
‘నిరాయుధులను చేసి హత్య చేయిస్తున్నారు’
కర్నూలు/హైదరాబాద్: చంద్రబాబు డైరెక్షన్‌లోనే వైఎస్సార్ సీపీ నేతల హత్యలు జరుగుతున్నాయని మాజీ ఎంపీ అనంత వెంకట్రామిరెడ్డి ఆరోపించారు. ఉద్దేశపూర్వకంగానే వైఎస్సార్ సీపీ నాయకుల గన్‌మెన్లను తొలగిస్తున్నారని అన్నారు. నిరాయుధులను చేసి తర్వాత వైఎస్సార్ సీపీ నేతలను హత్య చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పత్తికొండ వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి చెరుకులపాడు నారాయణ రెడ్డి హత్యపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.
నారాయణ రెడ్డికి ఉన్న ప్రజాదరణ చూసి ఓర్వలేక పొట్టన పెట్టుకున్నారని ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు ధ్వజమెత్తారు. ఆదివారం ఆయన హైదరాబాద్‌లో మాట్లాడుతూ.. హత్యా రాజకీయాలను చంద్రబాబు ప్రోత్సహిస్తున్నారని, టీడీపీ తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు.