సాక్షి, కర్నూలు: వైఎస్సార్‌సీపీ నాయకుడు చెరుకులపాడు నారాయణరెడ్డి హత్యకేసులో మొదటి నిందితుడిగా ఉన్న బీసన్నగారి రామాంజనేయులు పురుగు మందు తాగి ఆత్మహత్యకు ప్రయత్నించాడు. ఇతను ఇసుక, మద్యం అక్రమ రవాణా చేస్తూ కొంతమందిని కలుపుకుని ఒక గ్రూపుగా తయారై చెరుకులపాడు గ్రామంలో ప్రశాంతతకు భంగం కలిగిస్తూ గూండాయిజం, బెదిరింపులకు పాల్పడుతుండటంతో వెల్దుర్తి, కృష్ణగిరి పోలీస్‌స్టేషన్లలో ఐదు క్రిమినల్ కేసులు నమోదయ్యాయి.
వివిధ కేసుల్లో జైలుకు వెళ్లినప్పటికీ ప్రవర్తనలో మార్పు రాకపోవడంతో కలెక్టర్ ఉత్తర్వుల మేరకు పీడీ యాక్ట్ నమోదు చేశారు. చిన్నటేకూరు గ్రామానికి చెందిన అల్లుడు సురేంద్ర నిర్వహించిన పూజా కార్యక్రమాల్లో పాల్గొన్న రామాంజనేయులును పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రభుత్వాసుపత్రికి తరలించగా అక్కడ పురుగు మందు తాగి ఆత్మహత్యకు ప్రయత్నించాడు.
వెంటనే ఆసుపత్రిలో చేర్పించి వైద్య చికిత్స చేయించడంతో కోలుకున్నాడు. 2017 మే 21న చెరుకులపాడు నారాయణరెడ్డితో పాటు ఆయన అనుచరుడు సాంబశివుడును హత్య చేసిన కేసులో రామాంజనేయులు ప్రథమ నిందితుడిగా ఉన్నాడు.
చదవండి: (విద్యార్థుల జీవితాలతో నారాయణ ఆడుకున్నారు: ఏజీ పొన్నవోలు)
Comments
Please login to add a commentAdd a comment