పోలీస్స్టేషన్లలో ఐదు క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. వివిధ కేసుల్లో జైలుకు వెళ్లినప్పటికీ ప్రవర్తనలో మార్పు రాకపోవడంతో కలెక్టర్ ఉత్తర్వుల మేరకు పీడీ యాక్ట్ నమోదు చేశారు. చిన్నటేకూరు గ్రామానికి చెందిన అల్లుడు సురేంద్ర నిర్వహించిన పూజా కార్యక్రమాల్లో పాల్గొన్న రామాంజనేయులును పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రభుత్వాసుపత్రికి తరలించగా అక్కడ పురుగు మందు తాగి ఆత్మహత్యకు ప్రయత్నించాడు. వెంటనే ఆసుపత్రిలో చేర్పించి వైద్య చికిత్స చేయించడంతో కోలుకున్నాడు. 2017 మే 21న చెరుకులపాడు నారాయణరెడ్డితో పాటు ఆయన అనుచరుడు సాంబశివుడును హత్య చేసిన కేసులో రామాంజనేయులు ప్రథమ నిందితుడిగా ఉన్నాడు. చదవండి: (విద్యార్థుల జీవితాలతో నారాయణ ఆడుకున్నారు: ఏజీ పొన్నవోలు) -
ఆ పదవులకు పోటీ వద్దు: వైఎస్ జగన్
పులివెందుల: రాజ్యాంగపరంగా అత్యున్నత పదవులైన రాష్ట్రపతి, స్పీకర్ పదవులకు పోటీ ఉండకూడదని ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నాయకుడు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి అభిప్రాయపడ్డారు. అత్యున్నత పదవులు ఏకగ్రీవమైతే వాటి హుందాతనం పెరుగుతుందన్నారు. తటస్థంగా ఉండే వారే ఆ పదవుల్లో ఉండాలని ఆశిస్తామని, అందుకే ఏకగ్రీవానికి మద్దతు పలుకుతామని చెప్పారు. ఏపీ అసెంబ్లీ స్పీకర్‌గా కోడెల శివప్రసాదరావుకు అందుకే మద్దతు ఇచ్చామని, ఆయన ఏకగ్రీవంగా ఎన్నికయ్యారని గుర్తు చేశారు. అన్ని పార్టీలు మద్దతు ఇస్తే తటస్థంగా ఉంటారన్న ఆశ కలుగుతుందని చెప్పారు. గతంలో రాష్ట్రపతిగా ప్రణబ్ ముఖర్జీకి మద్దతు ఇచ్చామని తెలిపారు. పదవుల్లో ఉన్న వారు ప్రజల మనసుల్లో స్థానం సంపాదించుకోవాలన్నారు. తమ పార్టీ నేత చెరుకులపాడు నారాయణరెడ్డి హత్యకేసుపై సీబీఐతో దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేశారు. వైఎస్ జగన్ ఇంకా ఏమన్నారంటే... సీఎం పదవిలో ఇవాళ చంద్రబాబు ఉండొచ్చు రేపు మేం గెలవొచ్చు ఎవరు అధికారంలో ఉన్నా 5 కోట్ల మంది ప్రజల్లో ఒకరికే సీఎంగా ఉండే అవకాశం దేవుడు ఇస్తాడు అలాంటి పదవుల్లో ఉన్నవారు ప్రజల మనసులో స్థానం సంపాదించుకోవాలి ఎవరైనా ప్రజలకు మంచి చేయాలి ప్రజల ఆశీస్సులతో, దేవుడి దీవెనలతో సీఎంగా ఎన్నిక కావాలి ప్రలోభపెట్టి లొంగదీసుకోవడం, వారిపై అనర్హత వేటు పడకుండా చూడటం సరికాదు చంద్రబాబు పరోక్షంగా సహకరించబట్టే పత్తికొండలో హత్యలు జరిగాయి డిప్యూటీ సీఎంగా ఉన్న వ్యక్తి నియోజకవర్గంలో హత్య జరిగింది నారాయణరెడ్డి లైసెన్స్ రెన్యువల్ కోసం వెపన్ తీసుకున్నారు ఎమ్మెల్సీ ఎన్నికలు ముగిసినా వెపన్ తిరిగి ఇవ్వలేదు దీన్నిబట్టి చూస్తే పథకం ప్రకారం హత్య జరిగినట్టు తెలుస్తోంది ఇసుక మాఫియాపై నారాయణరెడ్డి యుద్ధం చేశారు కేఈ కుమారుడిపై విచారణకు హైకోర్టు ఆదేశించింది ఇలాంటి నేపథ్యంలో భద్రత కోసం నారాయణరెడ్డి పదేపదే వేడుకున్నారు కోర్టు ఆదేశాలతో సెక్యురిటీ ఇస్తే మూడు నెలల్లో తొలగించారు రాజకీయాల్లో ఉన్నప్పుడు ఎదుటివారిని ప్రేమించడం కూడా చేయాలి వచ్చే ఎన్నికల్లో 50 వేల మెజారిటీతో పత్తికొండలో గెలిచే పరిస్థితి వస్తుంది ఒకర్ని చంపితే అభ్యర్థి లేకుండా పోతారా? నాయకుడు లేకుండా పోతాడా? నారాయణరెడ్డి హత్యపై సీబీఐతో దర్యాప్తు జరపాలి నారాయణరెడ్డి హత్య కేసులో డిప్యూటీ సీఎం నిందితుడు కేఈకి చంద్రబాబు ఆశీస్సులు ఉన్నాయి సీబీఐతో విచారణ చేయిస్తేనే న్యాయం జరుగుతుంది పోలీసులు విచారణ వల్ల ఎవరికీ మేలు జరగదు -
ఆ పదవులకు పోటీ వద్దు: వైఎస్ జగన్
-
‘కేఈని తక్షణమే పదవి నుంచి తొలగించాలి’
విజయవాడ: రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన చెరకులపాడు నారాయణరెడ్డి హత్య ఘటనను వైఎసఆర్ సీపీ నేతలు వెలంపల్లి శ్రీనివాస్, పైలా సోమినాయుడు తీవ్రంగా ఖండించారు. వైఎస్ఆర్ సీపీ నేతలు సోమవారమిక్కడ మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు మనవడి చేతికి బలపం ఇచ్చి టీడీపీ రౌడీలకు కత్తులిచ్చారని ధ్వజమత్తారు. 132 జీవోలు జారీ చేసి టీడీపీ నేతలపై కేసులు ఎత్తేశారని అన్నారు. నారాయణరెడ్డి హత్యకేసులో చంద్రబాబుతో పాటు డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తిని ఏ-1 ముద్దాయిలుగా చేర్చాలని డిమాండ్ చేశారు. పూర్తిస్థాయిలో విచారణ జరగాలంటే కేఈని తక్షణమే పదవి నుంచి తొలగించాలన్నారు. కొంతమంది ఐపీఎస్ అధికారులు పచ్చ చొక్కాలు వేసుకుని పని చేస్తున్నారని, ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేసి రాష్ట్రపతి పాలన విధిస్తే కానీ ఏపీలో హత్యాకాండ ఆగదని అన్నారు. -
‘ప్రజలు తిరుగుబాటు చేయకముందే..’
శ్రీకాకుళం/పాలకొల్లు: కర్నూలు జిల్లా పత్తికొండ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి చెరకులపాడు నారాయణ రెడ్డిది ముమ్మాటికీ రాజకీయ హత్యేనని ఆ పార్టీ నాయకుడు తమ్మినేని సీతారాం అన్నారు. పథకం ప్రకారమే ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి ఈ హత్య చేయించారని ఆరోపించారు. టీడీపీ పాలనలో రౌడీలు, హంతకులు విర్రవీగుతున్నారని మండిపడ్డారు. ప్రభుత్వంపై ప్రజలు తిరుగుబాటు చేయకముందే గవర్నర్ స్పందించి చంద్రబాబు ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. తమ పార్టీ నేతలను హత్య చేయడం టీడీపీ నీచ రాజకీయాలకు నిదర్శనమని వైఎస్సార్ సీపీ ప్రధాన కార్యదర్శి మేకా శేషుబాబు.. పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులో సోమవారం విలేకరులతో మాట్లాడుతూ ధ్వజమెత్తారు. తమ జిల్లాకు చెందిన టీడీపీ ఎమ్మెల్యేలు అధికారులను, పోలీసులను నిర్బంధించడం దారుణమన్నారు. -
నారాయణరెడ్డి కారు డ్రైవర్ ఏం చెప్పాడంటే...
కర్నూలు: పత్తికొండ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి చెరకులపాడు నారాయణ రెడ్డిని దుండగులు పథకం ప్రకారం హత్య చేశారని ఆయన కారు డ్రైవర్ ఎల్లప్ప వెల్లడించాడు. రామకృష్ణాపురంకు సమీపంలోని కల్వర్టు దగ్గర పొలంలో దుండగులు నక్కారని తెలిపాడు. దాదాపు 20 మంది ఒక్కసారిగా వేట కొడవళ్లతో దాడి చేశారని, నారాయణరెడ్డిని విచక్షణారహితంగా నరికారని చెప్పాడు. అడ్డుపడిన సాంబశివుడిని కిరాతకంగా హతమర్చారని వాపోయారు. నారాయణరెడ్డి, సాంబశివుడు చనిపోయిన తర్వాత ఘటనాస్థలం నుంచి దుండగులు పరారయ్యారని వివరించాడు. దుండగులు తరిమేయడంతో ఎల్లప్ప అక్కడి నుంచి వెళ్లిపోయాడు. కాగా, నారాయణరెడ్డి, సాంబశివుడు మృతదేహాలకు కర్నూలు ప్రభుత్వాసుపత్రిలో సోమవారం పోస్టుమార్టం పూర్తి చేశారు. నారాయణరెడ్డి మృతదేహాన్ని ఆయన స్వగ్రామం చెరకులపాడుకు తరలించారు. ఈ మధ్యాహ్నం చెరకులపాడు చేరుకున్న నారాయణరెడ్డి పార్థీవదేహాన్ని చూసేందుకు నియోజకవర్గ ప్రజలు భారీ ఎత్తున తరలివచ్చారు. -
'వారికి జీవితాంతం గెలుపు లేకుండా చేస్తా'
-
‘నిరాయుధులను చేసి హత్య చేయిస్తున్నారు’
-
‘నిరాయుధులను చేసి హత్య చేయిస్తున్నారు’
కర్నూలు/హైదరాబాద్: చంద్రబాబు డైరెక్షన్లోనే వైఎస్సార్ సీపీ నేతల హత్యలు జరుగుతున్నాయని మాజీ ఎంపీ అనంత వెంకట్రామిరెడ్డి ఆరోపించారు. ఉద్దేశపూర్వకంగానే వైఎస్సార్ సీపీ నాయకుల గన్మెన్లను తొలగిస్తున్నారని అన్నారు. నిరాయుధులను చేసి తర్వాత వైఎస్సార్ సీపీ నేతలను హత్య చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పత్తికొండ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి చెరుకులపాడు నారాయణ రెడ్డి హత్యపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. నారాయణ రెడ్డికి ఉన్న ప్రజాదరణ చూసి ఓర్వలేక పొట్టన పెట్టుకున్నారని ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు ధ్వజమెత్తారు. ఆదివారం ఆయన హైదరాబాద్‌లో మాట్లాడుతూ.. హత్యా రాజకీయాలను చంద్రబాబు ప్రోత్సహిస్తున్నారని, టీడీపీ తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. -
ఎంతటివారైనా వదిలిపెట్టం: కర్నూలు ఎస్పీ
-
నా భర్తను చంపించింది వారే: నారాయణరెడ్డి భార్య
-
నా భర్తను చంపించింది వారే: నారాయణరెడ్డి భార్య
కర్నూలు: పత్తికొండ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి చెరుకులపాడు నారాయణ రెడ్డి హత్యకు కేఈ సోదరులే కారణమని నారాయణరెడ్డి భార్య శ్రీదేవి రెడ్డి, సోదరుడు ప్రదీప్‌రెడ్డి ఆరోపించారు. కేఈ కుమారుడు శ్యాంబాబు, ఎస్సై నాగ తులసీప్రసాద్ హత్యలో కీలకపాత్ర పోషించారని పేర్కొన్నారు. పత్తికొండలో డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి ఆగడాలు ఎక్కువయ్యాయని అన్నారు. కేఈ దౌర్జన్యాలకు వ్యతిరేకంగా నారాయణరెడ్డి న్యాయ పోరాటం చేస్తున్నారని తెలిపారు. ఇసుక మాఫియాకు వ్యతిరేకంగా పోరాడినందునే నారాయణరెడ్డిని హత్య చేశారని ఆరోపించారు. ఇసుక మాఫియాకు కేఈ కుమారుడు శ్యాంబాబు నేతృత్వం వహిస్తున్నాడని వెల్లడించారు. గన్మెన్లను ఇవ్వాలని ఉన్నతాధికారులను కోరినా పట్టించుకోలేదని వాపోయారు. రెన్యువల్ కోసం ఇటీవలే లైసెన్సెడ్ తుపాకీని నారాయణరెడ్డి డిపాజిట్ చేశారని తెలిపారు. మూడు నెలలైనా రెన్యువల్ చేయకపోవడం వల్లే ఆయన హత్యకు గురయ్యారని పేర్కొన్నారు. తమ కుటుంబంపై ఎన్నేళ్లు కక్ష సాధిస్తారని శ్రీదేవి రెడ్డి ప్రశ్నించారు. హత్య రాజకీయాలు చేసే బదులు ఇంట్లో కూర్చుని చీరలు కట్టుకోవాలని అన్నారు. తన పిల్లలకు తండ్రి లేకుండా చేశారని కన్నీళ్లపర్యంతమయ్యారు. ఏదైతే లక్ష్యం కోసం తన భర్త పోరాడారో దాని కోసం తన ఊపిరి ఉన్నంతవరకు పోరాడతానని పేర్కొన్నారు. -
‘ఆయన హత్య వార్త విని దిగ్భ్రాంతి చెందా’
కర్నూలు: ‘నిన్ననే నారాయణరెడ్డి ఆప్యాయంగా పలకరించారు. 30న జరగనున్న వైఎస్పార్ సీపీ ప్లీనరీ గురించి చర్చించారు. ఇవాళ ఆయన హత్య వార్త విని దిగ్భ్రాంతికి గురయ్యాన’ని వైఎస్సార్ సీపీ ఎంపీ బుట్టా రేణుక అన్నారు. పత్తికొండ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి చెరుకులపాడు నారాయణ రెడ్డిని ప్రత్యర్థులు కిరాతకంగా హత్య చేయడాన్ని ఆమె ఖండించారు. రాజకీయ పార్టీ నాయకుల కదలికలపై పోలీసులకు సమాచారం ఉంటుందని, ఇలాంటి ఘటనలను అరికట్టాల్సిన బాధ్యత పోలీసులదే అన్నారు. నారాయణరెడ్డి మృతి బాధాకరమని వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే ఐజయ్య వ్యాఖ్యానించారు. చంద్రబాబు అండతోనే టీడీపీ నేతలు రెచ్చిపోతున్నారని మండిపడ్డారు. చంద్రబాబు ఆదేశాలతోనే దౌర్జన్యాలకు దిగుతున్నారని ఆరోపించారు. నారాయణరెడ్డి రాబోయే ఎన్నికల్లో గెలిచే అభ్యర్థి అని, అదును చూసి ఆయనను హత్య చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. -
వైఎస్సార్ సీపీ ఎదుగుదల చూడలేకే..
కర్నూలు: పత్తికొండ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి చెరుకులపాడు నారాయణ రెడ్డిని పథకం ప్రకారమే హత్య చేశారని ఎమ్మెల్పీ గంగుల ప్రభాకర్ రెడ్డి ఆరోపించారు. ప్రభుత్వం అండతోనే టీడీపీ నేతలు రెచ్చిపోతున్నారని ధ్వజమెత్తారు. ఫ్యాక్షన్ రాజకీయాలను టీడీపీ ప్రోత్సహిస్తోందని మండిపడ్డారు. నారాయణ రెడ్డి మృతి చాలా దురదృష్టకరమని ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి అన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎదుగుదల చూడలేకే టీడీపీ ఈ దారుణానికి ఒడిగట్టిందని ఆరోపించారు. రాబోయే రోజుల్లో టీడీపీకి మనుగడ ఉండదన్న భయంతోనే దాడులకు పాల్పతున్నారని దుయ్యబట్టారు. పోలీసు వ్యవస్థను చంద్రబాబు నిర్వీరం చేసిందని వ్యాఖ్యానించారు. -
ఎంతటివారైనా వదిలిపెట్టం: కర్నూలు ఎస్పీ
కర్నూలు: పత్తికొండ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి చెరుకులపాడు నారాయణ రెడ్డి హత్య కేసులో దర్యాప్తు చేపట్టామని కర్నూలు జిల్లా ఎస్పీ రవికృష్ణ తెలిపారు. హంతకులు ఎంతటివారైనా వదిలిపెట్టబోమని ఆయన స్పష్టం చేశారు. నారాయణ రెడ్డి హత్యకు గురైన ప్రాంతాన్ని ఆయన పరిశీలించారు. క్రిందిస్థాయి అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఇటీవల కాలంలో జిల్లావ్యాప్తంగా పోలీసు గస్తీని పెంచామని అయినా ఈ సంఘటన జరగడం దురదృష్టకరమన్నారు. కాగా, నారాయణరెడ్డిని కిరాతకంగా హత్య చేసిన దుండగులను పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. తనకు ప్రాణహాని ఉందని నారాయణరెడ్డి చెప్పినా పోలీసులు పట్టించుకోలేదని, ఆయన తగిన రక్షణ కల్పించకపోవడం వల్లే ఈ దారుణం చోటుచేసుకుందని ఆయన వర్గీయులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు ఆయనకు తగిన భద్రత కల్పించివుంటే ఈ దారుణం జరిగివుండేది కాదని అంటున్నారు.