వైఎస్ ఉండి ఉంటే సమస్యలే ఉండేవి కావు | AP wouldn't be in dire state if YSR was alive, says Chegondi Hari Rama Jogayya | Sakshi
Sakshi News home page

వైఎస్ ఉండి ఉంటే సమస్యలే ఉండేవి కావు

Published Sun, Sep 1 2013 12:32 PM | Last Updated on Mon, Mar 18 2019 7:55 PM

వైఎస్ ఉండి ఉంటే సమస్యలే ఉండేవి కావు - Sakshi

వైఎస్ ఉండి ఉంటే సమస్యలే ఉండేవి కావు

మహానేత, దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి లేని లోటు రాష్ట్రంలో నేడు ప్రస్పుటంగా కనపడుతోందని మాజీ మంత్రి చేగొండి హరిరామజోగయ్య ఆదివారం ఏలూరులో పేర్కొన్నారు. ఆయన ఉండి ఉంటే రాష్ట్రంలో ఇన్ని సమస్యలు వచ్చేవి కావని ఆయన అభిప్రాయపడ్డారు. సమర్థత, పేదవారిని ఆదుకోవాలనే మనసు ఆ మహానేతకు లక్ష్యంగా ఉండేవని హరిరామజోగయ్య ఈ సందర్భంగా పేర్కొన్నారు.

ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి ముందే రాజీనామా చేసుంటే.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన జరిగేది కాదని హరిరామజోగయ్య అంతకుముందు అభిప్రాయపడ్డారు. ఇప్పటికైనా టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, కేంద్ర మంత్రులు రాజీనామాలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న గందరగోళ పరిస్థితులు చోటు చేసుకున్న నేపథ్యంలో.. కేంద్రం ఉభయ ప్రాంత ప్రజల మనోభావాలను పరిగణిలోకి తీసుకోవాలన్నారు.

రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను కాంగ్రెస్ పార్టీ పూర్తిగా పక్కనపెట్టిందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ మేకా శేషుబాబు పేర్కొన్నారు. భవిష్యత్తులో కలిగే రాజకీయ ప్రయోజనాల గురించి ఆలోచించి రాష్ట్ర విభజనకు పూనుకేంటే కాంగ్రెస్ నేతలు చరిత్రహీనులుగా మిగిలిపోతారని శేషుబాబు వ్యాఖ్యానించారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement