meka seshubabu
-
‘ప్రజలు తిరుగుబాటు చేయకముందే..’
శ్రీకాకుళం/పాలకొల్లు: కర్నూలు జిల్లా పత్తికొండ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి చెరకులపాడు నారాయణ రెడ్డిది ముమ్మాటికీ రాజకీయ హత్యేనని ఆ పార్టీ నాయకుడు తమ్మినేని సీతారాం అన్నారు. పథకం ప్రకారమే ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి ఈ హత్య చేయించారని ఆరోపించారు. టీడీపీ పాలనలో రౌడీలు, హంతకులు విర్రవీగుతున్నారని మండిపడ్డారు. ప్రభుత్వంపై ప్రజలు తిరుగుబాటు చేయకముందే గవర్నర్ స్పందించి చంద్రబాబు ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. తమ పార్టీ నేతలను హత్య చేయడం టీడీపీ నీచ రాజకీయాలకు నిదర్శనమని వైఎస్సార్ సీపీ ప్రధాన కార్యదర్శి మేకా శేషుబాబు.. పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులో సోమవారం విలేకరులతో మాట్లాడుతూ ధ్వజమెత్తారు. తమ జిల్లాకు చెందిన టీడీపీ ఎమ్మెల్యేలు అధికారులను, పోలీసులను నిర్బంధించడం దారుణమన్నారు. -
'ఎవరిని మోసం చేయడానికి ఈ ర్యాంకులు'
పశ్చిమ గోదావరి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకు రావడంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు విఫలమయ్యారని వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ మేకా శేషుబాబు ఎద్దేవా చేశారు. శుక్రవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రజలు ఇబ్బందుల్లో ఉంటే సీఎం విదేశాల్లో జల్సాలు చేయటం సిగ్గు చేటన్నారు. 'ఎవరిని మోసం చేయడానికి ఎమ్మెల్యేలకు, మంత్రులకు ర్యాంకులు కేటాయించారో సమాధానం చెప్పాలి. ఇసుక దోపిడీలు, భూ కబ్జాలు, అక్రమాలపై టీడీపీ ఎమ్మెల్యేలకు ఎన్నెన్ని ర్యాంకులు ఇచ్చుకున్నారు' లాంటి వాటికి సీఎం సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. అదే విధంగా ప్రతిపక్ష నాయకుడిగా ప్రజల తరఫున పోరాడుతున్న ఏకైక నాయకుడు వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మాత్రమేనని మేకా శేషుబాబు అన్నారు. -
'చంద్రబాబు వైఖరి వల్లే రాష్ట్రానికి ఈ దుస్థితి'
పాలకొల్లు: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఢిల్లీలో చేపట్టిన నిరాహారదీక్ష రాష్ట్ర విభన కోరుకునేవిధంగా ఉందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ మేకా శేషుబాబు అన్నారు. చంద్రబాబు దీక్ష సమైక్యవాదానికి తూట్లుపొడిచేలావుందన్నారు. చంద్రబాబు నాయుడు వైఖరి వల్లే రాష్ట్రానికి ఈ దుస్థితి దాపురించిందని ఆయన విమర్శించారు. చంద్రబాబు దీక్షలు, ఆత్మగౌరవ యాత్రలను ప్రజలు నమ్మేస్థితిలో లేదని చెప్పారు. 'తెలంగాణ నోట్'కు వ్యతిరేకంగా పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు గాంధీబొమ్మల సెంటర్లో మేకా శేషుబాబు ఆధ్వర్యంలో చేపట్టిన నిరాహార దీక్షలు 8వ రోజుకు చేరాయి. మరోవైపు వైఎస్ జగన్ దీక్షకు మద్దతుగా జిల్లా వ్యాప్తంగా వైఎస్సార్ సీపీ నాయకుల దీక్షలు కొనసాగుతున్నాయి. తణుకు నియోజకవర్గం సమన్వయకర్త చీర్ల రాదయ్య ఆధ్వర్యంలో రిలే దీక్షలు జరుగుతున్నాయి. పెనుగొండలో వైఎస్ఆర్ సీపీ సమన్వయకర్త మల్లుల లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. జగన్ దీక్షకు మద్దతుగా భీమవరంలో మాజీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిరాహార దీక్షలు చేస్తున్నారు. సమైక్యాంధ్రకు మద్దతుగా తాడేపల్లిగూడెం సమన్వయకర్త తోట గోపి ఆధ్వర్యంలో జరుగుతున్న రిలే దీక్షలు 62వ రోజుకు చేరాయి. సమైక్యాంధ్రకు మద్దతుగా ఆకివీడు జాతీయ రహదారిపై 5000వేల మంది విద్యార్థులతో మానవహారం నిర్వహించారు. దీంతో ఈ మార్గంలో భారీగా ట్రాఫిక్ స్తంభించింది. అత్తిలి బస్టాండ్ సెంటర్లో జేఏసీ ఆధ్వర్యంలో భిక్షాటన చేసి సమైక్యాంధ్రకు మద్దతుగా ఉద్యమంలో పాల్గొంటున్న ఆర్టీసీ డిపో కాంట్రాక్ట్ కార్మికులకు నిత్యావసర వస్తువుల పంపిణీ చేశారు. -
వైఎస్ ఉండి ఉంటే సమస్యలే ఉండేవి కావు
మహానేత, దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి లేని లోటు రాష్ట్రంలో నేడు ప్రస్పుటంగా కనపడుతోందని మాజీ మంత్రి చేగొండి హరిరామజోగయ్య ఆదివారం ఏలూరులో పేర్కొన్నారు. ఆయన ఉండి ఉంటే రాష్ట్రంలో ఇన్ని సమస్యలు వచ్చేవి కావని ఆయన అభిప్రాయపడ్డారు. సమర్థత, పేదవారిని ఆదుకోవాలనే మనసు ఆ మహానేతకు లక్ష్యంగా ఉండేవని హరిరామజోగయ్య ఈ సందర్భంగా పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కిరణ్కుమార్ రెడ్డి ముందే రాజీనామా చేసుంటే.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన జరిగేది కాదని హరిరామజోగయ్య అంతకుముందు అభిప్రాయపడ్డారు. ఇప్పటికైనా టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, కేంద్ర మంత్రులు రాజీనామాలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న గందరగోళ పరిస్థితులు చోటు చేసుకున్న నేపథ్యంలో.. కేంద్రం ఉభయ ప్రాంత ప్రజల మనోభావాలను పరిగణిలోకి తీసుకోవాలన్నారు. రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను కాంగ్రెస్ పార్టీ పూర్తిగా పక్కనపెట్టిందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ మేకా శేషుబాబు పేర్కొన్నారు. భవిష్యత్తులో కలిగే రాజకీయ ప్రయోజనాల గురించి ఆలోచించి రాష్ట్ర విభజనకు పూనుకేంటే కాంగ్రెస్ నేతలు చరిత్రహీనులుగా మిగిలిపోతారని శేషుబాబు వ్యాఖ్యానించారు.