
ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా శుక్రవారం సాయంత్రం నెక్లెస్ రోడ్డు, ట్యాంక్‌బండ్, సచివాలయ పరిసర ప్రాంతాల్లో నిర్వహించిన ఎయిర్ షో ఆద్యంతం ఆకట్టుకుంది. 9 ఎయిర్ క్రాఫ్ట్‌లు ఆకాశ వీధుల్లో చక్కర్లు కొట్టడంతో చూపరులు ఆశ్చర్య చకితులయ్యారు. సాగర తీరంలో ఎయిర్ షో విన్యాసాలను నగర వాసులు ఆసక్తిగా తిలకించారు.

































