నోయిడా: నోయిడాకు చెందిన ప్రవీణ్ కుమార్ అనే వ్యాపారవేత్తను అబుదాబి పోలీసులు నేరస్తుడిగా భావించి నిర్బంధించారు. ఆ వ్యాపారస్తుడిని తాము గాలిస్తున్న నేరస్తుడిగా పొరబడి ఒక రాత్రంతా జైల్లో ఉంచారు. పైగా అతనిని నేరస్తుడిగా అంగీకరించమంటూ బలవంతం చేశారు. దీంతో ప్రవీణ్ కుమార్ కుటుంబం అతనను విడుదల చేయాలంటూ భారత ప్రభుత్వానికి దరఖాస్తు పెట్టుకోవడమే కాకుండా విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ భారత రాయబార కార్యాలయం, రాష్ట్ర హోం మంత్రిత్వ శాఖకు సమాచారం అందించారు.
దీంతో ప్రవీణ్ కుమార్‌ని అబుదాబి పోలీసులు వెంటనే వదిలేశారు. తాము పొరపడి బంధించినట్లు అబుదాబీ పోలీసులు అంగీకరించారు. ఈ మేరకు గౌతమ్ బుద్ధ నగర్ జిల్లా హబీబ్‌పూర్‌కు చెందిన సదరు వ్యాపారవేత్త ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ...విమానాశ్రయంలో అబుదాబి సీఐడీ తనను అదుపులోకి తీసుకుని నిర్బంధించిందని, తర్వాత వదిలిపెట్టినట్లు వదిలి మళ్లీ తాను బయలుదేరుతున్న సమయంలో రెండోసారి నిర్బంధించారని తెలిపారు.
ఈ విషయంలో త్వరితగతిన చర్యలు తీసుకుని తనను విడుదలయ్యేలా చేసినందుకు ప్రధాని మోదీకి, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్‌కి ధన్యావాదాలు తెలిపారు. తనను శనివారం అబుదాబి పోలీసులు విడిచిపెట్టినట్లు తెలిపారు. ఆదివారం తెల్లవారుజామన భారత్‌కి తిరిగి వచ్చిన తర్వాత ప్రవీణ్ కుమార్‌కి ఎయిర్‌పోర్ట్‌లో ఘన స్వాగతం లభించింది. ఐతే ఈ కేసును స్థానిక పోలీసులు దర్యాప్తు చేయడంతోనే త్వరితగతిన చర్యలు తీసుకోగలిగనట్లు అధికారులు తెలిపారు.
(చదవండి: విజయపురలో పరువు హత్య?)
Comments
Please login to add a commentAdd a comment