హైదరాబాద్‌లో సీమాంధ్రుల సంఖ్య పెరుగుతుంది: జైపాల్ రెడ్డి
న్యూఢిల్లీ: రాష్ట్ర విభజన అంశంపై గురువారం కేంద్రం కేబినెట్ తెలంగాణ బిల్లుకు ఆమోదం తెలిపిన నేపథ్యంలో కేంద్రమంత్రి జైపాల్ రెడ్డి మాట్లాడుతూ.. 10ఏళ్ల తర్వాత హైదరాబాద్‌లో సీమాంధ్రుల సంఖ్య.. ఇప్పటికంటే ఎక్కువ పెరుగుతుందని చెప్పారు. అయితే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ శాంతి భద్రతలను పర్యవేక్షించే అధికారం గవర్నర్ కే ఉంటుందని ఆయన తెలిపారు.
చరిత్రలో మొదటిసారిగా ఒక ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతను కేంద్రం తీసుకుంటుందని అన్నారు. తెలంగాణ సాధనకు కృషి చేసిన విద్యార్ధులకే ఈ విజయం అంకితమని చెప్పారు. వెనుకబడిన మూడు ప్రాంతాలకు కేంద్రం ప్యాకేజీ ఇవ్వడానికి సిద్ధంగా ఉందంటూ ఆయన తెలిపారు.
కాగా, ప్రధాని నివాసంలో రాష్ట్ర విభజన అంశంపై మూడు గంటలపాటు కేంద్ర కేబినెట్ సమావేశం జరిగిన సంగతి తెలిసిందే.