‘ప్రజలు తిరుగుబాటు చేయకముందే..’ | YSRCP Leaders condemn cherukula padu narayana reddy murder | Sakshi
Sakshi News home page

‘ప్రజలు తిరుగుబాటు చేయకముందే..’

Published Mon, May 22 2017 1:41 PM | Last Updated on Tue, Sep 5 2017 11:44 AM

‘ప్రజలు తిరుగుబాటు చేయకముందే..’

‘ప్రజలు తిరుగుబాటు చేయకముందే..’

శ్రీకాకుళం/పాలకొల్లు:  కర్నూలు జిల్లా పత్తికొండ వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఇంచార్జి చెరకులపాడు నారాయణ రెడ్డిది ముమ్మాటికీ రాజకీయ హత్యేనని ఆ పార్టీ నాయకుడు తమ్మినేని సీతారాం అన్నారు. పథకం ప్రకారమే ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి ఈ హత్య చేయించారని ఆరోపించారు. టీడీపీ పాలనలో రౌడీలు, హంతకులు విర్రవీగుతున్నారని మండిపడ్డారు. ప్రభుత్వంపై ప్రజలు తిరుగుబాటు చేయకముందే గవర్నర్‌ స్పందించి చంద్రబాబు ప్రభుత్వాన్ని బర్తరఫ్‌ చేయాలని డిమాండ్‌ చేశారు.  

తమ పార్టీ నేతలను హత్య చేయడం టీడీపీ నీచ రాజకీయాలకు నిదర్శనమని వైఎస్సార్‌ సీపీ ప్రధాన కార్యదర్శి మేకా శేషుబాబు.. పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులో సోమవారం విలేకరులతో మాట్లాడుతూ ధ్వజమెత్తారు. తమ జిల్లాకు చెందిన టీడీపీ ఎమ్మెల్యేలు అధికారులను, పోలీసులను నిర్బంధించడం దారుణమన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement