
సాక్షి, నెల్లూరు: నగరంలో మూడు రోజుల క్రితం దంపతులు హత్య కలకలం సృష్టించిన విషయం తెలిసిందే. కాగా, జంట హత్యల కేసులను పోలీసులు ఛేదించారు. కృష్ణారావు క్యాంటీన్‌లో సప్లయర్‌గా పని చేస్తున్న శివనే.. వారిని హత్య చేసినట్టు పోలీసులు స్పష్టం చేశారు.
అయితే, అశోక్‌నగర్‌లో నివాసం ఉంటున్న వాసురెడ్డి కృష్ణారావు, అతని భార్య సునీత ఈనెల 28వ తేదీన దారుణ హత్యకు గురయ్యారు. వారిని కిరాకతంగా చంపి ఇంట్లో ఉన్న నగదు, బంగారం ఎత్తుకెళ్లారు. దీంతో, రంగంలోకి దిగిన పోలీసులు.. అన్ని కోణాల్లో దర్యాప్తు చేశారు. ఈ క్రమంలో క్యాంటీన్‌లో అందరి ముందు మందలించారని.. శివ అనే వ్యక్తి కక్ష పెంచుకున్నట్లు గుర్తించారు. అతడే దంపతులిద్దరిని హత్య చేసినట్లు సమాచారం.
కాగా, శనివారం రాత్రి భర్త కృష్ణారావు.. ఇంటి తాళం తీస్తుండగా ఆయనపై దాడి చేసి హత్య చేశారు. ఆ తర్వాత ఇంట్లోకి వెళ్లి నిద్రిస్తున్న సునీత తలపై కర్రతో కొట్టారు. దీంతో, ఆమె అక్కడికక్కడే మృతి చెందారు. ఆ తర్వాత నిందితులు అక్కడి నుంచి పరారైనట్టు పోలీసులు తెలిపారు. ఇక, కృష్ణారావు హత్యకు నిందితులు రెక్కీ కూడా నిర్వహించినట్టు సమాచారం. అయితే, శివతోపాటుగా ఇంకా ఎంతమంది ఉన్నారనే విషయాలు తెలియాల్సి ఉంది.
ఇది కూడా చదవండి: నెల్లూరులో జంట హత్యల కలకలం.. చంపింది ఎవరు?
Comments
Please login to add a commentAdd a comment