పశ్చిమ గోదావరి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకు రావడంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు విఫలమయ్యారని వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ మేకా శేషుబాబు ఎద్దేవా చేశారు. శుక్రవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రజలు ఇబ్బందుల్లో ఉంటే సీఎం విదేశాల్లో జల్సాలు చేయటం సిగ్గు చేటన్నారు.
'ఎవరిని మోసం చేయడానికి ఎమ్మెల్యేలకు, మంత్రులకు ర్యాంకులు కేటాయించారో సమాధానం చెప్పాలి. ఇసుక దోపిడీలు, భూ కబ్జాలు, అక్రమాలపై టీడీపీ ఎమ్మెల్యేలకు ఎన్నెన్ని ర్యాంకులు ఇచ్చుకున్నారు' లాంటి వాటికి సీఎం సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. అదే విధంగా ప్రతిపక్ష నాయకుడిగా ప్రజల తరఫున పోరాడుతున్న ఏకైక నాయకుడు వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మాత్రమేనని మేకా శేషుబాబు అన్నారు.
'ఎవరిని మోసం చేయడానికి ఈ ర్యాంకులు'
Published Fri, Aug 7 2015 7:51 PM | Last Updated on Sat, Aug 11 2018 4:03 PM
Advertisement
Advertisement