Chegondi Hari Rama Jogayya
-
భద్రాచలం డివిజన్ను సీమాంధ్రలో కలపాలి: చేగొండి హరిరామజోగయ్య
ఏలూరు: రాష్ట్రవిభజనపై కేంద్ర కేబినెట్ తెలంగాణ బిల్లుకు ఆమోదం తెలిపిన నేపథ్యంలో సీమాంధ్ర ప్రయోజనాలు, అభివృద్ధి కోసం కోసాంధ్ర పరిరక్షణసమితి ఏర్పాటు చేయాలంటూ చేగొండి హరిరామజోగయ్య డిమాండ్ చేశారు. అయితే ప్రస్తుతం తెలంగాణలో భాగంగా ఉన్న భద్రాచలం డివిజన్ ను సీమాంధ్రలో కలపాలంటూ ఆయన డిమాండ్ చేస్తున్నారు. 1956లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడకముందు ఉన్నా సరిహద్దులనే... విభజన తర్వాతా కూడా కొనసాగించాలన్నారు. కాగా, కృష్ణ, గోదావరి జలాల పంపిణీ నిర్వహణకు... ఏర్పాటు కాబోయే బోర్డులకు సర్వాధికారాలు కట్టబెట్టాలన్నారు. సీమాంధ్ర ప్రాంత అవసరాలు తీరిన తర్వాతే... కృష్ణ, గోదావరి బేసిన్ సహజ వనరులను ఇతర రాష్ట్రాలకు తరలించాలని చేగొండి హరిరామజోగయ్య చెప్పారు. -
వైఎస్ ఉండి ఉంటే సమస్యలే ఉండేవి కావు
మహానేత, దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి లేని లోటు రాష్ట్రంలో నేడు ప్రస్పుటంగా కనపడుతోందని మాజీ మంత్రి చేగొండి హరిరామజోగయ్య ఆదివారం ఏలూరులో పేర్కొన్నారు. ఆయన ఉండి ఉంటే రాష్ట్రంలో ఇన్ని సమస్యలు వచ్చేవి కావని ఆయన అభిప్రాయపడ్డారు. సమర్థత, పేదవారిని ఆదుకోవాలనే మనసు ఆ మహానేతకు లక్ష్యంగా ఉండేవని హరిరామజోగయ్య ఈ సందర్భంగా పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కిరణ్కుమార్ రెడ్డి ముందే రాజీనామా చేసుంటే.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన జరిగేది కాదని హరిరామజోగయ్య అంతకుముందు అభిప్రాయపడ్డారు. ఇప్పటికైనా టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, కేంద్ర మంత్రులు రాజీనామాలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న గందరగోళ పరిస్థితులు చోటు చేసుకున్న నేపథ్యంలో.. కేంద్రం ఉభయ ప్రాంత ప్రజల మనోభావాలను పరిగణిలోకి తీసుకోవాలన్నారు. రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను కాంగ్రెస్ పార్టీ పూర్తిగా పక్కనపెట్టిందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ మేకా శేషుబాబు పేర్కొన్నారు. భవిష్యత్తులో కలిగే రాజకీయ ప్రయోజనాల గురించి ఆలోచించి రాష్ట్ర విభజనకు పూనుకేంటే కాంగ్రెస్ నేతలు చరిత్రహీనులుగా మిగిలిపోతారని శేషుబాబు వ్యాఖ్యానించారు.