క్రైమ్: నేరస్తుల్లో మార్పు రావాలనే శిక్షలు విధిస్తుంది న్యాయస్థానం. కానీ, మార్పు రాకపోగా మరింత మూర్ఖంగా తయారయ్యే వాళ్లు లేకపోలేదు. అలాంటోడే ధర్మేష్ రాథోడ్.
అటెంప్ట్ టూ మర్డర్ కేసులో శిక్ష అనుభవిస్తున్న ధర్మేష్ రాథోడ్ అనే ఖైదీ.. శుక్రవారం గుజరాత్ నవ్‌సరి కోర్టులో సెషన్స్ జడ్జి మీదకు రాయిని విసిరాడు. అదృష్టం కొద్ది జడ్జి ఏఆర దేశాయ్ పక్కకు తప్పుకోవడంతో ఆ రాయి వెనకాల ఉన్న గోడను తాకింది.
అంత రాయి అతనికి దగ్గరకు ఎలా వచ్చిందని దర్యాప్తు చేపట్టిన పోలీస్ శాఖ.. అతనిని కోర్టుకు తీసుకెళ్లిన లాజ్‌పోర్ జైలులోని ముగ్గురు సిబ్బందిపై సస్పెన్షన్ వేటు వేసింది. ఇక జడ్జి మీదకు రాయి విసిరి దాడి చేయాలనుకున్న నేరానికి రాథోడ్‌పై మరో ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు.
ఇక రాథోడ్ ఇంతకు ముందు కూడా ఇలానే చేశాడట. ఓ న్యాయమూర్తిపైకి ఏకంగా షూని విసిరాడట. దీంతో అతన్ని ఆ తర్వాత కాలి కాళ్లతో కోర్టుకు తీసుకురావడం మొదలుపెట్టారు. ఇకనైనా జాగ్రత్తగా వ్యవహారించాలని పోలీసులను పలువురు న్యాయవాదలు సూచిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment