కోల్‌కతా హత్యాచార ఘటనపై సుప్రీం కోర్టు తదుపరి విచారణను సెప్టెంబర్ 5కి వాయిదా వేసింది. గురువారం ఆర్జీకర్ ఘటనకు సంబంధించి ఇప్పటి దాకా జరిపిన దర్యాప్తు స్టేటస్ రిపోర్ట్‌ను సీబీఐ సుప్రీం కోర్టుకు అందించింది. ఆర్జీ కర్ ఆస్పత్రి విధ్వంసానికి సంబంధించిన నివేదికను పశ్చిమ బెంగాల్ పోలీసులు సుప్రీం కోర్టుకు సమర్పించారు. ఈ రెండు స్టేటస్ రిపోర్ట్‌లపై సుప్రీం కోర్టు విచారణ చేపట్టింది. విచారణ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేసింది.
వైద్యుల భద్రతపై ఆసుపత్రులకు సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. జాతీయ టాస్క్ ఫోర్స్ కమిటీ ముందు వైద్యులు తమ భద్రతకు సంబంధించి సలహాలు సూచనలు ఇచ్చేలా పోర్టల్‌ను ఏర్పాటు చేయాలని ఆరోగ్య మంత్రిత్వ శాఖకు సూచించింది.
- శాంతియుత నిరసనలకు విఘాతం కలిగించవద్దని, ఆర్జీ కర్ ఘటనకు వ్యతిరేకంగా శాంతియుతంగా నిరసన తెలిపే వారిపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని తెలిపింది.
- అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు వైద్య సంస్థల వద్ద హింస, ఎలాంటి భయాందోళనలు లేకుండా చర్యలు తీసుకోవాలి
- వైద్యులు తిరిగి విధుల్లో చేరాలని విజ్ఞప్తి చేసిన సుప్రీంకోర్టు
- నిరసన తెలిపిన వైద్యులపై ఎలాంటి బలవంతపు చర్యలు తీసుకోవద్దు
- ఈ పరిస్థితిని రాజకీయం చేయవద్దని, చట్టం తన పని తాను చేసుకుంటోందన్న సుప్రీంకోర్టు
- వైద్యుల సంక్షేమం, భద్రతపై తాము ఆందోళన చెందుతున్నామన్న సుప్రీంకోర్టు
- వైద్యుల భద్రతను నిర్ధారించేందుకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్‌లతో చర్చించాలని ఆరోగ్య మంత్రిత్వ శాఖ కార్యదర్శిని ఆదేశించిన సుప్రీంకోర్టు
- వారంలోగా సమావేశాన్ని నిర్వహించాలని, రెండు వారాల్లో రాష్ట్రాలు పరిష్కార చర్యలు చేపట్టాలని ఆదేశించిన సుప్రీంకోర్టు
- తదుపరి విచారణ సెప్టెంబర్ 5 వాయిదా వేసింది
జూనియర్ డాక్టర్ హత్యాచార ఘటనపై సుప్రీం కోర్టులో విచారణ..
డాక్టర్లకు అధిక పనిగంటలపై సుప్రీం కోర్టు సీజేఐ ఆందోళన వ్యక్తం చేశారు.
- వైద్య నిపుణులు తిరిగి విధుల్లో చేరాలని, వారు తిరిగి విధుల్లో చేరిన తర్వాత అధికారులు ప్రతికూల చర్యలు తీసుకోకుండా ఆదేశిలిస్తామన్న సుప్రీంకోర్టు
- డాక్టర్లు తిరిగి విధుల్లోకి రాకపోతే ప్రజారోగ్య మౌలిక సదుపాయాలు ఎలా పనిచేస్తాయని సుప్రీంకోర్టు ప్రశ్నించింది.
- ఆర్జీ కర్ ప్రిన్సిపల్ ఘోష్ అనేక ఆర్థిక అవకతవకలకు పాల్పడ్డారని సుప్రీంకోర్టుకు వెల్లడించిన జూనియర్ డాక్టర్స్ తరఫున న్యాయవాది
- సీబీఐ దర్యాప్తు నివేదికను కోర్టుకు అందజేసిన సొలిసిటర్ జనరల్
- స్టేటస్ రిపోర్టును పరిశీలించిన సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ డీ. వై చంద్ర చూడ్ ధర్మసనం
- అయిదో రోజున సీబీఐ దర్యాప్తు ప్రారంభించింది
- శవ దహనం తర్వాత ఎఫ్ఐఆర్ నమోదు చేశారు
- తొలుత ఆత్మహత్య అని చెప్పారు
- అక్కడున్న డాక్టర్లు పట్టుబట్టడం వల్లే వీడియోగ్రఫీ చేశారు
- నిందితుడి గాయం గురించి సీజేఐ ఆరా తీశారు. ఇది కేసు డెయిరీలో భాగమని సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ సుప్రీంకోర్టుకు తెలియజేశారు.
- 5వ రోజున సీబీఐ దర్యాప్తు ప్రారంభించిందని, దీంతో కేసు అంతా తారుమారయ్యిందని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా సుప్రీంకోర్టుకు వివరించారు.
- సీనియర్ న్యాయవాది సిబల్ కేసులో ప్రతిదీ వీడియోగ్రాఫ్ చేయబడిందని తెలిపారు.
- మృతదేహాన్ని దహనం చేసిన తర్వాత 11:45 గంటలకు ఎఫ్‌ఐఆర్ నమోదు చేయబడిందని, సీనియర్ డాక్టర్లు, సహచరులు పట్టుబట్టడంతో వీడియోగ్రఫీ చేశామని తుషార్ మెహతా తెలిపారు.
- ఈ ఘటనకు సంబంధించి వాస్తవాలపై సుప్రీంకోర్టు పశ్చిమ బెంగాల్ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఒక అంశం చాలా కలవరపెడుతుందని, అసహజ మరణమని ఉదయం 10:10 గంటలకు నమోదు చేశారు. అయితే క్రైం సీన్ భద్రపరచడం, జప్తు చేయటం రాత్రిపూట జరిగాయని సీజేఐ డీ.వై చంద్రచూడ్ ప్రశ్నించారు.
- మొత్తం వీడియోగ్రఫీ చేయబడిందని బెంగాల్ ప్రభుత్వం తరఫున న్యాయవాది కపిల్ సిబల్ సుప్రీంకోర్టుకు తెలిపారు.
- ఈ ఘటనలో బెంగాల్ ప్రభుత్వం అనుసరించిన తీరు తనకు స్పష్టంగా కనిపించలేదని ధర్మాసనంలోని జస్టిస్ జేబీ పార్దివాలా అన్నారు. అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ప్రవర్తనపై ఆయన సందేహాన్ని లేవనెత్తారు. ఎందుకు ఈ విధంగా ప్రవర్తించారని ప్రశ్నించారు.
- బాధ్యతాయుతమైన ప్రకటన ఇవ్వాలని, ఆవేశపూరిత ప్రకటన చేయవద్దని సుప్రీంకోర్టు న్యాయవాది కపిల్ సిబల్‌కు సూచించింది. అసహజ మరణం కేసు ఎప్పుడు నమోదైందనే విషయాన్ని కోర్టుకు ఇంకా సమాధానం రాలేదు. మరోరోజు ఈ విషయాన్ని తీసుకుంటామని, బాధ్యతాయుతమైన పోలీసు అధికారిని ఇక్కడ ఉంచాలని కోర్టు పేర్కొంది.
- అసహజ మరణం అని తెలిసిన తర్వాత ఎందుకు పోస్టుమార్టం చేశారు? బెంగాల్ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ప్రశ్న
- కోల్‌కతా పోలీసుల దర్యాప్తు సరిగ్గా లేదు
- గత 30 ఏళ్లలో లోపాలు ఉన్న ఇలాంటి ఘటన చూడలేదని పేర్కొన్న ధర్మాసనం
- పోస్టుమార్టం తర్వాత సంఘటన స్థలాన్ని ధ్వంసం చేశారు.
- కోల్‌కతా పోలీసులపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.
- పోలీసుల దర్యాప్తు ఆందోళనకంగా ఉంది.
- ఆగస్టు 9న రాత్రి 7 గంటలకు ఘటనా స్థలాన్ని భద్రపరిచారు.
- పోస్ట్‌మార్టమ్ తర్వాత నేరం జరిగిన ప్రదేశాన్న ఎందుకు భద్రపర్చలేదు.
- ‘సీడీ చూశాము, పోలీసు అధికారుల కదలికలు, మృతదేహం ఎప్పుడు కనిపించిందో, పోలీసులు ఎప్పుడు వచ్చారో, అసహజ మరణ నివేదిక, పోస్ట్‌మార్టం నివేదిక, దహన సంస్కారాలు, ఎఫ్‌ఐఆర్’పరిశీలించాలని సీజేఐ చంద్రచూడ్ తెలిపారు.
- అయితే సాధారణ డైరీ ఎంట్రీని చదవమని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా సుప్రీం కోర్టును కోరారు. రాత్రి 11:30 గంటలకు అసహజ మరణం కేసు నమోదు చేయబడిందని అది సాధారణ డైర నమోదు మాత్రమే విజ్ఞప్తి చేశారు.
- కోల్‌కతా డాక్టర్ హత్యాచారం కేసులో సుప్రీంకోర్టుకు సీబీఐ సంచలన రిపోర్ట్ ఇచ్చింది..
- అత్యాచారం, మర్డర్ కేసును కప్పిపుచ్చే ప్రయత్నం చేశారు
- తల్లిదండ్రులను తప్పుదారి పట్టించారు
- శవ దహనం తర్వాతే ఎఫ్ఐఆర్ నమోదు చేశారు
- సంఘటన స్థలంలో ఆధారాలను ధ్వంసం చేశారు
సీబీఐ స్టేటస్ రిపోర్ట్‌లోని కీలకాంశాలు.. ముఖ్యంగా కోల్‌కతా పోలీసులు, కాలేజీ ప్రిన్సిపాల్ తీరును తీవ్రంగా తప్పుబట్టింది. ‘‘నిందితుడ్ని అరెస్ట్ చేశాక.. సీన్ రీకన్‌స్ట్రక్షన్ చేయడంలో ఆలస్యం జరిగింది. కేసును విచారించడంలో లోకల్ పోలీసులు అలసత్వం ప్రదర్శించారు. సాక్ష్యాలు, ఆధారాలు నాశనం అయ్యాక కేసు నమోదు చేశారు. మరోవైపు.. పోలీసులకు ఫిర్యాదు చేయడంలో ప్రిన్సిపాల్ ఆలస్యం చేశారు. పైగా బాధితురాలి ఆత్మాహత్య అంటూ బుకాయించే ప్రయత్నం చేశారు. పోలీసుల నిర్లక్ష్యం వల్లే ఆస్పత్రిలో దాడి జరిగింది. ఘటనా స్థలాన్ని ప్రొటెక్ట్ చేయడంలోనూ పోలీసులు ఘోరంగా విఫలం అయ్యారు. నిందితుడి వెనుక ఎవరైనా ఉన్నారా? అని ఆరా తీయడంలోనూ పోలీసులు విఫలం అయ్యారు’’ అని సీబీఐ పేర్కొంది.
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కోల్‌కతా ఆర్జీ కర్ ఆస్పత్రి జూనియర్ డాక్టర్ హత్యాచార ఘటనను సుప్రీంకోర్టు సుమోటోగా తీసుకొని మంగళవారం విచారణ జరిపిన విషయం తెలిసిందే. విచారణ సందర్భంగా ఈ ఘోరానికి సంబంధించిన దర్యాప్తు పురోగతిపై ఆగస్టు 22లోపు స్టేటస్ రిపోర్ట్‌ను సమర్పించాలని పశ్చిమ బెంగాల్ ప్రభుత్వాన్ని, సీబీఐకి సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అదే సమయంలో వైద్య సిబ్బంది భద్రత కోసం నేషనల్ టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటునకు ఆదేశించింది.
Comments
Please login to add a commentAdd a comment