
ఓ వ్యక్తి తన పగను తీర్చుకున్నాడు. అయితే ఒకటి రెండేళ్లకు కాదు ఏకంగా 22 ఏళ్ల తర్వాత తన తండ్రిని చంపిన హంతకుడిని మట్టుబెట్టాడు. ఒకప్పుడు తన తండ్రిని ఎలా చంపాడే సదరు వ్యక్తిని కూడా అలాగే చంపేశాడు. ఈ ఘటన గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో జరిగింది.
పోలీసుల వివరాల ప్రకారం.. అక్టోబర్ 1న అహ్మదాబాద్ నఖత్ సింగ్ భాటి(50) అనే వ్యక్తి సైకిల్‌పై వెళ్తుండగా కారు ఢీకొనడంతో మరణించినట్లు సమాచారం అందింది. నఖత్ సింగ్ భాటీ అహ్మదాబాద్‌లో థాల్తేజ్ లోని ఓ కాలేనీలో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడు. ముందుగా ఇది ప్రమాదంగా భావించిన పోలీసులు.. సీసీటీవీ ఫుటేజీని పరిశీలించగా హత్యకు గురైనట్లు తేలింది.
నిందితుడు గోపాల సింగ్ భాటి ఉద్దేశపూర్వకంగానే నఖత్‌ను గుద్ది పారిపోయేందుకు ప్రయత్నించినట్లు పోలీసులు గుర్తించారు. అనంతరం నిందితుడిని అదుపులోకి తీసుకొని విచారించగా అసలు విషయం బయటపడింది. 2002లో రాజస్థాన్‌లో 22 ఏళ్ల క్రితం తన తండ్రి కూడా ఇదే విధంగా నఖత్ హత్య చేసినట్లు పోలీసులకు వెల్లడించాడు. అందుకే ఇప్పుడు అతన్ని చంపి పగ తీర్చుకున్నట్లు తెలిపాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి విచారణ జరుపుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment