ఆయన రాక చెడు శకునం :ఎపీఎన్జీవో అధ్యక్షుడు అశోక్‌ బాబు | No future to congress party in state: Ashok Babu | Sakshi
Sakshi News home page

ఆయన రాక చెడు శకునం :ఎపీఎన్జీవో అధ్యక్షుడు అశోక్‌ బాబు

Published Tue, Dec 10 2013 5:31 PM | Last Updated on Thu, Sep 27 2018 5:59 PM

ఆయన రాక చెడు శకునం :ఎపీఎన్జీవో అధ్యక్షుడు అశోక్‌ బాబు - Sakshi

ఆయన రాక చెడు శకునం :ఎపీఎన్జీవో అధ్యక్షుడు అశోక్‌ బాబు

హైదరాబాద్: రాష్ట్రవిభజనపై కేంద్ర కేబినెట్ తెలంగాణ బిల్లుకు ఆమోదం తెలిపిన నేపథ్యంలో రాష్ట్రంలో కాంగ్రెస్‌పార్టీకి భవిష్యత్‌ లేకుండా చేస్తామని ఎపీఎన్ జీవో అధ్యక్షుడు అశోక్‌బాబు హెచ్చరించారు. ఈ నెల 12న దిగ్విజయ్‌ సింగ్ హైదరాబాద్ రాకూడదన్నారు.  ఆయన రాకను చెడు శకునంగా పరిగణిస్తున్నామన్నారు. అవిశ్వాస తీర్మానానికి సంతకాలు చేయని ఎంపీలపై ఆయన మండిపడ్డారు. సమైక్యవాదం వినిపించని ఎంపీలును సాంఘిక బహిష్కరణ చేయలంటూ అశోక్‌బాబు డిమాండ్ చేశారు. తీర్మానానికి సంతకాలు చేయకపోవడం వారి దిగజారుడుతనానికి నిదర్శనమన్నారు. అవిశ్వాస తీర్మానానికి సంతకాలు చేయని ఎంపీలకు రాజకీయ భవిష్యత్‌ లేకుండా చేస్తామని హెచ్చరించారు. వారి అభిప్రాయాలనే  తీర్మానాలుగా పరిగణించాలని చెప్పారు.

తెలంగాణ బిల్లు అసెంబ్లీకి రానున్న తరుణంలో అసెంబ్లీలో తెలంగాణ బిల్లును అందరూ వ్యతిరేకించాలని అశోక్ బాబు చెప్పారు.  కేంద్రమంత్రి చిరంజీవి అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని అశోక్‌బాబు విమర్శించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement