
భార్య కవితతో కునాల్( ఫైల్ ఫోటో)
అహ్మదాబాద్ : చేతబడి చేశారంటే నమ్మడం లేదని భార్య, కూతురిని చంపి తాను ఆత్మహత్యకు పాల్పడ్డాడు గుజరాత్‌కు చెందిన ఓ వ్యాపారవేత్త. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అహ్మదాబాద్‌కు చెందిన వ్యాపారవేత్త కునాల్ త్రివేది(45) భార్య కవిత(42), కూతురు శ్రీన్(16)తో కలిసి నివాసముంటున్నాడు.
గత కొద్ది రోజులుగా కునాల్ తాగుడుకు బాసిసయ్యాడు. రోజు తాగి వచ్చి ఇంట్లోవారితో గొడవకు దిగేవాడు. కాగా బుధవారం ఉదయం ఇంటి తలుపులు తెరవకపోవడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో పోలీసులు వచ్చి తలుపులు తెరచి చూడగా కునాల్ ఫ్యాన్‌కు వేలాడు ఉన్నాడు. భార్య కవిత, కూతురు శ్రీన్ బెడ్ రూంలో విగత జీవులుగా పడిఉన్నారు. మరో గదిలో కునాల్ తల్లి జయశ్రీబెన్(75) అపస్మారక స్థితి పడి ఉన్నారు. వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించారు. మృతదేహాలను పోస్టుమార్టంకు తరలించారు.
కునాల్ గదిలో ఒక లేఖ లభించింది. చేతబడి చేయడం వల్లనే తాను ఆత్మహత్య చేసుకుంటున్నానని లేఖలో రాశాడు. ‘నాకు చేతబడి చేశారంటే ఎవరూ నమ్మడం లేదు. అమ్మ నువ్వు కూడా నన్ను నమ్మలేదు. చేతబడి చేయడం వల్లే నేను తాగుతున్నాను. కానీ మీరంతా నన్ను తాగుబోతుని చేశారు. మంత్రాలు చేశారంటే మీరు నమ్మలేదు. మీరు నమ్మి ఉంటే ఈ రోజు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వచ్చేది కాదు’ అని లేఖలో రాసి ఉంది. భార్య, కూతురిని గొంతు పిసికి చంపి తర్వాత కులాన్ ఉరి వేసుకుని చనిపోవచ్చని పోలీసులు భావిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్నామని, మరిన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టామని పోలీసులు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment