![kolkata Doctor case: Polygraph test on main accused and others](/styles/webp/s3/article_images/2024/08/24/kolkata_0.jpg.webp?itok=cIGpu774)
కోల్‌కతా: కోల్‌కతా డాక్టర్ హత్యాచార కేసులో సీబీఐ దర్యాప్తు ముమ్మురం చేస్తోంది. తాజాగా ఆదివారం ఈ కేసులో ప్రధాన నిందితుడు సంజయ్ రాయ్, ఆర్జీ కర్ హాస్పిటల్ మాజీ ప్రిన్సిపల్ సందీష్ హోష్, మరో నలుగురు డాక్టర్లకు పాలిగ్రాఫ్ టెస్ట్ చేస్తున్నామని సీబీఐ అధికారులు తెలిపారు. ఈ టెస్ట్‌లు నిర్వహించటం కోసం ఢిల్లీ నుంచి సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీ (SEPSLA) ప్రత్యేక బృందం కోల్‌కతా చేరుకున్నట్లు తెలిపారు. పాలిగ్రాఫ్ టెస్ట్‌లు కొనసాగుతున్నాయని సీబీఐ అధికారులు పేర్కొన్నారు. ఇక.. ప్రధాన నిందితుడు సంజయ్ రాయ్‌కు జైలులోనే పాలిగ్రాఫ్ పరీక్ష నిర్వహిస్తామని, మిగతావారికి సీబీఐ కార్యాలయంలో టెస్ట్‌లు కొనసాగుతున్నట్లు సీబీఐ వర్గాలు తెలిపాయి.
Kolkata doctor rape-murder: Polygraph test of former RG Kar principal Sandip Ghosh among others to be held today
Read @ANI Story | https://t.co/cTnTQQqCBa#Kolkata #RGKarHospital #SandipGhosh pic.twitter.com/udWo2KLl2F— ANI Digital (@ani_digital) August 24, 2024
బాధితురాలితో చివరి గంటల్లో గడిపిన నలుగురిలో ఇద్దరు ఫస్టియర్ పోస్ట్ గ్రాడ్యుయేట్ టైనీలు, ఒక హౌస్ సర్జన్, ఇంటర్న్‌షిప్ చేస్తున్న మరొకరు ఉన్నారు. వీరందరూ కలిసి బాధిత డాక్టర్‌తో కలిసి ఘటన జరగడానికి ముందు భోజనం చేశారు. ఈ కేసులో వీరు నిందితులు కానప్పటికీ వారి స్టేట్‌మెంట్లు మాత్రం పరస్పర విరుద్ధంగా ఉన్నాయి.
డాక్టర్ హత్యాచారానికి గురవడానికి ముందు, తర్వాత ముందుగా వీరే చూశారు. సాక్ష్యాలను తారుమారు చేయడానికి వీళ్లు ఏమైనా ప్రయత్నించారా? అన్న విషయాన్ని పాలిగ్రాఫ్ టెస్టు ద్వారా తెలుసుకోవాలని దర్యాప్తు సంస్థ సీబీఐ భావిస్తోంది. ఇక.. నిందితులకు పాలిగ్రాఫ్ టెస్టు చేసేందుకు కోల్‌కతా హైకోర్టు ఇటీవల అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment