భద్రాచలం డివిజన్‌ను సీమాంధ్రలో కలపాలి: చేగొండి హరిరామజోగయ్య | Bhadrachalam division should be merged in Seemandhra: Chegondi Hari Rama Jogayya | Sakshi
Sakshi News home page

భద్రాచలం డివిజన్‌ను సీమాంధ్రలో కలపాలి: చేగొండి హరిరామజోగయ్య

Published Mon, Dec 9 2013 6:05 PM | Last Updated on Thu, Sep 27 2018 5:59 PM

భద్రాచలం డివిజన్‌ను సీమాంధ్రలో కలపాలి: చేగొండి హరిరామజోగయ్య - Sakshi

భద్రాచలం డివిజన్‌ను సీమాంధ్రలో కలపాలి: చేగొండి హరిరామజోగయ్య

ఏలూరు: రాష్ట్రవిభజనపై కేంద్ర కేబినెట్ తెలంగాణ బిల్లుకు ఆమోదం తెలిపిన నేపథ్యంలో  సీమాంధ్ర ప్రయోజనాలు, అభివృద్ధి కోసం కోసాంధ్ర పరిరక్షణసమితి ఏర్పాటు చేయాలంటూ చేగొండి హరిరామజోగయ్య డిమాండ్ చేశారు. అయితే ప్రస్తుతం తెలంగాణలో భాగంగా ఉన్న భద్రాచలం డివిజన్ ను సీమాంధ్రలో కలపాలంటూ ఆయన డిమాండ్ చేస్తున్నారు. 1956లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడకముందు ఉన్నా సరిహద్దులనే... విభజన తర్వాతా కూడా కొనసాగించాలన్నారు.

కాగా, కృష్ణ, గోదావరి జలాల పంపిణీ నిర్వహణకు... ఏర్పాటు కాబోయే బోర్డులకు సర్వాధికారాలు కట్టబెట్టాలన్నారు. సీమాంధ్ర ప్రాంత అవసరాలు తీరిన తర్వాతే... కృష్ణ, గోదావరి బేసిన్‌ సహజ వనరులను ఇతర రాష్ట్రాలకు తరలించాలని చేగొండి హరిరామజోగయ్య చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement