
ఖైరతాబాద్: పీపుల్స్ ప్లాజా వేదికగా ఆదివారం రాత్రి నిర్వహించిన భారత మాతకు మహా హారతి కార్యక్రమంలో అపశ్రుతి చోటుచేసుకుంది

కార్యక్రమం చివర్లో మహా హారతులు ఇచ్చే సమయంలో హుస్సేన్‌సాగర్‌లో బాణా సంచా కాల్చేందుకు నీటిలో జెట్టి ప్లాట్‌ఫాం ఏర్పాటు చేసి మెకనైజ్ బోట్ సాయంతో తారా జువ్వలను నీటిమీద నుంచి పైకి వదులుతున్నారు

ఈ క్రమంలో నిప్పు రవ్వలు బాణాసంచా ఉంచిన బోట్, ప్లాట్‌ఫాంపై పడటంతో ఒక్కసారిగా బాణసంచా పేలి మంటలు అంటుకున్నాయి

భారీగా మంటలు ఎగిసిపడటంతో మెకనైజ్ బోట్‌తో పాటు జెట్టి ప్లాట్‌ఫాం దగ్ధమయ్యాయి

బోటు ఫైబర్‌తో తయారు చేసినది కావడంతో క్షణాల్లో మంటలు అంటుకున్నాయి

మంటలు ఎగసి పడటంతో సాగర్‌పై నల్లటి పొగలు కమ్ముకున్నాయి



