accused person
-
సైఫ్ అలీ ఖాన్ కేసులో నిందితుడు అరెస్ట్
-
లగచర్ల ఘటనలో నిందితులకు నాంపల్లి కోర్టు బెయిల్
-
మా ఆశలు చచ్చిపోయాయి
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం స్పష్టించిన ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఆర్కిటెక్చర్ విద్యార్థిని ఎం.రిషితేశ్వరి ఆత్మహత్య కేసును కొట్టివేస్తూ గుంటూరు కోర్టు శుక్రవారం తీర్పు వెలువరించింది. వరంగల్‌కు చెందిన రిషితేశ్వరి గుంటూరు జిల్లా పెదకాకాని మండలం ఏఎన్‌యూలో బ్యాచిలర్ ఆఫ్ అర్కిటెక్చర్ (బీఆర్క్) చదువుతూ, 2015 జూలై 14న బాలికల వసతిగృహంలో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ర్యాగింగ్, వేధింపులవల్లే తమ కుమార్తె ఆత్మహత్యకు పాల్పడినట్లు మృతురాలి తల్లిదండ్రులు అప్పట్లో పెదకాకాని పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేయగా దర్యాప్తు చేపట్టారు. అయితే, నిందితులపై మోపిన నేరాన్ని ప్రాసిక్యూషన్ నిరూపించలేకపోవడంతో కేసును కొట్టేస్తూ గుంటూరు ఐదో అదనపు జిల్లా జడ్జి కె. నీలిమా తీర్పు వెలువరించారు. సాక్షి ప్రతినిధి, గుంటూరు/నగరంపాలెం: ‘కోర్టు తీర్పుతో మా ఆశలు చచ్చిపోయాయి. మాకు పూడ్చలేని బాధను మిగిల్చారు. న్యాయం జరుగుతుందని తొమ్మిదేళ్లుగా కోర్టుల చుట్టూ తిరిగాం. సాక్ష్యాధారాలు లేకపోవడంతో కేసు కొట్టేశామని చెప్పడం ఎంతో బాధగా ఉంది. మా కుమార్తె తన డైరీని స్వయంగా రాసింది. ఫోరెన్సిక్ ల్యాబ్ కూడా రిషితేశ్వరినే రాసిందని తేల్చిచెప్పింది. అయినా మా కుమార్తెకు అన్యాయం జరిగింది. ఇందులో 170 మంది సాక్షులున్నారు. కానీ, ఏ ఒక్కరూ వారికి కని పించలేదు. మాకింక దిక్కెవరు? గంగలో దూకడమే శరణ్యం. పాప రాసిన డైరీలను ఎందుకు సాక్ష్యంగా తీసుకోలేదో అర్థంకావడంలేదు. గతంలో సీఎం చంద్రబాబు, గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి, జిల్లా ఎస్పీకి డైరీ కాపీలు అందజేసినా పరిగణలోకి తీసుకోలేదు’.. ఆచార్య నాగార్జున వర్సిటీ బీఆర్క్ విద్యార్థిని రిషితేశ్వరి ఆత్మహత్య కేసు కొట్టేస్తూ గుంటూరు కోర్టు శుక్రవారం ఇచ్చిన తీర్పు అనంతరం మృతురాలి తల్లిదండ్రులు దుర్గాబాయి, మురళీకృష్ణ ఆవేదన ఇది. తీర్పు వెలువడగానే కోర్టు ప్రాంగణంలో కన్నీరుమున్నీరైన వారిని చూసి అందరి గుండెలు బరువెక్కాయి.కేసు పూర్వాపరాలు..రిషితేశ్వరి ఆత్మహత్య ఘటన అప్పట్లో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. బీసీ సామాజికవర్గానికి చెందిన విద్యార్థిని బలవన్మరణానికి కారణమైన వర్సిటీ అధికారులు, సంబంధిత వ్యక్తులపై చర్యలు తీసుకోకుండా అప్పటి టీడీపీ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించింది. విద్యార్థిని మృతికి కారణమైన అప్పటి ఆర్కిటెక్చర్ కళాశాల ప్రిన్సిపాల్ జి.బాబు రావుతోపాటు వర్సిటీ ఉన్నతాధికారులపై కేసు న మోదు చేయాలని, ర్యాగింగ్‌కు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని, రిషితేశ్వరి కుటుంబానికి న్యాయం చేయాలని వైఎస్సార్సీపీ నాయకులు, ప్రజా, విద్యార్థి సంఘాలు పెద్దఎత్తున ఉద్యమం చేశాయి. చంద్రబాబు నిర్లక్ష్యం వీడాలని అసెంబ్లీలోనూ ప్రభుత్వాన్ని నిలదీశారు. ఈ ఉద్యమాన్ని అణచివేసేందుకు నాటి ప్రభుత్వం చేయని ప్రయత్నం లేదు. చివరికి.. ఈ పోరాటాల ఫలితంగా టీడీపీ ప్రభుత్వం విధిలేని పరిస్థితుల్లో ప్రిన్సిపాల్ బాబురావుపై చర్యలు తీసుకుని, ఆరోపణలు ఎదుర్కొంటున్న విద్యార్థులను సస్పెండ్ చేశారు. ఈ నేపథ్యంలో సుదీర్ఘకాలం విచారణ జరిగిన అనంతరం శుక్రవారం గుంటూరు కోర్టు కేసును కొట్టివేసింది. అన్నీ సమర్పించాం, అప్పీలుకు వెళ్లాలి..రిషితేశ్వరి డైరీల్లో ఎవరెవరు ర్యాగింగ్‌కు పాల్పడ్డారు, మానసికంగా వేధించిన వారి పేర్లు స్పష్టంగా ఉ న్నాయి. ఈ తీర్పు న్యాయమైంది కాదని భావిస్తున్నాం. హైకోర్టుకు వెళ్లే ఆలోచన చేస్తాం. పోలీసులు అప్పీల్ చేయాలి. – వై.కోటేశ్వరరావు, స్పెషల్ పీపీగుండెఘోషకు రిషితేశ్వరి అక్షర రూపం ఇదే..రిషితేశ్వరి ఆత్మహత్య తరువాత ఆమె గదిలో డైరీ లభించింది. అందులో రిషితేశ్వరి స్వహస్తాలతో రాసుకున్న కొన్ని ఘటనలు, తాను ఎదుర్కొన్న ఆవేదన, గుండెఘోషను కూలంకషంగా అక్షర రూపంలో వివరించింది. ‘మై లాస్ట్ నోట్’ పేరుతో తన స్వహస్తాలతో రిషితేశ్వరి రాసిన కొన్ని ముఖ్యాంశాలు ఏమిటంటే..⇒ నవ్వు!!! నవ్వు!!! నవ్వు!!! ఈ నవ్వు అంటే నాకు చాలా ఇష్టం. అందుకే నేను ఎప్పుడూ నవ్వుతూ ఉంటా. అందరిని నవ్విస్తూ ఉంటా. కానీ, ఆ నవ్వే నాకు పెద్ద సమస్య అయింది.⇒ మా నాన్న అంటే నాకు చాలా ఇష్టం. నిజానికి పిచ్చి. అంత ప్రేమగా పెంచాడు మా నాన్న. నాకు చదువు అంటే ఇష్టం. ఈ చదువు కోసం నా ఊరు వదిలి ఇక్కడకొచ్చా. ⇒ ఇలా వచ్చిన నన్ను.. నా సీనియర్స్‌లో కొంతమంది చదువు వైపు కాకుండా ప్రేమవైపు లాగడానికి ప్రయత్నించారు. నేను ఆ దారిలోకి వెళ్లలేదు. దాంతో నా మీద రూమర్స్ క్రియేట్ చేశారు. అది వింటేనే నా మొహంలో నవ్వు మాయమై పోయేది.. ఏడుపు కూడా వచ్చేది.⇒ నేను నాన్న దగ్గర ఏమీ దాచేదాన్ని కాదు.. కాని ఇక్కడకు వచ్చాక చెబితే ఏమైపోతారో అని దాయాల్సి వస్తోంది. నాకు నరకయాతన కనిపిస్తోంది. ⇒ నా ఆఖరి కోరిక ఒక్కటే. నా చావుకు కారణం ఎవరో వాళ్లకు తెలుసు. వాళ్లు వాళ్ల తప్పు తెలుసుకుంటే చాలు. ఇంకెవ్వరినీ ఇలా (నాలా) బాధపెట్టకుంటే చాలు.⇒ ఏ అమ్మాయిలూ యూనివర్సిటీలో ర్యాగింగ్ ఉండదని అనుకోవద్దు. ఏ తల్లిదండ్రులు పిల్లల్ని ఇంత ప్రేమగా పెంచవద్దు. మీకు చెప్పలేక వాళ్లలో వాళ్లు దాచుకోలేక నరకం కనిపిస్తుంది.⇒ అమ్మా, నాన్న జాగ్రత్త! నాన్న ప్లీజ్ ఏడవకండి. నేను ఎప్పుడూ మీ దగ్గర్లోనే ఉంటా. ట్రై టూ డొనేట్ మై ఆర్గాన్స్ ఇఫ్ దే ఆర్ ఇన్ గుడ్ కండీషన్.. (నా అవయవాలు పనిచేసే స్థితిలో ఉంటే వాటిని దానం చేయడానికి ప్రయత్నించండి) అంటూ చాలా అంశాలు రాసింది. -
కెనడాలో టెంపుల్‌పై దాడి.. ఖలిస్తానీ నిరసన నిర్వాహకుడు అరెస్ట్
కెనడాలోని గ్రేటర్ టొరంటో ఏరియా (GTA)లో గత ఆదివారం హిందూ టెంపుల్‌పై జరిగిన దాడికి సంబంధించిన కేసులో ఖలిస్తానీ నిరసనల ప్రధాన నిర్వాహకుడు ఇందర్జీత్ గోసల్ పోలీసులు అరెస్టు చేశారు. బ్రాంప్టన్‌లోని హిందూ దేవాలయంపై హింసాత్మక దాడికి సంబంధించి శుక్రవారం అతన్ని అరెస్టు చేసి అభియోగాలు నమోదు చేసినట్లు పీల్ రీజినల్ పోలీసులు(PRP) వెల్లడించారు. నిందితుడు ఖలీస్తానీ వేర్పాటువాద గ్రూప్‌కు సంబంధించిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. అయితే.. అరెస్ట్ చేసిన అనంతరం అతన్ని షరతులపై విడుదల చేశామని తెలిపారు. బ్రాంప్టన్‌లోని అంటారియో కోర్ట్ ఆఫ్ జస్టిస్‌లో ముందస్తుగా పేర్కొన్న తేదీన హాజరుకావలసి ఉంటుందని అతనికి తెలియజేశారు. మరోవైపు.. టెంపుల్‌పై దాడి జరిగిన అనంతరం.. నవంబర్ 3, 4 తేదీల నుంచి చోటుచేసుకున్న సంఘటనలను పరిశీలించడానికి పోలీసులు.. ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేశారు. ఈ ఘటనపై దర్యాప్తు చేసి నిందితులను గుర్తించి అరెస్టు చేస్తామని పోలీసులు చెప్పారు. నవంబర్ 3న బ్రాంప్టన్‌లోని హిందూ సభ మందిర్‌పై జరిగిన దాడిపై ఇండో-కెనడియన్ సమాజం దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ఈ దాడిని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కెనడా అధ్యక్షుడు జస్టిస్ ట్రూడో, కెనడా ప్రతిపక్ష నాయకుడు పియరీ పోయిలీవ్రే తీవ్రంగా ఖండించిన విషయం తెలిసిందే.Glad that @PeelPolice has finally charged Khalistani extremist Inderjeet Gosal of Brampton for assault with a weapon. He was arrested yesterday but released on conditions. We urge @PeelPolice to also arrest / charge other accomplices of Gosal and their operators who are behind… pic.twitter.com/nBGKt4EjcT— VHP Canada (@vhpcanada) November 10, 2024ఎవరీ ఇందర్జీత్ గోసల్?ఇందర్జీత్ గోసల్‌కు సిక్కు ఫర్ జస్టిస్ (SFJ) జనరల్ కౌన్సెల్ గురుపత్వంత్ పన్నూకు లెఫ్టినెంట్‌గా గుర్తింపు ఉంది. గతేడాది జూన్ 18న బ్రిటీష్ కొలంబియాలోని సర్రేలో హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యకు గురైన తర్వాత ప్రజాభిప్రాయ సేకరణకు కెనడియన్ ఆర్గనైజర్‌గా నియమించబడ్డాడు. కెనడియన్ పోలీసుల ప్రకారం.. ఖలిస్థానీ గ్రూప్ పేరుతో హింసాత్మక కార్యకలాపాలకు పాల్పడుతున్న 13 మంది కెనడియన్లలో గోసల్ కూడా ఉన్నట్లు తెలిపారు.చదవండి: ఉక్రెయిన్, పశ్చిమాసియాపై ఏం చేస్తారు? -
వ్యాపారి రమేష్ కుమార్ హత్య కేసులో ట్విస్ట్
సాక్షి, హైదరాబాద్: నగరానికి చెందిన వ్యాపారి రమేష్ కుమార్ హత్య కేసులో కొత్త ట్విస్ట్ చోటుచేసుకుంది. ఈ కేసులో నిందితుల్ని కర్ణాటక పోలీసులు క్రైమ్ సీన్ రీ–కన్స్ట్రక్షన్ కోసం గత గురువారం నగరానికి తీసుకువచ్చారు. వీరంతా పోచారంలోని బృందావన్ హోటల్లో బస చేశారు. శుక్రవారం తెల్లవారుజామున కీలక నిందితుడు అంకుర్ రాణా తప్పించుకుని పారిపోయాడు. దీంతో కర్ణాటక పోలీసులు ఐటీ కారిడార్ పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. వెలుగులోకి వచి్చన అంశాల ప్రకారం కేసును ఇక్కడకు బదిలీ చేయాల్సి ఉండగా.. కర్ణాటక పోలీసులు చూపించిన అత్యుత్సాహం కారణంగానే ఇలా జరిగినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. తుకారాంగేట్ టు సంస్కృతి టౌన్షిప్ నగరంలోని తుకారాంగేట్‌కు చెందిన రమేష్ కుమార్ భార్య, కుమార్తెకు దూరంగా పోచారంలో ఉన్న సంస్కృతి టౌన్íÙప్లో ఒంటరిగా ఉండేవారు. భువనగిరికి చెందిన ఆకుల లత చిన్నతనంలోనే తండ్రిని కోల్పోయింది. ఇంజినీరింగ్ పూర్తి చేసిన ఈమె బెంగళూరులోని ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం చేసింది. ఈ నేపథ్యంలోనే తన పేరును నిహారికగా మార్చుకుంది. గతంలో ఇద్దరిని పెళ్లి చేసుకుని, వారి నుంచి వేరు పడిన నిహారికకు మాట్రిమోనియల్ సైట్ ద్వారా రమే‹Ùతో పరిచయం ఏర్పడింది. 2018లో రిజిస్టర్ వివాహం చేసుకున్న వీళ్లు సంస్కృతి టౌన్‌షిప్‌లోనే కాపురం పెట్టారు. నిహారిక మాత్రం ఉద్యోగ నిమిత్తం అంటూ ఎక్కువ రోజులు బెంగళూరులోనే ఉండేది. ఈమె తన రెండో భర్తతో కలిసి హరియాణాలో ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ పలువురిని మోసం చేసి జైలుకు వెళ్లింది. అక్కడే ఈమెకు అంకుర్ రాణా అనే నేరగాడి తల్లితో పరిచయమైంది. ఆమెను కలవడానికి ములాఖత్‌కు వచ్చే అంకుర్తోనూ స్నేహం ఏర్పడింది. జర్మనీలో ఉద్యోగం కోసం నగదు అవసరమంటూ.. ఆంధ్రప్రదేశ్‌లోని కడప జిల్లా వాసవీ నగర్ నుంచి బెంగళూరులోని రామమూర్తి నగర్ వెటర్నరీ డాక్టర్‌గా స్థిరపడిన నిఖిల్ మైరెడ్డితో నిహారికకు ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. కొన్నాళ్లుగా వీరిద్దరూ సహజీవనం చేస్తున్నారు. కొన్ని రోజులుగా నిహారిక తనకు జర్మనీలోని ప్రముఖ సాఫ్ట్వేర్ సంస్థలో ఉద్యోగం వచి్చందని, దాని నిమిత్తం రూ.2 కోట్లు చెల్లించాల్సి ఉందంటూ రమే‹Ùతో చెబుతూ వస్తోంది. కొన్నాళ్లుగా ఆమె ప్రవర్తన, మాటలపై సందేహాలు రావడంతో డబ్బు ఇవ్వడానికి ఆయన నిరాకరించారు. ఈ విషయంలోనే వీరి మధ్య వివాదం నెలకొంది. రమేష్ ఇటీవల తన స్తిరాస్థిని విక్రయించగా వచ్చిన రూ.8 కోట్లు కాజేయాలని నిహారిక పథకం వేసింది. రమేష్‌ను హత్య చేయడం ద్వారా దీన్ని అమలు చేయాలని అంకుర్ రాణాను సంప్రదించింది. అతడు అంగీకరించడంతో ఇరువురూ కలిసి గత నెల 1న నగరానికి చేరుకున్నారు. పీర్జాదిగూడలో చంపి.. మృతదేహంతో 800 కి.మీ ప్రయాణించి.. బోడుప్పల్ ప్రాంతంలో అంకుర్ బస చేయగా.. నిహారిక మాత్రం రమేష్ ఇంటికి వెళ్లింది. రెండు రోజుల పాటు వీరి మధ్య నగదు విషయంలో వాగ్వాదం జరిగింది. గత నెల 3 రాత్రిన తనను విమానాశ్రయంలో వదిలి రావాలంటూ నిహారిక కోరగా.. రమేష్ తన మెర్సిడిస్ బెంజ్ కారులో (టీఎస్ 07 ఎఫ్ఎస్ 5679) బయలుదేరారు. బోడుప్పల్–ఉప్పల్ మధ్యలో అంకుర్ వీరి వాహనం ఎక్కాడు. అతడిని తన సహోద్యోగిగా పరిచయం చేసింది. వీరి వాహనం పీర్జాదిగూడ కమాన్ వద్దకు చేరుకున్నాక వెనుక సీటులో కూర్చున్న అంకుర్ తన వద్ద ఉన్న వైరుతో రమే‹Ùకు ఉరి బిగించి చంపాడు. ఆపై వీళ్లు నిఖిల్‌ను సంప్రదించారు. అతడి సూచనల మేరకు మృతదేహాన్ని కారులో ఉంచుకుని దాదాపు 800 కి.మీ ప్రయాణించారు. ఊటీ సమీపంలోని సుంటికొప్పలో (కర్ణాటక) ఉన్న కాఫీ ఎస్టేట్‌లో పెట్రోల్ పోసి మృతదేహాన్ని దహనం చేసి కారుతో పారిపోయారు. గత నెల 8న సగం కాలిన మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు కొడుగు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. దర్యాప్తు చేసిన అధికారులు నిహారిక, నిఖిల్‌లను బెంగళూరులో, అంకుర్‌ను హరియాణాలో అరెస్టు చేశారు.అవకాశం ఉన్నా బదిలీ చేయకుండా... నిందితుల విచారణ నేపథ్యంలో ఈ హత్య పీర్జాదిగూడలో జరిగినట్లు తేలింది. నిబంధనల ప్రకారం ఆ వెంటనే ఈ కేసును రాచకొండకు బదిలీ చేయాలి. కొడుగు పోలీసులు మాత్రం అత్యుత్సాహం చూపిస్తూ అలా చేయలేదు. దర్యాప్తు కొనసాగిస్తూ నిందితులను కోర్టు అనుమతితో తమ కస్టడీలోకి తీసుకున్నారు. క్రైమ్ సీన్ రీ–కన్స్ట్రక్షన్ కోసం వారిని తీసుకుని నగరానికి వచ్చి పోచారంలోని బృందావన్ లాడ్జిలో బస చేశారు. గత గురువారం సంస్కృతి టౌన్షిప్, బోడుప్పల్, పీర్జాదిగూడల్లో వీరిని తిప్పారు. ఆ రోజు రాత్రి హోటల్ గదిలో అంతా నిద్రపోతుండగా.. శుక్రవారం తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో అంకుర్ ఎస్కేప్ అయ్యాడు. దీంతో కర్ణాటక పోలీసులు దీనిపై పోచారం ఐటీ కారిడార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మిగిలిన ఇద్దరు నిందితులను తీసుకుని శనివారం కొడుగు వెళ్లిపోయారు. పరారైన అంకుర్ కోసం కర్ణాటక, తెలంగాణ పోలీసులు గాలిస్తున్నారు. -
బద్లాపూర్ ఎన్కౌంటర్: మహారాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం
ముంబై: మహారాష్ట్రలో ఆగస్ట్‌లో సంచలనం సృష్టించిన ‘బద్లాపూర్’ బాలికలపై అత్యాచారం కేసులో నిందితుడు అక్షయ్ షిండే ఇటీవల పోలీసుల ఎదురుకాల్పుల్లో మృతి చెందాడు. ఈ ఘటనకు సంబంధించి తాజాగా నిందితుడు అక్షయ్ షిండే ఎన్‌కౌంటర్‌పై మహారాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రిటైర్డ్ హైకోర్టు న్యాయమూర్తి దిలీప్ భోసలేతో ఏకసభ్య విచారణ కమిషన్‌ను ఏర్పాటు చేసింది. ఈ కమిటి మూడు నెలల్లోగా ఎన్కౌంటర్ ఘటనపై పూర్తి నివేదిక సమర్పించనుంది.Maharashtra Government forms a 1-member inquiry committee of retired High Court judge Dilip Bhosale, into the encounter of Badlapur sexual assault accused Akshay Shinde. The commission will submit the report within 3 months.— ANI (@ANI) October 2, 2024 నిందితుడు అక్షయ్ షిండే ఎన్కౌంటర్ ఘటన ఇటీవల మహారాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపింది. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు సమీస్తున్న వేళ ఈ కేసు విషయంలో కేవలం రాజకీయ సానుభూతి పొందేందుకు ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే ప్రభుత్వం.. దారుణంగా నిందితుడిని హత్య చేయించిందని ప్రతిపక్షాలు తీవ్రంగా మండిపడ్డాయి. అదేవిధంగా ఈ ఎన్‌కౌంటర్‌పై విచారణ జరిపించాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేసిన విషయం తెలిసిందే.చదవండి: నిందితులు కాల్పులు జరుపుతుంటే..పోలీసులు చప్పట్లు కొట్టాలా?: ఫడ్నవీస్ -
‘సంజయ్ రాయ్‌పై నార్కో టెస్ట్ వద్దు’
కోల్‌కతా: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కోల్‌కతాలో ఆర్జీ కర్ వైద్యకళాశాల జూనియర్ వైద్యురాలి హత్యోదంతంలో ప్రధాన నిందితుడు సంజయ్ రాయ్‌కు నార్కో అనాలసిస్ పరీక్ష చేసేందుకు కోల్‌కతా కోర్టును సీబీఐ అనుమతి కోరగా న్యాయస్థానం అందుకు నిరాకరించింది. ఈ విషయాన్ని సీబీఐ ఉన్నతాధికారి ఒకరు శుక్రవారం వెల్లడించారు. ఆ కుటుంబాలకు ఆర్థికసాయం జూనియర్ వైద్యుల సమ్మె కారణంగా ఆస్పత్రుల్లో వైద్యం అందక మరణించిన వారి కుటుంబాలకు ఆర్థికసాయం చేసేందుకు పశి్చమబెంగాల్ ప్రభుత్వం ముందుకొచి్చంది. 29 మంది మృతుల కుటుంబాలకు తలో రూ.2 లక్షలు ఇస్తామని సీఎం మమతా బెనర్జీ శుక్రవారం ప్రకటించారు. రాష్ట్రపతి, ప్రధానికి జూడాల లేఖ ఈ ఉదంతంలో స్వయంగా కలగజేసుకోవాలంటూ రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీకి జూనియర్ డాక్టర్లు గురువారం రాత్రి లేఖలు రాశారు. ఈ లేఖల ప్రతులను ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్, కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డాలకూ పంపించారు. ‘‘ అత్యంత జుగుప్సాకరమైన నేరానికి మా తోటి సహాధ్యాయి బలైంది. న్యాయం జరిగేలా మీరు జోక్యం చేసుకోండి. అప్పుడే ఎలాంటి భయాలు లేకుండా మళ్లీ మా విధుల్లో చేరతాం’’ అని ఆ లేఖలో జూనియర్ వైద్యులు పేర్కొన్నారు. -
నిందితుల ఇళ్లు కూల్చడమేంటి? : సుప్రీంకోర్టు ఆగ్రహం
న్యూఢిల్లీ: బుల్డోజర్ రాజ్‌పై దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. క్రిమినల్ కేసుల్లో నిందితులుగా ఉన్నవారి ఇళ్లను కూల్చివేయడంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. అసలు ఈ ట్రెండ్ ఎక్కడి నుంచి వచ్చిందని ప్రశ్నించింది.ఢిల్లీ జహంగీర్‌పురిలో నిందితుడు అద్దెకున్న ఇళ్లు కూల్చివేయడంపై సీనియర్ న్యాయవాదులు దుష్యంత్‌దవే, సీయూ సింగ్ దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు విచారించింది. ఈ సందర్భంగా జస్టిస్ బిఆర్.గవాయి, జస్టిస్ విశ్వనాథన్‌ల బెంచ్ ఘాటు వ్యాఖ్యలు చేసింది. ’క్రిమినల్ కేసుల్లో నిందితులు, దోషుల ఇళ్లు కూల్చివేయాలన్న నిబంధన ఎక్కడ ఉంది. ఒక కట్టడం అక్రమమైనదైతే దానిని కూల్చేందుకు ఒక విధానం ఉంది. అవసరమైతే ఆ కట్టడాన్ని నిబంధనల ప్రకారం క్రమబద్ధీకరించాలి. దేశవ్యాప్తంగా ప్రస్తుతం నడుస్తున్న కూల్చివేతల ట్రెండ్‌పై మేం మార్గదర్శకాలు జారీ చేస్తాం’అని బెంచ్ తెలిపింది. కేసు విచారణను సెప్టెంబర్ 17కు వాయిదా వేసింది. రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో కొడుకు నేరం చేస్తే తండ్రి ఇళ్లు కూల్చిన ఘటనపైనా కోర్టు మండిపడింది. -
రోజూ రోటీయేనా ?
కోల్‌కతా: దేశమంతటా కలకలం సృష్టించిన కోల్‌కతాలో జూనియర్ వైద్యురాలి హత్యోదంతంలో నిందితుడు సంజయ్ రాయ్ జైళ్లోనూ తన మొండితనం చూపిస్తున్నాడు. ప్రతి రోజూ చపాతి ఏం తింటామని జైలు అధికారులపైనే ఆగ్రహం వ్యక్తంచేశాడు. అయితే జైలు నిబంధనల ప్రకారం ఖైదీలతోపాటే విచారణ ఖైదీలకు ఒకేరకమైన భోజనం వడ్డిస్తారు. వైద్యురాలి హత్యకేసులో అరెస్ట్‌చేశాక పోలీసులు సంజయ్‌ను కోల్‌కతాలోని ప్రెసిడెన్సీ కారాగారంలో పడేశారు. అయితే కస్టడీలో ఉన్నప్పటి నుంచి ఒకే తరహా చపాతి, కూరనే రోజూ వడ్డిస్తున్నారని సంజయ్ ఆగ్రహంగా మాట్లాడారు. ‘‘ రోజూ రోటీయేనా?. నాకు కోడిగుడ్డు ఫ్రైడ్రైస్లాంటి ఎగ్ చావ్మీన్ పెట్టండి’ అని జైలు సిబ్బందిని బెదిరించినట్లు విశ్వస నీయ వర్గాల సమా చారం. అయితే విచారణ ఖైదీ తనకిష్టమొచ్చింది తింటానని తెగేసి చెప్పడంపై జైలు యాజమాన్యం సీరియస్ అయింది. అతి చేయొద్దని హెచ్చరించి అధికారులు సంజయ్ నోరు మూయించారు. దీంతో పెట్టింది తింటానని సంజయ్ వ్యాఖ్యానించినట్లు సమాచారం. అయితే జైలుకు వచ్చిన కొత్తలో తనకు నిద్ర పట్టట్లేదని, నిద్ర సరిపోవడం లేదని, నన్ను కాస్తంత పడుకోనివ్వండి అని సంజయ్ తెగ ఫిర్యాదులు చేసేవాడని ఇప్పుడు సాధారణ స్థాయికి వచ్చాడని తెలుస్తోంది. -
కోల్‌కతా డాక్టర్ కేసు: నిందితులకు పాలిగ్రాఫ్ టెస్ట్
కోల్‌కతా: కోల్‌కతా డాక్టర్ హత్యాచార కేసులో సీబీఐ దర్యాప్తు ముమ్మురం చేస్తోంది. తాజాగా ఆదివారం ఈ కేసులో ప్రధాన నిందితుడు సంజయ్ రాయ్, ఆర్జీ కర్ హాస్పిటల్ మాజీ ప్రిన్సిపల్ సందీష్ హోష్, మరో నలుగురు డాక్టర్లకు పాలిగ్రాఫ్ టెస్ట్ చేస్తున్నామని సీబీఐ అధికారులు తెలిపారు. ఈ టెస్ట్‌లు నిర్వహించటం కోసం ఢిల్లీ నుంచి సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీ (SEPSLA) ప్రత్యేక బృందం కోల్‌కతా చేరుకున్నట్లు తెలిపారు. పాలిగ్రాఫ్ టెస్ట్‌లు కొనసాగుతున్నాయని సీబీఐ అధికారులు పేర్కొన్నారు. ఇక.. ప్రధాన నిందితుడు సంజయ్ రాయ్‌కు జైలులోనే పాలిగ్రాఫ్ పరీక్ష నిర్వహిస్తామని, మిగతావారికి సీబీఐ కార్యాలయంలో టెస్ట్‌లు కొనసాగుతున్నట్లు సీబీఐ వర్గాలు తెలిపాయి.Kolkata doctor rape-murder: Polygraph test of former RG Kar principal Sandip Ghosh among others to be held todayRead @ANI Story | https://t.co/cTnTQQqCBa#Kolkata #RGKarHospital #SandipGhosh pic.twitter.com/udWo2KLl2F— ANI Digital (@ani_digital) August 24, 2024బాధితురాలితో చివరి గంటల్లో గడిపిన నలుగురిలో ఇద్దరు ఫస్టియర్ పోస్ట్ గ్రాడ్యుయేట్ టైనీలు, ఒక హౌస్ సర్జన్, ఇంటర్న్‌షిప్ చేస్తున్న మరొకరు ఉన్నారు. వీరందరూ కలిసి బాధిత డాక్టర్‌తో కలిసి ఘటన జరగడానికి ముందు భోజనం చేశారు. ఈ కేసులో వీరు నిందితులు కానప్పటికీ వారి స్టేట్మెంట్లు మాత్రం పరస్పర విరుద్ధంగా ఉన్నాయి. డాక్టర్ హత్యాచారానికి గురవడానికి ముందు, తర్వాత ముందుగా వీరే చూశారు. సాక్ష్యాలను తారుమారు చేయడానికి వీళ్లు ఏమైనా ప్రయత్నించారా? అన్న విషయాన్ని పాలిగ్రాఫ్ టెస్టు ద్వారా తెలుసుకోవాలని దర్యాప్తు సంస్థ సీబీఐ భావిస్తోంది. ఇక.. నిందితులకు పాలిగ్రాఫ్ టెస్టు చేసేందుకు కోల్‌కతా హైకోర్టు ఇటీవల అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. -
అసోం అత్యాచారం కేసు: నిందితుడు మృతి
దిస్పూర్: అసోంలోని నాగావ్ జిల్లాలో 14 ఏళ్ల బాలికపై ముగ్గురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. తాజాగా ఈ ఘటనలో అరెస్టైన ప్రధాన నిందితుడు శనివారం తెల్లవారుజామున మృతి చెందినట్లు పోలీసు అధికారులు తెలిపారు. పోలీసులు వివరాల ప్రకారం.. ఈ కేసులో శుక్రవారం పోలీసులు ప్రధాన నిందితుడిని అరెస్ట్ చేశారు. దర్యాప్తులో భాగంగా ఈ రోజు తెల్లవారుజామున 3.30 గంటలకు క్రైం సీన్ రీ కన్స్ట్రక్షన్ కోసం ఘటన స్థలానికి తీసుకువెళ్లారు. ఈ క్రమంలో నిందితుడు పోలీసు కస్టడీ నుంచి తప్పించుకొని ఓ చెరువులో దూకాడు. దీంతో వెంటనే పోలీసులు రెండు గంటల పాటు చెరువులో గాలించి మృతదేహాన్ని బయటకు తీసి స్వాధీనం చేసుకున్నామని ఎస్పీ స్వప్ననీల్ వెల్లడించారు.నాగావ్ జిల్లాలోని ధింగ్ ప్రాంతంలో గురువారం రాత్రి 8 గంటల సమయంలో బాలిక ట్యూషన్ నుంచి ఇంటికి తిరిగి వస్తుండగా, ముగ్గురు వ్యక్తులు మోటార్ సైకిల్ వచ్చి, ఆమెను బంధించి అత్యాచారానికి పాల్పడి, రోడ్డు పక్కన విసిరేసి వెళ్లిపోయినట్లు పోలీసులు చెప్పారు. బాధితురాలు పదో తరగతి చదువుతోందని, దుండగుల దుశ్చర్య వల్ల గాయాలపాలై అపస్మారక స్థితికి చేరుకుందని తెలిపారు. స్థానికులు గమనించి, తమకు సమాచారం ఇచ్చారని వెల్లడించారు. బాధితురాలిని అసుపత్రికి తరలించామని, చికిత్స కొనసాగుతోందని పేర్కొన్నారు. ఇక.. ఈ ఘటనపై ప్రజలు ఆగ్రహంతో వీధుల్లోకి వచ్చి ఆందోళనకు దిగారు. మహిళలకు రక్షణ కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. -
పాత, కొత్తల గందరగోళం..
భారతదేశంలో నేరాల దర్యాప్తులో సుదీర్ఘమైన ఆలస్యం ఒక మహమ్మారిలా పరిణమించింది. ఇందువల్ల నిందితులైన అనేకమంది అమాయకులు అనవసరంగా జైళ్లలో విచారణ ఖైదీలుగా మగ్గ వలసి వస్తోంది. కొందరైతే పది పదిహేనేళ్లు జైల్లో ఉండి చివరకు నిర్దోషిగా విడుదలయినవారూ ఉన్నారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త చట్టాలు ఇలాంటి అమాయకుల సంఖ్య పెరగడానికి దోహదపడ తాయని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే ఈ చట్టాలు పోలీసులకు అరెస్ట్ చేసి నిర్బంధించేందుకు అపరిమిత అధికారాలను కట్ట బెడుతున్నాయి.నేర విచారణ అత్యంత ఆలస్యంగా జరగడం వల్ల కొందరు డబ్బున్న పెద్దవాళ్లు బెయిలుపై బయటికి వచ్చి ఎన్నికల్లో పోటీచేసి గెలుస్తున్నారు. అదేసమయంలో అమాయకులు ఏళ్ల తరబడి జైళ్లలో మగ్గుతున్నారు. ఆ విధంగా కొత్త చట్టాలు ఉన్నవారికి చుట్టాలు కాబోతున్నాయి. చట్టాలలో మార్పులు తెస్తే మంచిదే. ఈనాటి అవసరాలకు అనుగుణంగా వాటిని సవరించాలనే లక్ష్యం ఉంటే సంతోషం. చట్టాల మరింత ఆధునికీకరణ, సరళీ కరణ నేటి సమాజానికి అవసరం. కానీ కొత్త నేరాల చట్టాల వల్ల మేలు కంటే కీడే ఎక్కువ జరిగేలా ఉంది. ఈ చట్టాల ద్వారా జరిమానాలను చాలా పెంచారు.ఇది సరికాదు. పోనీ కనీసం కొత్త చట్టాల అమలు ద్వారా అయినా సత్వర తీర్పులు వచ్చే అవకాశం కలిగితే కొంత సంతోషం కలిగేది. కానీ కనుచూపు మేర అది సాధ్య మయ్యేలా కనిపించడంలేదు. ఎందుకంటే కొత్తగా నమోదయ్యే కేసులను కొత్త చట్టాల ప్రకారం విచారించాల్సి ఉంటుంది. ఇప్పటికే పెండింగ్‌లో ఉన్న లక్షలాది కేసులను పాత క్రిమినల్ చట్టాల ప్రకారం విచారించాల్సి ఉంటుంది. ఒకే సమయంలో పాత, కొత్త చట్టాల కింద విచారించడానికి తగిన సిబ్బంది, వసతులూ భారతీయ న్యాయ వ్యవస్థకు లేకపోవడం ఇక్కడ గమనార్హం.కొత్త మూడు చట్టాల్లో రెండింటిలో కొంచెం మార్పులు చేసినట్లు కనిపించినా మూడోదైన సాక్ష్య చట్టం మక్కీకి మక్కీ పాతదే. ఇండియన్ శిక్షాస్మృతి అనే 1860 నాటి పరమ పాత (లేదా సనాతన) చట్టం... ‘భారతీయ న్యాయ సంహిత– 2023’ పేరుతో మళ్లీ తీసుకురావడం విడ్డూరం. ఏం సాధించడానికి ఎన్డీఏ ప్రభుత్వం ఈ చట్టాలను కొత్తగా తీసుకువచ్చిందో అర్థం కావడం లేదు. పార్లమెంట్లో స్వయంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగిన స్థితిలో లేని బీజేపీపై... భాగస్వామ్య పక్షాల్లో బలమైన టీడీపీ, జేడీయూ వంటివైనా ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేయకపోవడం విచారకరం. ఇందువల్ల ఈ కొత్త చట్టాలు నిరా ఘాటంగా కొనసాగేందుకు అడ్డంకీ లేకుండా పోయింది. ఇప్పటికే పౌర హక్కుల కోసం ఉద్యమిస్తున్న కార్యకర్తలను దారుణ నిర్బంధానికి గురి చేస్తున్నారు.రాజకీయ కక్ష సాధింపులకు పాత నేరచట్టాలను ఉపయోగించే ఎన్నో దారుణాలకు పాల్పడింది బీజేపీ సర్కార్. ఇప్పుడు కొత్త చట్టాలను ఉపయోగించి మరెంత అన్యాయంగా వ్యవహరిస్తుందో అనే భయం ఎల్లెడలా కనిపిస్తోంది. వీటిని అడ్డుపెట్టుకొని రాష్ట్రాల్లో ప్రతిపక్ష పార్టీల ప్రభుత్వాలను కూల్చడానికి మరింతగా ప్రయత్నించవచ్చు. ఇప్పటికే అనేక కేసులు బనాయించిన ప్రతిపక్ష ప్రజా ప్రతినిధులు తమ పార్టీలో చేరిన తరువాత వారిపై కేసులు ఎత్తివేయడమో, లేక విచారణను వాయిదా వేసేలా చూడడమో బీజేపీ చేస్తూనే ఉంది. ఈ పరిస్థితుల్లో అమలులోకి వచ్చిన కొత్త చట్టాలు కేంద్ర పాలకు లకు ఇంకెంత మేలు చేకూర్చనున్నాయో! అంతి మంగా సాధారణ పౌరులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారనేది సుస్పష్టం.– మాడభూషి శ్రీధర్, వ్యాసకర్త, మహేంద్ర యూనివర్సిటీ, ‘స్కూల్ ఆఫ్ లా’లో ప్రొఫెసర్ -
యువతితో నటుడి నిశ్చితార్థం.. నిలదీసిన భార్యపై కత్తితో దాడి
బనశంకరి: మరో యువతితో నిశ్చితార్థం చేసుకోవడాన్ని ప్రశ్నించిన భార్యపై బుల్లితెర నటుడు చాకుతో దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటన హెచ్ఏఎల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ప్రైవేటు కంపెనీలో పనిచేస్తున్న సన్నిమహిపాల్ సీరియల్లో నటిస్తున్నాడు. జనవరిలో ఫేస్బుక్ ద్వారా ఓ అమ్మాయితో పరిచయం పెంచుకున్నాడు. అనంతరం ప్రేమిస్తున్నట్లు నమ్మించి శారీరకంగా ఒకటి కావడంతో ఆమె గర్భం దాల్చింది. గర్భిణి కావడంతో తనను పెళ్లి చేసుకోవాలని ఆ యువతి డిమాండ్ చేయడంతో గతనెల 15న దేవస్థానంలో ఇద్దరికి వివాహమైంది.వివాహమైన అనంతరం వారం పాటు తనతో కలిసున్న భర్త తల్లిదండ్రులను ఒప్పిస్తానని మాటిచ్చాడు. అప్పటివరకు ఇద్దరు స్నేహితులుగా ఉండాలని అలాగే మేనేజ్ చేయాలని షరతు విధించాడు. అనంతరం మంగళూరు వెళ్లి కొద్దిరోజుల క్రితం తల్లిదండ్రుల సమక్షంలో మరో యువతితో నిశ్చితార్థం చేసుకున్నాడు. ఈ విషయం తెల్సి ఆ యువతి సన్నిమహిపాల్ను ప్రశ్నించడానికి అర్ధరాత్రి విజ్ఞాననగరలో అతడి నివాసానికి వెళ్లింది.ఇద్దరి మధ్య గొడవ జరగడంతో సన్నిమహిపాల్ ఆమెపై చాకుతో దాడి చేశాడు. అనంతరం కారులో ఆసుపత్రికి తీసుకెళ్లగా ఈ గొడవలో తనకు అబార్షన్ అయిందని భార్య తెలిపింది. మరోవైపు తను బలవంతంగా వివాహం చేసుకుని ఇంట్లోకి ప్రవేశించిందని ఆరోపిస్తూ సన్నిమహిపాల్ సదరు యువతిపై హెచ్ఏఎల్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. -
దభోల్కర్ హత్యోదంతంలో ఇద్దరికి జీవితఖైదు
పుణె: అంధవిశ్వాసాలను రూపుమాపేందుకు మహారాష్ట్రలో సామాజిక ఉద్యమం చేసిన హేతువాది డాక్టర్ నరేంద్ర దభోల్కర్ హత్యోదంతంలో ఇద్దరు నిందితులకు పుణె ప్రత్యేక న్యాయస్థానం జీవితఖైదు విధించింది. దభోల్కర్ హత్య జరిగిన 11 సంవత్సరాలకు తీర్పు వెలువడటం గమనార్హం. ఈ కేసులో ముగ్గురు నిందితులను కోర్టు నిర్దోషులుగా ప్రకటిస్తూ శుక్రవారం తీర్పు చెప్పింది. ఈ హత్యలో కీలక సూత్రధారిగా ఆరోపణలు ఎదుర్కొన్న వీరేంద్రసిన్హా తావ్డేకు వ్యతిరేకంగా సరైన సాక్ష్యాధారాలు లేని కారణంగా నిర్దోషిగా ప్రకటిస్తూ అదనపు సెషన్స్ జడ్జి తీర్పు చెప్పారు. షూటర్లు సచిన్ అంధూరే, శరద్ కలాస్కర్లకు జీవితఖైదుతోపాటు చెరో రూ.5 లక్షల జరిమాన విధించారు. సరైన సాక్ష్యాలు లేని కారణంగా తావ్డే, సంజీవ్, విక్రమ్‌ను కోర్టు నిర్దోషులుగా విడిచిపెట్టింది. 67 ఏళ్ల దభోల్కర్ 2013 ఆగస్ట్ 20న పుణెలో ఉదయపు నడకకు వెళ్లినపుడు బైక్‌పై వచి్చన ఆగంతకులు కాల్పులు జరిపి పారిపోయారు. తీవ్రగాయాలైన దభోల్కర్ ఆస్పత్రిలో చనిపోయారు. -
కేరళ పేలుళ్లు.. పోలీసుల ముందు లొంగిపోయిన నిందితుడు
తిరువనంతపురం: కేరళ బాంబు పేలుళ్ల ఘటనకు తానే బాధ్యుడనని లొంగిపోయాడో వ్యక్తి. పేలుళ్లు జరిగిన కన్వెన్షన్ సెంటర్లో తానే బాంబును అమర్చినట్లు పేర్కొన్నాడు. తానే ఆ బాంబులను కన్వెన్షన్ సెంటర్లోకి తీసుకెళ్లినట్లు పోలీసుల ముందు ఒప్పుకున్నాడు. దీంతో అతన్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు. కేరళ, కలమస్సేరిలోని ప్రార్థనా సమావేశంలో జరిగిన పేలుళ్లలో ఒకరు మృతి చెందగా 50 మంది గాయపడ్డారు. ప్రార్థనలు జరుగుతున్న కన్వెన్షన్ సెంటర్లో డొమినిక్ మార్టిన్ అనే వ్యక్తి బాంబును అమర్చినట్లు ఒప్పుకున్నాడని పోలీసులు తెలిపారు. అయితే.. ఈ పేలుళ్ల వెనుక అతడి హస్తం ఉందా లేదా? అనే విషయాన్ని పోలీసులు ఇంకా నిర్ధారించలేదు. కేరళ ADGP (లా అండ్ ఆర్డర్) అజిత్ కుమార్ మాట్లాడుతూ.. "పేలుళ్లకు సంబంధించి త్రిసూర్ రూరల్‌లోని కొడకరా పోలీస్ స్టేషన్లో డొమినిక్ మార్టిన్ అనే వ్యక్తి లొంగిపోయాడు. అదే ప్రాంతానికి చెందినవాడుగా ఆయన పేర్కొన్నాడు. మేము ఈ కేసుకు సంబంధించిన అన్ని కోణాలను పరిశీలిస్తున్నాము." అని చెప్పారు. It's a very unfortunate incident. We are collecting details regarding the incident. All top officials are there in Ernakulam. DGP is moving to the spot. We are taking it very seriously. I have spoken to DGP. We need to get more details after the investigation: Kerala CM Pinarayi… https://t.co/4utwtmR9Sl pic.twitter.com/GHwfwieRLB — ANI (@ANI) October 29, 2023 కేరళలోని ఓ కన్వెన్షన్ సెంటర్లో ఒకేరోజు మూడు సార్లు పేలుళ్ల ఘటన చోటుచేసుకుంది. ఈ పేలుళ్లల్లో ఒకరు మృతిచెందగా.. మరో 50 మంది తీవ్రంగా గాయపడ్డారు. కలమస్సేరి సమీపంలోని ఓ కన్వెన్షన్ సెంటర్లో ప్రేయర్ మీట్ జరుగుతుండగా ఈ ఘటన జరిగింది. ప్రార్థన సమయంలో అందరూ కళ్లు మూసుకొని ప్రార్థనలు చేస్తుండగా ఉదయం 9:47 సమయంలో ఒక్కసారిగా భారీ పేలుడు సంభవించింది. అనంతరం మరో రెండు మూడు చిన్న పేలుళ్లు జరిగినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. దాదాపు 2,000 మందితో ప్రార్థనలు జరుగినట్లు స్థానికులు తెలిపారు. ఎన్ఐఏ యాంటీ టెర్రర్ ఏజెన్సీ కేసును విచారిస్తోంది. జాతీయ భద్రతా దళం బృందం కూడా కేరళకు రానుంది. ఈ పేలుళ్లకు కారణం ఏంటనేది తెలియాల్సి ఉంది. ఇది ఉగ్రదాడి అని ఇంటెలిజెన్స్ వర్గాలు చెబుతున్నాయి. కేరళలో జరిగిన ఓ కార్యక్రమంలో హమాస్ నాయకుడు పాల్గొనడంపై వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో ఈ పేలుడు సంభవించింది. ఇదీ చదవండి: కేరళ బాంబు పేలుళ్ల ఘటనలో విస్తుపోయే నిజాలు..! -
పరారీలో ‘ప్రవళిక’ కేసు నిందితుడు
మహబూబ్‌నగర్: రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారిన ప్రవళిక ఆత్మహత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న శివరాం రాథోడ్ స్వగ్రామం నారాయణపేట జిల్లా కోస్గి మండలం పీసీతండా ఒక్కసారిగా వార్తాల్లోకి రావడంతో గిరిజనులు ఉలిక్కి పడుతున్నారు. విచారణ నిమిత్తం కొత్త కొత్త వ్యక్తులు తండాకు వస్తుండటంతో భయంతో తండావాసులు ఉదయం వెళ్లి రాత్రికి తమ ఇళ్లకు చేరుకుంటున్నారు. నిందితుడి కుటుంబం ఆర్థికంగా బాగా ఉండి పలుకుబడి కలిగినది కావడంతో వివరాలు చెప్పడానికి జనాలు ముందుకు రావడం లేదు. నిందితుడు శివరాం తల్లిదండ్రులు కిషన్ రాథోడ్, సుశీల మహారాష్ట్రలోని ముంబయిలో కాంట్రాక్టర్లుగా అక్కడే స్థిరపడ్డారు. కిషన్ రాథోడ్‌కు ఇద్దరు కుమారులు, ఓ కూతురు కాగా పెద్ద కుమారుడు శివరాం రాథోడ్ బీటెక్ పూర్తి చేసి హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ కోచింగ్ సెంటర్లో సివిల్స్ కోచింగ్ తీసుకుంటున్నాడు. రెండో కుమారుడు మణిరాం రాథోడ్ ఉక్రెయిన్‌లో ఎంబీబీఎస్ చదువుతుండగా యుద్ధం నేపథ్యంలో హైదరాబాద్‌కు వచ్చాడు. కూతురు అనురాధ మహబూబ్‌నగర్‌లో బీటెక్ చదువుతుంది. పీసీతండాలో తాత హేమ్లానాయక్, నానమ్మ మోనెమ్మ, మాణిక్యమ్మల దగ్గరకు పిల్లలు అప్పుడప్పుడు వచ్చి పోతుండేవారు. రాజకీయంగా దుమారం.. ప్రవళిక ఆత్మహత్య సంఘటన రాష్ట్రంలో సంచలనంగా మారడంతోపాటు రాజకీయంగా పెద్ద దుమారం రేపుతుంది. ఈ నేపథ్యంలో పోలీసులు కేసులో నిందితుడిగా శివరాం రాథోడ్‌ను నిర్ధారించడంతో అతని కుటుంబం మొత్తం అందుబాటులో లేకుండా అజ్ఞాతంలోకి వెళ్లిపోయింది. నిందితుడి స్వగ్రామంలోని ఇంటికి సైతం తాళం వేసి కుటుంబ సభ్యులు ముఖం చాటేశారు. ఈ విషయమై తండావాసులు ఎవరూ నోరు మెదపకపోవడంతో నిశ్శబ్దం అలుముకుంది. ఏదేమైనా రాష్ట్రవ్యాప్త సంచలన కేసుకు కోస్గి మండలం మరోమారు వేదికై ంది. ప్రవళికతో ప్రేమాయణం.. మరో యువతితో పెళ్లి ఏర్పాట్లు ఆత్మహత్య చేసుకున్న ప్రవళికతో ప్రేమాయణం నడిపిన శివరాం రాథోడ్ వికారాబాద్ జిల్లా పరిగి సమీపంలోని ఓ తండాకు చెందిన యువతితో పెళ్లి చేయాలని కుటుంబసభ్యులు నిర్ణయించడంతో 15 రోజుల క్రితం పెళ్లిచూపుల తతంగాన్ని ఇరు కుటుంబాల వారు పూర్తి చేసుకున్నారు. దసరా తర్వాత ముహూర్తాలు వస్తాయని, అప్పుడే ఎంగేజ్మెంట్ చేయాలని నిర్ణయించుకున్నారు. తాను ప్రేమించిన యువకుడు వేరే అమ్మాయితో పెళ్లికి సిద్ధం కావడంతోనే ప్రవళిక ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు నిర్ధారించారు. -
పోలీసుల కళ్లలో కారం కొట్టి.. ప్రతీకార హత్య!
క్రైమ్: పోలీసుల కళ్లలో కారం కొట్టి.. ఓ హత్య కేసులో నిందితుడిగా ఉన్న గ్యాంగ్‌స్టర్‌ను కాల్చి చంపింది ప్రత్యర్థి గ్యాంగ్. రాజస్థాన్ భరత్‌పూర్‌లో బుధవారం ఉదయం జరిగిన ఈ ఘటన.. రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపింది. పోలీసులు దీనిని ప్రతీకార హత్యగానే ప్రకటించారు. కుల్దీప్ అనే గ్యాంగ్ స్టర్ బీజేపీ నేత కృపాల్ జఘిన హత్య కేసులో ప్రధాన నిందితుడు. సెప్టెంబర్ 4, 2022లో ఈ హత్య జరగ్గా.. ఆ మరుసటిరోజే ఎఫ్ఐఆర్ నమోదు చేసి కుల్దీప్ను అరెస్ట్ చేశారు. అయితే.. పోలీసుల కస్టడీలో ఉన్న కుల్దీప్, సహనిందితుడు విజయ్‌పాల్‌ను ఇవాళ జైపూర్ జైలు నుంచి భరత్పూర్ కోర్టులో హాజరుపర్చేందుకు తీసుకెళ్తున్నారు. ఈ ఓ వాహనంలో దూసుకొచ్చిన ప్రత్యర్థులు పోలీసుల కళ్లలో కారం కొట్టి.. కుల్దీప్ను కాల్చి చంపారు. మొత్తం పదిహేను రౌండ్ల కాల్పులు జరిపారు. కుల్దీప్ అక్కడిక్కడే కుప్పకూలిపోయాడు. విజయ్‌పాల్ గాయపడగా.. అతన్ని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. జైపూర్-ఆగ్రా నేషనల్ హైవేపై అమోలీ టోల్ ప్లాజా వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. కాల్పులు జరిపాక నిందితులు అక్కడి నుంచి పారిపోయారు. ఘటనపై దర్యాప్తు చేపట్టిన పోలీసుల బృందం.. సమీపంలోని గ్రామం నుంచి దుండగుల వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. -
ముంబై హత్య కేసు: విచారణలో షాకింగ్ ట్విస్ట్..శ్రద్ధా ఘటన స్ఫూర్తితోనే చేశా!
ముంబైలో శ్రద్ధావాకర్ హత్యోదంతం తరహాలో జరిగిన మరో ఘటన తీవ్ర సంచలనం సృష్టించింది. ఈ మేరకు మహారాష్ట్రలోని థానేలో 56 ఏళ్ల మనోజ్ సానే అనే వ్యక్తి ప్రియురాలు సరస్వతి వైద్యను చంపి ముక్కలు చేసి, వాసన రాకుండా కుక్కరలో ఉడకబెట్టిన ఘటన వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. దీంతో నిందితుడి మనోజ్ సానేని పోలీసులు అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. ఈ ఘటన దర్యాప్తులో బాధితురాలి సరస్వతి వైద్య గురించి విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. ఆమె అహ్మద్‌నరగ్‌లోని జాంకీబాయి ఆప్టే బాలికాశ్రమంలో పెరిగినట్లు తేలింది. ఆమె తన అంకుల్ ముంబైలో ఉంటారని అతనితోనే ఉంటానని చెప్పేదని ఆ బాలికాశ్రమంలో పనిచేసే మహిళ చెబుతోంది. సరస్వతి చివరిసారిగా రెండేళ్ల క్రితం అనాథశ్రమాన్ని సందర్శించిందని, అప్పుడు ఆమె చాలా సంతోషంగానే కనిపించిందని వెల్లడించింది. ఇక మనోజ్ సానే ఆమెను పెళ్లి చేసుకోలేదు. అతనికి ముంబైలోని బోరివాలిలో ఒక ఇల్లు ఉందని అక్కడ అతని కుటుంబ సభ్యులు ఉన్నట్లు పోలీసులు పేర్కొన్నారు. కానీ అతను తన కుటుంబానికి దూరంగా ఉంటున్నట్లు తెలిపారు. మనోజ్ సాన్ బోరివలిలోని ఓ కిరాణ దుకాణంలో పనిచేసేవాడని, అక్కడకి సదరు బాధితురాలు తరుచు వచ్చేదని పోలీసులు పేర్కొన్నారు. 2014 నుంచి వీరి మధ్య స్నేహం మొదలైందని ఆ తర్వాత 2016 నుంచి మీరా రోడ్డులోని ఫ్లాట్‌కు తీసుకుని సహజీవనం ప్రారంభించినట్లు వెల్లడించారు. చాలాకాలంగా కలిసే ఉంటున్నట్లు తెలిపారు. ఐతే గత కొద్ది రోజులుగా వీరి ఫ్లాట్ నుంచి దుర్వాసన రావడంతో ఇరుగుపొరుగు గమనించి తమకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. దీంతో తాము నిందితుడు మనోజ్‌సానే అరెస్టు చేసినట్లు పేర్కొన్నారు. విచారణలో నిందితుడు..ఆమె నాకు కూతురు లాంటిది!.. విచారణలో మనోజ్ సాన్ చెప్పిన విషయాలు విని పోలీసులు కంగుతిన్నారు. తాను హెచ్ఐవీ బాధితుడునని, చాలా ఏళ్ల క్రితమే ఈ వ్యాధి బారిన పడినట్లు చెప్పుకొచ్చాడు. అలాగే బాధితురాలు సరస్వతితో తనకు ఎలాంటి శారీరక సంబంధం లేదని చెప్పుకొచ్చాడు. ఆమె తనకు కూతురు లాంటిదంటూ షాకింగ్ విషయాన్ని చెప్పాడు. సరస్వతి పదోతరగతి పరీక్షలు రాయాలనుకుందని, ఇందుకోసం ఆమెకు గణిత పాఠాలు చెప్పేవాడనని తెలిపాడు. ఐతే ఆమె తాను ఆలస్యంగా ఇంటికి వచ్చినా అనుమానించేదని చెప్పాడు. ఐతే జూన్ 3వ తేదిన తాను ఇంటికి వచ్చేసరికి ఆమె ఆత్మహత్య చేసుకుని చనిపోయి ఉందని చెప్పుకొచ్చాడు. దీంతో తాను కేసులో ఇరుక్కుంటానేమోనన్న భయం వేసి ఇలా చేశానని వెల్లడించాడు. తాను ఢిల్లీలో జరిగిన శ్రద్ధావాకర్ హత్య గురించి తెలుసుకుని ఇలా చేసినట్లు పోలీసులకు వివరించాడు. ఇదిలా ఉండగా, నిందితుడి ఇంటిలో లభించిన బాధితురాలి శరీర భాగాలను ఫోరెన్సిక్ ల్యాబ్‌కి పంపించినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై ఇంకా దర్యాప్తు కొనసాగుతోందని, జూన్ 17 వరకు నిందితుడు తమ కస్టడిలోనే ఉంటాడని పోలీసులు వెల్లడించారు. --ఆర్ లక్ష్మీ లావణ్య, వెబ్ డెస్క్ (చదవండి: ముంబైలో నరరూప రాక్షసుడు..ప్రియురాలిని హతమార్చి.. ఆపై కుక్కర్లో..) -
ఐపీఎల్ బెట్టింగ్ భారీగా పట్టుబడ్డ డబ్బు
-
తల నరికి చంపిన కేసులో నిందితుడికి విముక్తి.. కోర్టు ఏం చెప్పిందంటే...
తన సహోద్యోగిని నరికి చంపిన కేసులో నిందితుడిని నిర్దోషిగా ప్రకటించింది మహారాష్ట్రలోని థానే జిల్లా కోర్టు. ఈ మేరకు 38 ఏళ్ల నేపాల్ జాతీయుడు రాజేష్‌కుమార్ నేపాలీ అలియాస్ యజ్ఞప్రసాద్ కాలూరామ్ పుఖ్రేల్ (జైసీ)ని నిర్దోషిగా ప్రకటించి ఈ కేసు నుంచి అతనికి విముక్తి లభించేలా చేసింది. ఏప్రిల్ 10 నాటికి ఉత్తర్వుల్లో నిందితుడిపై మోపిన అభియోగాలను నిరూపించడంలో ప్రాసిక్యూషన్ విఫలమైందని అదనపు సెషన్స్ జడ్జీ పేర్కొన్నారు. నిందితుడు బద్లాపూర్‌లోని కర్జాత్ హైవేపైన కత్రాప్ వద్ద చైనీస్ హోటల్లో పనిచేసేవాడు. ఏప్రిల్ 14, 2017న బాధితుడు జగత్ తేగ్బహదు షాహీతో సహ ఆ హోటల్ యజమానులు, ఇతర సిబ్బంది సమక్షంలో పార్టీ చేసుకున్నారు. ఆ తర్వాత యజమానులు వెళ్లిపోయారు. ఆ తర్వాత అక్కడ సదరు నిందితుడు, బాధితుడు మాత్రమేఉన్నారు. మరుసటి రోజు ఒక దుకాణదారుడు బాధితుడి తలతో ఉన్న ప్లాస్టిక్ బ్యాగ్ గుర్తించి పోలీసులకు సమాచారం అందించాడు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు అక్కడ నుంచి సుమారు వెయ్యి అడుగుల దూరంలో బాధితుడి శరీరాన్ని కనుగొన్నారు. దీంతో ఆ బాధితుడితో ఉన్న వ్యక్తి (రాజేష్ కుమార్)ని నిందితుడిగా అనుమానించి పుష్పక్ ఎక్స్‌ప్రెస్ రైలులో ఉత్తర ప్రదేశ్‌కు వెళ్తుండగా అరెస్టు చేశారు. ఐతే పోలీసుల విచారణలో పలు లోపాలు ఉన్నట్లు న్యాయమూర్తి పేర్కొన్నారు. అలాగే బాధితుడు మరణానికి ముందు నిందితుడు అక్కడే ఉన్నాడు అనడానికి సరైన ఆధారాలు సమర్పించడంలో కూడా విఫలమైనట్లు పేర్కొన్నారు. దీంతో నిందితుడిని నొర్దోషిగా ప్రకటిస్తూ ఊరట కల్పించింది కోర్టు. (చదవండి: బ్రిటన్ వెళ్లి శివాజీ ఖడ్గాన్ని తెచ్చేందుకు యత్నిస్తా!: మహారాష్ట్ర మంత్రి కీలక వ్యాఖ్యలు) -
VBIT కాలేజీ వ్యవహారంలో నిందితులు అరెస్ట్
-
కటకటాల రాథోడ్.. అప్పుడు షూ.. ఇప్పుడు రాయి!
క్రైమ్: నేరస్తుల్లో మార్పు రావాలనే శిక్షలు విధిస్తుంది న్యాయస్థానం. కానీ, మార్పు రాకపోగా మరింత మూర్ఖంగా తయారయ్యే వాళ్లు లేకపోలేదు. అలాంటోడే ధర్మేష్ రాథోడ్. అటెంప్ట్ టూ మర్డర్ కేసులో శిక్ష అనుభవిస్తున్న ధర్మేష్ రాథోడ్ అనే ఖైదీ.. శుక్రవారం గుజరాత్ నవ్‌సరి కోర్టులో సెషన్స్ జడ్జి మీదకు రాయిని విసిరాడు. అదృష్టం కొద్ది జడ్జి ఏఆర దేశాయ్ పక్కకు తప్పుకోవడంతో ఆ రాయి వెనకాల ఉన్న గోడను తాకింది. అంత రాయి అతనికి దగ్గరకు ఎలా వచ్చిందని దర్యాప్తు చేపట్టిన పోలీస్ శాఖ.. అతనిని కోర్టుకు తీసుకెళ్లిన లాజ్‌పోర్ జైలులోని ముగ్గురు సిబ్బందిపై సస్పెన్షన్ వేటు వేసింది. ఇక జడ్జి మీదకు రాయి విసిరి దాడి చేయాలనుకున్న నేరానికి రాథోడ్‌పై మరో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఇక రాథోడ్ ఇంతకు ముందు కూడా ఇలానే చేశాడట. ఓ న్యాయమూర్తిపైకి ఏకంగా షూని విసిరాడట. దీంతో అతన్ని ఆ తర్వాత కాలి కాళ్లతో కోర్టుకు తీసుకురావడం మొదలుపెట్టారు. ఇకనైనా జాగ్రత్తగా వ్యవహారించాలని పోలీసులను పలువురు న్యాయవాదలు సూచిస్తున్నారు. -
బిల్కిస్ బానోకు చుక్కెదురు.. దోషుల విడుదలపై పిటిషన్ కొట్టివేత
న్యూఢిల్లీ: 2002లో జరిగిన గుజరాత్ అల్లర్లలో సామూహిక అత్యాచారానికి గురై, దోషుల విడుదలపై పోరాడుతున్న బాధితురాలు బిల్కిస్ బానోకు సుప్రీం కోర్టులో చుక్కెదురైంది. దోషులను విడుదల చేస్తూ గుజరాత్ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంపై ఆమె సుప్రీం కోర్టును ఆశ్రయించింది. తనపై అఘాయిత్యానికి పాల్పడిన, తమ కుటుంబ సభ్యులను హత్య చేసిన వారిని విడుదల చేయడంపై రెండు వేర్వేరు పిటిషన్ల ద్వారా సవాల్ చేసింది. అందులో ఒకటి దోషులకు రెమిషన్ పాలసీని అమలు చేసేందుకు గతంలో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును పునఃపరిశీలించాలని పిటిషన్ దాఖలు చేశారు బిల్కిస్ బానో. తాజాగా ఆ పిటిషన్‌ను న్యాయస్థానం కొట్టివేసింది. ఇదీ కేసు.. 2002లో గోద్రా రైలు దహనం తర్వాత గుజరాత్లో అల్లర్లు జరిగాయి. ఈ క్రమంలోనే బిల్కిస్ బానో కుటుంబ సభ్యులను హత్య చేసి ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డారు దుండగులు. ఈ కేసులో 11 మంది నిందితులకు సీబీఐ స్పెషల్ కోర్టు 2008 జనవరిలో జీవిత ఖైదు విధించింది. 15 ఏళ్లు జైలులో గడిపిన తర్వాత తమను విడుదల చేయాలంటూ అందులో ఒకరు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఈక్రమంలో 1992 నాటి రెమిషన్ పాలసీని అమలు చేయాలని ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ సూచించింది. అందుకు సుప్రీం కోర్టు సైతం అనుమతిచ్చింది. దీంతో వారు 2022, ఆగస్టు 15న దోషులను విడుదల చేశారు. ఇదీ చదవండి: బిల్కిస్ బానో దోషుల విడుదల కేసు విచారణ నుంచి తప్పుకున్న సుప్రీం జడ్జీ -
శిక్ష పడుతుందన్న భయంతో.. విచారణ ఖైదీ ఆత్మహత్య
సాక్షి, యశవంతపుర: జైల్లో విచారణ ఖైదీ ఆత్మహత్య చేసుకున్న ఘటన ఉడుపిలో జరిగింది. ఉడుపి ఒత్తినెణె సమీపంలోని హేనబేరు రోడ్డులో జులై 12న కార్కళకు చెందిన ఆనంద దేవాడిగ అనే వ్యక్తిని సదానంద, తన స్నేహితురాలు శిల్ప సాయంతో కారులో పిలుచుకుని వచ్చి ఆయనకు నిద్ర మాత్రలు ఇచ్చి కారుతో సహా నిప్పు పెట్టారు. ఈ ఘటనలో సదానంద ఉడుపి జైలులో ఉన్నాడు. 20 మంది ఖైదీలతో ఓ బ్యారెక్‌లో ఉన్న సదానంద ఆదివారం తెల్లవారుజామున పంచెతో ఉరి వేసుకున్నాడు. దీన్ని గమనించి సహచర ఖైదీలు జైలు సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో వారు హుటాహుటిన ఆస్పత్రికి తరలిస్తుండగా సదానంద మార్గం మధ్యలో మృతి చెందాడు. కోర్టులో శిక్ష ఎక్కువగా పడుతుందనే భయంతో ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. (చదవండి: విహారయాత్రలో విషాదం..బస్సు బోల్తా ఇద్దరు మృతి) -
థ్రిల్లర్ సినిమాను తలపించే కథ...పాపం కొడుకు కోసం ఆ తల్లే..
ఎన్నో క్రైం స్టోరీలను విని ఉంటాం. ఆ కేసుల్లో చాలామటుకు హత్య చేయడం.. తప్పించుకునేందుకు రకరకాలుగా ట్రై చేసి చివరికి ఎక్కడో ఒక చోట దొరికపోవడం జరుగుతోంది. కానీ ఇక్కడ ఒక వ్యక్తి అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని అధికారులు హత్య కేసులో ఇరికించి జైలు పాలు చేశారు. దీంతో తల్లే కొడుకును కాపాడేందుకు రంగంలో దిగి రక్షించుకునే తాపత్రయాన్ని.. చూస్తే సినిమానే తలిపించే కథలా ఉంటుంది ఈ క్రైం స్టోరీ. వివరాల్లోకెళ్తే...యూపీలోని అలీఘర్‌లో 2015లో 15 ఏళ్ల బాలిక కనిపించకుండా పోవడంతో ఆమె తండ్రి గోండా పోలీస్టేషన్లో ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు విష్ణు అనే యువకుడిని అదుపులోకి తీసుకుని పెళ్లికి ప్రలోభ పెట్టి కిడ్నాప్ చేసినట్లుగా నేరాలు మోపి కేసు నమోదు చేశారు. కొంతకాలం తర్వాత ఆగ్రాలో ఒక బాలిక అనుమానస్పద మృతి వార్తను చూసి సదరు అమ్మాయి తండ్రి ఆ బాలిక తన కుమార్తెగా గుర్తించాడు. దీంతో విష్ణుపై హత్య నేరం కింద కేసు నమోదు జైలుకి పంపారు అధికారులు. ఐతే నిందితుడు విష్ణు తల్లి ఈ ఆరోపణలు అవాస్తవం అని నిరూపించి తన కొడుకును ఈ కేసు నుంచి బయటపడేలా చేయాలనకుంది. అందులో భాగంగా తానే స్వయంగా రంగంలోకి దిగి ఈ కేసును చేధించేందుకు పూనుకుంది. ఇక్కడే ఈ కేసులో అసలు ట్విస్ట్ మొదలవుతుంది. ఈ మేరకు ఏ అమ్మాయి ఐతే కిడ్నాప్ అయ్యి హత్యకు గురయ్యిందన్నారో ఆ అమ్మాయి బతికే ఉందని ఈ తల్లి గుర్తించింది. దీంతో ఆమె వెంటనే పోలీసులకు సమాచారం అందించింది. ఈ క్రమంలో పోలీసులు సదరు బాధితురాలిని హత్రాస్‌లో ట్రాక్ చేసి అదుపులోకి తీసుకుని కోర్టు ముందు హాజరుపర్చి వాంగ్మూలాన్ని నమోదు చేశారు. ఐతే ఈ కేసులో మరింత ముందకు వెళ్లాడానికి ఆమెకు డీఎన్ఏ టెస్ట్‌లు కూడా నిర్వహించనున్నట్లు పోలీస్ అధికారి సింగ్ చెప్పారు. ఆ తదనంతరం బాధ్యులపై తగిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఐతే ఆ ఘటనలో ఆ అమ్మాయికి ప్రస్తుతం 22 ఏళ్లు కాగా, నేరారోపణలు ఎదుర్కొంటున్న నిందితుడు విష్ణుకి 25 ఏళ్లు. దాదాపు ఏడేళ్ల తర్వాత గానీ ఈ కేసు ఒక కొలిక్కి రాలేదు. ఈ మేరకు విష్ణు తల్లి తన కొడుకు అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని ఈ కేసులో ఇరుకిస్తున్నారని తెలిసి.. తానే స్వయంగా రంగంలోకి దిగి దర్యాప్తు చేసినట్లు తెలిపింది. అతడి నిర్దోషిత్వాన్ని నిరూపించేందకు తాను ఈ బాధ్యత తీసుకున్నాని చెప్పింది. (చదవండి: అదృశ్యమైన వ్యక్తి శవమై తేలాడు.! ప్రియుడితో కలిసి భార్యే..) -
ఆధ్యాత్మిక గురువుగానే సింహయాజీని కలిసాను : కోదండరాం
-
చెరుకులపాడు నారాయణరెడ్డి హత్యకేసులో మొదటి నిందితుడి ఆత్మహత్యాయత్నం
సాక్షి, కర్నూలు: వైఎస్సార్సీపీ నాయకుడు చెరుకులపాడు నారాయణరెడ్డి హత్యకేసులో మొదటి నిందితుడిగా ఉన్న బీసన్నగారి రామాంజనేయులు పురుగు మందు తాగి ఆత్మహత్యకు ప్రయత్నించాడు. ఇతను ఇసుక, మద్యం అక్రమ రవాణా చేస్తూ కొంతమందిని కలుపుకుని ఒక గ్రూపుగా తయారై చెరుకులపాడు గ్రామంలో ప్రశాంతతకు భంగం కలిగిస్తూ గూండాయిజం, బెదిరింపులకు పాల్పడుతుండటంతో వెల్దుర్తి, కృష్ణగిరి పోలీస్స్టేషన్లలో ఐదు క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. వివిధ కేసుల్లో జైలుకు వెళ్లినప్పటికీ ప్రవర్తనలో మార్పు రాకపోవడంతో కలెక్టర్ ఉత్తర్వుల మేరకు పీడీ యాక్ట్ నమోదు చేశారు. చిన్నటేకూరు గ్రామానికి చెందిన అల్లుడు సురేంద్ర నిర్వహించిన పూజా కార్యక్రమాల్లో పాల్గొన్న రామాంజనేయులును పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రభుత్వాసుపత్రికి తరలించగా అక్కడ పురుగు మందు తాగి ఆత్మహత్యకు ప్రయత్నించాడు. వెంటనే ఆసుపత్రిలో చేర్పించి వైద్య చికిత్స చేయించడంతో కోలుకున్నాడు. 2017 మే 21న చెరుకులపాడు నారాయణరెడ్డితో పాటు ఆయన అనుచరుడు సాంబశివుడును హత్య చేసిన కేసులో రామాంజనేయులు ప్రథమ నిందితుడిగా ఉన్నాడు. చదవండి: (విద్యార్థుల జీవితాలతో నారాయణ ఆడుకున్నారు: ఏజీ పొన్నవోలు) -
ఘోరం: నర్సుపై సాముహిక అఘాయిత్యం
భోపాల్: ఆరోగ్య కేంద్రంలో నర్సుగా పనిచేస్తున్న మహిళపై మైనర్‌తో సహా నలుగురు సాముహిక అఘాయిత్యానికి పాల్పడ్డారు. ఈ ఘటన చత్తీస్‌గఢ్‌లోని మహేంద్రగఢ్ జిల్లాలో చోటు చేసుకుంది. నిందితులు భాధితురాలి పనిచేస్తున్న ఆరోగ్య కేంద్రంలో ఒంటరిగా ఉండటం గమనించి ఈ దారుణానికి తెగబడ్డారు. శుక్రవారం సాయంత్రం మూడు గంటల సమయానికి ఈ ఆరోగ్య కేంద్రంలోకి చోరబడి ఆమెపై అఘాయిత్యానికి పాల్పడటమే గాక హత్య చేసేందుకు కూడా యత్నించారు. దీంతో బాధితురాలి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన వెలుగు చూసింది. ఈ మేరకు పోలీసులు 17 ఏళ్ల మైనర్‌తో సహా ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకుని అరెస్టు చేశామని, మరో నిందితుడు పరారీలో ఉన్నట్లు వెల్లడించారు. ఈ ఘటనతో ఆరోగ్య కార్యకర్తల బృందం మారుమూల ప్రాంతాల్లో విధుల నిర్వర్తించడంపై ఆందోళన వ్యక్తం చేయడమే గాక చత్తీస్‌గఢ్ ప్రభుత్వాన్ని తమకు భద్రత కావాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలో జిల్లా ఆరోగ్య కేంద్రం ఛీఫ్ అధికారి ప్రతిమ సింగ్ మాట్లాడుతూ..తమకు భద్రత కావాలని, అలాగే ఈ నిందితులపై కఠిన చర్యలు తీసుకోకపోతే తాము విధులు నిర్వర్తించమని కరాఖండిగా చెప్పారు. (చదవండి: విచారణ సమయంలో నిందితుడి ఆత్మహత్య) -
విచారణ సమయంలో నిందితుడి ఆత్మహత్య
సాక్షి, చెన్నై: మాదక ద్రవ్యాల అక్రమ రవాణా విభాగం అధికారుల విచారణ సమయంలో ఓ నిందితుడు మూడో అంతస్తు నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడు తెలంగాణ వాసిగా గుర్తించారు. వివరాలు.. తమకు అందిన సమాచారం మేరకు శుక్రవారం చోళవరంలో చెన్నై మాదక ద్రవ్యాల అక్రమ రవాణా నియంత్రణ విభాగం అధికారులు నిఘా పెట్టారు. ఈ క్రమంలో రాయప్పరాజు అనే వ్యక్తిని ఆ విభాగం సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు. అతడి వద్ద నుంచి 8 కేజీల మాదక ద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం అతడిని అయపాక్కంలోని ప్రధాన కార్యాలయానికి తరలించి శుక్రవారం రాత్రంతా ప్రశ్నించారు. శనివారం వేకువ జామున రాయప్పరాజు హఠాత్తుగా మూడో అంతస్తులోని విచారణ గది నుంచి బయటకు పరుగులు తీసి అనంతరం కిందకి దూకేశాడు. తీవ్రగాయాలతో పడి ఉన్న రాయప్పరాజును అక్కడి సిబ్బంది ఆవడి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మార్గమధ్యలో రాయప్ప రాజు మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ ఘటనపై తిరుముల్లైవాయిల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. విచారణలో మృతుడు తెలంగాణ రాష్ట్రం రామకృష్ణాపురానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. కుటుంబం పరువు పోతుందనే వేదనతో రాయప్పరాజు ఐటీ సంస్థలో పనిచేస్తున్నట్లు కుటుంబ సభ్యులకు చెప్పుకుంటూ, చెన్నై నుంచి మాదక ద్రవ్యాలను తెలంగాణకు తరలిస్తున్నట్లు విచారణలో తేలింది. తాను మాదక ద్రవ్యాలతో పట్టుబడడంతో కుటుంబం తీవ్ర అవమానం పాలవుతుందనే వేదనతో ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చునని పోలీసులు పేర్కొంటున్నారు. అయితే ఇతని వద్ద పట్టుబడ్డ మాదక ద్రవ్యాలు విమానాశ్రయంలో సీజ్ చేసినవి కావడం గమనార్హం. అక్కడి అధికారులు, సిబ్బంది ఎవరో సీజ్ చేసిన మాదకద్రవ్యాలను ఇతని ద్వారా బయటకు పంపిస్తున్నట్టు తేలింది. దీంతో ఈ కేసును మరింత సమగ్రంగా విచారించేందుకు ఉన్నతాధికారులు సిద్ధమయ్యారు. మృతుడు 48 కేజీల మేరకు సీజ్ చేసిన మాదక ద్రవ్యాలను తెలంగాణకు తరలించినట్లు ప్రాథమికంగా గుర్తించారు. (చదవండి: దొంగతనం కోసం వచ్చి ఆత్మహత్య..) -
అబుదాబి పోలీసుల నిర్బంధంలో నోయిడా వ్యక్తి... ఆ తర్వాత...
నోయిడా: నోయిడాకు చెందిన ప్రవీణ్ కుమార్ అనే వ్యాపారవేత్తను అబుదాబి పోలీసులు నేరస్తుడిగా భావించి నిర్బంధించారు. ఆ వ్యాపారస్తుడిని తాము గాలిస్తున్న నేరస్తుడిగా పొరబడి ఒక రాత్రంతా జైల్లో ఉంచారు. పైగా అతనిని నేరస్తుడిగా అంగీకరించమంటూ బలవంతం చేశారు. దీంతో ప్రవీణ్ కుమార్ కుటుంబం అతనను విడుదల చేయాలంటూ భారత ప్రభుత్వానికి దరఖాస్తు పెట్టుకోవడమే కాకుండా విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ భారత రాయబార కార్యాలయం, రాష్ట్ర హోం మంత్రిత్వ శాఖకు సమాచారం అందించారు. దీంతో ప్రవీణ్ కుమార్‌ని అబుదాబి పోలీసులు వెంటనే వదిలేశారు. తాము పొరపడి బంధించినట్లు అబుదాబీ పోలీసులు అంగీకరించారు. ఈ మేరకు గౌతమ్ బుద్ధ నగర్ జిల్లా హబీబ్‌పూర్‌కు చెందిన సదరు వ్యాపారవేత్త ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ...విమానాశ్రయంలో అబుదాబి సీఐడీ తనను అదుపులోకి తీసుకుని నిర్బంధించిందని, తర్వాత వదిలిపెట్టినట్లు వదిలి మళ్లీ తాను బయలుదేరుతున్న సమయంలో రెండోసారి నిర్బంధించారని తెలిపారు. ఈ విషయంలో త్వరితగతిన చర్యలు తీసుకుని తనను విడుదలయ్యేలా చేసినందుకు ప్రధాని మోదీకి, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్‌కి ధన్యావాదాలు తెలిపారు. తనను శనివారం అబుదాబి పోలీసులు విడిచిపెట్టినట్లు తెలిపారు. ఆదివారం తెల్లవారుజామన భారత్‌కి తిరిగి వచ్చిన తర్వాత ప్రవీణ్ కుమార్‌కి ఎయిర్‌పోర్ట్‌లో ఘన స్వాగతం లభించింది. ఐతే ఈ కేసును స్థానిక పోలీసులు దర్యాప్తు చేయడంతోనే త్వరితగతిన చర్యలు తీసుకోగలిగనట్లు అధికారులు తెలిపారు. (చదవండి: విజయపురలో పరువు హత్య?) -
సిద్ధూ హత్య కేసు: పోలీసు కస్టడీ నుంచి గ్యాంగ్‌స్టర్ ఎస్కేప్!
ఛండీగఢ్: పంజాబీ సింగర్ సిద్ధూ మూసేవాలా హత్య కేసు నిందితుడు, గ్యాంగ్‌స్టర్ దీపక్ అలియాస్ టిను పోలీస్ కస్టడీ నుంచి తప్పించుకున్నాడు. శనివారం రాత్రి పోలీసు కస్టడీ నుంచి దీపక్ తప్పించుకుని పారిపోయినట్లు అధికారులు తెలిపారు. సెంట్రల్ ఇవ్వెస్టిగేషన్ ఏజెన్సీ(సీఐఏ) సిబ్బంది ప్రైవేటు వాహనంలో మాన్సా నుంచి కపుర్థలా జైలుకు రాత్రి 11 గంటల ప్రాంతంలో తరలిస్తున్న క్రమంలో అదును చూసి పోలీసుల నుంచి తప్పించుకున్నాడని చెప్పారు. కస్టడీ నుంచి తప్పించుకున్న దీపక్.. గ్యాంగ్‌స్టర్, ప్రధాన నిందితుడు లారెన్స్ బిష్ణోయ్‌కి అత్యంత సన్నిహితుడు. సిద్ధూ మూసేవాలా హత్య కేసుకు పథకం రచించటం నుంచి అమలు చేసే వరకు పాల్గొన్నట్లు భావిస్తున్న 15 మంది జాబితాలో దీపక్ పేరును చేర్చారు పోలీసులు. ప్రొడక్షన్ వారెంట్‌పై ఢిల్లీ పోలీసులు కొద్ది రోజుల క్రితమే దీపక్‌ను పంజాబ్ తీసుకొచ్చారు. శనివారం జరిగిన సంఘటనతో పోలీసుల నుంచి దీపక్ పారిపోవటం ఇది నాలుగోసారి కావటం గమనార్హం. గతంలో 2017లో అంబాలా సెంట్రల్ జైలులో శిక్ష అనుభవించాడు దీపక్. ఆ సమయంలో పెప్పర్ స్ప్రే ఉపయోగించి పారిపోయాడు. ఓసారి ఆసుపత్రికి తీసుకెళ్లగా తప్పించుకున్నాడు. ఇదీ చదవండి: సిద్ధూ మూసేవాలా తండ్రిని చంపుతానని బెదిరించిన వ్యక్తి అరెస్టు -
సినిమాలో హీరో మాదిరి కూతురుని రక్షించుకున్న రోజువారీ కూలీ
కిడ్నాప్‌కి గురైతే దొరకుతారన్నగ్యారంటి ఉండకపోగా బతికే ఉంటారన్న నమ్మకమూ ఉండదు. చాలా వరకు ఇలాంటి కిడ్నాప్ కేసుల్లో బాదితులను హతమార్చడం లేదంటే అమ్మేయడం వంటివి జరుగుతుంటాయి. సరైనా అధారాలు ఉంకపోవడంతో చాలా వరకు ఇలాంటి కేసులు పెండింగ్‌లోనే ఉండిపోతాయి. ఐతే ఇక్కడొక తండ్రి కిడ్నాప్ అయిన కూతురుని సినిమాలో హీరో మాదిరి గాలించి రక్షించుకున్నాడు. వివరాల్లోకెళ్తే.... పోలీసులు తెలిపిన కథనం ప్రకారం....ముంబైలోని సబర్బన్ బాంద్రాలో రోజువారీ కూలీ తమ ఇంటి వద్ద 12 ఏళ్ల కూతురు కిడ్నాప్‌కి గరయ్యందంటూ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఐతే ఆ అమ్మాయి తండ్రి ఇరుగు పొరుగువారిని విచారించి నిందితుడు గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తుంటాడు. ఆ అమ్మాయి కిడ్నాప్‌కి గురయ్యిన రోజు తల్లికి ఏదో సాకుతో బయటకు వెళ్లిందనే విషయాన్ని తెలుసుకుని ఆ దిశగా తెలిసినవాళ్లందర్నీ ఆరా తీయడం మెదలు పెట్టాడు. ఈ క్రమంలో బాధితురాలి తండ్రి నిందుతుడు షాహిద్ ఖాన్(24)తో వెళ్లినట్లు తెలుసుకుంటాడు. అంతేకాదు ఆ వ్యక్తి తన ఇంటికి సమీపంలోని వస్త్రాల తయారీలో ఉద్యోగం చేస్తుస్నట్లుగా తెలుసుకుంటాడు. దీంతో ఆ తండ్రి ఆ నిందితుడు కుటుంబం అలీఘర్ సమీపంలోని ఐత్రోలి గ్రామంలో ఉంటుందని తెలుసుకుని... పోలీసులు, స్థానికుల సాయంతో తన కూతురుని రక్షించుకుంటాడు. సదరు నిందితుడు ఆ అమ్మాయిని తనతో షాపింగ్‌కి రావాలంటూ కుర్లాకు తీసుకువెళ్లి..అక్కడ నుంచి సూరత్‌కి బస్సు ఎక్కి, రైలులో ఢిల్లికి చేరుకున్నట్లు తెలిపాడు. దీంతో పోలీసులు సదరు వ్యక్తిని అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. (చదవండి: గేమింగ్ యాప్ స్కామ్.... సుమారు రూ. 12 కోట్లు స్వాధీనం) -
భార్య పుట్టింటికి వెళ్లిందని... ట్రాన్స్ జెండర్‌ని ఇంటికి రప్పించి...
Mutilated Body Found In Indore: ఇండోర్‌లోని పోలీసులు పొదలమాటున చిద్రమైన ట్రాన్స్‌జెండర్ మృత దేహాన్ని గుర్తించారు. దీంతో పోలీసులు అనుమానస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని విచారించడం ప్రారంభించారు. ఈ మేరకు పోలీసులు ఈ కేసు మిస్టరిని చేధించి నిందితుడిని అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. పోలీసుల తెలిపిన కథనం ప్రకారం....పోలీసుల గుర్తించిన ఆ ట్రాన్స్‌జెండర్ మృతదేహంలో ఒక భాగం మాత్రమే లభించింది. దీంతో పోలీసుల ఆ పరిసర ప్రాంతాల్లో పీసీఫుటేజ్‌ని పరిశీలించగా.... చనిపోయిన ట్రాన్స్ జెండర్ ఆగస్టు 28న కనిపించకుండా పోయిన అలియాస్ జోయా కిన్నార్‌గా గుర్తించారు. ఐతే ఈ కేసులో అనుమానితుడు ఖజ్రానాకు చెందిన నూర్‌మహ్మద్‌గా గుర్తించి విచారణకు పిలిపించారు. అతను విచారణలో చెప్పిన విషాయలు విని పోలీసులు ఒక్కసారిగా షాక్‌కి గురయ్యారు. నిందితుడు విచారణలో అతని భార్య పుట్టింటికి వెళ్లిందని, తాను ఆ సమయంలో ట్రాన్స్‌జెండర్ జోయాతో సోషల్ మీడియాలో చాటింగ్ చేసినట్లు తెలిపాడు. ఆ తర్వాత తాను జోయాను తన ఇంటికి రమ్మని ఆహ్వానించానని చెప్పాడు. ఇంటికి వచ్చాకే జోయా ట్రాన్స్‌జెండర్ అని తెలిసిందని, దీంతో ఈ విషయమై మా ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగిందని తెలిపాడు. ఆ కోపంలో తాను ఆమె గొంతుకోసి చంపినట్లు చెప్పాడు. ఆ తర్వాత ఆమె మృతదేహాన్ని రెండు ముక్కలుగా చేసి, అందులో ఒక భాగాన్ని సంచిలో వేసి బైపాస్ సమీపంలోని పొదల్లోకి విసిరేసినట్లు తెలిపాడు. మరో భాగాన్ని పారేయలేక తన ఇంట్లోనే పెట్టేలో భద్రపరిచినట్లు తెలిపాడు. దీంతో పోలీసులు మిగతా భాగం మృతదేహాన్ని నిందితుడు నూర్‌మహ్మద్ ఇంటి నుంచి స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. అంతేకాదు నిందితుడిపై హత్యానేరం కింద కేసు నమోదు చేసుకుని అరెస్టు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. (చదవండి: గర్భిణి మృతి... దెబ్బకు రాజీనామా చేసిన ఆరోగ్యమంత్రి) -
నెల్లూరు జంట హత్యలు: అతడే రెక్కీ నిర్వహించి మరీ మర్డర్ ప్లాన్!
సాక్షి, నెల్లూరు: నగరంలో మూడు రోజుల క్రితం దంపతులు హత్య కలకలం సృష్టించిన విషయం తెలిసిందే. కాగా, జంట హత్యల కేసులను పోలీసులు ఛేదించారు. కృష్ణారావు క్యాంటీన్లో సప్లయర్‌గా పని చేస్తున్న శివనే.. వారిని హత్య చేసినట్టు పోలీసులు స్పష్టం చేశారు. అయితే, అశోక్‌నగర్‌లో నివాసం ఉంటున్న వాసురెడ్డి కృష్ణారావు, అతని భార్య సునీత ఈనెల 28వ తేదీన దారుణ హత్యకు గురయ్యారు. వారిని కిరాకతంగా చంపి ఇంట్లో ఉన్న నగదు, బంగారం ఎత్తుకెళ్లారు. దీంతో, రంగంలోకి దిగిన పోలీసులు.. అన్ని కోణాల్లో దర్యాప్తు చేశారు. ఈ క్రమంలో క్యాంటీన్లో అందరి ముందు మందలించారని.. శివ అనే వ్యక్తి కక్ష పెంచుకున్నట్లు గుర్తించారు. అతడే దంపతులిద్దరిని హత్య చేసినట్లు సమాచారం. కాగా, శనివారం రాత్రి భర్త కృష్ణారావు.. ఇంటి తాళం తీస్తుండగా ఆయనపై దాడి చేసి హత్య చేశారు. ఆ తర్వాత ఇంట్లోకి వెళ్లి నిద్రిస్తున్న సునీత తలపై కర్రతో కొట్టారు. దీంతో, ఆమె అక్కడికక్కడే మృతి చెందారు. ఆ తర్వాత నిందితులు అక్కడి నుంచి పరారైనట్టు పోలీసులు తెలిపారు. ఇక, కృష్ణారావు హత్యకు నిందితులు రెక్కీ కూడా నిర్వహించినట్టు సమాచారం. అయితే, శివతోపాటుగా ఇంకా ఎంతమంది ఉన్నారనే విషయాలు తెలియాల్సి ఉంది. ఇది కూడా చదవండి: నెల్లూరులో జంట హత్యల కలకలం.. చంపింది ఎవరు? -
ప్లీజ్.. ఆ హంతకుడెవరో చెప్పండి బాబా!
భోపాల్: మర్డర్ మిస్టరీని ఛేదించాలంటే.. డాగ్‌స్క్వాడ్ తనిఖీలు, ఫోరెన్సిక్ రిపోర్టులు, విచారణలు ఇలా పోలీసులు మల్లగుల్లాలు పడతారు. కానీ.. చిత్రంలోని పోలీసేమో.. తనకు బాగా నమ్మకమున్న బాబా దగ్గరికి వెళ్లాడు.. ఓ హత్య కేసులోని అనుమానితుల జాబితాను ఆయన చేతిలో పెట్టి... మర్డర్ చేసిందెవరో చెప్పమని కోరాడు. ఈ బాబా కూడా జేమ్స్‌బాండ్ టైపులో లిస్టును ఒకటికి పదిసార్లు పరిశీలనగా చూసేసి.. ఇందులో ఉన్నవారెవరూ కాదు భక్తా.. మరొకడు ఉన్నాడు అంటూ కొంచెం బేస్ వాయిస్‌తో బదులిచ్చాడు. ఈ వీడియో కాస్త.. యూట్యూబ్‌లో వైరలయ్యింది. ఇంకేముంది ఉన్నతాధికారులు.. ఆ ఆఫీసర్ ఎవరా అని ఆరా తీశారు. చివరికి మధ్యప్రదేశ్‌లోని ఛతర్పూర్ జిల్లా బమితా స్టేషన్ పరిధిలో పనిచేస్తున్న ఏఎస్ఐ అనిల్ శర్మగా నిర్ధారణ అయ్యింది. వెంటనే.. సదరు ఏఎస్ఐని సస్పెండ్ చేశారు. ఇంతకీ ఈ కేసు ఏమిటంటే.. జూలై 28న వొతపూర్వ గ్రామానికి చెందిన 17 ఏళ్ల యువతి హత్యకు గురైంది. గ్రామంలోని ముగ్గురిని అనుమానిస్తూ మృతురాలి కుటుంబ సభ్యులు, బంధువులు కేసు పెట్టారు. ముగ్గురిని అదుపులోకి తీసుకున్న పోలీసులకు ఎలాంటి ఆధారాలు దొరకకపోవడంతో వారిని వదిలిపెట్టారు. చివరికి యువతి మామను అరెస్టు చేశారు. అయితే అతడిని పరిశోధన, సాక్ష్యాల అధారంగానే అరెస్టు చేశామని, బాబా సూచన మేరకు కాదని జిల్లా ఎస్పీ పేర్కొనడం గమనార్హం. Ever imagined cop seeking help of religious guru to crack a case. No, this isn't reel life, but real life. See how ASI of MP's Chhatarpur district police gets help from religious guru Baba Pandokhar Sarkar for cracking murder case. @NewIndianXpress @TheMornStandard @santwana99 pic.twitter.com/RtyKBWSLZD — Anuraag Singh (@anuraag_niebpl) August 19, 2022 -
బిగ్‌బాస్ బ్యూటీకి లైంగిక వేధింపులు.. ఆవేదనతో పోస్ట్
ఉర్ఫీ జావేద్.. సోషల్ మీడియా యూజర్లకు పెద్ద పరిచయం అక్కర్లేని పేరు. హిందీ బిగ్‌బాస్ ఓటీటీలో మెరిసిన ఈ బ్యూటీ బయటకు వచ్చాక తన డ్రెస్సింగ్ స్టైల్‌తో చేస్తున్న రచ్చ అంతా ఇంతా కాదు. ఉర్ఫీ పేరు వింటే చాలు వెంటనే ఆమె భిన్నమైన వస్త్రశైలి గుర్తుకు వస్తుంది. ఆమె వేసే దుస్తులను చూసి ఇలా కూడా డిజైన్ చేయోచ్చా అని నోళ్లు వెళ్లబెట్టిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. చిరిగిన బట్టలు, పగిలిన గ్లాస్ ముక్కలు, బికినీలతో అందాలను ప్రదర్శిస్తూ అనేక సార్లు ట్రోల్స్ బారిన పడింది. అయితే తాజాగా ఉర్ఫీ జావేద్ మరో సమస్యను ఎదుర్కొంటోంది. ఒక అబ్బాయి తనను లైంగికంగా వేధిస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేసింది. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా తెలియజేస్తూ అతని ఫొటోను షేర్ చేసింది ఉర్ఫీ జావేద్. ''ఈ వ్యక్తి నన్ను రెండేళ్లుగా వేధిస్తున్నాడు. నా ఫొటోను మార్ఫింగ్ చేసి నాకు పంపించి తనతో శృంగారపు వీడియో చాట్ చేయమని బలవంతం చేస్తున్నాడు. తనతో శృంగారం చేయడం ఒప్పుకోకపోతే ఆ ఫొటోను అనేక బాలీవుడ్ పేజీలలో పోస్ట్ చేసి, నా కెరీర్‌ను నాశనం చేస్తానని రెండేళ్లుగా నరకం చూపిస్తున్నాడు'' అని తెలిపింది. అలాగే ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేసిన పట్టించుకోవట్లేదని అసహనం వ్యక్తం చేసింది. చదవండి: నెట్టింట్లో అంజలి అసభ్యకర వీడియో వైరల్.. కన్నీరు పెట్టుకున్న నటి ''నేను 1 తేదిన గోరేగావ్ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదు చేశాను. 14 రోజులు గడిచినా ఇంతవరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. నేను తీవ్ర నిరాశకు గురయ్యాను. ముంబయి పోలీస్ గురించి చాలా మంచి విషయాలు విన్నాను. కానీ, ఈ వ్యక్తి పట్ల వారు ఇలా ఎందుకు చేస్తున్నారో అర్థం కావట్లేదు. అతను ఎంతో మంది మహిళలతో ఇలా చేశాడని తెలిసినా, ఇప్పటికీ ఎలాంటి చర్య తీసుకోలేదు. అతని వల్ల సమాజానికి, ముఖ్యంగా మహిళలకు ప్రమాదం. ఇప్పటికైన పోలీసులు తగిన చర్యలు తీసుకుంటారని భావిస్తున్నా'' అని ఉర్ఫీ రాసుకొచ్చింది. అలాగే తనను వేధిస్తున్న వ్యక్తి పంజాబీ చిత్రసీమలో స్వేచ్ఛగా తిరుగుతున్నాడని కూడా తెలిపింది. అంతేకాకుండా ఆ వ్యక్తి ఉర్ఫీకి చేసిన వాట్సాప్ చాట్ స్క్రీన్షాట్లను సైతం షేర్ చేసింది. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది. చదవండి: 1947లో పుట్టుక.. స్వాతంత్య్ర దినోత్సవం రోజునే మరణించిన నటి View this post on Instagram A post shared by Uorfi (@urf7i) -
బయటపడ్డ బండారం: అత్యాశకు పోయి.. ఆస్తి మొత్తం పోగొట్టుకుని..
ఒంగోలు(ప్రకాశం జిల్లా): బెట్టింగ్ భూతం ఓ యువకుడ్ని నిండా ముంచింది. అత్యాశకు పోయి ఉన్న సొత్తును కోల్పోవడంతో పాటు చివరకు నేరాల బాట పట్టి కటకటాల పాలైన ఉదంతాన్ని జిల్లా అదనపు ఎస్పీ(క్రైమ్స్) వి.శ్రీధరరావు స్థానిక తాలూకా పోలీసుస్టేషన్లో విలేకరుల సమావేశంలో మీడియాకు వివరించారు. జిల్లా ఎస్పీ మలికాగర్గ్ క్రైమ్స్ అదనపు ఎస్పీగా ప్రత్యేకంగా ఒక పోస్టును కేటాయించడంతోపాటు చాలెంజింగ్‌గా మారిన పలు కేసులను అప్పగించారు. ఈ నేపథ్యంలో వాటిపై ప్రత్యేక నిఘా కొనసాగించగా గత నెలలో జరిగిన చోరీ కేసుతో ఓ నిందితుడి బండారం బయటపడింది. చదవండి: ఆ రోజు టీడీపీ నాయకులు అడ్డురాకుంటే.. యువతి బతికేది కదా! ఆ కేసుతోపాటు గతంలో అదే తరహాలో చోటుచేసుకున్న కేసులను సరిపోల్చగా ఒంగోలు పట్టణ పరిధిలోనే 11 కేసుల్లో నిందితునిగా వెల్లడైంది. దీంతో పోలీసులు నిఘా పెట్టి గురువారం నిందితుడు రాయవరపు శ్రీనివాసరావును స్థానిక కర్నూలు రోడ్డులోని పవర్ ఆఫీసు సమీపంలో అరెస్టు చేశారు. అతనిని విచారించగా 2021 మార్చి నుంచి 2022 జూన్ వరకు మొత్తం 11 చోరీ కేసుల్లో అతని పాత్ర రూఢీ అయింది. ఒంగోలు తాలూకా పోలీసుస్టేషన్ పరిధిలో 2, ఒంగోలు వన్‌టౌన్ పరిధిలో 9 వెరసి మొత్తం 11 దొంగతనం కేసులకుగాను 5 సెల్ఫోన్లు, ఒక ట్యాబ్, ఒక మంగళసూత్రం, ఒక బంగారపు కాసు, రూ.500 నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. విచారణలో నిందితుడు వెల్లడించిన విషయాలు పోలీసులను సైతం దిగ్భ్రాంతికి గురిచేశాయి. కొంపముంచిన అత్యాశ పామూరు మండలం పుట్టనాయుడుపల్లికి చెందిన రాయవరపు శ్రీనివాసరావు ఇంటర్ వరకు విద్యనభ్యసించాడు. ఇతని సోదరి అనకాపల్లిలో, తల్లిదండ్రులు పూణేలో ఉంటున్నారు. తల్లిదండ్రుల వద్దకు అంటూ పూణే వెళ్లిన సమయంలో అతనికి బెట్టింగ్ భూతం ఆవహించింది. ఆన్లైన్లో వన్ ఎక్స్‌బెట్, బెట్ వే, వూల్ఫ్ 777, 22 బెట్, ఐపీఎల్ విన్ అనే యాప్‌లలో బెట్టింగ్ ఆడి చేతిలో ఉన్న సొత్తును పోగొట్టుకున్నాడు. చివరకు తల్లి ద్వారా తెలిసిన వారి వద్ద కొంత అప్పు తీసుకుని ఆ మొత్తం పోగొట్టుకున్నాడు. పోగొట్టుకున్న చోటే సొమ్ము తిరిగి పొందాలనే ఉద్దేశంతో ఉన్న ఇంటిని సైతం రూ.20 లక్షలకు విక్రయించాడు. ఆ డబ్బును సైతం బెట్టింగ్‌లో అర్పించాడు. అనకాపల్లిలో ఉంటున్న అక్క వద్దకు వెళ్లి వారి లారీలను విక్రయించడం ద్వారా వచ్చిన రూ.20 లక్షలను కూడా బెట్టింగ్‌లో పోగొట్టుకున్నాడు. ఒక వైపు సొంత ఇల్లు కోల్పోయి, తోబుట్టువుకు చెందిన సొమ్మును సైతం బెట్టింగ్‌లో సమర్పించుకుని, తల్లిదండ్రులకు ఇబ్బందులు తెచ్చి పెట్టి చివరకు నేరాల బాట పట్టాడు. ఒంగోలు లాడ్జిలో మకాం వేసి రాత్రిపూట షాపులను ఎంచుకుని చోరీలు చేయడం మొదలెట్టాడు. దాదాపు 16 నెలలపాటు చోరీలు కొనసాగించాడు. ఈ క్రమంలోనే పోలీసులకు దొరికిపోయి కటకటాలపాలయ్యాడు. చోరీ చేసిన సొత్తును సైతం బెట్టింగ్‌లోనే పోగొట్టినట్లు నిర్ధారించుకున్నామని క్రైమ్స్ అదనపు ఎస్పీ వి.శ్రీధరరావు వివరించారు. కేసులను ఛేదించేందుకు కృషి చేసిన క్రైమ్స్ అదనపు ఎస్పీతోపాటు డీఎస్పీ నాగరాజు, తాలూకా సీఐ వి.శ్రీనివాసరెడ్డి, ఎస్సైలు ఎం.దేవకుమార్, ఎం.సైదుబాబు, సిబ్బందిని ఎస్పీ మలికాగర్గ్ ప్రత్యేకంగా అభినందించారు. -
ప్రియుడే కాలయముడు
అనంతపురం క్రైం: నగరంలోని ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో చోటు చేసుకున్న వివాహిత కేసులో నిందితుడిని ఏడాదిన్నర తర్వాత పోలీసులు అరెస్ట్ చేశారు. హతురాలికి చెందిన 2.5 తులాల తాళిబొట్టు చైన్ స్వాధీనం చేసుకున్నారు. వివరాలను స్థానిక డీఎస్పీ కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ శ్రీనివాసులు వెల్లడించారు. అనంతపురంలోని శ్రీనివాసనగర్‌కు చెందిన ఈశ్వర్‌కు కర్నూలు జిల్లా ఆదోనికి చెందిన రాజేశ్వరితో వివాహమైంది. పెళ్లికి ముందు రాజేశ్వరి ఆదోనికి చెందిన చౌదరి హిదాయతుల్లా అలియాస్ ఇనాయతుల్లా మధ్య ప్రేమ వ్యవహారం నడిచింది. ఆ తర్వాత హిదాయతుల్లా కొన్నాళ్ల పాటు కువైట్‌కు వెళ్లాడు. ఆ సమయంలోనే రాజేశ్వరికి ఈశ్వర్‌తో కుటుంబ పెద్దలు వివాహం జరిపించారు. కువైట్ నుంచి వచ్చిన తర్వాత రాజేశ్వరితో హిదాయతుల్లా చాలా చనువుగా ఉండేవాడు. ఈ క్రమంలోనే రూ.2 లక్షలు రాజేశ్వరికి అప్పుగా ఇచ్చాడు. ఈ డబ్బును తిరిగి ఇవ్వాలని తరచూ అడిగినా.. రాజేశ్వరి మాట దాటవేస్తూ వస్తుండడంతో ఆమెపై కక్ష పెంచుకున్నాడు. 2020, ఆగస్టు 28న హిదాయతుల్లా ఆదోని నుంచి అనంతపురానికి వచ్చాడు. రాజేశ్వరిని ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని ఆర్ఎం కార్యాలయం వెనుక ఉన్న ఖాళీ ప్రదేశానికి తీసుకెళ్లాడు. తానిచ్చిన డబ్బు తిరిగివ్వాలని గొడపడ్డాడు. తన వద్ద లేవని రాజేశ్వరి తెలపడంతో ఆమె గొంతు నులిమి హతమార్చాడు. అనంతరం రాజేశ్వరి మెడలోని తాళిబొట్టు చైన్ తీసుకుని ఉడాయించాడు. పోలీసులు మొదట్లో మిస్సింగ్ కేసుగా, తర్వాత అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. సీసీ ఫుటేజీల ఆధారంగా నిందితుడు కర్నూలు జిల్లా ఆదోనికి చెందిన హిదాయతుల్లాగా నిర్ధారించుకున్నారు. కాగా, రాజేశ్వరిని హతమార్చిన అనంతరం భార్యాపిల్లలను ఆదోనిలోనే ఉంచి హిదాయతుల్లా నెల్లూరుకు మకాం మార్చాడు. అక్కడ ఓ పండ్ల వ్యాపారి వద్ద కూలి పనులతో జీవనం సాగించసాగాడు. శనివారం అనంతపురంలోని ఆర్టీసీ బస్టాండు వద్ద తచ్చాడుతున్న నిందితుడిని పోలీసులు గుర్తించి అదుపులోకి తీసుకుని విచారణ చేయడంతో అసలు విషయం వెలుగు చూసింది. నిందితుడిపై కేసు నమోదు చేసి, రిమాండ్‌కు తరలించారు. నిందితుడి అరెస్ట్‌లో చొరవ చూపిన త్రీటౌన్ సీఐ కత్తి శ్రీనివాసులు, ఎస్ఐలు జయపాల్ రెడ్డి, వలిబాషు, సునీత, వెంకటేశ్వర్లు, బలరాం తదితరులను డీఎస్పీ అభినందించారు. (చదవండి: పాత కక్షలతో....ప్రాణం తీసిన స్నేహితులు) -
గంజాయి తరలిస్తున్న ఆరుగురు నిందితుల అరెస్టు
కొయ్యూరు: విజయవాడకు 40 కిలోల గంజాయి తరలిస్తున్న ఆరుగురు నిందితులు పోలీసులకు పట్టుబడ్డారు. ఎస్ఐ దాసరి నాగేంద్ర తన సిబ్బందితో కలిసి ఆదివారం మండలంలోని చీడిపాలెం రహదారిలో వాహనాల తనిఖీలు చేస్తున్నారు. ఈ క్రమంలో బూదరాళ్ల– చాపరాతిపాలెం రహదారి నుంచి కాకరపాడు వైపు వస్తున్న రెండు ద్విచక్ర వాహనాలను తనిఖీ చేయగా, గంజాయి బయట పడింది. ఆరుగురు యువకులను అరెస్టు చేసి వాటిని స్వాధీనం చేసుకున్నారు. విజయవాడకు చెందిన కొండా యహోవ, తుమ్మల మనోజ్, మేరుగు చందు, షేక్ జానీ, జి. సాయిజగదీశ్వరరావుతోపాటు వారికి గంజాయి అమ్మిన పాడేరు మండలం ఇడ్డుపల్లికి చెందిన వంతల సుమన్‌లను అరెస్టు చేశారు. వీరిని రిమాండ్‌కు తరలించామని ఎస్ఐ తెలిపారు. రెండు రోజుల క్రితం గుడ్లపల్లి సమీపంలో 120 కిలోల గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. (చదవండి: యువకుడిపై దాడికి పాల్పడిన సర్పంచ్) -
క్రికెట్ బెట్టింగ్ గ్యాంగ్ గుట్టురట్టు
సాక్షి, హైదరాబాద్: ఐపీఎల్ క్రికెట్ సీజన్లో ప్రతి మ్యాచ్‌లో క్రికెట్ బెట్టింగ్ గ్యాంగ్‌లు పట్టుబడుతూనే ఉన్నాయి. ఇటీవలే రాచకొండలో 7 మందిని, సైబరాబాద్ పోలీసులు 18 మంది అంతర్రాష్ట్ర నిందితులను పట్టుకోగా.. తాజాగా మరో ముఠా ఎల్బీనగర్ స్పెషల్ ఆపరేషన్ టీం (ఎస్ఓటీ) పోలీసులకు చిక్కింది. ఇన్స్పెక్టర్ బీ అంజిరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. వనస్థలిపురం ఆటోనగర్‌కు చెందిన దేవినేని చక్రవర్తి రియల్ ఎస్టేట్ వ్యాపారి. బెట్టింగ్‌లకు బానిసగా మారాడు. ఐపీఎల్ సీజన్ నేపథ్యంలో ఆన్లైన్లో క్రికెట్ పందేలు వేసి సులభంగా డబ్బు సంపాదించాలని నిర్ణయించుకున్నాడు. భీమవరానికి చెందిన అప్పల రాజు, తన బావమరిది అయిన తూర్పు గోదావరి జిల్లా సీతానగరంలోని ముగ్గువుల్లాకి చెందిన నిడదవోలు శ్రీనివాస్ ఉదయ్ కుమార్ల నుంచి క్రికెట్ బెట్టింగ్ నిర్వహణకు అవసరమైన లైన్లను తీసుకునేవాడు. మన్సూరాబాద్‌లోని చండీశ్వర్ కాలనీకి చెందిన వేములపర్తి హరీష్‌ను సబ్– బుకీగా ఏర్పాటు చేసుకొని వనస్థలిపురంలోని మెడోస్ లోటస్ అపార్ట్మెంట్లో బెట్టింగ్ సెటప్‌ను ఏర్పాటు చేసుకుని ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్నారు. విశ్వసనీయ సమాచారంతో ఎల్బీనగర్ ఎస్ఓటీ పోలీసులు శుక్రవారం రాత్రి లోటస్ దాడులు చేసి మెయిన్ ఆర్గనైజర్ దేవినేని చక్రవర్తి, సబ్ బుకీ హరీష్‌లతో పాటు ముగ్గురు పంటర్లు చెన్రెడ్డి సురేశ్ రెడ్డి, సామ జైపాల్ రెడ్డి, షేక్ ఆసిఫ్ పాషాలను అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి రూ.1,20 కోట్ల నగదు స్వాధీనం చేసుకున్నారు. అప్పల రాజు, శ్రీనివాస్ ఉదయ్ కుమార్ పరారీలో ఉన్నారు. (చదవండి: లాఠీ లాక్కుని మరీ పోలీసునే చితక్కొట్టిన ఘనుడు...వైరల్ వీడియో) -
ఐదేళ్ల బాలికపై అత్యాచారయత్నం.. కొందరు మహిళలు అతడిని అడవిలో..
అగర్తలా: ఈశాన్య రాష్ట్రం త్రిపురలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఓ వ్యక్తిని(46) కొంత మంది మహిళలు చెట్టుకు కట్టేసి కొట్టి చంపారు. సదరు వ్యక్తి ఓ హత్య కేసులో ఎనిమిదేళ్లు జైలు శిక్ష అనుభవించి ఇటీవలే విడుదలవడం గమనార్హం. వివరాల ప్రకారం.. త్రిపురలోని ధలై జిల్లాలోని గండెచెర్ర పోలీసు స్టేషన్ పరిధిలో బుధవారం ఓ మతపరమైన కార్యక్రమం జరుగుతోంది. ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో భారీగా మహిళలు హాజరయ్యారు. ఈ క్రమంలో ఓ వ్యక్తి ఐదేళ్ల బాలికను పక్కనే ఉన్న అటవీ ప్రాంతంలోకి తీసుకెళ్లి అత్యాచార ప్రయత్నం చేశాడు. దీంతో బాలిక కేకలు వేయగా.. నిందితుడి అక్కడి నుంచి పరారయ్యాడు. వెంటనే స్థానికులు బాలికను రక్షించి ఆసుపత్రికి తరలించారు. అనంతరం సదరు బాలిక కుటుంబ సభ్యులు, స్థానికులు నిందితుడిని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ గండెచెర్ర-అమర్పూర్ హైవేపై బైఠాయించి నిరసనకు దిగారు. దీంతో హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. ఈ క్రమంలోనే నిందితుడిని కొందరు వ్యక్తులు పట్టుకున్నారన్న విషయం తెలియడంతో అక్కడికి పెద్ద సంఖ్యలో మహిళలు చేరుకున్నారు. అనంతరం అతడిని చెట్టుకు కట్టేసి మహిళందరూ తీవ్రంగా కొట్టారు. దీంతో అతను స్పృహ కోల్పోయాడు. ఈ విషయం పోలీసుల దృష్టికి చేరడంతో హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకున్నారు. అనంతరం నిందితుడిని ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందతూ మరణించాడని పోలీసులు తెలిపారు. ఈ ఘటనలపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు వెల్లడించారు. -
తప్పు చేసి.. నీతులు చెప్తావా బాబూ!
వెల్దుర్తి (మాచర్ల)/గుంటూరు జిల్లా: దోపిడీ, హత్య కేసుల్లో నిందితుడికి జేజేలు పలికి, అతని పాడె మోసిన ఘనత మాజీ సీఎం చంద్రబాబుకే దక్కిందని పల్నాడువాసులు విమర్శిస్తున్నారు. రక్త సంబందీకులు మృతి చెందిన సమయంలో సైతం ఏనాడూ పాడె మోయని చంద్రబాబు.. దోపిడీ, హత్య కేసుల్లో నిందితుడైన తోట చంద్రయ్య పాడెను మోయటంపై టీడీపీలోనూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అంతటితో ఆగకుండా ఈ హత్యను రాజకీయ హత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. పలు రకాల నీతులు మాట్లాడారు. దోపిడీ, హత్య కేసుల్లో నిందితుడిగా భావిస్తున్న వ్యక్తి పాత కక్షల నేపథ్యంలో హత్యకు గురైతే, విపక్ష నేత పరుగు పరుగున రావడమే ఓ వింత అయితే.. అతని పాడె మోయడం, నీతులు వల్లించడం మరింత విస్తుగొలుపుతోందని టీడీపీ నేతలే అంటున్నారు. తప్పు చేసి.., తానెప్పుడూ హత్యలను ప్రోత్సహించలేదని కూడా బాబు చెప్పడం హాస్యాస్పదమంటున్నారు. చదవండి: పచ్చని పల్నాడులో చిచ్చు పెడుతున్నారు డబ్బులు గుంజుకుని రైల్లోంచి తోసేశారు వ్యక్తిగత కక్షలతో వెల్దుర్తి మండలం గుండ్లపాడుకు చెందిన తోట చంద్రయ్య గురువారం హత్యకు గురవడం తెలిసిందే. చంద్రబాబు హడావుడిగా చంద్రయ్య కుటంబ సభ్యులను పరామర్శించడంతో పాటు పాడెను మోశారు. ఇదే ఇప్పుడు చర్చనీయాంశమైంది. స్థానికులు చెబుతున్న వివరాల ప్రకారం.. గుండ్లపాడుకు చెందిన మిరపకాయల వ్యాపారి సాని పేరయ్య ఇక్కడి మిర్చిని కొని గుంటూరు యార్డుకు తీసుకెళ్లి విక్రయించేవాడు. 20 ఏళ్ల క్రితం పేరయ్య ఓ రోజు ఇలానే మిర్చి అమ్మిన డబ్బులతో తిరుగు ప్రయాణమయ్యాడు. ఆయన వద్ద భారీ మొత్తంలో డబ్బులు ఉండటాన్ని గమనించిన చంద్రయ్య, మరో ఇద్దరు పేరయ్యను కలిశారు. స్వగ్రామానికి రైలులో కలిసి వెళ్దామని చెప్పడంతో వారితో రైలెక్కిన పేరయ్యపై రైలులోనే దాడి చేశారు. ఆయన వద్ద ఉన్న డబ్బును లాక్కుని విషయం బయట పడుతుందన్న ఆందోళనతో పేరయ్యను సత్తెనపల్లి, పిడుగురాళ్ళ మధ్య రైలు నుంచి తోసేశారు. నడుస్తున్న రైలు నుంచి కింద పడి పేరయ్య మృతిచెందాడు. వీరు తరువాత స్టేషన్లో దిగి వెనక్కి వెళ్ళి మృతదేహాన్ని మాయం చేశారు. ఏమీ తెలియనట్లే గ్రామంలో తిరగసాగారు. అదే రైలులో ప్రయాణిస్తున్న ఓ యువకుడు పేరయ్య హత్యను చూశాడు. ఆరు నెలల తరువాత ఈ విషయాన్ని పేరయ్య కుమారుడు బ్రహ్మయ్యకు చెప్పాడు. దీంతో చంద్రయ్యతో పాటు మరో ఇద్దరిని నిలదీయగా వారు నేరం ఒప్పుకున్నారు. పేరయ్య బంధువులు వీరికి సగం గుండు, సగం మీసంతో గాడిదపై ఊరేగించారని సమాచారం. బ్రహ్మయ్య పోలీసులకు ఫిర్యాదు చేయడంతో చంద్రయ్య, మరో ఇద్దరిపై డెకాయిటీ, హత్య కేసులు నమోదు చేసి కోర్టులో హాజరు పర్చగా, జైలు జీవితాన్ని అనుభవించారు. చంద్రయ్యపై గతంలో నమోదైన కేసుపై మాచర్ల రూరల్ సీఐ సురేంద్రబాబును వివరణ కోరగా విచారిస్తానన్నారు. -
హరియాణా ఆవిర్భావ దినోత్సవం: ఖైదీలకు సీఎం ఖట్టర్ తీపికబురు
చండీగఢ్: హరియాణా ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సీఎం మనోహర్‌లాల్ ఖట్టర్ రాష్ట్రంలోని.. వివిధ జైళ్లలో శిక్షలను అనుభవిస్తున్నవారికి తీపికబురు అందించారు. ఇప్పటికే.. జైళ్లలో లేదా పెరోల్‌పై ఉన్న సుమారు 250 మంది నిందితులకు క్షమాభిక్ష ఇస్తున్నట్లు ప్రకటించారు. శిక్షాకాలంలో 6 నెలలు, అంతకన్నా తక్కువ కాలం ఉన్న నిందితులకు మాత్రమే ఇది వర్తిస్తుందని తెలిపారు. అయితే, క్రూరమైన నేరాలకు పాల్పడి శిక్షలు అనుభవిస్తున్న వారికి మాత్రం ఇది వర్తించదని సీఎం మనోహర్‌లాల్ ఖట్టర్ స్పష్టం చేశారు. చదవండి: బస్సు లోయలో పడిన ఘటన: బాధిత కుటుంబాలకు రూ.లక్ష పరిహారం Haryana CM ML Khattar announces pardoning of sentences of 250 prisoners lodged in different jails of the state or currently on parole, who have a duration of 6 months or less remaining in their sentence. This will not be applicable to convicts of heinous crimes. pic.twitter.com/BpJQS3Ymmc — ANI (@ANI) November 1, 2021 -
రాజు ఆత్మహత్యపై విచారణ: 4 వారాలు గడువిచ్చిన హైకోర్టు
సాక్షి, హైదరాబాద్: సైదాబాద్ ఘటన నిందితుడు రాజు మృతిపై తెలంగాణ హైకోర్టు జ్యుడీషియల్ విచారణకు ఆదేశాలు జారీ చేసింది. విచారణ జరిపి నాలుగు వారాల్లో సీల్డ్ కవర్లో నివేదిక సమర్పించాలని తెలిపింది. ఈ మేరకు వరంగల్ మూడో మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్‌కు న్యాయస్థానం ఆదేశించింది. రాజు మృతిపై పౌర హక్కుల సంఘం నేత పిల్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. రాజును పోలీసులు హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించారని పిటిషనర్ వాదనలు వినిపించారు. చదవండి: విద్యార్థినికి ఘోర అవమానం.. పొట్టి దుస్తులు వేసుకోవడం నేరమా? అయితే ఆ వాదనలకు అడ్వకేట్ జనరల్ ప్రసాద్ ప్రతివాదనలు చేశారు. రాజు ఆత్మహత్య చేసుకున్నాడని స్పష్టం చేసింది. రాజు ఆత్మహత్యపై ఏడుగురి సాక్ష్యాల నమోదు ప్రక్రియ, పోస్టుమార్టం వీడియో చిత్రీకరణ చేసినట్లు ఏజీ నివేదిక ఇచ్చారు. ఆ వీడియోలను రేపు రాత్రి 8 గంటల్లోగా వరంగల్ జిల్లా జడ్జికి అప్పగించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. స్టేషన్ ఘన్పూర్ సమీపంలో రైల్వే పట్టాలపై గురువారం ఉదయం రాజు మృతిచెందిన విషయం తెలిసిందే. అయితే పోలీస్ వర్గాలు మాత్రం రాజుది ఆత్మహత్య అని స్పష్టంగా చెబుతున్నారు. కానీ కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పౌర హక్కుల నాయకుడు న్యాయస్థానాన్ని ఆశ్రయించాడు. చదవండి: నిర్మల్ సభలో ‘ఈటల’ స్పెషల్ అట్రాక్షన్: చప్పట్లు మోగించిన అమిత్ షా -
వరంగల్‌లో రాజు అంత్యక్రియలు పూర్తి
సాక్షి, హైదరాబాద్: సింగరేణి కాలనీలో ఆరేళ్ల చిన్నారిపై అత్యాచారం, హత్యకు పాల్పడిన నిందితుడు రాజు మృతిపై వస్తున్న వార్తలకు ఒక స్పష్టత వచ్చినట్టు తెలుస్తోంది. పోస్టుమార్టం వైద్యులు చెబుతున్న దాన్ని బట్టి రాజు ఆత్మహత్యేగా స్పష్టంగా తెలుస్తోంది. స్టేషన్ ఘన్పూర్ సమీపంలో రైల్వే పట్టాలపై ఆత్మహత్య చేసుకున్న రాజు మృతదేహాన్ని వరంగల్‌లోని ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. మొదటి రాజు కుటుంబసభ్యులకు చూపించారు. ఆ మృతదేహం రాజుదేనని ధ్రువీకరించడంతో వైద్యులు పోస్టుమార్టం చేశారు. అనంతరం మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు. మృతదేహాన్ని స్వగ్రామానికి కాకుండా వరంగల్‌లోని పోతన కాలనీ శ్మశాన వాటికలో బంధువులు అంత్యక్రియలు పూర్తిచేశారు. తల్లి కుమారుడి చితికి నిప్పటించారు. భార్య కూడా హాజరయ్యారు. కాగా నిందితుడి పోస్టుమార్టం ఫోరెన్సిక్ రిపోర్ట్ కీలకం కానుంది. రాజు మృతదేహానికి గంటపాటు ఫోరెన్సిక్ వైద్యులు రజా మాలిక్, ఫోరెన్సిక్ వైద్యుడు, వరంగల్ ఎంజీఎం రాజు పోస్టుమార్టం చేశారు. అనంతరం వైద్యులు మీడియాతో మాట్లాడారు. మృతదేహంపై ట్రైన్ గాయాలు, గ్రీజు ఉన్నాయని చెప్పారు. రైల్వే ప్రమాదం గాయాలను గుర్తించినట్లు తెలిపారు. మృతదేహంపై ఇతర గాయాలేమైనా ఉన్నాయా అనేది పరిశీలించినట్లు వివరించారు. పోస్టుమార్టం ప్రక్రియ మొత్తం వీడియోగ్రఫీ చేసినట్లు వెల్లడించారు. డీఎన్ఏ టెస్ట్ కోసం రాజు ఎముకలు సేకరించినట్లు పేర్కొన్నారు. రాజు మత్తు పదార్థాలు సేకరించాడా అనేది పరిశీలిస్తున్నట్లు తెలిపారు. -
రాజు ఆత్మహత్య: కేటీఆర్ స్పందన..
సాక్షి, హైదరాబాద్: సైదాబాద్ చిన్నారి అత్యాచారం, హత్యకేసు నిందితుడు రాజు ఆత్మహత్యపై మంత్రి కేటీఆర్ స్పందించారు. ‘నిందితుడు రాజు ఆత్యహత్య చేసుకున్నట్లు తెలంగాణ డీజీపీ సమాచారం అందించారు. నిందితుడు రాజు మృతదేహం వరంగల్ జిల్లాలోని స్టేషన్ ఘన్పూర్ రైల్వే ట్రాక్‌పై గుర్తించారు’ అని కేటీఆర్ ట్వీట్ చేశారు. స్టేషన్ ఘన్పూర్ రైల్వే ట్రాక్‌వద్ద రాజు మృత దేహం లభ్యమైందని తెలంగాణ డీజీపీ ట్వీట్ చేశారు. రైల్వే ట్రాక్‌పై దొరికిన మృతదేహంపై మౌనిక అని పచ్చబొట్టు ఉండటంతో నిందితుడు రాజు అని నిర్థారించారు. Just been informed by @TelanganaDGP Garu that the beast who raped the child has been traced & found dead on a railway track at station Ghanpur#JusticeForChaithra https://t.co/TCx2BHvVhG — KTR (@KTRTRS) September 16, 2021 -
సైదాబాద్ నిందితుడు రాజు కోసం కొనసాగుతున్న పోలీస్ సెర్చ్ ఆపరేషన్
-
నిందితుడు ఎక్కడ
-
‘రాజు’ కోసం వేట: తెలంగాణ పోలీసుల భారీ సెర్చ్ ఆపరేషన్
-
‘రాజు’ కోసం వేట: తెలంగాణ పోలీసుల భారీ సెర్చ్ ఆపరేషన్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో పోలీసులు నిందితుడు రాజు కోసం జల్లెడ పడుతున్నారు. అతడి కోసం భారీగా సెర్చ్ ఆపరేషన్ చేపట్టారు. జంట నగరాలతో పాటు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలను అప్రమత్తం చేశారు. అన్ని పోలీస్స్టేషన్లకు రాజు ఫొటో పంపించారు. హైదరాబాద్‌లోని సింగరేణి కాలనీలో ఆరేళ్ల చిన్నారి హత్యాచారం కేసు పోలీసులను పరుగులు పెట్టిస్తోంది. విపక్షాలు విమర్శలు తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతుండడంతో పోలీసులపై ఒత్తిడి పెరుగుతోంది. ఘటన జరిగిన వారమైనా నిందితుడిని అరెస్ట్ చేయకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చదవండి: కులాలు వేరు.. అయినా ఘనంగా పెళ్లి చేస్తారని నమ్మివెళ్తే.. సైదాబాద్ చిన్నారి హత్యాచార ఘటనపై హోం మంత్రి మహమూద్ అలీ సమీక్ష చేశారు. డీజీపీ మహేందర్ రెడ్డి, సీపీ అంజనీ కుమార్, ఈస్ట్ జోన్ డీసీపీ రమేశ్‌రెడ్డితో సమీక్షించి పలు ఆదేశాలు జారీ చేశారు. చిన్నారి హత్యాచార ఘటనపై సీఎం కేసీఆర్ చాలా సీరియస్‌గా ఉన్నారని చెప్పారు. నిందితుడిని వీలైనంత తొందరగా పట్టుకోండి అని ఆదేశించారు. చట్టపరంగా నిందితుడికి కఠినంగా శిక్ష పడేలా చూడాలని స్పష్టం చేశారు. చదవండి: నాకు లవర్‌ను వెతికి పెట్టండి: ఎమ్మెల్యేకు యువకుడి లేఖ ఈ కేసులో డీజీపీ మహేందర్ రెడ్డి స్వయంగా రంగంలోకి దిగారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని పోలీస్ అధికారులను అప్రమత్తం చేశారు. ప్రతి పోలీస్‌స్టేషన్‌లో నిందితుడు రాజు ఫొటోను డిసిప్లే చేయాలని ఆదేశించారు. కమిషనర్లు, ఎస్పీలు గాలింపు చర్యలు ముమ్మరం చేయాలని చెప్పారు. ఈ మేరకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అధికారులకు దిశానిర్దేశం చేశారు. నిందితుడిని పట్టిస్తే రూ.10 లక్షల నజరానా ప్రకటించిన విషయం తెలిసిందే. ఇక జంట నగరాల పరిధిలో గల్లీగల్లీని గాలిస్తున్నారు. సీసీ కెమెరాల ఆధారంగా నిందితుడి కోసం వేట కొనసాగుతోంది. సీసీ కెమెరా ఫుటేజ్‌ను ఎప్పటికప్పుడు పోలీసులు పరిశీలిస్తున్నారు. ఎల్బీనగర్ నుంచి ఉప్పల్‌లో బస్సు ఎక్కినట్లు గుర్తించారు. బస్సులో వెళ్లిన రాజు ఎక్కడ దిగారో తెలుసుకుంటున్నారు. వేల సీసీ కెమెరాల ఫుటేజ్‌ను చూస్తున్నారు. టవల్‌తో పాటు టోపీని రాజు మోత్కూరు మార్గంలో పడేసినట్లు గుర్తించారు. ఒక కవర్లో తువ్వాలు, టోపీ, కల్లు సీసా, రూ.700 నగదు ఉన్నట్లు తేలింది. రాజుకు మద్యం అలవాటు ఉండడంతో అన్నీ వైన్‌షాపుల దగ్గర పోలీసులు మఫ్టీలో నిఘా ఉంచారు. త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు చెబుతున్నారు. చదవండి: మంత్రి కేటీఆర్ మత్తులో ఉండి ట్వీట్ చేశారా?: రేవంత్‌రెడ్డి ఇక వీరితో పాటు నగరంతో పాటు సరిహద్దు జిల్లాల్లో రాజు కోసం గాలిస్తున్నారు. ఈ సందర్భంగా కాచిగూడ ట్రాఫిక్ పోలీసులు నిందితుడు రాజు ఫొటోలను బస్సులు, ఆటోలకు వాల్ పోస్టర్లు అంటించారు. మరికొన్ని చోట్ల నిందితుడి ఫొటో చూపిస్తూ మీకు కనిపిస్తే సమాచారం ఇవ్వాలని ప్రజలకు పోలీసులు సూచిస్తున్నారు. రాజు ఆనవాళ్లు లభ్యం అయితే తమకు సమాచారం ఇవ్వాలని చెబుతున్నారు. కొన్నిచోట్ల వాహనదారులను ఆపివేసి తనిఖీలు చేస్తున్నారు కూడా. -
సైదాబాద్ అత్యాచార కేసు: ఆచూకీ చెప్తే రూ. 10 లక్షలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర రాజధానిలో ఆరేళ్ల గిరిజన బాలికపై అత్యాచారం చేసి హత్య చేసిన నిందితుడు రాజు ఆచూకీ చెబితే రూ.10 లక్షల రివార్డు ఇస్తామని హైదరాబాద్ పోలీసు కమిషనర్ అంజనీకుమార్ మంగళవారం ప్రకటించారు. నిందితుడి ఫొటో, ఆనవాళ్లను విడుదల చేశారు. అతని ఆచూకీ తెలియజేయాలనుకొనేవారు ఈస్ట్‌జోన్ డీసీపీకి 9490616366 లేదా టాస్క్‌ఫోర్స్ డీసీపీకి 9490616627 ఫోన్లో సమాచారం ఇవ్వాలని సూచించారు. ఈ కేసు దర్యాప్తు తీరుతెన్నులపై అంజనీకుమార్ మంగళవారం సమీక్షించారు. నిందితుడిపై రివార్డు ప్రకటన నేపథ్యంలో సైబరాబాద్, రాచకొండ పోలీసులూ రంగంలోకి దిగారు. మొత్తం పది బృందాలు క్షేత్రస్థాయిలో గాలిస్తుండగా మూడు కమిషనరేట్లకు చెందిన ఐటీ సెల్స్ సాంకేతిక సహకారం అందిస్తున్నాయి. రాజు సెల్‌ఫోన్ స్విచ్చాఫ్ చేసి ఉండటంతో ఆచూకీ కనిపెట్టడం జటిలంగా మారిందని ఓ అధికారి వ్యాఖ్యానించారు. ఇప్పటికే అన్ని జిల్లాలకు అతడి ఫొటోతోపాటు వివరాలనూ పంపినట్లు ఆయన తెలిపారు. రాజు మద్యం మత్తులో వైన్ షాపులు, ఫుట్‌పాత్‌లు, నిర్మానుష్య ప్రాంతాల్లోనే తలదాచుకుంటూ ఉండేవాడని పోలీసులు చెబుతున్నారు. మరోవైపు ఈ దారుణం అనంతరం రాజు పారిపోవడానికి అతని స్నేహితుడు సహకరించినట్లు సీసీ కెమెరాల్లో గుర్తించిన పోలీసులు సోమవారం రాత్రి అతన్ని అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు. నిందితుడి స్వస్థలం యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరుగా పోలీసులు చెబుతున్నారు. వ్యసనాలు, చిల్లర దొంగతనాలకు అలవాటుపడి జులాయిగా తిరుగుతున్న రాజుకు అతని కుటుంబం దూరంగా ఉంటోంది. భార్య కూడా అతన్ని వదిలేసింది. అందుకే అతని కుటుంబీకుల్ని పోలీసులు అదుపులోకి తీసుకొని ప్రశ్నించినా ఫలితం లేకుండా పోయింది. ఇవీ రాజు ఆనవాళ్లు... ►30 ఏళ్ల వయస్సు, ముఖానికి గడ్డం ►దాదాపు 5 అడుగుల 9 అంగుళాల ఎత్తు ►రబ్బర్ బ్యాండ్‌తో బిగించి ఉండే పొడువాటి జుట్టు ►తలపై టోపీ, మెడలో ఎర్రటి స్కార్ఫ్ ►రెండు చేతుల మీదా మౌనిక అనే పేరు పచ్చబొట్టు -
రమ్య హత్య కేసు: హెడ్ కానిస్టేబుల్ ధైర్య సాహసాలు
ముప్పాళ్ళ: జిల్లాలో సంచలనం సృష్టించిన బీటెక్ విద్యార్థిని రమ్య హత్య కేసులో నిందితుడైన శశికృష్ణను పట్టుకోవటంలో హెడ్ కానిస్టేబుల్ చాకచక్యం ప్రదర్శించారు. ఉన్నతాధికారుల ప్రశంసలు అందుకుంటున్నారు. హత్యానంతరం పరారైన నిందితుడు నరసరావుపేట మండలం ములకలూరు గ్రామ సమీపంలో ఉన్నట్టుగా ఫోన్ సిగ్నల్ ద్వారా గుర్తించిన పోలీసు ఉన్నతాధికారులు ముప్పాళ్ల, నరసరావుపేట పోలీసులకు సమాచారం ఇచ్చారు. ముప్పాళ్లలో స్టేషన్ విధుల్లో ఉన్న హెడ్‌కానిస్టేబుల్ మహ్మద్‌రఫీ తన స్వగ్రామం కూడా పక్కనే ఉన్న పమిడిపాడు కావటంతో హుటాహుటిన నిందితుడిని పట్టుకునేందుకు బయలుదేరారు. చదవండి: గాంధీ ఆసుపత్రి అత్యాచార ఘటనలో ట్విస్ట్ ములకలూరు పొలాల్లో ఉన్నట్లుగా గుర్తించి అతన్ని అదుపులోకి తీసుకునేందుకు యత్నించే క్రమంలో నిందితుడు తనవద్ద నున్న కత్తితో చేతిపైన, గొంతుపైన గాయపరుచుకొని ఆత్మహత్యాయత్నానికి ఒడిగట్టాడు. హెడ్‌కానిస్టేబుల్ రఫీని కూడా కత్తితో బెదిరించాడు. అయినా రఫీ వెనుకడుగు వేయకుండా చాకచక్యంగా తోటి సిబ్బంది సాయంతో నిందితుడిని వెనుకవైపుగా వెళ్లి అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిని పట్టుకోవడంలో ధైర్యసాహసాలు ప్రదర్శించిన రఫీని ఇన్చార్జ్ డీఐజీ రాజశేఖర్, రూరల్ ఎస్పీ విశాల్‌గున్నీ, అర్బన్ ఎస్పీ ఆరీఫ్ హఫీజ్, అదనపు ఎస్పీ రిశాంత్‌రెడ్డితో పాటు సత్తెనపల్లి డీఎస్పీ విజయభాస్కరరెడ్డి, రూరల్ సీఐ నరసింహారావు ఫోన్లో అభినందించారు. ఇది మా స్టేషన్‌కే గర్వకారణమని ఎస్సై ఎమ్.పట్టాభిరామయ్య ఆనందం వ్యక్తం చేశారు. ఇవీ చదవండి: హైదరాబాద్ నగర వాసులకు తీపి కబురు ఇడ్లీ, పూరీ అంటే ఇష్టం.. దోశ, వడ కూడా.. -
సోషల్‌మీడియా పట్ల అందరూ అప్రమత్తంగా ఉండాలి
-
మీడియా ముందుకు బీటెక్ విద్యార్థిని హత్యకేసు నిందితుడు
సాక్షి, గుంటూరు: బీటెక్ విద్యార్ధిని హత్య కేసులో నిందితుడ్ని మీడియా ముందు పోలీసులు ప్రవేశపెట్టారు. ఇన్ఛార్జ్ డీఐజీ రాజశేఖర్ బాబు మీడియాతో మాట్లాడుతూ.. బీటెక్ విద్యార్ధిని హత్య దురదృష్టకరమన్నారు. ఘటన జరిగిన కొన్ని గంటల్లోనే నిందితుడిని పట్టుకున్నామని తెలిపారు. రమ్య హత్య కేసులో శశికృష్ణను అరెస్ట్ చేశామని వెల్లడించారు. శశికృష్ణ ఇన్స్టాగ్రాం ద్వారా రమ్యకు పరిచయం అయ్యాడని.. శశికృష్ణ వేధించడంతో రమ్య దూరం పెట్టిందన్నారు. ప్రేమించకుంటే చంపుతానని శశికృష్ణ బెదిరించాడు. ప్రేమించలేదన్న కోపంతో రమ్యను హత్య చేశాడని తెలిపారు. సోషల్ మీడియాలో పరిచయాల పట్ల యువత అప్రమత్తంగా ఉండాలని ఇన్ఛార్జ్ డీఐజీ సూచించారు. మహిళల రక్షణే మా ప్రథమ కర్తవ్యమని, మహిళల రక్షణకై అహర్నిశలు శ్రమిస్తున్నామని ఇన్ఛార్జ్ డీఐజీ తెలిపారు. -
బీటెక్ విద్యార్థిని హత్య కేసు: నిందితుడు అరెస్ట్
సాక్షి, గుంటూరు: బీటెక్ విద్యార్ధిని రమ్య హత్య కేసులో నిందితుడు శశికృష్ణను అరెస్ట్ చేసినట్లు డీజీపీ గౌతమ్ సవాంగ్ తెలిపారు. పోలీసులు పట్టుకునే సమయంలో నిందితుడు ఆత్మహత్యాయత్నం చేశాడని పేర్కొన్నారు. పోలీసులను చూసి శశికృష్ణ గొంతు కోసుకోవడానికి యత్నించాడని చెప్పారు. డీజీపీ గౌతమ్ సవాంగ్ మీడియాతో మాట్లాడుతూ.. రమ్య హత్యా ఘటన అత్యంత దురదృష్టకరమని, స్థానికులు ఇచ్చిన సమాచారం, సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితున్ని గుర్తించామని తెలిపారు. ఈ కేసు దర్యాప్తులో స్థానికులు అత్యంత కీలక సమాచారాన్ని పోలీసులకు అందించారని పేర్కొన్నారు. హత్యకు పాల్పడిన యువకుడిని గుంటూరు అర్బన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నాని, నిందుతున్ని కఠినంగా శిక్షిస్తామని తెలిపారు. సోషల్ మీడియా పరిచయాల పట్ల యువత అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు. యువతులు, మహిళలపై దాడులకు యత్నిస్తే కఠిన శిక్షలు తప్పవన్నారు. జరిగిన ప్రతి సంఘటనను రాజకీయ కోణంలో చూడవద్దని కోరారు. సమాజంలో జరుగుతున్న వికృత పోకడలను సమిష్టిగా ఎదుర్కోవాలన్నారు. ఘటన జరిగిన తక్షణం వేగంగా స్పందించి కేసును ఛేదించిన గుంటూరు అర్బన్ పోలీసులకు అభినందనలు తెలిపారు. విచారణ త్వరితగతిన పూర్తి చేసి నిందితుడికి సత్వరం కఠిన శిక్ష పడేలా చూడాలని ఆదేశాలు ఇచ్చినట్లు పేర్కొన్నారు. మహిళల రక్షణ తమ ప్రథమ కర్తవ్యమని, అందుకోసం అహర్నిశలు శ్రమిస్తామని తెలిపారు. బీటెక్ విద్యార్థిని రమ్య హత్య కేసు నిందితుడి కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్న సమయంలో నిందితుడు శశికృష్ణ తన గొంతును కత్తితో కోసుకోవడానికి యత్నించాడు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు అడ్డుకున్నారు. అనంతరం గాయపడిన శశికృష్ణను పోలీసులు ఆస్పత్రికి తరలించారు. శనివారం కాకాని రోడ్డులో బీటెక్ విద్యార్థిని రమ్యను శశికృష్ణ హత్య చేసిన విషయం తెలిసిందే. విద్యార్థినిని నిందితుడు దారుణంగా రోడ్డు మీదనే కత్తితో పొడిచి చంపాడు. -
వైఎస్ వివేకా హత్య కేసులో కీలక నిందితుడు సునీల్‌యాదవ్ అరెస్ట్
సాక్షి, వైఎస్సార్ కడప: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక నిందితుడు సునీల్‌యాదవ్‌ను సీబీఐ అధికారులు అరెస్టు చేశారు. సోమవారం సాయంత్రం గోవాలోని స్థానిక కోర్టులో సునీల్ యాదవ్‌ను సీబీఐ హాజరుపరిచింది. అనంతరం ట్రాన్సిట్ రిమాండ్‌పై మంగళవారం సాయంత్రంలోపు కడప చేరుకునే అవకాశం ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు. అదే విధంగా రేపు(బుధవారం) కడప కోర్టులో సీబీఐ సునీల్‌యాదవ్‌ను హాజరుపర్చనుంది. -
భీమా కోరేగావ్ కేసు: స్టాన్ స్వామి కన్నుమూత
ముంబై: ఎల్గార్ పరిషత్ కేసులో నిందితుడిగా ఉన్న గిరిజన హక్కుల కార్యకర్త స్టాన్ స్వామి సోమవారం మృతి చెందారు. అనారోగ్య కారణాలతో బెయిల్ మంజూరు చేయాలన్న ఆయన విజ్ఞప్తిపై బొంబాయి హైకోర్టులో విచారణ కొనసాగుతుండగానే 84 ఏళ్ల స్వామి ముంబైలోని హోలీ ఫ్యామిలీ ఆసుపత్రిలో కన్నుమూశారు. ఆరోగ్యం మరింత క్షీణించడంతో ఆదివారం నుంచి ఆయనను వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందించారు. కోవిడ్‌కు చికిత్స పొందుతూ స్టాన్ స్వామి సోమవారం గుండెపోటుతో మృతి చెందారని ఆయన బెయిల్ కేసును విచారిస్తున్న ధర్మాసనానికి స్వామి తరఫు న్యాయవాది మిహిర్ దేశాయి తెలిపారు. దీనిపై జస్టిస్ ఎస్ఎస్ షిండే, జస్టిస్ ఎన్జే జమాదార్ల ధర్మాసనం దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ఈ వార్తపై స్పందించేందుకు తమకు మాటలు రావడం లేదని, స్టాన్ స్వామి ఆత్మకు శాంతి చేకూరాలని వ్యాఖ్యానించింది. రోమన్ కేథలిక్ ప్రీస్ట్‌గా ఉన్న స్టాన్ స్వామి మృతిపై జెస్యూట్ ప్రొవిన్షియల్ ఆఫ్ ఇండియా సంతాపం వ్యక్తం చేసింది. ‘ఆదివాసీలు, దళితులు, అణగారిన వర్గాల కోసం ఆయన జీవితాంతం పోరాడారు. పేదలకు గౌరవప్రదమైన జీవితం లభించాలని పోరాటం చేశారు’ అని ఒక ప్రకటనలో పేర్కొంది. స్టాన్ స్వామి మృతి విషయంలో చికిత్స అందించిన ఆసుపత్రిపై కానీ, బెయిల్ కేసు విచారణ జరుపుతున్న కోర్టుపై కానీ తమకెలాంటి ఫిర్యాదులు లేవని చెప్పగలమని.. అయితే, ఎల్గార్ పరిషత్ కేసును విచారిస్తున్న ఎన్ఐఏపై, జైలు అధికారులపై మాత్రం అలా చెప్పలేమని న్యాయవాది మిహిర్ దేశాయి ధర్మాసనంతో వ్యాఖ్యానించారు. స్వామికి సరైన సమయంలో వైద్య సదుపాయం కల్పించే విషయంలో ఎన్ఐఏ నిర్లక్ష్యంగా వ్యవహరించిందని ఆరోపించారు. విచారణ ఖైదీ అయిన తన క్లయింట్ స్వామి మృతికి దారితీసిన కారణాలపై హైకోర్టు న్యాయ విచారణ జరపాలని డిమాండ్ చేశారు. హోలీ ఫ్యామిలీ ఆసుపత్రికి తీసుకెళ్లడానికి 10 రోజుల ముందు స్వామిని జేజే ఆసుపత్రికి తీసుకువెళ్లారని, కానీ, ఆయనకు అక్కడ కోవిడ్ నిర్ధారణ పరీక్ష జరపలేదని కోర్టుకు వివరించారు. ఆ తరువాత హోలీ ఫ్యామిలీ ఆసుపత్రిలో పరీక్షించగా, కోవిడ్ నిర్ధారణ అయిందన్నారు. స్టాన్ స్వామికి బెయిల్ మంజూరు చేయడాన్ని ప్రతీసారి ఎన్ఐఏ వ్యతిరేకించిందని, కానీ, ఒక్కరోజు కూడా ఆయనను విచారించడానికి కస్టడీకి తీసుకోలేదని ఆరోపించారు. విచారణ ఖైదీగా ఉన్న సమయంలోనే స్టాన్ స్వామి మరణించినందువల్ల, ఐక్యరాజ్య సమితి మానవహక్కుల కమిషన్ నిబంధనల ప్రకారం అధికారులు ఆయనకు పోస్ట్‌మార్టం నిర్వహించాలని డిమాండ్ చేశారు. కాగా, న్యాయ విచారణకు హైకోర్టు ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదు. కోవిడ్ ప్రొటోకాల్ ప్రకారం స్టాన్ స్వామి అంత్యక్రియలు ముంబైలో జరుగుతాయని కోర్టు తెలిపింది. ఎల్గార్ పరిషత్– మావోయిస్ట్ సంబంధాలకు సంబంధించిన కేసులో, కఠినమైన చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం(యూఏపీఏ) కింద 2020 అక్టోబర్ నుంచి స్వామిని విచారణ ఖైదీగా మొదట తలోజా జైళ్లో నిర్బంధించారు. మొదట అక్కడి ఆసుపత్రిలోనే చికిత్స అందించారు. అనంతరం, హైకోర్టు ఆదేశాల మేరకు ఈ సంవత్సరం మే నెలలో హోలీ ఫ్యామిలీ ఆసుపత్రికి తరలించారు. అంతకుముందు, జేజే ఆసుపత్రిలో తనను చేర్చడాన్ని స్వామి తీవ్రంగా వ్యతిరేకించారు. ఫాదర్ స్టాన్ స్వామి మృతికి నా హృదయపూర్వక నివాళులు’ అని కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. ‘హక్కుల కార్యకర్త ఫాదర్ స్టాన్ స్వామి కస్టడీ హత్యను మోదీ, షా విజయవంతంగా ముగించారు. ఆయనకు బెయిల్ నిరాకరించిన జడ్జీలు ఇక రాత్రులు నిద్ర పోలేరనుకుంటా. వారికీ ఈ హత్యలో భాగం ఉంది’ అని సీపీఐఎంల్ పొలిట్‌బ్యూరో మెంబర్ కవిత కృష్ణన్ ట్వీట్ చేశారు. స్టాన్ స్వామి విషయంలో ఎన్ఐఏ వ్యవహరించిన తీరుపై గతంలోనూ విమర్శలు వచ్చాయి. పార్కిన్సన్ వ్యాధితో బాధపడ్తున్న తనకు జైలులో ఆహారం తీసుకోవడానికి వీలుగా ఒక సిప్పర్‌ను, స్ట్రాను ఇవ్వాలని ఎన్ఐఏను ఆదేశించాలని ఎన్ఐఏ ప్రత్యేక కోర్టుకు స్వామి మూడు సార్లు దరఖాస్తు చేసుకున్నారు. స్వామి చేసిన ఆ చిన్న అభ్యర్థనపై స్పందించడానికి ఎన్ఐఏ 4 వారాల గడువు కోరింది. అయితే, ఆ తరువాత స్వామికి సిప్పర్, స్ట్రాతో పాటు, వీల్ చెయిర్‌ను, చేతికర్రను, వాకర్‌ను, ఇద్దరు సహాయకులను సమకూర్చామని ఎన్ఐఏ కోర్టుకు తెలిపింది. ఆదివాసీల కోసం 30 ఏళ్ల పోరాటం ఫాదర్ స్టాన్ స్వామి పూర్తి పేరు స్టానిస్లాస్ లూర్దుసామి. జార్ఖండ్‌లో ఆదివాసీలు, అణగారిన వర్గాల హక్కుల కోసం జీవిత పర్యంతం ఆయన కృషి చేశారు. నక్సలైట్లను ముద్రవేసి అక్రమంగా జైళ్లో మగ్గుతున్న ఆదివాసీల దుస్థితిపై ఆయన ఒక పరిశోధన గ్రంథం రాశారు. మావోయిస్టులతో సంబంధాలున్నాయని తమపై తప్పుడు ఆరోపణలతో జైల్లో పెట్టారని దాదాపు 97 శాతం విచారణ ఖైదీలు తనతో చెప్పినట్లు స్వామి అందులో పేర్కొన్నారు. ఆదివాసీల హక్కుల కోసం ఆయన 3దశాబ్దాల పాటు కృషి చేశారు. తమిళనాడులోని తిరుచిరాపల్లిలో 1937లో ఆయన జన్మించారు. ‘జంషెడ్పూర్ ప్రావిన్స్ ఆఫ్ ద సొసైటీ ఆఫ్ జీసస్’లో చేరి, ప్రీస్ట్‌గా మారారు. 1970లలోనే యూనివర్సిటీ ఆఫ్ మనీలాలో సోషియాలజీలో పీజీ చేశారు. బ్రసెల్స్‌లో చదువుకుంటున్న సమయంలో బ్రెజిల్‌లోని పేదల కోసం కృషి చేస్తున్న ఆర్చ్ బిషప్ హోల్డర్ కామరా సేవలు ఆయనను అమితంగా ఆకర్షించాయి. 1975 నుంచి 1986 వరకు బెంగళూరులోని ఇండియన్ సోషల్ ఇన్స్టిట్యూట్కు డైరెక్టర్‌గా పనిచేశారు. 30 ఏళ్లుగా జార్ఖండ్ గిరిజనుల కోసం పనిచేస్తున్నారు. వారి భూములను అభివృద్ధి పేరుతో డ్యాములు, గనులు, టౌన్‌షిప్‌ల కోసం తీసుకోవడాన్ని వ్యతిరేకిస్తూ పోరాటం చేశారు. నక్సలైట్లతో సంబంధాలున్నాయన్న తప్పుడు ఆరోపణలతో జైళ్లలో మగ్గుతున్న గిరిజన యువత విడుదలకి కృషి చేశారు. కేన్సర్‌తో, పార్కిన్సన్ వ్యాధితో బాధపడ్తున్న స్టాన్ స్వామిని, మావోయిస్టులతో సంబంధాలున్నాయన్న ఆరోపణలపై గత అక్టోబర్ 8న రాంచిలో అరెస్ట్ చేసి తీసుకువెళ్లారు. -
గోల్డ్ స్కామ్‌లో కీలక మలుపు: ప్రధాన సూత్రధారి అరెస్ట్
తిరువనంతపురం: కేరళలో సంచలనం సృష్టించిన బంగారం కుంభకోణం కేసు కీలక మలుపు తిరిగింది. ఆ స్కామ్‌లో సూత్రధారిగా ఉన్న మహమ్మద్ మన్సూర్‌ను జాతీయ దర్యాప్తు బృందం (ఎన్ఐఏ) అరెస్ట్ చేసింది. దీంతో ఈ కేసుకు సంబంధించి విచారణ ముమ్మరంగా సాగే అవకాశం ఉంది. ఈ బంగారం కుంభకోణం కేరళ రాజకీయంతో ముడిపడి ఉండడంతో ఎన్ఐఏ దర్యాప్తును ముమ్మరం చేసింది. ఈ క్రమంలోనే అతడిని అరెస్ట్ చేసింది. అరెస్ట్ అనంతరం మహమ్మద్ మన్సూర్‌ను కొచ్చిలోని ఎన్ఐఏ కోర్టులో అధికారులు హాజరుపరిచారు. మన్సూర్‌ను 5 రోజులపాటు కస్టడీకి కోర్టు అనుమతి ఇచ్చింది. 2020 జూలై 5వ తేదీన త్రివేండ్రం విమానాశ్రయంలో 30 కిలోల బంగారం స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ కేసును ఎన్ఐఏ దర్యాప్తు చేస్తోంది. ఈ ఏడాది జనవరిలో ఛార్జిషీట్ దాఖలు చేశారు. ఈ మన్సూర్ దుబాయ్ నుంచి కుంభకోణం మొత్తం నడిపాడని పోలీస్ అధికారులు తెలిపారు. ఇతర నిందితులతో కలిసి బంగారాన్ని భారత్‌కు తెచ్చేందుకు మన్సూర్ ప్రణాళిక రచించాడని వెల్లడించారు. తిరువననంతపురంలో ఉన్న యూఏఈ కాన్సులేట్ చిరునామాకు కార్గో ద్వారా బంగారం స్మగ్లింగ్ చేస్తూ పట్టుబడడంతో ఈ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. ఇప్పుడు అరెస్టయిన మన్సూర్ ఏం వివరాలు వెల్లడిస్తాడో.. ఎవరెవరి పేర్లు బయటకు వస్తాయోనని కేరళలో హాట్ టాపిక్ కొనసాగుతోంది. -
కార్పొరేటర్ హత్య కేసులో నిందితుడు అరెస్ట్
తూర్పుగోదావరి: కార్పొరేటర్ కంపర రమేష్ హత్యకేసులో నిందితుడు చిన్నాను పోలీసులు అరెస్టు చేశారు. హత్య అనంతరం తమ్ముడితో కలిసి ఘటనాస్థలి నుంచి పారిపోయిన చిన్నాను గుంటూరులో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈనెల 12న కార్పోరేటర్ రమేష్‌ను కాకినాడలో అతి దారుణంగా హత్య చేయించిన సంగతి తెలిసిందే. నిందితుడు చిన్నా..రమేష్‌పైకి మూడు సార్లు కారు ఎక్కించి దారుణంగా హత్య చేశాడు. రియల్ ఎస్టేట్ విషయంలోనే ఇద్దరి మధ్యా వివాదం తలెత్తినట్లు తెలుస్తోంది. తనకు నమ్మక ద్రోహం చేసి, ఆర్థిక మోసానికి పాల్పడ్డాడనే కారణంతోనే చిన్నాను రమేష్ దూరం పెడుతూ వస్తున్నారు. అయితే, అది నిజం కాదని, సంబంధిత విషయాలన్నీ కలిసి మాట్లాడాలని, అంతకు సుమారు వారం నుంచి చిన్నా ప్రయత్నించగా మొదట రమేష్ అందుకు అంగీకరించ లేదు. చిన్నా తనను కలవాలనుకుంటున్నాడనే విషయాన్ని రమేష్ తన స్నేహితులకు చెప్పగా వారి సలహాతోనే చిన్నాను రమేష్ కలిశాడు. ఈ నేపథ్యంలో ముందే అనుకున్న పథకం ప్రకారం రమేష్‌పైకి కారుతో తొక్కించి చిన్నా కిరాతంగా హత్య చేశాడు. చదవండి : (కార్పొరేటర్ హత్య కేసు: కృష్ణా జిల్లాలో నిందితుడు?) (కాకినాడలో కార్పొరేటర్ దారుణ హత్య) -
కార్పొరేటర్ హత్య కేసు: కృష్ణా జిల్లాలో చిన్నా?
కాకినాడ క్రైం(తూర్పుగోదావరి): కార్పొరేటర్ కంపర రమేష్‌ను దారుణంగా హతమార్చిన నిందితుడు గురజాన చిన్నా అలియాస్ సత్యనారాయణ కృష్ణా జిల్లాలో తలదాచుకున్నట్లు విశ్వసనీయ సమాచారం. హత్య అనంతరం తమ్ముడితో కలిసి ఘటనా స్థలి నుంచి పారిపోయిన చిన్నా నేరుగా ఇంటికి వెళ్లాడు. పోలీసుల కళ్లుగప్పి తప్పించుకోవాలనే పన్నాగంతో హత్యకు వినియోగించిన హోండా సిటీ కారును ఇంటి దగ్గరే వదిలేశాడు. భార్య, పిల్లలు, తమ్ముడు కుమార్‌తో కలిసి తన మరో కారు ‘ఫార్చూ్యనర్’లో పరారయ్యాడు. సగం దారి వరకూ ఫోన్ ఆన్‌లోనే ఉంచాడు. మార్గం మధ్యలో తన ఫోన్‌తో పాటు, భార్య, తమ్ముడి ఫోన్లను స్విచ్ ఆఫ్ చేశాడు. నిందితుడి జాడ తెలుసుకునేందుకు ప్రత్యేక పోలీస్ బృందాలు పని చేస్తున్నాయి. ఇప్పటికే సర్పవరం సీఐ నున్న రాజు తన బృందంతో కలిసి కృష్ణా జిల్లా చేరుకున్నారు. నిందితుడి కోసం శోధన మొదలు పెట్టారు. అక్కడి పోలీసులతో కలిసి చిన్నా కదలికలను పసిగట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. కృష్ణా జిల్లాలో అతడి బంధువులు, స్నేహితులు ఎవరైనా ఉన్నారా అనే కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు. కాకినాడ కోకిలా సెంటర్లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు మొదలు, కృష్ణా జిల్లాను అనుసంధానం చేసే రహదారిలోని దాదాపు ప్రతి సీసీ టీవీ ఫుటేజీ పరిశీలించేందుకు ప్రత్యేక బృందమే ఏర్పడింది. దీనిపై పోలీస్ శాఖ ఐటీ విభాగం కసరత్తు చేస్తోంది. టోల్గేట్ల వద్ద ఏర్పాటు చేసిన సీసీ కెమేరాల ఫుటేజీని కూడా పరిశీలిస్తున్నారు. ఇదిలా ఉండగా ఈ హత్య ఘటనలో కీలక విషయం వెలుగులోకి వచ్చింది. నిందితుడు చిన్నా తొలుత రమేష్‌కు ఫోన్ చేసి వస్తాననడం నిజం కాదని తెలుస్తోంది. తనకు నమ్మక ద్రోహం చేసి, ఆర్థిక మోసానికి పాల్పడ్డాడనే కారణంతోనే చిన్నాను రమేష్ దూరం పెడుతూ వస్తున్నారు. అయితే, అది నిజం కాదని, సంబంధిత విషయాలన్నీ కలిసి మాట్లాడాలని, అంతకు సుమారు వారం నుంచి చిన్నా ప్రయత్నిస్తున్నాడు. అందుకు రమేష్ అంగీకరించడం లేదు. చిన్నా తనను కలవాలనుకుంటున్నాడనే విషయాన్ని రమేష్ తన స్నేహితులు సతీష్, శ్రీనివాస్‌కు శుక్రవారం రాత్రి అంటున్నాడని చెప్పారు. వారి సలహాతోనే చిన్నాను రమేష్ రమ్మన్నారని అంటున్నారు. తాను కోనపాపపేటలో ఉన్నానని, తమ్ముడి పుట్టిన రోజని చిన్నా చెప్పాడు. అలా బాధ చెప్పుకుంటానని వచ్చిన వ్యక్తి రమేష్‌ను అతి కిరాతకంగా హతమార్చాడు. (చదవండి: కాకినాడలో కార్పొరేటర్ దారుణ హత్య ) శునకం తెచ్చిన తంటా.. -
బాధిత కుటుంబంపై కేసు పెట్టాలి
లక్నో/హాథ్రస్: హత్యాచార నిందితులకు మద్దతుగా హాథ్రస్లో ఆదివారం బీజేపీకి చెందిన మాజీ ఎమ్మెల్యే రాజ్వీర్ సింగ్ పహిల్వాన్ నివాసంలో ఒక సమావేశం జరిగింది. నిందితులకు మద్ధతుగా పెద్ద సంఖ్యలో ప్రజలు ఈ సమావేశానికి హాజరయ్యారని రాజ్వీర్ సింగ్ కుమారుడు మన్వీర్ సింగ్ తెలిపారు. అగ్రకులాల వారే కాకుండా, సమాజం లోని అన్ని వర్గాల వారు ఈ సమావేశానికి వచ్చారన్నారు. బాధిత కుటుంబ సభ్యులపైనా కేసు నమోదు చేయాలని ఆ సమావేశంలో డిమాండ్ చేశారు. ఘటనకు సంబంధించి బాధిత కుటుంబం పలుమార్లు తమ స్టేట్మెంట్ను మార్చారని ఆరోపించారు. ఈ సమావేశం సందర్భంగా మాజీ ఎమ్మెల్యే నివాసం వద్ద ముందు జాగ్రత్త చర్యగా భారీగా పోలీసులను మోహరించారు. ‘సీబీఐ దర్యాప్తును స్వాగతిస్తున్నాం. వారి దర్యాప్తుపై మాకు విశ్వాసముంది’ అని మన్వీర్ పేర్కొన్నారు. ‘ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేసే కుట్ర ఇది. ఎలాంటి విచారణకైనా నిందితులు సిద్ధంగా ఉన్నారు. వారు తప్పు చేసి ఉంటే ఎప్పుడో పారిపోయేవారు. బాధిత కుటుంబమే ఎప్పటికప్పుడు మాట మారుస్తోంది. నార్కో టెస్ట్కో లేక సీబీఐ దర్యాప్తుకో వారు సిద్ధంగా లేరు’ అన్నారు. కొనసాగుతున్న సిట్ దర్యాప్తు హాథ్రస్ హత్యాచార ఘటనపై సీబీఐ దర్యాప్తునకు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సిఫారసు చేసిన మర్నాడు కూడా.. ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) తన దర్యాప్తు కొనసాగించింది. ఆదివారం సీనియర్ ఐపీఎస్ అధికారి భగవాన్ స్వరూప్ నేతృత్వంలో సిట్ బాధితురాలి కుటుంబసభ్యుల వాంగ్మూలాలను నమోదు చేసింది. అలాగే, ఈ కేసు విషయంలో సమాచారం ఇవ్వాలనుకునే వారు తమ వద్దకు రావాలని గ్రామస్తులకు సూచించింది. -
హాపూర్ ఘటన.. పోలీసులు వచ్చేలోపు పరార్
లక్నో: ఆరేళ్ల బాలికను కిడ్నాప్ చేసి అత్యంత అమానుషంగా అత్యాచారానికి పాల్పడిన ఘటనలో పోలీసులు మృగాళ్ల కోసం తీవ్రంగా గాలిస్తున్నారు. వారి ఊహా చిత్రాలను విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో బాలికపై దారుణానికి ఒడిగట్టిన వారిలో ఓ వ్యక్తి అమ్రోహాలోని తన సొంత గ్రామ శివార్లలో చేతిలో మద్యం బాటిళ్లతో తిరుగుతుండటాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. అయితే వారు వచ్చేలోపే నిందితుడు తప్పించుకున్నాడు. స్థానికులు నిందితుడిని దల్పత్గా గుర్తించారు. అతడు అమ్రోహాలోని గజ్రౌలా ప్రాంతం మహమూద్‌పూర్ గ్రామంలో నివసిస్తున్నాడు. దాంతో పోలీసులు అతడి ఇంటిని చుట్టుముట్టారు. గత ఆరు రోజులుగా పోలీసులు అనేక బృందాలుగా ఏర్పడి నిందితుల కోసం అమ్రోహాలోని గజ్రౌలా సమీపంలోని అటవి ప్రాంతంలో తీవ్రంగా గాలిస్తున్నారు. సోమవారం స్థానికులు నిందితులను గుర్తించి పోలీసులకు తెలిపారు. కానీ వారు వచ్చేలోపే నిందితులు తప్పించుకున్నారు. (బాలికపై అత్యాచారం: నిందితుల ఊహా చిత్రాలు!) ఉత్తరప్రదేశ్‌లోని హాపూర్ జిల్లాలో పోయిన గురువారం ఆరేళ్ల బాలిక ఇంటి ముందు ఆడుకుంటుండగా బైక్‌పై వచ్చిన ఓ వ్యక్తి బాలికను కిడ్నాప్ చేసి తీసుకెళ్లి స్నేహితులతో కలిసి అత్యాచారానికి పాల్పడ్డాడు. దీని గురించి బాలిక తల్లిదండ్రులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈలోపు శుక్రవారం ఉదయం పొలాల్లో ఒంటిపై తీవ్ర గాయాలతో బాలిక అపస్మారక స్థితిలో పడి ఉండటాన్ని స్థానికులు కనుగొన్నారు. అనంతరం ఆమెను మీరట్‌లోని ఆస్పత్రికి తరలించగా బాలికపై అత్యాచారం జరిగినట్లు వైద్యులు నిర్దారించారు. బాలిక పరిస్థితి ఇంకా విషమంగానే ఉందని.. నాటి భయానక సంఘటన నుంచి చిన్నారికి ఇంకా కోలుకోలేదని వైద్యులు తెలిపారు. -
బెయిల్‌పై విడుదలైన ఈఎస్ఐ స్కామ్ నిందితులు
-
పోలీస్‌స్టేషన్‌లో నిందితుడి ఆత్మహత్య
సాక్షి, మంథని: వన్యప్రాణుల వేట కేసులో పోలీస్ కస్టడీలో ఉన్న నలుగురు నిందితుల్లో ఒకరు ఠాణా ఆవరణలోని బాత్రూంలో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన రామగుండం కమిషనరేట్ పరిధిలో కలకలం సృష్టించింది. రామగుండం పోలీస్ కమిషనర్ సత్యనారాయణ తెలిపిన వివరాల ప్రకారం.. మంథని మండలం లక్కేపూర్ శివారులో ఈ నెల 24న వన్యప్రాణుల వేట కోసం మైదుపల్లికి చెందిన ఉప్పు కుమార్, మక్కాల మల్లేష్, సిద్దపల్లికి చెందిన తాటి సంపత్, రామగిరి మండలం రామయ్యపల్లికి చెందిన శీలం రంగయ్యలు విద్యుత్ తీగలు అమర్చుతుండగా మంథని ఎస్సై ఓంకార్‌యాదవ్ పట్టుకున్నారు. వారిపై కేసు నమోదు చేశారు. (ఇండిగో ప్రయాణికుడికి కరోనా..) ఈ క్రమంలో ఠాణాలోని నిందితుల్లో ఏ–3గా ఉన్న రంగయ్య(52) మంగళవారం తెల్లవారుజామున 4 గంటల సమయంలో పోలీస్‌స్టేషన్ ఆవరణలోని బాత్రూంలో ఇనుప పైపునకు తలపాగాతో ఉరేసుకున్నాడు. అతను ఎంతసేపటికీ రాకపోవడంతో అనుమానం వచ్చిన తోటి నిందితులు బాత్రూం వద్దకు వెళ్లగా లోపల గడి పెట్టి ఉంది. వెంటనే తలుపు పగులగొట్టి చూడగా ఉరేసుకొని కనిపించాడు. వారు పోలీసులకు సమాచారం ఇవ్వగా ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు చెప్పారు. మృతుడిపై ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిధిలో రెండు వన్యప్రాణుల వేట కేసులు ఉన్నట్లు సీపీ తెలిపారు. ఇటీవలే ఈ గ్యాంగ్ ఓ అడవి పందిని వేటాడి చ ంపినట్లు తెలిసిందన్నారు. ఫిజికల్ టార్చర్ ఏం లేదని, ఒకవేళ పోలీసుల నిర్లక్ష్యం ఉందని తేలితే చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. మృతదేహానికి తహసీల్దార్ అనుపమరావు పంచనామా నిర్వహించారు. (మెట్రో ప్రయాణం: మరో 30 సెకన్లు పెంపు) మానవ హక్కుల కమిషన్ నిబంధనలకు లోబడి విచారణ జాతీయ మానవ హక్కుల కమిషన్ నిబంధనలకు లోబడి కేసు విచారణ చేపడుతామని సీపీ సత్యనారాయణ తెలిపారు. మంచిర్యాల జిల్లా జైపూర్ ఏసీపీ నరేందర్‌ను కేసు విచారణ అధికారిగా నియమించినట్లు పేర్కొన్నారు. వన్యప్రాణుల వేటలో ఏటా 10 నుంచి 15 మంది చనిపోతున్నారన్నారు. గతేడాది సుమారు 450 మంది వేటగాళ్లను బైండోవర్ చేసినట్లు తెలిపారు. రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని బెల్లంపల్లి, జైపూర్, సుందిళ్ల ప్రాంతాల్లో నాలుగు పులులు సంచరిస్తున్నాయని వెల్లడించారు. వాటికి ప్రాణహాని ఉందనే వన్యప్రాణులను వేటాడే వారిని పట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. విద్యుత్ శాఖ నుంచి కూడా సమాచారం వచ్చిందన్నారు. రంగయ్య కుటుంబసభ్యులతో పాటు మిగతా నిందితుల స్టేట్మెంట్ రికార్డు చేస్తామని సీపీ పేర్కొన్నారు. వైద్య బృందం సమక్షంలో వీడియో చిత్రీకరణ చేస్తామని తెలిపారు. భారీగా మోహరించిన పోలీసులు పోలీస్ కస్టడీలో ఉన్న రంగయ్య ఉరేసుకోవడంతో అతని కుటుంబసబ్యులు, ఇతర కుల సంఘాలు, రాజకీయ నాయకులు వచ్చే అవకాశం ఉందన్న అనుమానంతో మంగళవారం అధిక సంఖ్యలో తరలివచ్చారు. పెద్దపల్లి డీసీపీ రవీందర్‌తో పాటు పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాలకు చెందిన ఏసీపీలు, సీఐలు, ఇతర విభాగాల పోలీసులు మంథని ఠాణాకు చేరుకున్నారు. ఇతరులను పోలీస్‌స్టేషన్‌లోకి అనుమతించలేదు. మృతుడి బంధువులతో సంప్రదింపులు జరిపి, నష్టపరిహారం చెల్లించేందుకు ఒప్పందం చేసుకున్నట్లు సమాచారం. (హైదరాబాద్‌లోనే ‘ఫావిపిరవిర్’ ) రామయ్యపల్లిలో విషాదం రామగిరి(మంథని): మంథని పోలీస్‌స్టేషన్‌లో రంగయ్య ఆత్మహత్మతో బుధవారంపేట పంచాయతీ పరిధిలోని రామయ్యపల్లిలో విషాదం నెలకొంది. మంగళవారం మృతుడి ఇంటి వద్ద కుటుంబసభ్యులు, బంధువుల రోదనలు మిన్నంటాయి. పోలీసు కేసు భయంతోనే రంగయ్య ఉరేసుకొని ఉంటాడని గ్రామస్తులు తెలిపారు. మృతుడికి భార్య రాజమ్మ, కుమారుడు అనిల్, కూతుళ్లు రజిత(వివాహం అయ్యింది), మౌనిక ఉన్నారు. సోమవారమే భోజనం తీసుకెళ్లాను నాలుగు రోజుల కిందట నా భర్తను కలిశాను. సోమవారం కూడా భోజనం తీసుకెళ్లాను. ఆయన నాకేం చెప్పలేదు. ఇంతలో ఇలా సచ్చిపోయాడు. – రాజమ్మ, రంగయ్య భార్య -
కూతురు పుట్టిన రోజని పిలిచి..
-
23 మంది పిల్లల్ని కాపాడిన ఎన్ఎస్జీ
ఫరూఖాబాద్(యూపీ) : పుట్టిన రోజు వేడుకకు పిల్లల్ని పిలిచి వారిని బందీలుగా చేసిన ఓ పాత నేరస్తుడిని గురువారం అర్ధరాత్రి ఎన్ఎస్జీ (నేషనల్ సెక్యూరిటీ గార్డ్) చాకచక్యంగా మట్టుబెట్టింది. నేరస్తుడి చెర నుంచి పిల్లలందర్నీ సురక్షితంగా రక్షించింది. ఉత్తర ప్రదేశ్‌లోని మొహ్మదాబాద్ ప్రాంతం కతారియా గ్రామంలో జరిగిన సంఘటన వివరాలిలా ఉన్నాయి. మొహమ్మదాబాద్ ప్రాంతం కతారియా గ్రామానికి చెందిన సుభాష్ బథమ్ పాత నేరస్తుడు. తన పుట్టిన రోజు వేడుక అంటూ గురువారం సాయంత్రం చుట్టుపక్కలుండే 23 మంది పిల్లలను ఇంటికి రప్పించుకున్నాడు. అనంతరం వారందరినీ బయటకు వెళ్లకుండా తన ఇంట్లోనే బందీలుగా ఉంచుకున్నాడు. అప్రమత్తమైన అధికారులు, అతడిని ఒప్పించి, పిల్లలను కాపాడేందుకు స్థానిక పెద్దలను, కుటుంబసభ్యులు, బంధువులను రప్పించారు. అక్రమంగా తనపై పోలీసులు హత్యకేసు మోపారంటూ ఆరోపించాడు. అతడి కోరిక మేరకు స్థానిక ఎమ్మెల్యేను కూడా తీసుకువచ్చారు. వారంతా నచ్చజెప్పేందుకు యత్నించగా లోపలి నుంచి ఆరు పర్యాయాలు కాల్పులు జరిపాడు. ఒక నాటుబాంబును కూడా బయట ఉన్న వారిపైకి విసిరాడు. దీంతో ఒకరికి గాయాలయ్యాయి. వెంటనే అధికార యంత్రాంగం అప్రమత్తమయింది. చిన్నారులను సురక్షితంగా బయటకు తీసుకువచ్చేందుకు ఎన్‌ఎస్‌జీను రంగంలోకి దించింది. అతడిని పలుమార్లు లొంగిపొమ్మని చెప్పగా ఆ హెచ్చరికలను పట్టించుకోలేదు. దీంతో అతడిని ఎన్ఎస్జీ మట్టుబెట్టింది. పిల్లల్ని అతడి చెర నుంచి సురక్షితంగా బయటకు తీసుకువచ్చింది. సుభాష్ బథమ్‌కు మతిస్థిమితం లేదని డీజీపీ ఓపీ సింగ్ తెలిపారు. అక్కడి పరిస్థితిని ఎప్పటికప్పుడు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ పర్యవేక్షించినట్లు అధికారులు తెలిపారు. -
ఉన్నావ్: పెళ్లిపై ఒప్పందానికి వచ్చిన తర్వాతే..
లక్నో : ఉన్నావ్ అత్యాచారం, హత్య కేసులో ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటికే బాధితురాలు విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఏడుగురు పోలీసులను సస్పెండ్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. తాజాగా బాధితురాలిపై అత్యాచారం, పెట్రోల్ పోసి నిప్పంటిన నిందితుల్లో ప్రధాన నిందితుడిగా భావిస్తున్న శివం త్రివేది బాధితురాలిని పెళ్లి చేసుకుంటానని మాట ఇచ్చాడు. అంతేగాక ఇందుకు ఓ ఒప్పంద పత్రం కూడా రాసిచ్చాడు. ఇదంతా మహిళను అత్యాచారం చేయకముందే జరగడం గమనార్హం. బాధితురాలిని 2018 జనవరిలో వివాహం చేసుకుంటానని నిందితుడు ఒప్పందం కుదుర్చుకొని అనంతరం 2018 డిసెంబర్లో ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఒప్పంద పత్రంలో ‘‘హిందూ సంప్రదాయాల ప్రకారం 15 జనవరి 2018న మేము ఒక ఆలయంలో వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నాం. ఇప్పటికే ఇద్దరం భార్య, భర్తలాగా కలిసే జీవిస్తున్నాం. భవిష్యత్తులో మా బంధానికి ఎలాంటి అడ్డంకులు రాకుండా ఉండటానికే ఈ నిర్ణయం తీసుకున్నాం. అందుకే ఈ ఒప్పందంపై సంతకం చేస్తున్నాం’’ అని నిందితుడు శివం త్రివేది ఒప్పంద పత్రంలో సంతకం చేశాడు. ఇక గత ఏడాది డిసెంబర్లో మహిళను అత్యాచారం చేసిన ఇద్దరు నిందితుల్లో ఒకరైన శివం త్రివేదిని పోలీసులు అరెస్టు చేయగా ఇటీవలే బెయిల్‌పై బయటికి వచ్చిన నిందితుడు.. బాధితురాలిని కేసు ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశాడు. ఇందుకు యువతి ఒప్పుకోకపోవడంతో గురువారం ఉదయం బాధితురాలిపై దాడికి దిగి పెట్రోల్ పోసి నిప్పంటించి పరారయ్యారు. 90 శాతం కాలిన గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి ప్రాణాలు విడిచింది. ఈ ఘటన అనంతరం పోలీసులు అయిదుగురు నిందితులను అరెస్టు చేశారు. కాగా ఉన్నావ్ బాధితురాలి మృతిపై దేశ వ్యాప్తంగా ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. మహిళలపై అత్యాచార ఘటనలు జరగకుండా ప్రభుత్వం కనీసం చర్యలు తీసుకోవడం లేదని ప్రతిపక్షాలు, ప్రజలు విమర్శిస్తున్నారు. తన కూతురు చావుకు కారణమైన దోషులను ఉరి తీయాలంటూ బాధితురాలి తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. -
‘దిశ’ నిందితుల మృతదేహాలు అప్పగిస్తారా..?
సాక్షి, మహబూబ్‌నగర్ : పశువైద్యురాలు ‘దిశ’ అత్యాచార, హత్య కేసులో ఎన్కౌంటర్ అయిన నిందితుల మృతదేహాల విషయమై మూడురోజుల నుంచి పోలీస్‌శాఖలో ఉత్కంఠ నెలకొంది. ఈ నెల 6న తెల్లవారుజామున ఎన్కౌంటర్ జరిగిన తర్వాత నాలుగు మృతదేహాలను అదేరోజు సాయంత్రం మహబూబ్‌నగర్ జనరల్ ఆస్పత్రికి తరలించారు. నిందితుల మృతదేహాలు ఆస్పత్రి గేట్ లోపలికి వచ్చినప్పటి నుంచి ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేశారు. ముఖ్యంగా పోస్టుమార్టం నిర్వహణ, జాతీయ మానవ హక్కుల కమిషన్ సభ్యుల పర్యటన దేనికీ కూడా ఎలాంటి అవాంతరాలు ఏర్పడకుండా పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. ప్రధానంగా మీడియాను ఆస్పత్రి లోపలికి వెళ్లకుండా, కేసు వివరాలు మీడియాతో ఎవరూ మాట్లాడకుండా జాగ్రత్తపడ్డారు. అయితే శనివారం అర్ధరాత్రి నాలుగు మృతదేహాలను జనరల్ ఆస్పత్రి పోస్టుమార్టం విభాగం నుంచి ఎదిర సమీపంలోని పాలమూరు మెడికల్ కళాశాలకు తరలిస్తున్న సమయంలో వీడియోలు, ఫొటోలు బయటకు రావడం, సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం కావడంతో ఈ రెండు రోజులపాటు చేసిన శ్రమ మొత్తం వృథా అయిందంటూ పోలీసులు వాపోయారు. శుక్రవారం రాత్రి సైతం పోస్టుమార్టం జరుగుతున్న సమయంలో ఓ ప్రైవేట్ వ్యక్తి లోపలికి ప్రవేశించి ఫొటోలు తీసి సోషల్ మీడియాలో పెట్టాడు. దీనిపై అదేరోజు సిబ్బందిపై ఎస్పీ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. మళ్లీ మృతదేహాల తరలింపు సందర్భంగా వీడియోలు బయటకు రావడంతో ఈ విషయమై పట్టణానికి చెందిన ఇద్దరు సీఐలపై శాఖాపరమైన చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది. నేడు తరలించే అవకాశం దిశ అత్యాచార, హత్య కేసులో సోమవారం హైకోర్టు నిర్ణయం వెల్లడించిన తర్వాత నాలుగు మృతదేహాలను వారి కుటుంబ సభ్యులకు అప్పగించే అవకాశం ఉంది. హైకోర్టు నిర్ణయం వచ్చేసరికి సాయంత్రం అయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో రాత్రి 8 గంటల తర్వాతనే మృతదేహాలను అక్కడి నుంచి తరలించే విషయమై కదలిక వచ్చేటట్లు కనిపిస్తోంది. అయితే కుటుంబ సభ్యులు మాత్రం తమ పిల్లల మృతదేహాలను ఎప్పుడు అప్పగిస్తారో అంటూ ఎదురుచూస్తున్నారు. శుక్రవారం రాత్రే ఇస్తారనుకున్నా.. కోర్టు జోక్యం చేసుకోవడం, ఎన్‌కౌంటర్‌పై అనుమానాలు ఉన్నాయని ఎన్హెచ్ఆర్సీ పర్యటనకు వస్తామని చెప్పడంతో సోమవారం వరకు వాయిదా పడింది. మెడికల్ కళాశాల ముఖద్వారం వద్ద పోలీసులు ఏర్పాటు చేసిన బారీకేడ్లు అనాటమీ ల్యాబ్‌లో.. నలుగురు నిందితుల మృతదేహాలను జిల్లా జనరల్ ఆస్పత్రిలో పెట్టడం వల్ల శాంతిభద్రతలకు ఇబ్బందిగా మారుతుందని, ఆస్పత్రికి వచ్చిపోయే రోగులకు సమస్యగా ఉంటుందని భావించిన పోలీసులు శనివారం అర్ధరాత్రి సమయంలో పోస్టుమార్టం విభాగం నుంచి డీసీఎంలో నాలుగు మృతదేహాలను పాలమూరు మెడికల్ కళాశాలకు తరలించారు. కళాశాలలోని గ్రౌండ్‌ఫ్లోర్‌లో ఉన్న అనాటమీ ల్యాబ్‌లో సైంటిఫిక్ మెథడ్ విధానం కలిగిన ఫ్రీజర్‌లో మృతదేహాలను భద్రపరిచారు. వీటిలో పెట్టడం వల్ల మృతదేహాలకు ఎలాంటి సమస్య రాదని, కొన్నిరోజులపాటు భద్రపరిచే సౌకర్యం ఉందని ఓ వైద్యుడు వెల్లడించారు. ఈ ల్యాబ్ లోపలికి ఎవరూ వెళ్లకుండా ప్రత్యేకమైన చర్యలు చేపట్టారు. అనుమతి లేదు.. పాలమూరు మెడికల్ కళాశాలలో మృతదేహాలు పెట్టడం వల్ల కళాశాల ముఖద్వారం దగ్గరే పోలీసులు బారీకేడ్లు ఏర్పాటు చేసి వచ్చిపోయే వ్యక్తులను క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సిబ్బంది లోపలికి వెళ్తున్న వ్యక్తులను తనిఖీలు చేసి పంపారు. క్యాంపస్ ప్రాంగణంలోకి కొత్త వ్యక్తులు లోపలికి వెళ్లడానికి పోలీసులు ఏమాత్రం అనుమతి ఇవ్వడం లేదు. విద్యార్థుల కుటుంబ సభ్యులు, ఇతర కార్మికులు వచ్చినా పంపలేదు. కేవలం కళాశాలలో చదువుతున్న విద్యార్థులు, అధ్యాపకులు, ఇతర సిబ్బందిని మాత్రం గుర్తింపు కార్డులు చూసి లోపలికి పంపించారు. పరిశీలించిన ఏఎస్పీ ఎన్కౌంటర్లో మృతిచెందిన నలుగురు నిందితుల మృతదేహాలను కళాశాలలో పెట్టడం వల్ల పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు. ఇద్దరు సీఐలతోపాటు ముగ్గురు ఎస్ఐలు ఇతర కానిస్టేబుళ్లు కలిపి మొత్తం 30 మందికిపైగా సిబ్బందితో బందోబస్తు కల్పించారు. స్థానిక పరిస్థితిని ఏఎస్పీ వెంకటేశ్వర్లు, కల్వకుర్తి డీఎస్పీ గిరిబాబు పర్యవేక్షించారు. -
ఎమ్మార్వో హత్య: నా భర్త అమాయకుడు
సాక్షి, రంగారెడ్డి: జిల్లాలోని అబ్దుల్లాపూర్ మెట్ ఎమ్మార్వో హత్య కేసులో ప్రధాన నిందితుడు సురేష్ భార్య లత ఈ హత్యా ఉదంతంపై స్పందించారు. తన భర్త సురేష్ అమాయకుడని తెలిపారు. ఆమె బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. ఎమ్మార్వో హత్య చేసేంత దారుణానికి ఒడిగడుతాడని తాను భావించటం లేదని చెప్పారు. దీనివెనుక ఎవరో ఉన్నారని అనుమానం వ్యక్తం చేసింది. ఎమ్మార్వో విజయారెడ్డి హత్యలో తన భర్తను పావుగా వాడుకున్నారని ఆరోపించారు. ఈ సంఘటన జరిగిన అనంతరం తన భర్త సురేష్‌తో ఇప్పటివరకు మాట్లాడలేదన్నారు. హత్య జరిగిన రోజు తనతో భూవివాదం, ఎమ్మార్వో ఆఫీస్‌కు వెళుతున్నట్లు వంటి ఎలాంటి విషయాలు తనకు చెప్పలేదని పేర్కొన్నారు. ఈ దారుణం వెనక ఉన్న వాళ్లని కూడా బయటికి తీయాలని సురేష్ భార్య లత పోలీసులను, ప్రభుత్వాన్ని కోరారు. -
ఎమ్మార్వో హత్య కేసు : నిందితుడి పరిస్థితి విషమం
సాక్షి, హైదరాబాద్: తహసీల్దార్ హత్య కేసులో నిందితుడు సురేష్ పరిస్థితి విషమంగా ఉందని ఉస్మానియా ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. అతని ఒంటిపై 65 శాతం కాలిన గాయాలు ఉన్నాయని తెలిపారు. అబ్దుల్లాపూర్‌మెట్ పోలీసుల సంరక్షణలో ఉస్మానియా మెయిల్ బర్నింగ్ వార్డులో నిందితుడు చికిత్స పొందుతున్నాడు. నిందితుడి నుంచి మెజిస్ట్రేట్ డీడీ డిక్లరేషన్ నివేదిక తీసుకున్నారు. 74 గంటలు దాటితే తప్ప సురేష్ ఆరోగ్య పరిస్థితి గురించి చెప్పలేమని ఆస్పత్రి వైద్యులు పేర్కొన్నారు. ప్రస్తుతం సురేష్ న్యూరో బర్న్ షాక్‌లో ఉన్నట్టు తెలిపారు. మరో 24 గంటలు దాటితే సురేష్ స్కిన్ బర్న్ సెప్టిక్‌లోకి వెళ్ళే ప్రమాదం ఉందని తెలిపారు. ఉస్మానియా వైద్యులు పోలీసుల సమక్షంలో ఫ్లూయిడ్స్ ఇస్తూ.. చికిత్స అందిస్తున్నారు. -
కూల్‌డ్రింక్‌లో విషం కలిపి.. బ్లేడ్‌తో గొంతు కోసి..
సాక్షి, కామారెడ్డి: అన్న కూతురు ప్రేమ పెళ్లి నచ్చని ఓ వ్యక్తి ఉన్మాదిగా మారి ముగ్గురిని హతమార్చిన ఘటన జిల్లాలో కలకలం రేపింది. జిల్లాలోని భిక్కనూరు మండలం జంగంపల్లి శుక్రవారం ఈ ఘటన చోటుచేసుకుంది. అయితే, ముగ్గురి ఉసురు తీసిన ఉన్మాది బ్లేడ్‌తో గొంతు కోసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్టు పోలీసులు వెల్లడించారు. అతని మృతదేహం దోమకొండలోని గుండ్ల చెరువులో ఆదివారం లభ్యమైంది. వివరాలు.. భిక్కనూరు మండలం జంగంపల్లికి చెందిన బందెల బాలయ్య (45), బందెల రవి అన్నదమ్ములు. బాలయ్యకు భార్య, ఇద్దరు కూతుళ్లు దీప, లత(16), కుమారుడు అజయ్ ఉన్నారు. రవికి భార్య, ఒక కూతురు చందన(8) ఉన్నా రు. బాలయ్య పెద్ద కూతురు దీప నెల రోజుల క్రితం జంగంపల్లి గ్రామానికి చెందిన వారి కులానికే చెందిన నర్సింలు అనే యువకుడిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఈ విషయంలో ఇరువురి కుటుంబ సభ్యుల మధ్య గొడవలు జరిగినా.. ఒకే కులం కావడంతో సర్దుకుపోయారు. దీంతో కుటుంబం పరువు తీసిన అన్నను, అతని కుటుంబ సభ్యులను చంపుతానంటూ రవి పలుమార్లు హెచ్చరించాడు. సరైన సమయం కోసం ఎదురు చూశాడు. శుక్రవారం సాయంత్రం 4 గంటల ప్రాంతంలో మాయ మాటలు చెప్పి, నమ్మించి తన బైకుపై అన్న బాలయ్య, అన్న రెండో కూతురు లత (16), తన కూతురు చందన (8) లను తీసుకుని దోమకొండ మండల కేంద్రానికి సమీపంలోని మల్లన్న ఆలయం వద్దకు తీసుకెళ్లాడు. అక్కడ పురుగుల మందు కలిపిన కూల్‌డ్రింక్‌ను గ్లాసుల్లో పోసి ముగ్గురితో తాగించాడు. అనంతరం తన వెంట తెచ్చుకున్న బ్లేడుతో అన్న బాలయ్య, అన్న కూతురు లత, తన సొంత కూతురు చందన గొంతు కోసి ప్రాణాలు తీశాడు. ముగ్గురూ చనిపోయారని నిర్ధారించుకున్న తర్వాత అక్కడ నుంచి పరారయ్యాడు. గుండ్ల చెరువు వద్ద తానూ గొంతు కోసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. చదవండి: అన్న కూతురు ప్రేమ నచ్చని ఉన్మాది -
అత్యాచార నిందితుడికి శిక్ష ఖరారు
సాక్షి, వరంగల్ : ఆరేళ్ల బాలికపై అత్యాచారం చేసి అనంతరం హత్యకు పాల్పడిన ఓ కామాంధుడికి ఎట్టకేలకు శిక్ష ఖరారు అయ్యింది. ఈ కేసుకు సంబంధించిన తుది తీర్పును శుక్రవారం జిల్లా కోర్టు వెలువరించింది. జయశంకర్ జిల్లా గోరికొత్త పల్లి గ్రామంలో ఆరేళ్ల చిన్నారిపై అఘాయిత్యానికి పాల్పడ్డ శివ అనే నిందితుడుకి వరంగల్ జిల్లా న్యాయస్థానం యావజ్జీవ కారాగార శిక్షను విధించింది. -
ఆధిపత్య పోరులోనే కోటయ్య హత్య
సాక్షి, చేబ్రోలు: దళిత నాయకుల మధ్య ఆధిపత్య పోరు కారణంగానే ఎమ్మార్పీఎస్ మాజీ నేత, నవ్యాంధ్ర ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకుడు పమిడిపాటి కోటయ్య హత్యకు ప్రధాన కారణమని చేబ్రోలు సర్కిల్ ఇన్స్పెక్టర్ టీవీ శ్రీనివాసరావు తెలిపారు. మండలకేంద్రలోని సర్కిల్ కార్యాలయంలో గురువారం విలేకర్ల సమావేశం నిర్వహించారు. జూలై 5వ తేదీ రాత్రి చేబ్రోలు మండల పరిధిలోని వేజండ్ల పల్లె అడ్డరోడ్డు దగ్గర అమృతలూరు ప్రాంతానికి చెందిన పమిడిపాటి కోటయ్య హత్యకు గురయ్యాడు. దీనిపై పూర్తి స్థాయిలో విచారణ జరిపి ఘటనకు కారణమైన ఆరుగురు నిందితులను అరెస్ట్ చేసి కోర్టుకు హాజరుపరిచారు. తెనాలి ప్రాంతానికి చెందిన సుద్దపల్లి నాగరాజు, తెనాలి ఐతానగర్‌కు చెందిన కొత్తపల్లి నాగరాజు, కొలకలూరు గ్రామానికి చెందిన సుద్దపల్లి రాజేంద్ర, కూచిపూడి మోహన్, సుద్దపల్లి కిషోర్‌లు కోటయ్య హత్యకు కారకులని వెల్లడించారు. సీఐ శ్రీనివాసరావు మాట్లాడుతూ మృతుడు పమిడిపాటి కోటయ్య, తెనాలి ప్రాంతానికి చెందిన సుద్దపల్లి నాగరాజు గతంలో ఎమ్మార్పీఎస్‌లో పనిచేశారు. కోటయ్యను ఎమ్మార్పీఎస్ నుంచి తొలగించిన తరువాత వీరిద్దరికి మధ్య మనస్పర్థలు వచ్చాయి. ఈ నేపథ్యంలో కోటయ్య ఫేస్బుక్, వాట్సప్‌లలో పీక కోస్తానని, చంపుతానని పోస్టులు పెట్టడంతో ఎక్కడ తనను చంపుతాడోనని భావించి ముందుగానే నాగరాజు కోటయ్యను చంపాలని నిర్ణయించుకొని మరి కొంత మంది సహకారంతో పథకం ప్రకారం హత్య చేశాడు. కోటయ్య కదలికలను గమనించి స్కార్పియాతో ఢీ కొట్టి కత్తులతో పొడిచి హత్య చేసినట్లు వివరించారు. హత్యకు ఉపయోగించిన కారు, ద్విచక్ర వాహనాలను స్వాదీనం చేసుకున్నారు. సీఐతో పాటు స్థానిక ఎస్ఐ సీహెచ్ కిషోర్, సిబ్బంది పాల్గొన్నారు. -
‘మాలేగావ్’ నిందితులకు బెయిల్
ముంబై: మాలేగావ్ వరుస పేలుళ్లలో నలుగురు నిందితులకు బాంబే హైకోర్టు గురువారం బెయిల్ మంజూరు చేసింది. జస్టిస్ ఐఏ మహంతి, జస్టిస్ ఏఎమ్ బాదర్‌లతో కూడిన డివిజన్ బెంచ్ ఈ నిర్ణయం తీసుకుంది. ధాన్ సింగ్, లోకేశ్ శర్మ, మనోహర్ నర్వారియా, రాజేంద్ర చౌదరిలకు బెయిల్ మంజూరు చేశారు. రూ. 50 వేలు పూచీకత్తు సమర్పించాలని, విచారణ సమయంలో ప్రతిరోజు స్పెషల్ కోర్టుకు హాజరు కావాలని హైకోర్టు ఆదేశించింది. అంతేకాక సాక్ష్యాలను ప్రభావితం చేసేలా ప్రవర్తించరాదనే షరతును విధించింది. 2016లో ప్రత్యేక న్యాయస్థానం వీరికి బెయిల్ తిరస్కరించడంతో హైకోర్టును ఆశ్రయించారు. 2013లో అరెస్టు అయినప్పటి నుంచి ఈ నలుగురు జైళ్లో ఉన్న సంగతి విదితమే. 2006, సెప్టెంబరు 8న నాసిక్ సమీపంలోని మాలేగావ్‌లో జరిగిన వరుస బాంబు పేలుళ్లలో 37 మంది చనిపోగా, 100 మందికి పైగా గాయపడ్డారు. ఈ కేసును మొదట మహారాష్ట్రకు చెందిన ఉగ్రవాద వ్యతిరేక సంస్థ విచారణకు తీసుకొని మైనార్టీ వర్గానికి చెందిన తొమ్మిది మందిని అరెస్టు చేసింది. తర్వాత ఈ కేసును సీబీఐకి అప్పగించారు. అనంతరం ఈ కేసు విచారణ జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) చేతుల్లోకి వెళ్లింది. మెజారిటీ వర్గానికి చెందినవారే ఈ పేలుళ్లకు పాల్పర్డారని ప్రాథమిక నిర్ధారణకు వచ్చిన ఎన్ఐఏ.. మొదట నిందితులుగా ఉన్న తొమ్మిది మందిపై ఉన్న చార్జ్‌షీట్‌ను తొలగించింది. దీంతో 2016లో స్పెషల్ ట్రయల్ కోర్టు ఎన్ఐఏ వాదనలను అంగీకరించి, తొమ్మిది మంది నిందితులను విడుదల చేసింది. -
‘పుల్వామా’ సూత్రధారి హతం
శ్రీనగర్: పుల్వామాలో 40 మంది సీఆర్పీఎఫ్ జవాన్లను బలిగొన్న పుల్వామా దాడికి సూత్రధారిగా భావిస్తున్న ఉగ్రవాది ముదాసిర్ అహ్మద్ ఖాన్‌ను భద్రతా బలగాలు ఎన్కౌంటర్లో సోమవారం మట్టుపెట్టాయి. ఈ ఘటనలో మరణించిన మరో ఉగ్రవాదిని పుల్వామా దాడిలో వాడిన మినీ వ్యానును కొనుగోలు చేసిన సజ్జద్ భట్ అని భావిస్తున్నారు. పుల్వామా జిల్లా పింగ్లిష్‌లో ఆదివారం సాయంత్రం ప్రారంభమైన ఎన్కౌంటర్ సోమవారం వేకువజాము వరకు సాగింది. ఉగ్రవాదులు దాక్కున్న ఇంట్లో లభ్యమైన సామగ్రి, ఆధారాల్ని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ)కి అందజేస్తామని కశ్మీర్ పోలీస్ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. సుదీర్ఘ ఎన్కౌంటర్.. పింగ్లిష్‌లో ఉగ్రవాదులు సంచరిస్తున్నారని సమాచారం అందడంతో ఆదివారం సాయంత్రం నుంచే భద్రతా బలగాలు అక్కడ సోదాలు ముమ్మరం చేశాయి. తొలుత ముష్కరులు కాల్పులకు దిగడంతో భద్రతా బలగాలు తిప్పికొట్టాయి. దీంతో ఇరు వర్గాల మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. సుదీర్ఘంగా కొనసాగిన ఎన్కౌంటర్ ముగిసిన తరువాత సంఘటనా స్థలంలో ఇద్దరు ఉగ్రవాదుల మృతదేహాలను గుర్తించారు. అందులో ఒకరు పుల్వామా మాస్టర్‌మైండ్ ముదాసిర్ అహ్మద్ ఖాన్ కాగా, రెండో వ్యక్తి వివరాలు స్పష్టంగా తెలియరాలేదు. అతడిని పుల్వామా దాడికి 10 రోజుల ముందే, ఆ వాహనాన్ని కొనుగోలు చేసిన సజ్జద్ భట్‌గా భావిస్తున్నట్లు అధికారులు తెలిపారు. రెండో ఉగ్రవాదిగా భావిస్తున్న సజ్జద్ భట్ వివరాలు ఇంకా పూర్తిగా తెలియరాలేదని, అతడు పాకిస్తానీయుడు అని భావిస్తున్నట్లు కశ్మీర్ రేంజ్ ఐజీ స్వయం ప్రకాశ్ పాణి చెప్పారు. ఎలక్ట్రీ్టషియన్ నుంచి ఉగ్రవాదిగా పుల్వామా నివాసి అయిన 23 ఏళ్ల ముదాసిర్ అహ్మద్ ఖాన్ డిగ్రీ పూర్తిచేసి ఎలక్ట్రీషియన్‌గా పనిచేశాడు. 2017లో జైషేలో సాధారణ కార్యకర్తగా చేరి తరువాత నూర్ మహ్మద్ తంత్రాయ్ ప్రేరణతో ఉగ్రవాదిగా మారాడు. అదే ఏడాది డిసెంబర్లో తంత్రాయ్ హతమయ్యాక 2018 జనవరిలో ఇంటి నుంచి పరారై క్రియాశీలకంగా మారాడు. 2018, ఫిబ్రవరిలో ఆరుగురు భద్రతా సిబ్బందిని బలితీసుకున్న సుంజవాన్ ఆర్మీపై దాడిలో అతని పాత్ర ఉన్నట్లు భావిస్తున్నారు. ఈ ఘటనకు నెల రోజుల ముందు ఐదుగురు సీఆర్పీఫ్ సిబ్బంది ప్రాణాలు కోల్పోయిన లీత్‌పురా దాడిలోనూ అతని ప్రమేయం ఉన్నట్లు తెలిసింది. -
ఎన్కౌంటర్లో పుల్వామా ఉగ్రదాడి నిందితుడు హతం
-
పుల్వామా ఉగ్రదాడి: సూత్రధారి హతం
శ్రీనగర్ : పుల్వామా ఉగ్ర దాడికి ప్రధాన సూత్రధారిగా అనుమానిస్తున్న జైషే ఉగ్రవాది ముదస్సర్ అహ్మద్ ఖాన్ అలియాస్ మహ్మద్ భాయ్ దక్షిణ కశ్మీర్లో జరిగిన ఎన్కౌంటర్లో మరణించాడని అధికారులు పేర్కొన్నారు. ఈ ఎన్కౌంటర్లో మరణించిన ముగ్గురు ఉగ్రవాదుల్లో పుల్వామా దాడి సూత్రధారి, 23 ఏళ్ల ఎలక్ర్టీషియన్ మహ్మద్ భాయ్ కూడా ఉన్నాడని వెల్లడించారు. ఎన్కౌంటర్లో హతమైన ముగ్గురి మిలిటెంట్ల మృతదేహాలు దగ్ధమయ్యాయని, గుర్తుపట్టలేని విధంగా ఉన్నాయని, వారిని గుర్తించేందుకు చర్యలు చేపడుతున్నామని అధికారులు తెలిపారు. ఉగ్రవాదుల కదలికలపై ఇంటెలిజెన్స్ సమాచారం మేరకు పింగ్లిష్ ప్రాంతంలో చేపట్టిన గాలింపు చర్యల్లో ఉగ్రవాదులు కాల్పులు జరపడంతో భద్రతా దళాలు ఎదురుకాల్పులకు దిగడంతో ఎన్కౌంటర్ చోటుచేసుకుందని అధికారులు పేర్కొన్నారు. కాగా, పుల్వామాలో ఫిబ్రవరి 14న సీఆర్పీఎఫ్ వాహనశ్రేణిపై జరిగిన ఉగ్రదాడిలో 40 మంది జవాన్లు మరణించిన ఘటన వెనుక 23 ఏళ్ల జైషే మహ్మద్ ఉగ్రవాది ముదసర్ అహ్మద్ ఖాన్ అలియాస్ మహ్మద్ భాయ్ ప్రమేయం ఉన్నట్టు అధికారులు గుర్తించారు. జైషే మానవ బాంబు పాల్పడిన ఈ భీకర దాడికి వాహనం, పేలుడు పదార్ధాలను ఖాన్ సమకూర్చినట్టు అధికారులు అనుమానిస్తున్నారు. ట్రాల్ ప్రాంతంలోని మిర్ మొహల్లా నివాసైన ఖాన్ పాక్‌కు చెందిన జైషే మహ్మద్ ఉగ్ర సంస్థలో 2017లో అజ్ఞాత కార్యకర్తగా చేరాడని చెప్పారు.పుల్వామాలో ఆత్మాహుతి దాడికి పాల్పడిన జైషే కార్యకర్త అదిల్ అహ్మద్ దార్ నిత్యం ఖాన్‌తో సంప్రదింపులు జరిపినట్టు అధికారులు తెలిపారు. డిగ్రీ వరకూ చదివిన అహ్మద్ ఖాన్ అలియాస్ మహ్మద్ భాయ్ ఆ తర్వాత ఐటీఐలో ఎలక్ర్టీషియన్ కోర్సు చేశాడు. కశ్మీర్లో జరిగిన పలు ఉగ్రదాడుల్లో ఖాన్ పాల్గొన్నట్టు అధికారులు వెల్లడించారు. -
షెల్టర్ హోం కేసు : మంజూ వర్మ లొంగుబాటు
పట్నా : ముజఫర్‌పూర్ షెల్టర్ హోం కేసులో సీబీఐ దర్యాప్తును ఎదుర్కొంటున్న బిహార్ మాజీ మంత్రి మంజు వర్మ మంగళవారం బెగుసరాయ్ కోర్టులో లొంగిపోయారు. ఈ కేసులో సీబీఐ తనను అరెస్ట్ చేయకుండా మంజు వర్మ రెండు నెలలుగా తప్పించుకు తిరుగుతున్నారు. కాగా సీబీఐ కన్నుగప్పి తిరుగుతున్న మంజువర్మను పరారీలో ఉన్నట్టు ప్రకటించిన బెగుసరాయ్ కోర్టు ఆమె ఆస్తులను అటాచ్ చేయాల్సిందిగా ఉత్తర్వులు జారీ చేసింది. కోర్టు ఉత్తర్వుల మేరకు వర్మ ఆస్తులను అటాచ్ చేసే ప్రక్రియను బిహార్ పోలీసులు పూర్తిచేశారు. ముజఫర్‌పూర్ షెల్టర్ హోంలో 30 మంది బాలికలపై లైంగిక దాడి జరిగిన కేసులో ప్రధాన నిందితుడైన బ్రజేష్ ఠాకూర్‌తో మంజు వర్మ భర్త చంద్రశేఖర్ వర్మకు సన్నిహిత సంబంధాలున్నాయనే ఆరోపణలపై ఆమె ఈ ఏడాది ఆగస్టులో మంత్రి పదవి నుంచి వైదొలగిన సంగతి తెలిసిందే. షెల్టర్ హోం కేసుకు సంబంధించి గతంలో మంజూ వర్మ నివాసంపై, ఆమె బంధువుల నివాసంలో సీబీఐ చేపట్టిన దాడుల్లో ఆయుధాలు లభ్యం కావడంతో మంజు వర్మపై సీబీఐ కేసు నమోదు చేసింది. -
నకిలీ నోట్ల కేసు నిందితుడు అక్బర్ అలీ అరెస్ట్
సాక్షి, హైదరాబాద్ : 2015 విశాఖ నకిలీ నోట్ల కేసులో ప్రధాన నిందితుడు మహ్మద్ అక్బర్ అలీని పోలీసులు అరెస్ట్ చేశారు. గత కొద్దికాలంగా అజ్ఞాతంలో ఉన్న అక్బర్‌ను ఎన్ఐఏ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అస్సాంకు చెందిన మహ్మద్ అక్బర్ అలీ 2007లో బెంగళూరుకు వచ్చి స్థిరపడ్డాడు. పువ్వుల అమ్మే షాపులో పనిచేసుకునే అక్బర్! హకీమ్ అనే వ్యక్తి ద్వారా నకిలీ నోట్ల దందాలోకి దిగాడు. ఆ తర్వాత సొంతంగా ఒక గ్రూపును తయారుచేసుకుని దంగా చేసేవాడు. 2015 సంవత్సరంలో ఈ ముఠాకు చెందిన సద్దాం హశ్సేన్ అనే వ్యక్తి దొంగ నోట్లు తరలిస్తుండగా విశాఖపట్నంలో పట్టుబడ్డాడు. అతని వద్దనుంచి 5లక్షల నకిలీ నోట్లు స్వాధీనపరుచుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. దీంతో ఈ కేసులో అక్బర్ ప్రధాన నిందితుడని తేలింది. అయితే పోలీసులకు చిక్కకుండా తప్పించుకున్న అతడు అజ్ఞాతంలోకి వెళ్లాడు. అక్బర్ కోసం శ్రమించిన పోలీసులు అతని కదలికను పసిగట్టి పట్టుకున్నారు. -
అత్యాచారం, హత్య కేసులో నిందితుడికి పదేళ్ల జైలు
సాక్షి, కోలారు : బాలికపై అత్యాచారం జరిపి హత్య చేసిన కేసులో నిందితుడికి 10 సంవత్సరాల జైలు శిక్ష విధిస్తూ కర్ణాటకలోని కోలారు జిల్లా సెషన్స్ న్యాయమూర్తి శనివారం తీర్పు చెప్పారు. కోలారు నగరంలోని కేజీ మోహల్లా వాసి వాజిద్‌ఖాన్ 2015 జనవరి 31న అదే ప్రాంతానికే చెందిన ఓ బాలికపై అత్యాచారం చేసి హత్య చేశాడు. నిందితుడిని పోలీసులు అరెస్టు చేయగా కోర్టు విచారణలో నేరం రుజువు కావడంతో సెషన్స్ న్యాయమూర్తి బి.ఎస్.రేఖ నిందితుడికి పైవిధంగా జైలు శిక్ష, రూ.5 వేల జరిమానా విధించారు.